సాక్షి, సుచిత్ర: కుత్బుల్లాపూర్‌లోని సుచిత్ర సర్కిల్ వద్ద మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన భూమిలో విషయంలో వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ భూమి తమదేనంటూ 15 మంది బాధితులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, తాజాగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను ల్యాండ్ కబ్జాలు చేసే వ్యక్తిని కాను. నా దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. కబ్జా అంటున్న ల్యాండ్ మిలటరీ వాళ్ల ఆధీనంలో ఉంది. వాళ్ళు ఆ భూమి తీసుకున్నారు. రాత్రికి రాత్రే గుండాలు రౌడీలు వచ్చి దౌర్జన్యం చేశారు. భూమి పత్రాలు అన్ని సక్రమంగా ఉంటే ఎంఎల్ఏ లక్ష్మణ్ మొన్న ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు చూపించలేదు. కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
నేను లీగల్‌గా పోరాడుతాను. సుచిత్ర దగ్గర ఉన్న భూమి విషయంలో అన్ని పత్రాలు సర్వేయర్లకు ఇచ్చాను. పోలీసులు కూడా నాకు సహకరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బుడ్డ లీడర్లు నన్నేదో చేయాలని కంకణం కట్టుకున్నారు. నాకు ఇవేం కొత్త కాదు. దీనికి కచ్చితంగా పోరాటం చేస్తాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment