Vajedu
-
ఎస్సై హరీశ్, యువతి ఆడియో సంభాషణ వైరల్
ములుగు: ఎస్సై హరీశ్, ఆ యువతి మాట్లాడుకున్నట్టుగా చెబుతున్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఓ రిసార్టులో ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హరీశ్ ఆత్మహత్యకు సూర్యాపేట జిల్లాలోని దుగ్యాతండాకు చెందిన ఓ యువతిపై పోలీసులు ఎక్కువగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువతి పేరిట బయటకు వచ్చిన ఆడియోపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా..అబద్ధమా అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ ఆడియోలో ఏంముందంటే...: ‘మనం పెళ్లి చేసుకోవాలంటే ముందుగా నువ్వు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ధర్నా చేయాలి. పలువురిని ఆకర్షించేలా చేస్తేనే మన ప్రేమ విషయం బయటకు వస్తుంది.. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి వీలవుతుంది. విషయం బయట కు వచ్చిన తర్వాత పెద్దలు ఒప్పుకోని పక్షంలో నా తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుందాం.’ – ఎస్సై హరీశ్‘నేను కాళ్లు పట్టుకుంటాను కానీ.. మా అమ్మా నాన్న పట్టుకోరు.. నేను కొందరిపై కేసులు పెట్టినట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నన్ను ఇబ్బంది పెట్టిన ఇద్దరిపై కేసులు పెట్టాను. ఈ విషయం హరీశ్‌కు ముందుగానే తెలిపాను. ఆయన మంచి మనసుతో కలిసి జీవించడానికి ఒప్పుకున్నాడు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి డబ్బు చర్చలు రాలేదు. నాకు డబ్బులు ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా బ్యాంకు ఖాతాలను చూస్తే ఆ విష యం తెలుస్తుంది. నాపై కావాలనే చిలుకూరులోని కొందరు కుట్ర పూరితంగా వ్యవహరించి తప్పుడు ప్రకటనలు వచ్చేలా చేశారు’. – సదరు యువతిఆ కానిస్టేబుల్ ప్రైవేట్ వెహికిల్ ఎందుకు నడిపారు? -
మాయలేడి.. జగత్ కిలాడి!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ మృతికి కారణమైన యువతిపై ఆరా తీస్తున్న పోలీసులకు, నిఘావర్గాలకు విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. యువతి గత మూడేళ్లలో ప్రేమ పేరిట ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీశ్ నాలుగో వ్యక్తిగా చెబుతున్నారు. పూర్వ నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి స్కెచ్ వేస్తే చాలు.. ఎదుటివారికి దిమ్మతిరిగి పోవాల్సిందే. కొంతకాలం హైదరాబాద్ హయత్‌నగర్ ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పలువురిని ఆకట్టుకుని, ఆపై వారిని అష్టకష్టాలు పెట్టినట్లు ఒక్కొక్కొటిగా విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఆ యువతిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కావడానికి కారణంతో పాటు ఓ ఎస్ఐ, మరో న్యాయమూర్తిపై ప్రైవేట్ కంప్లయింట్ చేయడం పూర్వ నల్లగొండ జిల్లాలో అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై సూర్యాపేట జిల్లాతో పాటు హయత్‌నగర్‌లోనూ తనను ప్రేమించి మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అన్నీ గుర్తించే దూరం పెట్టిన హరీశ్? కొద్దిరోజులుగా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా చిట్‌చాట్ చేసిన ఎస్ఐ హరీశ్.. ఆమె గురించి పలు విషయాలు తెలిశాకే దూరం పెట్టారన్న చర్చ జరుగుతోంది. తనకున్న సోర్స్ ద్వారా ఆమె ప్రవర్తన తెలుసుకున్న హరీశ్ ఆమెను దూరం పెట్టారని మరో వాదన వినిపిస్తున్నది. అయితే ఇటీవల హరీశ్‌కు హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరి ఈనెల 14న నిశి్చతార్థం కూడా జరగబోతున్నదని తెలుసుకున్న సదరు యువతి మళ్లీ వెంటబడినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఈనెల 1న నేరుగా వాజేడు పోలీసుస్టేషన్‌కే చేరుకున్న ఆమె.. హంగామా చేసి పరువు తీసే ప్రయత్నాన్ని హరీశ్ పసిగట్టాడు. ఈ క్రమంలో రాజీ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఆ మాయలేడి పన్నాగంలో చిక్కుకుని