MEDCHAL Police Station
-
కిరాణా షాపుకు వెళ్లొస్తానని ఒకరు.. డ్యూటీకి వెళ్తున్నానని మరొకరు...
సాక్షి, హైదరాబాద్(మేడ్చల్): వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన జమాల్ 10 ఏళ్ల క్రితం బతుకుదెరువుకు మేడ్చల్‌కు వచ్చి పట్టణంలోని కుమ్మరిబస్తీలో తన చెల్లి రుక్సానా(20)తో కలిసి నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం కిరాణా షాపుకు వెళ్తున్నానని ఇంటి నుండి వెళ్లిన రుక్సానా ఎంతకీ ఇంటికి చేరకపోవడంతో అన్న జమాల్ చుట్టుపక్కలా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మేడ్చల్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (భార్య చనిపోతే.. మరో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు..) డ్యూటీకి వెళ్లిన వ్యక్తి.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కండ్లకోయలో నివాసం ఉండే అల్లి బాలకృష్ణ(31) ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 11న డ్యూటీకి వెళ్తున్నానని ఇంటి నుండి వెళ్లిన బాలకృష్ణ తిరిగి ఇంటికి చేరుకోలేదు. చుట్టు పక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో శుక్రవారం అతని భార్య రేణుక మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (భార్య పుట్టింటికి.. కన్నకూతురిపై తండ్రి లైంగిక దాడి) -
కాలితో తొక్కితే చాలు.. చేతిలోకి శానిటైజర్ చుక్కలు..
సాక్షి, హైదరాబాద్: ఇకపై శానిటైజర్ బాటిల్‌ను చేతితో నొక్కాల్సిన పనిలేదు. కాలితో తొక్కితే చాలు...మీ చేతిలో శానిటైజర్ చుక్కలు పడతాయి. ఇందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రత్యేకంగా మెషిన్ రూపొందించింది. ఐటీఐ(పారిశ్రామిక శిక్షణ సంస్థ) విద్యార్థుల సాయంతో దీన్ని తయారు చేసింది. చేతితో శానిటైజర్ బాటిల్‌ను పట్టుకోవడంతో వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందనే వాదన ఉంది. ఈ క్రమంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కొందరు ఐటీఐ విద్యార్థులు ఈ పరికరానికి రూపకల్పన చేశారు. దీన్ని ఇటీవల మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు ఉచితంగా అందించారు. త్వరలో వంద మిషన్లు తయారు చేసి డిమాండ్ ఉన్న సంస్థలకు అందించనున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కె.వై.నాయక్ తెలిపారు. 40వేల మాస్కుల ఉచిత పంపిణీ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో కుట్టుమిషన్ ట్రేడ్ ఉన్న వాటిల్లో మాస్కుల తయారీకి కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఆదేశించింది.ప్రస్తుతం 15 ప్రభుత్వ ఐటీఐలు, 5 ప్రైవేటు ఐటీఐలలో మాస్కులను తయారు చేస్తున్నారు. ఐసీఎంఆర్, వైద్య,ఆరోగ్య శాఖ సూచనల ఆధారంగా వీటిని రూపొందిస్తున్నారు. మాస్కులు కొనుగోలు చేయలేని కూలీలు, పేదలకు వీటిని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించి.. ఇప్పటివరకు తయారు చేసిన 40వేల మాస్కులను ఉచితంగా పంపిణీ చేసినట్టు ఆ శాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్ తెలిపారు. ఆన్లైన్లో ఐటీఐ శిక్షణ: ఐటీఐల్లోనూ ఆన్లైన్ బోధన మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న చైన్నైలోని నేషనల్ ఇన్స్ట్రక్షన్ మీడియా ఇన్స్టిట్యూట్ టీచింగ్ ఫ్యాకల్టీ సాయంతో ప్రస్తుతం 63 ప్రభుత్వ ఐటీఐలు, 13 ప్రైవేటు ఐటీఐలలోని విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుండగా... ఈ వారాంతంలోగా అన్ని ప్రైవేటు ఐటీఐలలోని విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందుబాటులోకి రానుంది. -
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
మేడ్చల్ జిల్లా: మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యప్రకాశ్ అనే వ్యక్తి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా షామీర్పేట్ పోలీస్‌స్టేషన్ నుంచి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. గత మూడు రోజులుగా విధులకు గైర్హాజరయ్యాడు. ఈ రోజు(శుక్రవారం) ఉదయం ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. సరైన సమయంలో కుటుంబసభ్యులు గమనించడంతో వెంటనే సుచిత్ర సెంటర్లోని రష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి నిలకడగా ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై మాట్లాడటానికి పోలీసు అధికారులు నిరాకరించారు. -
కొడుకే చంపేశాడు..
తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు మిస్టరీని చేదించిన పోలీసులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మేడ్చల్‌రూరల్: తండ్రి తాగివచ్చి అకారణంగా తనను, ఇంట్లో వారిని తిడుతున్నాడని ఆగ్రహించిన ఓ తనయుడు తండ్రిని హత్య చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారంపేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ రాజశేఖర్‌రెడ్డి తో కలిసి వివరాలు వెల్లడించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉంటున్న మహమ్మద్ అలీ(50) గత నెల 12న రాత్రి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 20న మరణించాడు. కాగా 14న తన తండ్రి తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇందుకు కారణం తెలియడం లేదని మృతుడి కుమారుడు మహమ్మద్ ఉస్మాన్ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి కుమారుడే మహమ్మద్ ఆలిపై దాడి చేసి గాయపర్చినట్లు గుర్తించారు.. మహమ్మద్ అలీ(50) భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని పెద్ద కుమారుడు మహమ్మద్ ఉస్మాన్(22) కొద్ది రోజులుగా ఖాళీగా ఉంటున్నాడు. మహమ్మద్ అలీ గత నెల 11న మనవరాలి తొట్టెల ఫంక్షన్లో తనతో పాటు కూడా కుటుంబసభ్యులను అకారణంగా తిట్టడంతో తండ్రిపై కోపం పెంచుకున్న ఉస్మాన్ తండ్రికి బుద్ధి చెప్పాలని నిర్ణరుుంచుకున్నాడు. 12వ తేదీ రాత్రి మహమ్మద్ అలీ నిద్రిస్తున్న సమయంలో ఉస్మాన్ అతడిపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. అనంతరం బాత్రూంలో రాడ్‌కు అంటిన రక్తపు మరకలను కడిగి ఎవరికీ అనుమానం రాకుండా రాడ్‌ను పారవేశాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మహమ్మద్ ఆలీ వాంతులు చేసుకోవడం గమనించిన నిందితుడు కుటుంబసభ్యుల సహకారంతో అతడిని ఆస్పత్రికి తరలించాడు. మద్యం మత్తులో కిందపడడంతో గాయాలైనట్లు వైద్యులకు చెప్పాడు. అనంతరం పోలీసులకు అనుమానం రాకుండా నవంబర్ 14న మేడ్చల్ పీఎస్‌కు వెళ్లి తన తండ్రి కి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని గాయాలెలా అయ్యాయో తెలియడం లేదని ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వైద్యులను విచారించగా తలపై బలంగా కొట్టినందునే అతను గాయపడినట్లు చెప్పడంతో హత్యకేసు నమోదు చేసుకున్నారు. గత నెల 20న చికిత్స పొందుతూ మహమ్మద్ అలీ మరణించగా దీంతో పోలీసులు శనివారం మృతుడి పెద్ద కుమారుడు మహమ్మద్ ఉస్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మృతుడి హత్యకు ఉపయోగిం చిన ఇనుపరాడ్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. హత్యకేసు చేదించిన మేడ్చల్ పోలీసులకు ఏసీపీ అభినందించాడు.