Jurala Project
-
జూరాల 10 గేట్లు ఎత్తివేత
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద మొదలైంది. గురువారం సాయంత్రం 55 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 89 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఉదయం 20 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయగా...సాయంత్రం నాలుగు గేట్లను, రాత్రి మరో ఆరు గేట్లు మూసివేసి ప్రాజెక్టు 10 క్రస్టు గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జన్కోజల విద్యుత్ కేంద్రంలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. దిగువకు 81,912 క్యూసెక్కుల నీరుక్రస్టు గేట్ల ద్వారా 41,400 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి కోసం 37,237 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 95, నెట్టెంపాడుకు 1,500 , కుడి కాల్వకు 500, ఎడమ కాల్వకు 550, కోయిల్‌సాగర్‌కు 630, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 100, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు..ఇలా మొత్తం ప్రాజెక్టు నుంచి 81,912 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.సాగర్‌కు 69,132 క్యూసెక్కుల నీరుజూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.132 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా...ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 30,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 6వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేçశుల, హంద్రీ నుంచి 1,14,689 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఎడమ, కుడి భూగర్భ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 69,132 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
కృష్ణ గోదావరి నదులకు కొనసాగుతున్న వరద.. ప్రాజెక్టులకు జలకళ
-
వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ
-
జూరాల ప్రాజెక్ట్ కు వరద ఉధృతి.. ఎత్తిన గేట్లు..
-
జూరాల ప్రాజెక్ట్ కు వరద ఉధృతి
-
జూరాల ప్రాజెక్ట్ కు వరద ఉధృతి
-
‘కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాతనే జూరాలను నిండుగా నింపుకున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాల సామర్ధ్యం ఆరున్నర టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. ఆయన తెలంగాణ భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జూరాలకు గరిష్టంగా వరద వచ్చేది 40 రోజులు మాత్రమే. నీటి పారుదల శాఖా మంత్రి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణ నీటివాటా తేలేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీర్చిదిద్దుకున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అన్ని పనులు పూర్తయ్యాయి. ఏడు నుండి పది శాతం పనులే మిగిలిపోయాయి.. 90 శాతం పనులు పూర్తయ్యాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ మీద బురదజల్లుతున్నారు. ప్రాజెక్ట్ మీద వంద కేసులు వేసిన పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలు.. వాటిని ఎదుర్కొని పనులు పూర్తి చేశాం. కర్ణాటకను నిలువరించకుంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీదే’అని నిరంజన్‌రెడ్డి అన్నారు. -
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో...
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 7గంటల వరకు కేవలం 317 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 161 క్యూసెక్కులు క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 388 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.048 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. -
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం రాత్రి 8 గంటల వరకు ప్రాజెక్టుకు 1,980 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 78 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 731 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 300 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,044 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.340 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రామన్‌పాడుకు 1,140 క్యూసెక్కులు మదనాపురం: జూరాల ఎడమ కాల్వ నుంచి రామన్‌పాడు జలాశయానికి 1,140 ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులకు వచ్చి చేరింది. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు 1,150, కుడి కాల్వకు 10, ఎడమ కాల్వకు 10 క్యూసెక్కులు విడుదల చేయడంతో పాటు తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ రనిల్‌రెడ్డి తెలిపారు. -
జూరాలకు స్వల్పంగా పెరిగిన ఇన్‌ఫ్లో.. శ్రీశైలం జలాశయంలో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు ప్రాజెక్టుకు 2,800క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. నెట్టెంపాడు ఎత్తిపోతల నీటి పంపింగ్ కొనసాగుతుంది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఆవిరి రూపంలో 99, ఎడమ కాల్వకు 1,140, కుడి కాల్వకు 731, ఆర్డీఎస్ లింకు కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 6.462 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంలో నీటిమట్టం 842 అడుగులు దోమలపెంట: శ్రీశైలం జలాశయంలో సోమవారం 842 అడుగుల వద్ద 64.9 టీఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 25,427 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు 1,392, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 960, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 135 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. -
'జూరాల' కు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
