వాజేడు, న్యూస్‌లైన్: మారుమూల ప్రాంత ప్రజానీకం సౌరవిద్యుత్‌పై మక్కువ పెంచుకుంటోంది. ఉష్ణశక్తితో పనిచేసే సోలార్ ఇన్వర్టర్ల పుణ్యమా అని ఏజెన్సీ గ్రామాలు చీకట్లను పారదోలుతున్నాయి. వాజేడు మండలంలో సౌరవిద్యుత్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఓ రెండు కంపెనీలు సబ్సిడీలు ఇస్తుండటంతో సోలార్ ఇన్వర్టర్ల వైపు ఇక్కడి ప్రజానీకం మొగ్గుచూపుతోంది. వీటి కోసం సంబంధిత కంపెనీలు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పిస్తుండటంతో ఇక్కడి ప్రజలు సోలార్ ఇనర్టర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీ) నుంచి ఇప్పటికే ఆ రెండు కంపెనీల్లో ఒకటి 15, మరొకటి పది సోలార్ ఇన్వర్టర్లను ప్రజలకు అందించాయి.
200 వాట్స్ సౌరవిద్యుత్ ఇన్వర్టర్‌కు రూ.60వేలు, 300 వాట్స్ దానికి రూ.65వేల బ్యాంకు రుణం ఇస్తుంది. దీనిలో అప్పుపొందే వినియోగదారుడు రూ.60వేల దానికి రూ.10వేలు, 65 వేలదానికి రూ.15 వేలు ముందస్తుగా చెల్లించాలి. మిగతా సొమ్మును బ్యాంకు రుణంగా ఇస్తుంది. దీన్ని వాయిదా పద్ధతిలో చెల్లించాలి.
అయితే రూ.50వేలల్లో రూ.21,600 సబ్సిడీ రూపంలో వస్తుందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. సోలార్ ఇన్వర్టర్ కొనుగోలు చేసిన మూడునెలల తర్వాత ఈ సబ్సిడీ సొమ్ము కొనుగోలుదారుని బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతుంది. ఇలా 50 శాతానికి పైగా సబ్సిడీ లభిస్తుండటంతో ఏజెన్సీ వాసులు ఈ సోలార్ ఇన్వర్టర్ల వైపు మొగ్గుచూపుతున్నారు.
ఉష్ణ‘శక్తి’
Published Tue, May 27 2014 2:09 AM | Last Updated on Mon, Oct 22 2018 8:26 PM
Advertisement