కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం | Police Constable Committed Suicide Attempt In Medchal | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

Published Fri, Jul 6 2018 4:16 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

Police Constable Committed Suicide Attempt In Medchal - Sakshi

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్య ప్రకాశ్‌( అంతర్‌ చిత్రంలో సూర్య ప్రకాశ్‌ పాత చిత్రం)

మేడ్చల్‌ జిల్లా: మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యప్రకాశ్‌ అనే వ్యక్తి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా షామీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. గత మూడు రోజులుగా విధులకు గైర్హాజరయ్యాడు. ఈ రోజు(శుక్రవారం) ఉదయం ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి ఫ్యాన్‌కు ఉరేసుకుని  ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.

సరైన సమయంలో కుటుంబసభ్యులు గమనించడంతో వెంటనే సుచిత్ర సెంటర్‌లోని రష్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్‌ పరిస్థితి నిలకడగా ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై మాట్లాడటానికి పోలీసు అధికారులు నిరాకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement