narayanapur
-
ఆలోచించండి.. ఆగం కాకండి : కేటీఆర్
-
ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్
సాక్షి, నల్గొండ: మునుగోడు ఎన్నికల ప్రచారం నేటి (మంగళవారం) సాయంత్రం 6 గంటలతో ముగియనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంస్థాన్ నారాయణపూర్ చౌరస్తాలో రోడ్‌షో నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అమ్ముడుపోతే ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టుకు మోదీ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శలు గుప్పించారు. ఓటుకు తులం బంగారం ఇచ్చైనా గెలుస్తాననే పొగరుతో బీజేపీ నాయకులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద కాంట్రాక్టర్లను మోదీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ రాకముందు కరెంట్ ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీ సామాన్యుడి బతుకు నాశనం చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేశారు. మోదీ అధికారంలో వచ్చినప్పుడు రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కు చేరింది. మోదీ వచ్చినప్పుడు పెట్రోల్ ధర రూ.70 ఉంటే ఇవాళ 110 రూపాయలకు చేరింది. కార్పొరేట్ శక్తులకు మోదీ కొమ్ముకాస్తున్నారు. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా. ఎవరు పెద్దోళ్ల కోసం ఉన్నారు..? ఎవరు పేదోళ్ల కోసం ఉన్నారు. ఆలోచించి ఓటు వేయండి.. ఆగం కాకండి. ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో మునుగోడు ప్రజలు తేల్చుకోవాలని’ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు -
11 మంది కిడ్నాప్: త్రుటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే
రాయ్‌పూర్: మావోయిస్టుల దాడి నుంచి ఓ ఎమ్మెల్యే త్రుటిలో తప్పించుకున్నారు. ఓ పర్యటనలో ఉండగా మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. ఈ సమయంలో ఎమ్మెల్యే తప్పించుకోగా భద్రతా విధుల్లో ఉన్న ఓ జవాన్ మృతి చెందగా మరో జవాన్ గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చందన్ కశ్యప్ మంగళవారం ఓర్చాలో పర్యటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రతా దళాలు వెంటనే ఉన్నారు. ఎమ్మెల్యే పర్యటన విషయం తెలుసుకున్న మావోయిస్టులు ఎమ్మెల్యే పర్యటనపై దాడి చేశారు. ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుపడడంతో భద్రతా దళాలు ఎదుర్కొనేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు జరిగిన కాల్పుల్లో ఓ ఐటీబీపీ జవాన్ మృతి చెందాడు. ఇంకా మరొకరికి గాయాలయ్యాయి. ఈ దాడి నుంచి ఎమ్మెల్యే చందన్ సురక్షితంగా బయటపడ్డారు. ఇదిలా ఉండగా సుక్మా జిల్లా జేగురుగొండలో మావోయిస్టులు కొందరిని కిడ్నాప్ చేశారనే వార్త కలకలం సృష్టించింది. ఏకంగా 11 మంది గిరిజనులను మావోయిస్టులు అపహరించుకుపోయారని తెలుస్తోంది. అయితే పోలీస్ రిక్రూట్మెంట్ కోసం వెళ్లారనే కారణంతోనే వారిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారని వార్తలు వస్తున్నాయి. -
పల్లెల్లో దాహం కేకలు !
సాక్షి, దాచేపల్లి : పల్లెవాసుల గొంతెండుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంచినీటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో ప్రజలు మండిపడుతున్నారు. ఓట్లు కోసం గడప తొక్కే నాయకులు ఇప్పుడు నీటి సమస్యను పరిష్కరించకపోవటంతో వారి తీరును తప్పుపడుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే మంచినీటి ఎద్దడి ఉంటే ముందు రోజుల్లో మరింతగా నీటి కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెంతనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించకపోవటంతో అనేక గ్రామాలకు కృష్ణమ్మ రావటంలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించిన తాగునీటి పైలెట్ ప్రాజెక్ట్‌ల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించటంతో మంచినీటి సమస్యకు కారణంగా మారింది. పైపులైన్ల తొలగింపు.... నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురం,మన్షూర్షాపేట, అంజనాపురం, నడికుడి ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య అధికంగా ఉంది. ఇక్కడ రోడ్ల నిర్మాణం కోసం తాగునీటి పైపులను తొలగించారు. నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణాలు పూర్తికాక పైపులైన్లను అమర్చలేదు. దీంతో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కేసానుపల్లి గ్రామంలో పలు బోర్లు మరమ్మతులకు గురికాగా మరికొన్ని బోర్లకు నీరు అందటంలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్లకు నీరు అందక పనిచేయటంలేదు. దీంతో ప్రజలు తాగునీటి కోసం పరుగులు తీస్తున్నారు. రైల్వేట్రాక్ సమీపంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో బోర్లు పనిచేయక కాలనీవాసులు నీటి కోసం అరకిలోమీటర్ దూరం వెళ్తున్నారు. దాచేపల్లిలోని పలు వార్డుల్లో మంచినీటి సమస్య ఉంది. మాదినపాడు, తంగెడ, తక్కెళ్లపాడు, గామాలపాడు, పొందుగల గ్రామాల్లో కూడా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు... వేసవికాలం రావటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గతేడాది వర్షపాతం తక్కువ మోతాదులో నమోదు కావటంతో భూగర్భ జలాలు స్థాయి పెరగలేదు. దీంతో బోర్లకు నీరు అందటంలేదు. ప్రస్తుతం 500 అడుగుల లోతులో బోర్లు వేసిన అర అంగుళం నీటి ధార రావటంలేదు. నాగులేరు, పలు వాగుల్లో అధికపార్టీ నాయకులు చెక్‌డ్యాంలను నిర్మించారు. కేవలం నిధులు డ్రా చేసుకునేందుకు వీటిని నిర్మించారే తప్ప నీరు నిలబడేందుకు కాదనే విషయం చెక్‌డ్యాంలను చూస్తే తెలుస్తుంది. మార్చిలో భూగర్భ జలాలు అడుగంటిపోతే ఏప్రిల్, మే నెలలో అసలు బోర్లు పనిచేయవనే ఆందోళన ప్రజలను వెంటాడుతోంది. రెండేళ్ల క్రితం డిసెంబర్ నుంచి మే నెలాఖారు వరకు మంచినీటి ఎద్దడి నెలకొనటంతో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో నెలకొన్న మంచినీటి ఎద్దడిపై దృష్టిసారించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో నడికుడికి చెందిన మందపాటి నాగిరెడ్డి ఫౌండేషన్, ఇరికేపల్లికి చెందిన ది మధర్ స్వచ్ఛంద సేవా సంస్థల వారు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా మంచి నీటిని అందిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు తీసుకున్న చొరవను ప్రభుత్వం చూపించకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మంచినీటి సమస్యను తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల కోసం పైపులైన్లు తొలగించారు నారాయణపురంలో రోడ్ల నిర్మాణం కోసం మంచినీటి పైపులైన్లను తొలగించారు. పైపులను తీసేయటం వల్ల మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. గత నెల రోజుల నుంచి మంచినీటి కోసం పక్క వీధులకు వెళ్తున్నారు. పైపులైన్ల ద్వారా మంచినీరు సక్రమంగా అందటంలేదు. – షేక్ షరిఫ్. నారాయణపురం -
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాల్పుల కలకలం
నారాయణపూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ విరుచుకుపడ్డారు. నారాయణపూర్ జిల్లా ధనోరా అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ధనోరా అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపైకి మావోలు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుదాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్సును తగులబెట్టిన నక్సల్స్
ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఓ ప్రైవేటు బస్సును మావోయిస్టులు తగులబెట్టారు. అబూజ్మడ్-నారాయణపూర్ రహదారి నిర్మాణాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఘటనకు పాల్పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ : మావోయిస్టు మృతి
రాయ్‌పూర్: స్పెషల్ టాస్క్ఫోర్సు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ ప్రాంతంలోని కుధూర్లో శనివారం తెల్లవారుజామున నక్సల్స్ జన్ అదాలత్ నిర్వహించి గ్రామస్తులకు శిక్షలు విధిస్తున్నారన్న సమాచారం అందుకున్న నారాయణపూర్, కొండగావ్ పోలీసులు కిలమ్-తుండివాల్-కుధూర్ మార్గంలో నక్సల్స్ వెదుకులాటకు ఉమ్మడిగా బయలుదేరారు. పోలీసు పార్టీ కుధూర్ గ్రామానికి చేరుకోగానే నక్సల్స్ పోలీసులపైకి కాల్పులు జరిపారు. పోలీసులు కూడా కాల్పులు జరపగా మహిళలను, పిల్లలను అడ్డుపెట్టుకుని నక్సల్స్ పారిపోయారు. కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతదేహం కనిపించింది. అక్కడి రక్తపు మరకలనుబట్టి మరికొందరు నక్సల్స్ గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన నక్సల్‌ను కొట్మెపార గ్రామానికి చెందిన ఎల్ఓఎస్ మావోయిస్టు ఏరియా డిప్యూటీ కమాండ ర్ బోటి కశ్యప్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపినట్లు నారాయణపూర్ ఎస్పీ అభిషేక్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. -
నారాయణపూర్‌లో దొంగల బీభత్సం
నారాయణపూర్: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలకేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లు, ఒక నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలానికి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. -
నారాయణపూర్‌లో వ్యక్తి హత్య
రెబ్బన: ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం నారాయణపూర్‌లో గుర్తితెలియని వ్యక్తులు దుర్గం వెంకటయ్య(40) అనే వ్యక్తిని హత్యచేశారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున జరిగింది. గ్రామ శివారులో వెంకటయ్య మృతదేహం పడిఉండగా ఉదయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని శరీరంపై గాయాలున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. రెబ్బన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
9మంది మావోయిస్టుల అరెస్ట్
రాయపూర్ : ఛత్తీస్‌గఢ్‌లో తొమ్మిదిమంది మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. నారాయణ్‌పూర్ జిల్లా కొసల్నార్ అటవీ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న మావోలను విచారిస్తున్నారు. వీరు పలు ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసినవారిలో ఇద్దరిపై రివార్డు ఉంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముచ్చటగా మూడేళ్లు..!
జిల్లాలో కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేసిన 17ఏళ్ల తరువాత మరమ్మతులకు ప్రభుత్వం ఉపక్రమించింది. గత మూడే ళ్లుగా కొనసాగుతున్న ఈ పనులను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఐదు క్రస్టుగేట్ల ఇనుప తాళ్ల మార్పునకు రూ.38 లక్షలతో గత రెండురోజుల క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. త్వరలోనే ఈ పనులను చేపట్టనున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి ప్రాజెక్టు క్రస్టుగేట్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా, నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. కిలోమీటర్ మేర ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం చేయడంతోపాటు, 67 క్రస్టుగేట్లను అమర్చారు. ప్రతి ఐదేళ్లకోసారి క్రస్టు గేట్ల రబ్బర్ బీడింగ్లను మార్చడం, తుప్పు పట్టకుండా కలర్ వేయడం, ఇనుప తాళ్ల నిర్వాహణ తదితర మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇవేవీ చేపట్టకపోవడంతో గత మూ డేళ్లుగా 50 గేట్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. దీని కితోడు 2012 రబీ సీజన్లో నారాయణపూ ర్ ప్రాజెక్టు నుంచి రీజనరేట్ వాటర్ రాకపోవడంతో ఆయకట్టుకు నీళ్లివ్వలేని పరిస్థితి ఏర్పడింది. లీకేజీల రూపంలో ఉన్న నీరం తా దిగువనదిలోకి పోవడంతో రైతులు ఆం దోళనకు దిగారు.స్పందించిన ప్రభుత్వం క్ర స్టుగేట్ల మరమ్మతులకు టెండర్లను పిలిచింది. మరమ్మతులకు టెండర్లు మొదటి దశ టెండర్లలో ముంబాయికి చెందిన కంపెనీ ముందుకు రాగా, గతేడాది ఫిబ్రవరి వరకు కేవలం 50 క్రస్టుగేట్లకు మాత్రమే మరమ్మతులు చేయగలిగారు. మిగిలి ఉన్న క్రస్టుగేట్ల మరమ్మతులతోపాటు, ఐదు క్రస్టుగేట్ల ఇనుప తాళ్ల మార్పునకు రూ.38 లక్షలతో గతనెల క్రితం టెండర్లు పిలిచి రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. వచ్చే ఫిబ్రవరి నాటికి క్రస్టుగేట్ల మరమ్మతులను పూర్తి చేసి రిజర్వాయర్ నీళ్లు లీకేజీల ద్వారా దిగువకు వెళ్లకుండా పూర్తిస్థాయి నీటి కట్టడి చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై జూరాల క్రస్టు గేట్ల నిర్వాహణ డివిజన్ ఈఈ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఐదు క్రస్టుగేట్లకు రోప్‌లను మార్చే టెండర్లను పూర్తి చేశామని, పూర్తి స్థాయిలో రబ్బర్ బీడింగ్ల ఏర్పాటు కూడా ఫిబ్రవరి నాటికి పూర్తి చేసే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. -
ఆడపిల్లల సంక్షేమానికే ‘బంగారు తల్లి’
వికారాబాద్, న్యూస్‌లైన్ : ఆడపిల్లల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధి నారాయణపూర్ గ్రామంలో సుమారు రూ.70లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల పోషణ తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్థిక సహాయం అందజేస్తోందని చెప్పారు. సమాజంలో ఆడపిల్లలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు మంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే నారాయణపూర్ గ్రామంలో దాదాపు రూ.70లక్షల విలువ చేసే అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు. గ్రామంలో ఉర్దూ మీడియం పాఠశాలకు రూ.16 లక్షలు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.15లక్షలు, డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2లక్షలు, అలాగే నారాయణపూర్ - కట్టమైసమ్మ గుడి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.35లక్షలను బీఆర్జీఎఫ్ నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వం అందజేసే రుణాలతో పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని తమ కాళ్ల మీద నిలబడాలని మంత్రి సూచించారు. ప్రతి మండలానికి ఒక గ్యాస్ ఏజెన్సీ ఇప్పిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముందు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నారాయణపూర్ సర్పంచ్ నర్సింహులు, శివరెడ్డిపేట్ సొసైటీ చైర్మన్ కిషన్‌నాయక్, వికారాబాద్, ధారూరు మార్కెట్ కమిటీ చైర్మన్లు, పౌర సంబంధాల అధికారి హర్షభార్గవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వినయ్‌కుమార్ పాల్గొన్నారు.