వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా తాను మళ్లీ ఎన్నికైతే ఒక నియంత తరహాలో పరిపాలన సాగిస్తానని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తనకు రెండు లక్ష్యాలు ఉన్నాయని, వాటిని నెరవేర్చవడానికి అవసరమైతే నియంతలా మారుతానని స్పష్టం చేశారు. మెక్సికో సరిహద్దు నుంచి నుంచి అమెరికాలోకి చొరబాట్లను అరికట్టడం, ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వడం తన లక్ష్యాలు అని వివరించారు. తనపై తప్పుడు ప్రచారం సాగిస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్ మండిపడ్డారు.
ఒకవేళ తనపై అక్రమ కేసులు నమోదు చేసి, విచారణ చేపడితే అమెరికా మొత్తం స్తంభించిపోతుందని తేల్చిచెప్పారు. తనను నియంతగా చిత్రీకరించి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అధ్యక్షుడిగా అధికారంలో తాను యుద్ధాలు చేయలేదని, విదేశాల్లో ఉన్న అమెరికా దళాలను వెనక్కి రప్పించానని గుర్తుచేశారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ యుద్ధాల నుంచి రాజకీయంగా లాభం పొందాలని బైడెన్ ఎత్తుగడలు వేస్తున్నారని ట్రంప్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment