జిల్లాలో కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేసిన 17ఏళ్ల తరువాత మరమ్మతులకు ప్రభుత్వం ఉపక్రమించింది. గత మూడే ళ్లుగా కొనసాగుతున్న ఈ పనులను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఐదు క్రస్టుగేట్ల ఇనుప తాళ్ల మార్పునకు రూ.38 లక్షలతో గత రెండురోజుల క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. త్వరలోనే ఈ పనులను చేపట్టనున్నారు.
ప్రతి ఐదేళ్లకోసారి ప్రాజెక్టు క్రస్టుగేట్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా, నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. కిలోమీటర్ మేర ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం చేయడంతోపాటు, 67 క్రస్టుగేట్లను అమర్చారు. ప్రతి ఐదేళ్లకోసారి క్రస్టు గేట్ల రబ్బర్ బీడింగ్‌లను మార్చడం, తుప్పు పట్టకుండా కలర్ వేయడం, ఇనుప తాళ్ల నిర్వాహణ తదితర మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇవేవీ చేపట్టకపోవడంతో గత మూ డేళ్లుగా 50 గేట్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. దీని కితోడు 2012 రబీ సీజన్‌లో నారాయణపూ ర్ ప్రాజెక్టు నుంచి రీజనరేట్ వాటర్ రాకపోవడంతో ఆయకట్టుకు నీళ్లివ్వలేని పరిస్థితి ఏర్పడింది. లీకేజీల రూపంలో ఉన్న నీరం తా దిగువనదిలోకి పోవడంతో రైతులు ఆం దోళనకు దిగారు.స్పందించిన ప్రభుత్వం క్ర స్టుగేట్ల మరమ్మతులకు టెండర్లను పిలిచింది.
మరమ్మతులకు టెండర్లు
మొదటి దశ టెండర్లలో ముంబాయికి చెందిన కంపెనీ ముందుకు రాగా, గతేడాది ఫిబ్రవరి వరకు కేవలం 50 క్రస్టుగేట్లకు మాత్రమే మరమ్మతులు చేయగలిగారు. మిగిలి ఉన్న క్రస్టుగేట్ల మరమ్మతులతోపాటు, ఐదు క్రస్టుగేట్ల ఇనుప తాళ్ల మార్పునకు రూ.38 లక్షలతో గతనెల క్రితం టెండర్లు పిలిచి రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. వచ్చే ఫిబ్రవరి నాటికి క్రస్టుగేట్ల మరమ్మతులను పూర్తి చేసి రిజర్వాయర్ నీళ్లు లీకేజీల ద్వారా దిగువకు వెళ్లకుండా పూర్తిస్థాయి నీటి కట్టడి చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై జూరాల క్రస్టు గేట్ల నిర్వాహణ డివిజన్ ఈఈ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఐదు క్రస్టుగేట్లకు రోప్‌లను మార్చే టెండర్లను పూర్తి చేశామని, పూర్తి స్థాయిలో రబ్బర్ బీడింగ్‌ల ఏర్పాటు కూడా ఫిబ్రవరి నాటికి పూర్తి చేసే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు.
ముచ్చటగా మూడేళ్లు..!
Published Sun, Dec 1 2013 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement