
సాక్షి, వాజేడు : కుటుంబ యజమానిని నిర్భంధించి దోపిడీ చేసిన సంఘటన వాజేడు మండలంలో సంచలనం సృష్టించింది. ప్రగళ్లపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో గ్రామానికి చెందిన హెచ్ ఖాసీం మహ్మద్ ఇంటికి ముసుగులు ధరించిన ఆరుగురు అపరిచిత వ్యక్తులు వచ్చారు. అందరు గాడ నిద్రలో ఉండగా తలుపు కొట్టడంతో ఖాసీం మహ్మద్ భార్య తలుపు తీసింది. ఖాసీం ఆర్‌ఎంపీ వైద్యుడు కావడంతో వైద్యం కోసం వచ్చి ఉంటారని భావించి తలుపు తీశారు.
వెంటనే ఆమెను తుపాకీతో బెదిరించి ఇంట్లోకి వెళ్లారు ఖాసీంను తాళ్లతో బంధించి నేను దళ కమాండర్‌ను లక్ష రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. తన వద్ద డబ్బులు లేవని ఖాసీం చెప్పడంతో ఖాసీం భార్య మెడలోని పుస్తెల తాడు, కూతురు మెడలోని చైన్‌ను లాక్కున్నారు. ఈ రెండు కలిపి 42 గ్రాములు ఉంటాయని బాధితులు తెలిపారు. కాగా ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపుతామని హెచ్చరించి వెళ్లారు. బాధితులు బుధవార వాజేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నకిలీ మావోయిస్టులు డబ్బుల కోసం ఇదంతా చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment