పినపాకలో మావోయిస్టు పోస్టర్లు
Published Tue, May 30 2017 2:05 PM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM
పినపాక: ఖమ్మం జిల్లా పినపాక మండలం మల్లారం పంచాయతీ వెంకటేశ్వరపురం గ్రామంలో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. నక్సల్బరీ సాయుధ 50వ వార్షికోత్సవాలను గ్రామ గ్రామాన విప్లవ ఉత్తేజంతో జరపాలని అందులో పేర్కొన్నారు. నక్సలిజమే భారత ప్రజల విముక్తికి ఏకైక మార్గమని, నక్సలిజం రగిల్చి ప్రజా యుద్ధ జ్వాలల్లో భూస్వాములను భస్మీపటలం చేద్దామని ప్రజలకు నక్సల్స్ పిలుపునిచ్చారు. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దామని, నక్సల్బరీ ఏకీ రాస్తా అని, సామ్రాజ్యవాదం నశించాలని ఆ పోస్టర్లలో నక్సల్స్ పేర్కొన్నారు.
Advertisement
Advertisement