మహబూబ్‌నగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో మరింత తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 16,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 10వేలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి లిఫ్టు–1 వద్ద ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఆవిరి రూపంలో 94, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 738, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 60, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 8,737 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.929 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 115.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 25.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10,899 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఎలాంటి అవుట్ ఫ్లో లేదని అధికారులు తెలిపారు. స్వల్పంగా విద్యుదుత్పత్తి.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో స్వల్పంగా ఉత్పత్తి కొనసాగుతుంది. ఆదివారం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ రామసుబ్బారెడ్డి, డీఈ పవన్‌కుమార్ తెలిపారు. ఎగువలో ఒక యూనిద్ ద్వారా 39 మెగావాట్లు, 80.437 ఎం.యూ దిగువలో ఒక యూనిట్ ద్వారా 40 మెగావాట్లు, 86.813 ఎం.యూ విద్యుదుత్పత్తిని చేపడుతున్నామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 167.250 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు. మదనాపురం మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు వచ్చి చేరింది. శ్రీశైలంలో 854.7 అడుగుల నీటిమట్టం.. శ్రీశైలం జలాశయంలో ఆదివారం 854.7 అడుగుల వద్ద 91.1 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 5,385 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 1,583, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు 1,455, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 800 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 197 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. -
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
ధరూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగింది. నీటి ప్రవాహం తగ్గడంతో రెండ్రోజుల క్రితం గేట్లు మూసివేయగా..బుధవారం ఉదయం నుంచి ఇన్‌ఫ్లో పెరిగింది. రాత్రి 10 గంటల సమయంలో ప్రాజెక్టుకు 95వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..పది క్రస్టు గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి 39,580 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. అదేవిధంగా 12 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 38,864 క్యూసెక్కులు వదులుతుండగా..మొత్తంగా జూరాల నుంచి 83,077 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 7.836 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి జూరాల క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 78,444 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 886 క్యూసెక్కులు మొత్తం 79,330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 854.40 అడుగులమేర 90.348 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఆల్మట్టిలో పెరిగిన వరద ఉద్ధృతి
సాక్షి,అమరావతి/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మంగళవారం కృష్ణా ప్రధాన పాయలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.67 టీఎంసీలకు చేరింది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆల్మట్టి నుంచి విడుదల చేస్తున్న జలాలకు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న వరద తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్‌లోకి 13,681 క్యూసెక్కులు చేరుతున్నాయి. నారాయణపూర్‌లో నీటి నిల్వ 20.36 టీఎంసీలకు చేరింది. కృష్ణా ప్రధాన పాయ, భీమా నుంచి జూరాల ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలోనూ వరద ఉద్ధృతి మరింత పెరిగింది. టీబీ డ్యామ్‌లోకి 83,842 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 32.86 టీఎంసీలకు చేరింది. జూరాలలో విద్యుదుత్పత్తిని ఆపేయడంతో శ్రీశైలంలోకి చేరుతున్న ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1236 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 37.08 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలానికి దిగువన కురిసిన వర్షాల వల్ల సాగర్‌లోకి 6,438 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 142.44 టీఎంసీలకు చేరింది. మూసీ వరద పులిచింతలలోకి నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 12,560 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన మున్నేరు, కట్టలేరు, వైరా కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో బ్యారేజ్‌కు 11,840 క్యూసెక్కుల వరద వస్తోంది. బ్యారేజ్ 16 గేట్లను అడుగు మేర ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజీకి 50 వేల క్యూసెక్కులు అంతకు మించి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సంగమేశ్వరుడి సన్నిధికి.. కొత్తపల్లి (నంద్యాల): నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పరిధిలోని సప్తనదుల సంగమ ప్రాంతంలో వెలసిన సంగమేశ్వరాలయాన్ని కృష్ణా జలాలు సమీస్తున్నాయి. సంగమేశ్వరాలయం వద్ద బీమలింగం కొలను పూర్తిగా మునిగిపోయి ఆలయ సమీపంలోని మెట్ల మార్గం వరకు చేరుకున్నాయి. దీంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది. -
శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత
గద్వాల రూరల్/దోమలపెంట/బాల్కొండ: కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులకు మళ్లీ వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో భారీగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతంగా వస్తోంది. దీంతో శుక్రవారం ఉదయం జూరాల ప్రాజెక్టు 27 క్రస్టుగేట్లు ఎత్తి 1,45,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సీజన్లో ఒకేసారి 27 గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. సాయంత్రం 6 గంటలకు వరద తగ్గడంతో 17 గేట్లు మూసి వేసి.. 75,005 క్యూసెక్కులు విడుదల చేశారు. రాత్రి 8 గంటల సమయంలో జూరాలకు 92 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మరోవైపు ఈ ఏడాది తొలిసారిగా శ్రీశైలం ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తి.. సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి సాయంత్రం 6 గంటలకు 1,52,589 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 62,896 క్యూòÜక్కులు, స్పిల్‌వే ద్వారా 1,39,915 క్యూసెక్కులు, మొత్తం ప్రాజెక్టు నుంచి 2,02,811 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.8 అడుగులు, 214.84 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎస్సారెస్పీలోకి పోటెత్తిన వరద.. ఎస్సారెస్పీలోకి ఎగువ నుంచి 88,470 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 14 గేట్లను ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులు. కాగా శుక్రవారం రాత్రికి 1,088.6 (78.34 టీఎంసీలు) అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. -
శ్రీశైలం, జూరాల గేట్లెత్తారు
గద్వాల రూరల్/దోమలపెంట: ఎగువ నుంచి భారీగా వరద పెరగడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు గేట్లను మరోసారి ఎత్తారు. గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులకు గురువారం రాత్రి 8 గంటల సమయంలో 81,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా పదిగేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 81,892 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 8.591 టీఎంసీలు, 317.990 మీటర్ల మేర నీటిని నిల్వ చేశారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాలతోపాటు సుంకేశుల నుంచి భారీగా వరద పోటెత్తింది. సుంకేశుల 1,16,062, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు, జూరాలతో కలిపి మొత్తం 1,98,204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు పది అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 27,662 క్కూసెక్కులు, ఎడమ గట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,237 క్యూసెక్కులు మొత్తం 91,683 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.1 అడుగులు, 210.5133 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
అధ్వాన్నంగా ఆత్మకూరు - జూరాల ప్రాజెక్ట్ రహదారి
-
మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద
-
మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి
-
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్‌లో స్వల్పంగా వరద నీరు
-
జూరాల కాల్వపై కూలిన వంతెన
ధరూరు (గద్వాల): వాహనం బరువును తట్టుకోలేక ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడికాల్వపై నిర్మించిన వంతెన కూలింది. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం భీంపురం సమీపంలో జూరాల–ఆత్మకూరు, మక్తల్ ప్రధాన రోడ్డు మార్గం నుంచి భీంపురం, పెద్దచింతరేవులకు రాకపోకలు సాగించేందుకు సుమారు 30 ఏళ్ల క్రితం రోడ్–కం–బ్రిడ్జిని నిర్మించారు. అప్పటినుంచి ఇదే మార్గం గుండా ఈ రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం భీంపురానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణంకోసం స్లాబ్ వేసేందుకు కాంక్రీటు మిశ్రమంతో కూడిన భారీ వాహనం (30 టన్నుల ట్రాంక్ మిక్చర్) వచ్చింది. వంతెన మధ్యలోకి రాగానే బ్రిడ్జి కూలింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని అలాగే ఆపి కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. -
జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
-
జూరాలకు పెరుగుతున్న వరద ఉధృతి
-
‘బొగత’కు జనకళ.. వాహ్ మహబూబ్ ఘాట్
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద చాలా రోజుల తర్వాత పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జలపాతం అందాలను తిలకించి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం గుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. – వాజేడు వాహ్ మహబూబ్ ఘాట్ చుట్టూ ఎత్తయిన కొండలు... చెట్లతో ఎటు చూసినా పచ్చ తివాచి పరిచినట్లు కనిపించే ప్రకృతి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. పచ్చదనం మధ్యలో నల్లతాచు పాములా కనిపించే రోడ్డు మలుపులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. నిర్మల్ సమీపంలోని మహబూబ్ ఘాట్ వద్ద కనిపించే ఈ దృశ్యాలు ప్రకృతి రమణీయతకు అద్ధం పడుతున్నాయి. మనసుకు ఆహ్లాదాన్నిచ్చే మహబూబ్ ఘాట్ అందాలను ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ జూరాల ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తివేత ధరూరు (గద్వాల): జూరాలకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు 4,27,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో 36 గేట్ల ద్వారా 3,63,993 క్యూసెక్కుల నీటిని దిగవకు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్‌ఫ్లో 3,66,006 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.557 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పుడమి పచ్చకోక కట్టినట్టు.. కనుచూపు మేర పచ్చటి పొలాలు.. ఆకాశంలో కమ్ముకుంటున్న కారుమేఘాలు.. మధ్యలో పచ్చని చెట్లు.. పైర్లు.. భూమికి పచ్చని రంగేసినట్టు ఎటు చూసినా పచ్చదనంతో సింగారించుకున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారు ప్రాంతమిది. – ఫొటో: కె.సతీష్, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, సిద్దిపేట సుందర జలపాతం.. వెళ్లడం కష్టం కొండలపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కట్టుమల్లారం సమీపంలోని రథంగుట్టపై ఉంది. ఇది దాదాపు వర్షాకాలం పొడవునా జాలువారుతూనే ఉంటుంది. అయితే దీని వద్దకు వెళ్లేందుకు మాత్రం దారిలేదు. మూడేళ్ల క్రితం పై భాగానికి వెళ్లే యత్నంలో ఓ యువకుడు రాళ్లపై నుంచి జారిపడి మృతిచెందాడు. అప్పట్నుంచి ఎవరూ ఈ జలపాతం వద్దకు వెళ్లట్లేదు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. – మణుగూరుటౌన్ -
నిండుకుండలా సాగర్!
