suchitra area
-
కాంగ్రెస్ లీడర్లు నన్నేదో చేయాలనుకుంటున్నారు: మల్లారెడ్డి ఫైర్
సాక్షి, సుచిత్ర: కుత్బుల్లాపూర్‌లోని సుచిత్ర సర్కిల్ వద్ద మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన భూమిలో విషయంలో వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ భూమి తమదేనంటూ 15 మంది బాధితులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను ల్యాండ్ కబ్జాలు చేసే వ్యక్తిని కాను. నా దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. కబ్జా అంటున్న ల్యాండ్ మిలటరీ వాళ్ల ఆధీనంలో ఉంది. వాళ్ళు ఆ భూమి తీసుకున్నారు. రాత్రికి రాత్రే గుండాలు రౌడీలు వచ్చి దౌర్జన్యం చేశారు. భూమి పత్రాలు అన్ని సక్రమంగా ఉంటే ఎంఎల్ఏ లక్ష్మణ్ మొన్న ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు చూపించలేదు. కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను లీగల్‌గా పోరాడుతాను. సుచిత్ర దగ్గర ఉన్న భూమి విషయంలో అన్ని పత్రాలు సర్వేయర్లకు ఇచ్చాను. పోలీసులు కూడా నాకు సహకరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బుడ్డ లీడర్లు నన్నేదో చేయాలని కంకణం కట్టుకున్నారు. నాకు ఇవేం కొత్త కాదు. దీనికి కచ్చితంగా పోరాటం చేస్తాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
మేడ్చల్ జిల్లా: మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యప్రకాశ్ అనే వ్యక్తి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా షామీర్పేట్ పోలీస్‌స్టేషన్ నుంచి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. గత మూడు రోజులుగా విధులకు గైర్హాజరయ్యాడు. ఈ రోజు(శుక్రవారం) ఉదయం ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. సరైన సమయంలో కుటుంబసభ్యులు గమనించడంతో వెంటనే సుచిత్ర సెంటర్లోని రష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి నిలకడగా ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై మాట్లాడటానికి పోలీసు అధికారులు నిరాకరించారు. -
'సుచిత్ర'లో సందడి చేసిన మాధవీలత
హైదరాబాద్: నచ్చావులే, స్నేహితుడా ఫేం మాధవీలత కుత్బుల్లాపూర్ సర్కిల్ సుచిత్ర ప్రాంతంలో సందడి చేసింది. ఓ ప్రైవేటు క్లినిక్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ క్లినిక్‌లో బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన అంశాలపై తర్ఫీదునిస్తారు. కార్యక్రమంలో నిర్వాహకులు బాసాని భాస్కర్, తాళ్లపల్లి శ్రీకాంత్, చింతల నరేష్‌లు పాల్గొన్నారు.