ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పుల కలకలం
నారాయణపూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. నారాయణపూర్ జిల్లా ధనోరా అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ధనోరా అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపైకి మావోలు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుదాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.