సాక్షి, హైదరాబాద్/ధరూరు/ దోమలపెంట (అచ్చంపేట): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి సాగర్ దాకా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు. ఆ నీరంతా దిగువన నాగార్జున సాగర్‌కు చేరుతూ.. నిండుకుండలా మారింది. సోమవారం ఉదయం కల్లా సాగర్ పూర్తిగా నిండుతుందని, గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. భారీగా ప్రవాహాలు.. జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 9 గంటల సమయంలో 4.67 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. 47 గేట్లను ఎత్తి 4.75 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరదకుతోడు సుంకేశుల ద్వారా చేరుతున్న ప్రవాహాలు కలిసి.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.31 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 883.5 అడుగుల్లో నీటి మట్టాన్ని కొనసాగిస్తూ.. పదిగేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. దీనితోపాటు కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తితో 66 వేల క్యూసెక్కుల మేర విడుదలవుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 4.54 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 264 టీఎంసీలు దాటింది. మరో 48 టీఎంసీలు వస్తే సాగర్ నిండుతుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయానికల్లా ప్రాజెక్టు నిండనుందని, గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా విడుదలవుతున్న నీళ్లు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. అక్కడ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రకాశం బ్యారేజీకి వెళ్తున్నాయి. బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా కాల్వలకు 8,634 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. 26,712 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
జూరాల ప్రాజెక్టు వద్ద పర్యటకుల సందడి
-
నిండుకుండలా మారిన జూరాల ప్రాజెక్టు
-
జూరాల, శ్రీశైలానికి భారీ ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్: గత నాలుగు రోజులుగా ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల పరిధిలో కొనసాగుతున్న వర్షాలకు తోడు స్థానిక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి 52 వేల క్యూసెక్కులను దిగువనున్న నారాయణపూర్‌కు విడుదల చేస్తుండగా అక్కడి నుంచి 62 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలేస్తున్నారు. దీంతో ఆదివారం సాయంత్రానికి జూరాలకు 79 వేల క్యూసెక్కులు వస్తుండగా లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ నీరంతా శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలానికి 99 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండటంతో అక్కడ నీటి నిల్వ 215 టీఎంసీలకుగాను 41.11 టీఎంసీలకు చేరింది. ఇక ఇక్కడి నుంచి 7 వేల క్యూసెక్కులను వదిలేస్తుండటంతో నాగార్జునసాగర్‌లోకి 9 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో అక్కడ పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను ప్రస్తుతం నిల్వ 169.71 టీఎంసీలకు చేరింది. మరోవైపు గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి. -
జూరాల ప్రాజెక్ట్ వంతెన పై రాకపోకలు నిషేధం
-
Photo Feature: కమ్మేసిన మబ్బులు.. కుమ్మేసిన వాన
తొలకరి జల్లులతో హైదరాబాద్ నగరం పులకించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం చల్లబడింది. భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు లాక్డౌన్ సమయం పెంచడంతో హైదరాబాద్ రహదారులపై సందడి పెరిగింది. కాగా, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతోంది. -
జురాలకు పోటెత్తిన వరద నీరు