విలవిల్లాడిన హరీశ్.. ప్రాణంకంటే పరువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చి తనువు చాలించడం అందరినీ కలచి వేసింది. కాగా, తమ కుమారుడి ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని, ఆ యువతిని విచారించి న్యాయం చేయాలని హరీశ్ తండ్రి రుద్రారపు రాములు తాజాగా పోలీసు అధికారులను కోరారు. ఇదే సమయంలో హరీశ్ సోదరుడు, సీఆర్పీఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్న కుమారస్వామి కూడా గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన సోదరుడి ఆత్మహత్యపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. -
రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, వరంగల్: ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓ యువతి వేధింపుల కారణంగానే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. తమ కుమారుడి మృతికి సదరు యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన యువతి ఏడు నెలల కిందట హరీష్‌కు కాల్ చేసింది. మాటామాటా కలిసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. హైదరాబాద్‌లో చదువుకునే ఆమె వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి ఉండి వెళ్లేదని సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి ఎస్ఐ హరీష్ ఆరా తీశాడు. దీంతో అతనికి కొన్ని విషయాలు తెలిశాయి.ఈ 26 ఏళ్ల యువతిది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం. ఊళ్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయింది. ఈ విషయాలను తెలుసుకున్న హరీశ్.. ఆమె పెళ్లి ప్రతిపాదనను నిరాకరించాడు. ఇంట్లో వాళ్లు చూసే సంబంధాన్ని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్ల కట్ట సమీపంలోని ఓ రిసార్టుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.ఈ క్రమంలో వారిద్దరి మధ్య అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. సెటిల్మెంట్ చేసుకోవడానికి ఎస్సై ప్రయత్నించగా, సదరు యువతి అందుకు అంగీకరించకలేదు. అంతేకాకుండా తమ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన హరీశ్ తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తమ కుమారుడి మృతికి యువతే కారణమని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఇక, ఈ నెల ఆరో తేదీన హరీష్‌కు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. -
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య
-
TG: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి,ములుగు: వాజేడు మండల ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం(డిసెంబర్2) ఉదయం వెలుగు చూసింది. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్‌లో హరీష్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం రిసార్ట్ గదిలోకి ఒంటరిగా వెళ్లిన ఎస్ఐ రాత్రి వరకు కూడా బయటికి రాకపోవడంతో అక్కడి సిబ్బంది వేచి చూశారు. ఉదయం ఫెరిడో రిసార్ట్ సిబ్బంది గదిలోకి వెళ్ళి చూడగా విగత ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న విషయం బయటపడింది. వెంటనే ఈ విషయాన్ని వాజేడు పోలీసులకు ఫెరిడో రిసార్ట్ సిబ్బంది తెలియజేశారు. ప్రేమ వ్యవహారమే కారణమా..?సోమవారం ఉదయం 6 గంటలకు తన డ్రైవర్‌కు ఫోన్ చేసిన ఎస్సై హరీశ్ తనను హోటల్ నుంచి పిక్ అప్ చేసుకొమని చెప్పారు. డ్రైవర్ హోటల్‌కు వచ్చేేసరికే తుపాకీతో కాల్చుకుని హరీశ్ మృతి చెందాడు. ఉదయం హోటల్లో హరీష్, మరో అమ్మాయి గొడవపడినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. తనను వదలిపెట్టాలని హరీశ్ ఎంత బతిమిలాడినా అమ్మాయి వినకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. హరీష్‌కు ఇంట్లో ఇటీవలే పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఎటూ తేల్చుకోలేక అతడు మానసికఒత్తిడికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. -
మాకు రారా కొత్త టీచర్లు?
వాజేడు: చదువుకునేందుకు విద్యార్థులున్నా.. ఉపాధ్యాయులు లేని పాఠశాల అది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల బదిలీల్లో ఇక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు కాచారం, మరొకరు మంగపేట మండలం చుంచుపల్లికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఒక ఉపాధ్యాయినిని నియమించగా.. ఆమె బీఈడీ ఓడీలో ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. కాగా, పే సెంటర్ ఇన్చార్జ్ హెచ్ఎం కేశవరావు ఇతర పాఠశాలల ఉపాధ్యాయుల్లో రోజుకొకరిని జంగాలపల్లి పాఠశాలకు పంపిస్తూ నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీలోనూ ఈ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.66 మందికి ఇద్దరే టీచర్లా?అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం.. పర్వత్‌పల్లి పాఠశాలకు తాళంబషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పర్వత్‌పల్లి ప్రాథమిక పాఠశాలకు గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 66 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారని, అందులో భరత్ అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడిని బుధవారం అధికారులు రిలీవ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తుంటే తమ గ్రామానికి ఎందుకు నియమించలేదని నిలదీశారు. టీచర్లు లేని పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్‌ను పాడు చేయలేమని స్పష్టం చేశారు. కొత్తగా ఉపాధ్యాయులను నియమించే వరకు పిల్లలను బడికి పంపేదిలేదంటూ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాఠశాలలో సద్దాం హుస్సేన్, రవీందర్‌రెడ్డి అనే ఇద్దరు టీచర్లే లిఉన్నారని వీరు ఐదు తరగతులకూ పాఠాలు ఎలా బోధిస్తారో అధికారులే చెప్పాలన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు చెప్పారు. మరోవైపు త్వరలో కొత్త టీచర్లు వస్తారని, విద్యార్థులను బడికి పంపాలని ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చూడండి: డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు (ఫొటోలు) -
‘బొగత’కు జనకళ.. వాహ్ మహబూబ్ ఘాట్
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద చాలా రోజుల తర్వాత పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జలపాతం అందాలను తిలకించి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం గుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. – వాజేడు వాహ్ మహబూబ్ ఘాట్ చుట్టూ ఎత్తయిన కొండలు... చెట్లతో ఎటు చూసినా పచ్చ తివాచి పరిచినట్లు కనిపించే ప్రకృతి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. పచ్చదనం మధ్యలో నల్లతాచు పాములా కనిపించే రోడ్డు మలుపులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. నిర్మల్ సమీపంలోని మహబూబ్ ఘాట్ వద్ద కనిపించే ఈ దృశ్యాలు ప్రకృతి రమణీయతకు అద్ధం పడుతున్నాయి. మనసుకు ఆహ్లాదాన్నిచ్చే మహబూబ్ ఘాట్ అందాలను ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ జూరాల ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తివేత ధరూరు (గద్వాల): జూరాలకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు 4,27,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో 36 గేట్ల ద్వారా 3,63,993 క్యూసెక్కుల నీటిని దిగవకు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్‌ఫ్లో 3,66,006 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.557 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పుడమి పచ్చకోక కట్టినట్టు.. కనుచూపు మేర పచ్చటి పొలాలు.. ఆకాశంలో కమ్ముకుంటున్న కారుమేఘాలు.. మధ్యలో పచ్చని చెట్లు.. పైర్లు.. భూమికి పచ్చని రంగేసినట్టు ఎటు చూసినా పచ్చదనంతో సింగారించుకున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారు ప్రాంతమిది. – ఫొటో: కె.సతీష్, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, సిద్దిపేట సుందర జలపాతం.. వెళ్లడం కష్టం కొండలపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కట్టుమల్లారం సమీపంలోని రథంగుట్టపై ఉంది. ఇది దాదాపు వర్షాకాలం పొడవునా జాలువారుతూనే ఉంటుంది. అయితే దీని వద్దకు వెళ్లేందుకు మాత్రం దారిలేదు. మూడేళ్ల క్రితం పై భాగానికి వెళ్లే యత్నంలో ఓ యువకుడు రాళ్లపై నుంచి జారిపడి మృతిచెందాడు. అప్పట్నుంచి ఎవరూ ఈ జలపాతం వద్దకు వెళ్లట్లేదు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. – మణుగూరుటౌన్ -
అరుదైన దృశ్యం: రోడ్డుపై అడవి దున్న
వాజేడు(ములుగు) : సాధారణంగా అడవి దున్నలు జనారణ్యంలోకి రావు. కానీ మంగళవారం ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు వద్ద ఓ అడవి దున్న(కారు బర్రె) రోడ్డుపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. ఇక్కడి అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు అడవి దున్న ఆనవాళ్లు కనిపించలేదు. అయితే, ఈ బర్రె ధర్మవరం అటవీ ప్రాంతం వైపు నుంచి చెరుకూరు సమీపంలో జాతీయ రహదారి మీదుగా ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న గుట్టల వైపు వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఇది రహదారి దాటుతున్నప్పుడు వాహనదారులు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
ఏడాది క్రితం భార్యకు ప్రేమ లేఖ ఇచ్చాడని..
సాక్షి, వాజేడు: తన భార్యకు ఏడాది క్రితం ప్రేమలేఖ ఇచ్చాడనే కోపంతో కోడిని కోసే కత్తితో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని ప్రగళ్లపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వాజేడు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొప్పునూరు గ్రామానికి చెందిన వేల్పుల నగేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన హిమామ్ చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కాగా నగేష్ హిమామ్ భార్యకు ఏడాది క్రితం ప్రేమిస్తున్నానని లెటర్ ఇచ్చాడు. విషయం తెలుసుకున్న హిమామ్ దాన్ని మనసులో దాచుకున్నాడు. మంగళవారం నగష్ హిమామ్ చికెన్ సెంటర్‌కు రాగా ఈ విషయమై ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశం పట్టలేక హిమామ్ కత్తితో నగేష్‌పై దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో నగేష్ మొఖంపై గాయాలయ్యాయి. వైద్యం చేయించున్న అనంతరం బాధితుడు నేరుగా వాజేడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపారు. గాయపడిన నగేష్ -
యజమానిని నిర్బంధించి దోచేశారు
సాక్షి, వాజేడు : కుటుంబ యజమానిని నిర్భంధించి దోపిడీ చేసిన సంఘటన వాజేడు మండలంలో సంచలనం సృష్టించింది. ప్రగళ్లపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో గ్రామానికి చెందిన హెచ్ ఖాసీం మహ్మద్ ఇంటికి ముసుగులు ధరించిన ఆరుగురు అపరిచిత వ్యక్తులు వచ్చారు. అందరు గాడ నిద్రలో ఉండగా తలుపు కొట్టడంతో ఖాసీం మహ్మద్ భార్య తలుపు తీసింది. ఖాసీం ఆర్ఎంపీ వైద్యుడు కావడంతో వైద్యం కోసం వచ్చి ఉంటారని భావించి తలుపు తీశారు. వెంటనే ఆమెను తుపాకీతో బెదిరించి ఇంట్లోకి వెళ్లారు ఖాసీంను తాళ్లతో బంధించి నేను దళ కమాండర్‌ను లక్ష రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. తన వద్ద డబ్బులు లేవని ఖాసీం చెప్పడంతో ఖాసీం భార్య మెడలోని పుస్తెల తాడు, కూతురు మెడలోని చైన్‌ను లాక్కున్నారు. ఈ రెండు కలిపి 42 గ్రాములు ఉంటాయని బాధితులు తెలిపారు. కాగా ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపుతామని హెచ్చరించి వెళ్లారు. బాధితులు బుధవార వాజేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నకిలీ మావోయిస్టులు డబ్బుల కోసం ఇదంతా చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వరి పొలంలో చేపల వేట
సాక్షి, వాజేడు : వరి పొలంలో చేపల వేట ఏమిటని అనుకుంటున్నారా ! అవునండి నిజమే. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోదావరి నీరు ఎగ పోటుతో పొలాల్లోకి చేరింది. వరద పెరిగే సమయంలో గోదావరి నుంచి చేపలు వస్తాయి. ములుగు జిల్లా వాజేడు మండల పరిధి కాచారం వద్ద పొలాల్లో రైతులు శుక్రవారం తోపెను వలతో చేపలు పట్టుకుంటుండగా ఆ దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. -
మా ఊరికి డాక్టరొచ్చిండు
అన్ని వసతులు సవ్యంగా, పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో డ్యూటీలకు వెళ్లమంటేనే డాక్టర్లు, ఇతర ప్రభుత్వాధికారులు అలసత్వం వహిస్తారు. తప్పదనుకుంటే వారంలో రెండ్రోజులు అలా వెళ్లి ఇలా రావడమే మహా గగనం. అలాంటిది దట్టమైన అరణ్యంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుని వెళ్లాల్సిన గ్రామాల్లో వైద్య పరిస్థితి సంగతి గురించి మాట్లాడుకోవడం తప్పే. జ్వరమొస్తేనే దేవుడిపై భారం వేసే ఆదివాసీ గ్రామాలకు లెక్కేలేదు. సీజన్ మారిందంటే చాలు ఏజెన్సీల్లో పడకేసిన వైద్యం, విషజ్వరాలతో చనిపోయే సాటి మనుషుల గురించి లెక్కలేనన్ని వార్తలు చదువుతుంటాం. మారుమూల గిరిజన పల్లెల్లో ఇప్పటికీ డాక్టర్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. వారం, రెండువారాలకోసారి ఓ ఆశ వర్కర్ వస్తే వస్తారు లేకుంటే అదీ లేదు. అలాంటిది ఓ మండల వైద్యాధికారి.. వైద్య సిబ్బందిని వెంటబెట్టుకుని తమ వద్దకే వస్తే.. ఇది అలాంటి తండాల ప్రజల ఊహకు కూడా అందదు. కానీ ములుగు జిల్లా వాజేడు వైద్యాధికారి మంకిడి వెంకటేశ్వర్లు దీన్ని నిజం చేసి చూపించారు. కనీస వైద్య సేవలు గిరిజనుల హక్కు అని గుర్తించి తానే స్వయంగా ఓ గిరిజన తండాకు వెళ్లి వైద్యసేవలందించారు. వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామపంచాయతీ పరిధిలో గుట్టలపైన ఉన్న పెను గోలు ఓ ఆదివాసీల కుగ్రామం. ఊళ్లో 18 ఇండ్లు, 23 కుటుంబాలు, 78 మంది జనాభా ఉన్నారు. వీరికి మట్టిరోడ్డు సౌకర్యం కూడా లేదు. గుట్ట దిగొస్తేనే సరుకులు, వైద్యం అందేది. ఒకట్రెండు కిలోమీటర్లు కాదు 15 కిలోమీటర్ల మేర గుట్ట పైకెక్కి దిగి కిందకు రావడం సులభమేం కాదు. వర్షాకాలంలోనైతే అదో పెద్ద యజ్ఞమే. ఒకే వాగును మూడు చోట్ల దాటాల్సి ఉంది. ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలీని పరిస్థితి వీరిది. పది, పదిహేను రోజులకోసారి ఆశ వర్కర్, ఏఎన్ఎంలు వచ్చి ఏదో మందులు ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడి గిరిజనులకు వైద్యమందిం చాలని జిల్లా వైద్యాధికారి మంకిడి వెంకటేశ్వర్లు సంకల్పించారు. సబ్యూనిట్ ఆఫీసర్ శరత్ బాబు, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, శేఖర్, చిన్న వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం రాజేశ్వరి, ఆశ వర్కర్ సమ్మక్కతో కలిసి గురువారం ఉదయం ఏడు గంటలకు వాజేడు నుంచి బయలు దేరారు. గుమ్మడిదొడ్డి గ్రామ చివర నుంచి గుట్ట ఎక్కుతూ 5 గంటల పాటు మధ్యలో వాగును మూడుచోట్ల దాటి 15 కిలోమీటర్లు కాలినడకన పెనుగోలుకు చేరుకున్నారు. ఆదివాసీలకు వైద్య పరీక్షలు ఆశ వర్కర్, ఏఎన్ఎం రావడమే ఎక్కువైన ఆ ఊరికి వైద్య సిబ్బంది వచ్చారనే సమాచారంతో గ్రామస్తులంతా ఒక్క చోటికి చేరారు. ముందు గిరిజనులతో మాట్లాడిన వైద్య బృందం అందరినీ పరీక్షించి అవసరమైన మందులు ఇచ్చారు. రోగులను పరీక్షించే సమయంలో ఊకే శ్రీలత, బొగ్గుల మల్లేష్, జనార్దన్‌లకు మలేరియా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించి వైద్యం అందించారు. మరో 10 మందికి జ్వరాలు ఉండటంతో వారికి వైద్యం చేశారు. దగ్గు, జలుబు, ఒంటి నొప్పులతో బాధపడుతున్న వారికి చికిత్స చేసి మందులు ఇచ్చారు. ఆ తరువాత గ్రామస్తులకు దోమ తెరలను పంపిణీ చేసి 18 గృహాల్లో దోమల మందు పిచికారీ చేశారు. వర్షంతో ఆగిన ప్రయాణం మధ్యాహ్నం 12 గంటలకు పెనుగోలుకు చేరుకున్న వైద్య బృందం ఆదివాసీలకు పరీక్షలు, మందులు, దోమ తెరల పంపిణీ పూర్తయ్యే సమయానికి వర్షం ప్రారంభమైంది. దీంతో గురువారం రాత్రి అక్కడే బసచేశారు. తమకు కలగా మారిన వైద్యాన్ని అందించిన అధికారులపై ఆది వాసీలు తమ గౌరవాన్ని చాటుకున్నారు. వైద్య సిబ్బందికి భోజనాలు పెట్టడంతోపాటు పడుకునేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా లేక పోవడంతో గుడ్డి దీపాల వెలుగులోనే వైద్యాధికారి సహా సిబ్బంది విశ్రమించారు. ఉదయం లేవగానే వాజేడుకు రావడానికి పయనమైన వైద్య సిబ్బందికి జోరు వర్షంలోనూ గ్రామ స్తులు వెంటుండి వాగు దాటించారు. గుమ్మడిదొడ్డి గ్రామం వరకు మెడికల్ కిట్లను మోసుకొచ్చి దింపి వెళ్లారు. వైద్యం చేసి వాజేడుకు చేరుకునేంతవరకూ ఆ గ్రామస్తులు కొందరు వీరి వెంటే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఇంతవరకు ఎవరూ తమ ఊరివైపు కన్నెత్తి కూడా చూడలేదని డాక్టర్ మంకిడి వెంకటేశ్వర్లు సేవలను జీవితాంతం గుర్తుంచుకుంటామని పెనుగోలు గ్రామస్తులు తెలిపారు. అదో మధురానుభూతి గుట్టల పైనున్న పెనుగోలు గిరిజనులకు వైద్యం అందించడం మధురానుభూతిని మిగిల్చింది. అక్కడికి వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. అది ఇప్పుడు కుదిరింది. వారి ఆతిథ్యం, ఆదరణ మర్చిపోలేనివి. నేను పడుకున్నప్పుడు ఓ తేలు నా దగ్గరగా వస్తే దాన్ని గుర్తించి గ్రామస్తులు చంపారు. చిమ్మ చీకట్లో వారు ఉంటున్న దృశ్యం కలవరం కలిగించింది. – మంకిడి వెంకటేశ్వర్లు, వైద్యాధికారి -
