సాక్షి,ములుగు: వాజేడు మండల ఎస్‌ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం(డిసెంబర్2) ఉదయం వెలుగు చూసింది. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్‌లో హరీష్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆదివారం ఉదయం రిసార్ట్ గదిలోకి ఒంటరిగా వెళ్లిన ఎస్ఐ రాత్రి వరకు కూడా బయటికి రాకపోవడంతో అక్కడి సిబ్బంది వేచి చూశారు. ఉదయం ఫెరిడో రిసార్ట్ సిబ్బంది గదిలోకి వెళ్ళి చూడగా విగత ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్న విషయం బయటపడింది. వెంటనే ఈ విషయాన్ని వాజేడు పోలీసులకు ఫెరిడో రిసార్ట్ సిబ్బంది తెలియజేశారు.
ప్రేమ వ్యవహారమే కారణమా..?
సోమవారం ఉదయం 6 గంటలకు తన డ్రైవర్‌కు ఫోన్ చేసిన ఎస్సై హరీశ్ తనను హోటల్ నుంచి పిక్ అప్ చేసుకొమని చెప్పారు. డ్రైవర్ హోటల్‌కు వచ్చేేసరికే తుపాకీతో కాల్చుకుని హరీశ్ మృతి చెందాడు. ఉదయం హోటల్‌లో హరీష్, మరో అమ్మాయి గొడవపడినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
తనను వదలిపెట్టాలని హరీశ్ ఎంత బతిమిలాడినా అమ్మాయి వినకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. హరీష్‌కు ఇంట్లో ఇటీవలే పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఎటూ తేల్చుకోలేక అతడు మానసికఒత్తిడికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment