జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీన ఈఓఆర్‌డీ, ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లాపరిషత్ సీఈఓ సూర్యప్రకాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీన ఈఓఆర్‌డీ, ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లాపరిషత్ సీఈఓ సూర్యప్రకాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ భవనంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందన్నారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ, గుర్తించిన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో బాలికలకు విశ్రాంతి గదులు, ప్రహరీల నిర్మాణం, ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహణ, తాగునీటి సమస్యల పరిష్కారం, బోర్ల నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, 2014-15 మండల పరిషత్ బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై చర్చ ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఈఓఆర్‌డీలు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, డీఈఈ, ఏఈ, ఏఈఈలంతా హాజరు కావాలని సూర్యప్రకాష్ కోరారు.