45 మీటర్ల ఎత్తు నుంచి లోయలో పడిన వృద్ధుడు
వాజేడు : మండల పరిధిలోని చీకుపల్లి బ్రిడ్జి వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు గజ్జల బుచ్చయ్య(85) 45 మీటర్ల ఎత్తు నుంచి లోయలోని నీళ్లలోపడి అక్కడికక్కడే మృతిచెందగా కారు మరో వైపు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని తలపించింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు కాగా మిగతా వారిని స్థానికులు రక్షించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన గజ్జల బుచ్చయ్య(85) ప్రతీ రోజు బొగత జలపాతం గ్రామానికి నడిచి వెళ్లి తిరిగి రావడం అలవాటు. రోజూలాగే మంగళవారం కూడా బొగత జలపాతానికి వెళ్లి తిరిగి ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో పరకాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు ఏపీ 9 బీజే 0137 నంబర్ కారులో బొగత జలపాతానికి వస్తున్నారు. అతివేగంగా వస్తున్న కారును చీకుపల్లి బ్రిడ్జి వద్ద మూలమలుపు తిరిగే క్రమంలో అదుపు చేయలేకవడంతో రోడ్డు పక్కన నడుస్తున్న బుచ్చయ్యను ఢీకొట్టారు. దీంతో బుచ్చయ్య రోడ్డుపై సుమారు 10 మీటర్ల ఎత్తుకు ఎగిరి 35 మీటర్ల లోతు లోయలోని నీటిలో పడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. బుచ్చయ్యకు కారు తగలగానే ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ ఎదురుగా లోయ ఉండటంతో ఎడమ చేతి వైపునకు తిప్పగానే కారు మరో పక్క లోయలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ద్విచక్ర వాహనదారుడు రెండు బ్రేకులను వేయడంతో బండి మీద ఉన్న దంపతులు కింద పడిపోయారు. లేదంటే వీరు కూడా కారు ప్రమాదానికి గురయ్యేవారు. ఈ ఘటనలో కారు మొత్తం నుజ్జనుజ్జయ్యింది. లోయలో కారు తిరగబడి ఉండడంతో అందులో ఉన్న ఏడుగురికి ఊపిరాడలేదు. అక్కడ ఉన్న స్థానికులు కారునుపైకి లేపి అందులోని వారిని బయటకు తీశారు. కారులో ఉన్న నాగరాజు, డ్రైవర్‌కు గాయాలు కాగా మిగతా వారు క్షేమంగా బయటపడ్డారు. కారును పైకి లేపి ఉండకపోతే మిగతా వారు కూడా మృత్యువాతపడే వారని స్థానికులు తెలిపారు. కారులో ఉన్న అందరూ పూటుగా తాగి కారును నడుపుతున్నారని సంఘటన స్థలానికి చేరుకున్న చీకుపల్లి, గుమ్మడిదొడ్డి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గుమ్మడిదొడ్డి గ్రామస్తులు, బంధువులు విషయాన్ని ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్‌కు తెలియజేయటంతో ఆయన ఘటన స్థలానికి వచ్చి వివరాలను సేకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమొదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జలపాతంలో పడి విద్యార్థి మృతి
వాజేడు (ఖమ్మం) : జలపాతం అందాలను ఆస్వాదించటానికి వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్వంచ నవభారత్ కాలనీకి చెందిన దరావత్ పవన్ (18) కొత్తగూడెంలోని నలంద కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తన మిత్రులతో కలసి బొగత జలపాతం వద్దకు వచ్చాడు. జలపాతంలోని లక్ష్మీనరసింహా స్వామి ఆలయ సమీపం వద్ద ఉన్న రాళ్లపై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు పవన్ జారి జలపాతంలో పడ్డాడు. వెంటనే నీటిలో మునిగిపోవడంతో పర్యాటకులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సుమారు గంట తర్వాత పవన్ మృతదేహాన్ని బయటకు తీశారు. -
