సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటుచేసిన సోలార్ ఫోటోవోల్టాయిక్ వ్యవస్థను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. క్యాంప్ కార్యాలయానికి అవసరమయ్యే విద్యుత్‌లో సగం ఈ సౌరశక్తి విధానం ద్వారా ఉత్పత్తి అవుతుందని, ఖర్చు కూడా సగం తగ్గుతుందని అధికారులు తెలిపారు.
ఇటీవల ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సోలార్ విధానం-2012 అమలును వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహానికి నెడ్‌క్యాప్ చేపడుతున్న చర్యలను అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, సీఎం ముఖ్యకార్యదర్శి అజయ్ కలాం, ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్‌బాబు పాల్గొన్నారు.