సాక్షి, మహబూబ్‌నగర్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగు కురుస్తున భారీ వర్షాలకు జురాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు 50 గేట్లను అధికారులు ఎత్తి వేశారు. దీంతో కృష్ణానది నీరు పరవళ్ళు తొక్కుతుంది. కృష్ణానదికి ఇన్ ఫ్లో 5లక్షల 5వేల క్యూసెక్కులు కాగా.. దిగువున 5 లక్షల 91 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.73 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9: 657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.08 టీఎంసీలుగా ఉంది. (చదవండి: భారీ వరదలు: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం) దీంతో కృష్ణానదికి భారీగా వరద నీరు వస్తుండటంతో సమీప మండలంలోని వాసునగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అధికారులు నగర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తంగిడి వద్ద కృష్ణ బీమా నదుల సంగమం వద్ద ఉన్న భీమేశ్వర ఆలయం చుట్టూ నీళ్లు నిలవడంతో అధికారులు కృష్ణ నదీ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే మత్స్యకారులు ఎవరు నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: భారీ వరద: ఏ క్షణామైనా తెగిపోయే ప్రమాదం) -
గాలికొదిలేసిన కరోనా నిబంధనలు
సాక్షి, అమరచింత (కొత్తకోట): కరోనా నేపథ్యంలో ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. భౌతిక దూరం పాటిస్తూ మస్క్‌లు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఓ వైపు అవగాహన కలి్పస్తున్నా.. మరోవైపు కోవిడ్ నిబంధనలు.. భౌతికదూరం పాటింపును గాలికొదిలేస్తున్నారు మరికొందరు. గుంపులు గుంపులుగా ఒకేచోట చేరడం.. మాస్‌్కలు ధరించకపోవడంతో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జూరాల ప్రాజెక్టు వద్ద 29 క్రస్టుగేట్లు తెరిచి వరద జలాలను దిగువకు వదులుతుండగా ఆ దృశ్యాలను చూసేందుకు ఆదివారం జిల్లాతోపాటు హైద్రాబాద్, నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల నుండి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టు పరిసరాలు ఎటు చూసినా.. జనసందోహం నెలకొంది. వందలాదిగా వాహనాలు ప్రాజెక్టు రహదారిపైకి రావడంతో ట్రాఫిక్‌జాం అయ్యింది. రెండు కిలోమీటర్ల పొడవున వాహనరాకపోకలకు అంతరాయం కల్గడంతో వాహనదారులు దాదాపు మూడు గంటల పాటు వాహనాల్లోనే ఇరుక్కుపోయే పరిస్థితి చోటుచేసుకుంది. పోలీసులు బందోబస్తు నిర్వహించకపోవడంతో మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం సందర్శకుల సందడి కనిపించింది. దేవరకద్ర పోలీసులు సమీపంలోనే బారికేడ్లను ఏర్పాటు చేయడం వల్ల వాహనాలకు అక్కడే నిలిపి కొందరు కాలినడకన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పిల్లలు, పెద్దలు, యువతి యువకులు సెలీ్ఫలు దిగుతూ ఆనందంగా కనిపించారు. చేపలు పట్టిన ఎమ్మెల్యే.. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బండర్‌పల్లి చెక్‌డ్యామ్ వద్ద ఆదివారం కొద్ది సేపు గాలం వేసి చేపలు పడుతూ ఆనందించారు. చెక్‌డ్యామ్ నిండుగా ఉండడం అలుగు పారడంతో చేపలు నీటిలో ఎదురెక్కడంతో పలువురు గాలాలు వేసి చేపలు పట్టడం కనిపించింది. బండర్‌పల్లి వద్ద గాలంతో చేపను పట్టిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కనిపించని కరోనా భయం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలను విధిస్తున్న ప్రజలు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలను పాటించలేక పోతున్నారు. భౌతిక దూరం, మాసు్కలను ధరించాలని చెబుతున్నా జూరాల ప్రాజెక్టుకు వస్తున్న పర్యాటకులు మాత్రం వీటిని పాటించలేక పోతున్నారు. ప్రాజెక్టు దిగువ భాగాన క్రస్టుగేట్ల నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్నా.. పర్యాటకులు మాత్రం సెల్ఫీల మోజులో పారుతున్న నీటిలో నిల్చోవడం, జలకాలాడడం, సెల్ఫీలు తీసుకోవడం పరిపాటిగా మారింది. తేడా వస్తే ప్రవాహంలో కొట్టుకుపోతామన్న భయం కూడా కలగకపోవడం దిగువ జూరాల వద్ద ప్రాజెక్టు అధికారులు గాని పోలీసు సిబ్బందిగాని హెచ్చరిక బోర్డులతో పాటు సిబ్బందిని నియమించక పోవడంతో పర్యాటకులు పారే నీటిలో ఆటలాడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేగాక మద్యం విక్రయాలు కూడా చేపవంటకాల దుకాణాల వద్ద జోరుగా కొనసాగుతున్న సంబందిత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదిలాఉండగా, కోవిడ్ దృష్ట్యా పర్యాటకులు జూరాల ప్రాజెక్టు వద్దకు రావద్దని సూచించామని ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతయ్య, ప్రాజెక్టు ఈఈ పార్థసారథి పేర్కొన్నారు. అందరు సహకరించాలని కోరారు. -
జూరాల ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేత
