సాక్షి,రంగారెడ్డిజిల్లా: ఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్ హత్య సంచలనం రేపింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే హత్య చేశాడు. ఇది పరువు హత్య అని తొలుత భావించినప్పటికీ పోలీసుల ప్రాథమిక విచారణలో ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలుస్తోంది.
రాయపోల్‌కు చెందిన శ్రీకాంత్,నాగమణిలు నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం హయత్‌నగర్‌లో నాగమణి, శ్రీకాంత్ నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్ళింది.
నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళుతుండగా వెంబడించిన తమ్ముడు పరమేష్ తొలుత ఆమెను కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు.హత్య చేసిన పరమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కేసులో ట్విస్ట్.. వెలుగులోకి అసలు నిజాలు
ఆస్తి కోసమే అక్క నాగమణిని తమ్ముడు పరమేష్ చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానే చూసుకున్నాడు పరమేష్. కాగా నాగమణికి ఇదివరకే వివాహమై విడాకులు కూడా అయ్యాయి. తమ వారసత్వ భూమిని మొదటి వివాహం తర్వాత నాగమణి తమ్ముడికి ఇచ్చేసింది.
రెండవ భర్త శ్రీకాంత్‌ను ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్న నాగమణి భూమిలో తనకు వాటా ఇవ్వాలని తమ్ముడిని మళ్లీ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన పరమేష్ నాగమణి స్కూటీపై వెళుతుండగా కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో నరికి చంపాడు.
ఇదీ చదవండి: ఎస్సై ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం..?
Comments
Please login to add a commentAdd a comment