సాక్షి, విశాఖపట్నం: ఏపీ రూఫ్‌టాప్ సోలార్ ఎక్స్‌పో-2015కు రెండవ రోజు సంసదర్శకుల తాకిడి కొనసాగింది. విశాఖ నగరంతో పాటు సరిసర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి కూడా వినియోగదారులు తరలివచ్చారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఆదివారం ఎక్స్‌పోకు వచ్చి విద్యార్థులు, సందర్శకులతో ముచ్చటించారు. ఇలాంటి ఎక్స్‌పో జరగుతున్నందున వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ సిస్టంను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 23 పాఠశాలల విద్యార్థులు క్విజ్ పోటీలో, 20 ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సెమినార్‌లో పాల్గొన్నారు.
తొలిరోజు 400 మంది విద్యార్థులు పాల్గొన్న చిత్రలేఖనం పోటీల విజేతలను రెండవ రోజు ఎంపిక చేశారు.మొదటి రోజు 48కెవి సోలార్ రూఫ్‌టాప్ కోసం 18 మంది వినియోగదారులు దరఖాస్తులు అందించగా రెండవ రోజు 42 మంది 263కెవి సోలార్ విద్యుత్ కావాలని రిజిస్టర్ చేయించుకున్నారు. ఆకర్షణీయంగా రూపొందించిన ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి వినియోగదారులు వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో నిపుణులు, అధికారులు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు.సెమినార్‌లో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ రెండం సెషన్‌లో సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల, విజయనగరం విద్యార్థులు ఎస్.రవితేజ, ఓ.దీపికాచైతన్య విజేతలుగా నిలిచారు.
‘సోలార్ ఎక్స్‌పో’లో సమగ్ర విజ్ఞానం
Published Sun, Aug 23 2015 11:35 PM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM
Advertisement