ఖమ్మం : ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని గోదావరి వరద నీరు శనివారం కాజ్‌వేపైకి వచ్చి చేరింది. దాంతో మండలంలోని దాదాపు 25 గ్రామాలకు గోదావరి వరద నీటి కారణంగా రాకపోకలు నిలిచపోయాయి. దీంతో అధికారులు నాటు పడవల సహాయంతో గ్రామాల మధ్య రాకపోకలను పునరుద్ధరించారు.
పెద్ద ఎత్తున గోదావరి నది వరద నీరు కాజ్‌వేపైకి వచ్చి చేరడంతోనే ఈ పరిస్థితి నెలకొందని మండలంలోని ప్రజలు వెల్లడించారు. వాజేడు మండలంలో పలు లోతట్టు ప్రాంతాలు కావడంతో ఇలా కాజ్‌వేపైకి నీరు వచ్చి చేరిందని చెబుతున్నారు.