ధరూరు (గద్వాల): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉదృతి భారీగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తూ జలకళ సంతరించుకుంది. పోటెత్తుతున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3 లక్షల 35 వేల క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 3 లక్షల 38 వేల 733 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం318.07 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటిసామర్ద్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.75 టీఎంసీలుగా ఉంది. ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన నిరాటంకంగా కొనసాగుతుంది. మరోవైపు నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీటి పంపింగ్ కొనసాగిస్తున్నారు. నారాయణపూర్ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. నదీ తీర గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు ఎవరు నదిలోకి చేపల వేటకు వెళ్లరాదాని అధికారులు విజ్ఞప్తి చేశారు. -
జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు
ధరూరు (గద్వాల): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూఐర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో అదే స్థాయిలో వదర నీటిని దిగువన ఉన్న జూరాలకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జూరాల క్రస్టు గేట్లను పెంచుతూ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ప్రాజెక్టు దిగువన ఉన్న జెన్కో జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టుకు 2లక్షల 90వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 39 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 2లక్షల 58వేల 032 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. క్రస్టు గేట్ల ముందు నుంచి దిగువన ఉన్న శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులిడుతోంది. కృష్ణమ్మ పరవళ్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కొనసాగుతున్న నెట్టెంపాడు ఎత్తిపోతల నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, కుడి ద్వారా 357, ఎడమ కాల్వ ద్వారా 100 , సమాంతర కాల్వకు 300 క్యూసెక్కులు మొత్తం ప్రాజెక్టు నుంచి 2లక్షల 83వేల 183 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా 7.875 టీఎంసీలుగా ఉంది. ఆల్మట్టి వద్ద తగ్గిన వరద ఉధృతి ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో 114.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు లక్షా 27వేల 582 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ప్రాజెక్టు నుంచి 2లక్షల 255 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.4 టీఎంసీల నీరు ని ల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు లక్షా 78వేల 264 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి 2లక్షల 25వేల 291 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగు లు పెడుతోంది. ఎగువ నుంచి శనివారం సాయంత్రం 98,975 క్యూసెక్కులు చేరుతుండగా రాత్రి 12 గంటలకు ఇది రెండు లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ దఫా వరదకు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండవచ్చని అంచనా వేస్తున్నాయి. ► పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సగటున 72 మి.మీ.ల వర్షపాతం పడింది. దాంతో కృష్ణా, ఉపనదుల్లో గంట గంటకూ వరద పెరుగుతోంది. ► ఆల్మట్టిలోకి వరద పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) సూచనల మేరకు డ్యామ్ నీటినిల్వలను ఖాళీ చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. దాంతో జూరాలకు భారీగా వరద చేరుతోంది. జూరాల వరదను దిగువకు వదులుతున్నారు. ► శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు జలాలు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం 558.20 అడుగులకు చేరుకుంది. ► అప్పర్ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ నుంచి భారీ వరదను దిగువకు వదులుతుండటంతో తుంగభద్రలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ► పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని నుంచి నీటి ప్రవాహం చేరుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.17 లక్షల క్యూసెక్కులు చేరుతుం డగా 7 వేల క్యూసెక్కులు డెల్టాకు, మిగిలిన 1.11 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
నిలకడగా కృష్ణమ్మ
