
రోడ్డుపై వెళుతున్న అడవి దున్న
ఇది రహదారి దాటుతున్నప్పుడు వాహనదారులు తీసిన ఫొటోలు....
వాజేడు(ములుగు) : సాధారణంగా అడవి దున్నలు జనారణ్యంలోకి రావు. కానీ మంగళవారం ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు వద్ద ఓ అడవి దున్న(కారు బర్రె) రోడ్డుపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. ఇక్కడి అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు అడవి దున్న ఆనవాళ్లు కనిపించలేదు. అయితే, ఈ బర్రె ధర్మవరం అటవీ ప్రాంతం వైపు నుంచి చెరుకూరు సమీపంలో జాతీయ రహదారి మీదుగా ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న గుట్టల వైపు వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఇది రహదారి దాటుతున్నప్పుడు వాహనదారులు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.