వాజేడు మండలంలో నిలిచిన రాకపోకలు
ఖమ్మం : ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని గోదావరి వరద నీరు శనివారం కాజ్‌వేపైకి వచ్చి చేరింది. దాంతో మండలంలోని దాదాపు 25 గ్రామాలకు గోదావరి వరద నీటి కారణంగా రాకపోకలు నిలిచపోయాయి. దీంతో అధికారులు నాటు పడవల సహాయంతో గ్రామాల మధ్య రాకపోకలను పునరుద్ధరించారు. పెద్ద ఎత్తున గోదావరి నది వరద నీరు కాజ్‌వేపైకి వచ్చి చేరడంతోనే ఈ పరిస్థితి నెలకొందని మండలంలోని ప్రజలు వెల్లడించారు. వాజేడు మండలంలో పలు లోతట్టు ప్రాంతాలు కావడంతో ఇలా కాజ్‌వేపైకి నీరు వచ్చి చేరిందని చెబుతున్నారు. -
ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షాలు
ఖమ్మం: అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గోదావరిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు రిజర్వాయర్ లోని పెద్దఎత్తున నీరు రావడంతో 18 గేట్లు ఎత్తేసి 90 వేల క్యూసెక్కుల నీటికి దిగువకు వదిలారు. కిన్నెరసాని, పెదవాగు, బయ్యారం చెరువు, వైరా రిజర్వాయర్ జలకళ సంతరించుకున్నాయి. గోదావరికి వరదనీరు పోటెత్తడంతో వాజేడు-వెంకటాపురం మండలాల మధ్య ఉన్న చీకుపల్లి వాగు పొంగి 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు, ముర్రేడు, ఏయ, ఆకేయ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. -
ఉష్ణ‘శక్తి’
వాజేడు, న్యూస్‌లైన్: మారుమూల ప్రాంత ప్రజానీకం సౌరవిద్యుత్‌పై మక్కువ పెంచుకుంటోంది. ఉష్ణశక్తితో పనిచేసే సోలార్ ఇన్వర్టర్ల పుణ్యమా అని ఏజెన్సీ గ్రామాలు చీకట్లను పారదోలుతున్నాయి. వాజేడు మండలంలో సౌరవిద్యుత్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఓ రెండు కంపెనీలు సబ్సిడీలు ఇస్తుండటంతో సోలార్ ఇన్వర్టర్ల వైపు ఇక్కడి ప్రజానీకం మొగ్గుచూపుతోంది. వీటి కోసం సంబంధిత కంపెనీలు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పిస్తుండటంతో ఇక్కడి ప్రజలు సోలార్ ఇనర్టర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీ) నుంచి ఇప్పటికే ఆ రెండు కంపెనీల్లో ఒకటి 15, మరొకటి పది సోలార్ ఇన్వర్టర్లను ప్రజలకు అందించాయి. 200 వాట్స్ సౌరవిద్యుత్ ఇన్వర్టర్కు రూ.60వేలు, 300 వాట్స్ దానికి రూ.65వేల బ్యాంకు రుణం ఇస్తుంది. దీనిలో అప్పుపొందే వినియోగదారుడు రూ.60వేల దానికి రూ.10వేలు, 65 వేలదానికి రూ.15 వేలు ముందస్తుగా చెల్లించాలి. మిగతా సొమ్మును బ్యాంకు రుణంగా ఇస్తుంది. దీన్ని వాయిదా పద్ధతిలో చెల్లించాలి. అయితే రూ.50వేలల్లో రూ.21,600 సబ్సిడీ రూపంలో వస్తుందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. సోలార్ ఇన్వర్టర్ కొనుగోలు చేసిన మూడునెలల తర్వాత ఈ సబ్సిడీ సొమ్ము కొనుగోలుదారుని బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. ఇలా 50 శాతానికి పైగా సబ్సిడీ లభిస్తుండటంతో ఏజెన్సీ వాసులు ఈ సోలార్ ఇన్వర్టర్ల వైపు మొగ్గుచూపుతున్నారు.