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 89,731 క్యూసెక్కులు చేరుతుండటంతో.. నీటి మట్టం 838.8 అడుగులకు చేరింది. నీటి నిల్వ 60.10 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం నిండాలంటే ఇంకా 155 టీఎంసీలు అవసరం. ► జూరాల ప్రాజెక్టులోకి 86,280 క్యూసెక్కులు చేరతుండగా.. స్పిల్‌వే వద్ద 7 గేట్లు ఎత్తి, విద్యుత్ కేంద్రం ద్వారా 84 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ► జూరాల నుంచి వస్తున్న జలాలకు హంద్రీ, తుంగభద్ర జలాలు జత కలవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 89,731 క్యూసెక్కులు చేరుతున్నాయి. ► ప్రకాశం బ్యారేజీలోకి 17,409 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 4,502 క్యూసెక్కులు వదిలి 12,907 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరిలో స్థిరంగా.. ► గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 56,039 క్యూసెక్కులు చేరుతుండగా.. 55,539 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► వంశధార నదిలో వరద ప్రవాహం తగ్గింది. గొట్టా బ్యారేజీలోకి 2,685 క్యూసెక్కులు చేరుతుండగా 2,391 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. -
‘జూరాల’ పునరుజ్జీవానికి అడుగులు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో ఎగువ నుంచి వరద కొనసాగే రోజులు తగ్గుతుండటంతో వరదున్నప్పుడే ఆ నీటిని ఒడిసిపట్టేలా ప్రభుత్వం బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బేసిన్లో ఎగువన ఉన్న జూరాల నుంచే కృష్ణా వరద జలాలను మళ్లించి నిల్వ చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్ల బృందం జూరాల ఫోర్‌షోర్‌లో 20.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను ప్రతిపాదించగా దీన్ని నీటిపారుదల శాఖ పరిశీలించి ఆమోదం తెలిపింది. భరోసా ఇచ్చేలా... జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా లైవ్ స్టోరేజీ మాత్రం కేవలం 6.50 టీఎంసీలే. అయితే జూరాలపై దాని సొంత ఆయకట్టుకు అవసరమయ్యే 19.74 టీఎంసీల నీటితోపాటు నెట్టెంపాడుకు 21.42 టీఎంసీలు, భీమా 20 టీఎంసీలు, కోయిల్‌సాగర్ 5.50 టీఎంసీలు, గట్టు 4 టీఎంసీలు, మిషన్ భగీరథ కోసం 4.14 టీఎంసీలు కలిపి మొత్తంగా 73.20 టీఎంసీల అవసరాలున్నాయి. వాటి కింద 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. అయితే నెట్టెంపాడు పరిధిలో 11 టీఎంసీలు, భీమా పరిధిలో 8.57, కోయిల్‌సాగర్ కింద 2.27, జూరాల కింది రిజర్వాయర్లలోని నీటి నిల్వలతో కలిపి మొత్తం 28 టీఎంసీల మేర మాత్రమే నిల్వ చేయగలిగే రిజర్వాయర్లున్నాయి. ప్రస్తుతం ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి వరద కొనసాగుతున్న రోజులు తగ్గుతూ వస్తుండటంతో ప్రాజెక్టులకు నీటి లభ్యత ఉండట్లేదు. కొన్ని సంవత్సరాల్లో ప్రవాహాలు పూర్తిగా రానప్పుడు తాగునీటికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ దృష్ట్యా జూరాలకు నీటి లభ్యత పెంచడం, దానిపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి వీలుగా జూరాల పునరుజ్జీవ పథకాన్ని ప్రభుత్తం తెరపైకి తెచ్చింది. రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, అనంతరాములు, ఖగేందర్, మహేందర్ నేతృత్వంలోని బృందం గతేడాది డిసెంబర్లో ఈ ప్రాజెక్టు పరిధిలో పర్యటించి జూరాల ఫోర్‌షోర్‌లోని నాగర్‌దొడ్డి వద్ద 20.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదించింది. వరదతో నింపి... ఆగగానే వదిలి జూరాలకు కుడిపక్క ఫోర్‌షోర్‌లో కేవలం కిలోమీటర్ దూరంలో ఈ రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. వరద ఉండే 20 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని తరలించేలా ఒక పంపుహౌస్ నిర్మించి దాని ద్వారా రిజర్వాయర్‌ను నింపేలా ప్రణాళిక వేశారు. దీనికి రూ. 5,200 కోట్లు అంచనా కట్టారు. ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తే గతం లో రూ. 554 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన గట్టు ఎత్తిపోతల పథకం అవసరం ఉండదని ఇంజనీర్లు చెబుతున్నారు. వరద ఉండే రోజుల్లో నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్ నింపుకొని, జూరాలలో నీటి నిల్వలు తగ్గితే మళ్లీ రిజర్వాయర్ నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ జూరాలకు నీటిని విడుదల చేసి నింపేలా ఈ ప్రతిపాదన సిద్ధమైంది. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఈ ప్రతిపాదనపై ఎలా ముందుకెళ్లాలో తెలపాలని కోరుతూ ఈఎన్సీకి లేఖ రాశారు. ప్రభుత్వం అనుమతిస్తే ఈ ప్రతిపాదనపై సమగ్ర సర్వే చేస్తామని ప్రతిపాదించారు. -
‘జూరాల’ వద్ద మరో కొత్త జలాశయం
గద్వాల రూరల్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ భాగాన మరో జలాశయం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇది వరకే గట్టు ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మరో ప్రాజెక్టును తెరమీదకు తెచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాలు, భూములు ఎక్కువగా ముంపునకు గురవకుండా తక్కువ భూ సేకరణతో జలాశయం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఇటీవల రిటైర్డ్ ఇంజినీర్ల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలతో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇదే నివేదికను ప్రభుత్వం ఈఎన్సీ అధికారులకు అందజేసి పరిశీలించాలని ఆదేశించింది. దీంతో ఉన్నతాధికారులు గద్వాల జిల్లా ఇంజినీరింగ్ అధికారులను విచారణ చేసి నివేదిక అందించాలని సూచించడంతో 16 రోజుల క్రితం పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు అందించారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని జలాశయం నిర్మాణం చేపడితే ఉమ్మడి జిల్లాలో సుమారు 6లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందే అవకాశం ఉంది. జూరాల వెనకజలాలకు.. జూరాల వెనక జలాలకు సుమారు అర కిలోమీటర్ దూరంలో ద్యాగదొడ్డి, నాగర్‌దొడ్డి ప్రాంతాల నడుమ అదనపు జలాశయాన్ని నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. 3,600ఎకరాల్లో 20 టీఎంసీల సామర్థ్యంతో జలాశయ నిర్మాణాన్ని చేపట్టనుండగా కట్ట పొడవు 15 కిలోమీటర్లు ఉంటుంది. జూరాల కుడి కాల్వ పరిధిలోని 37వేల ఎకరాలతో పాటు నెట్టెంపాడు, తుమ్మిళ్ల ఎత్తిపోతలు కలుపుకొని 2.70 లక్షల ఎకరాలకు, జూరాల ఎడమ కాల్వ పరిధిలోని 63 వేల ఎకరాలతోపాటు భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులతో కలుపుకొని మూడు లక్షల ఎకరాలకు సాగునీటి ని అందించవచ్చని ఇరిగేషన్ అధికారులు లెక్క తేల్చారు. జలాశ యంలోకి నీటిని పంపింగ్ చేసేందుకు 40 మెగావాట్ల సామర్థ్యంతో 5 పంపులు అవసరమవుతాయి. ఇదే అంశాలను పేర్కొంటూ తుది నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. అనుమతి వస్తే కార్యాచరణ రిటైర్డ్ ఇంజినీర్ల బృందం ఇచ్చిన నివేదికలో చాలా అనుకూల అంశాలున్నాయి. జూరాల జలాశయం పక్కన 20 టీఎంసీల సామర్థ్యంతో అదనపు జలాశయ నిర్మాణానికి సంబంధించి నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే కార్యాచరణ మొదలవుతుంది. గద్వాలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ సాగునీటి కష్టాలు తీరుతాయి.– రహీముద్దీన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు గట్టు ఎత్తిపోతలకు శంకుస్థాపన గద్వాల జిల్లాలోని గట్టు, ధరూరు, కేటీదొడ్డి మండలాల పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు 2018, జూన్ 29న గట్టు మండలం పెంచికలపాడు సమీపంలో ఎత్తిపోతలను నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.570 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతలకు నల్లసోమనాద్రి ఎత్తిపోతలు అని నామకరణం చేశారు. ఇందులో భాగంగా ఇరిగేషన్ అధికారులు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఇది మధ్యలోనే నిలిచిపోయింది. ఇదే క్రమంలో 20టీఎంసీల సామర్థ్యంతో జూరాలకు పక్కనే అదనంగా మరో జలాశయాన్ని నిర్మించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. జిల్లా ఇరిగేషన్ ఆమోదం.. రిటైర్డ్ ఇంజినీర్ల బృందం ఇచ్చిన నివేదికపై జిల్లా ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా జలాశయ నిర్మాణానికి 3,600 ఎకరాలు అవసరమని నిర్ధారించారు. అయితే ఈ కొత్త జలాశయంలో గ్రామాలు, వ్యవసాయ పొలాలు ముంపునకు గురికావని, అంతేకాకుండా కొత్త కాల్వల నిర్మాణాలు కూడా అవసరం లేదని గుర్తించారు. -
కృష్ణాకూ రివర్స్!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ చేస్తున్నట్లే కృష్ణా నదీ జలాలనూ పాలమూరు–రంగారెడ్డి ద్వారా జూరా లకు తరలించే ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధమ య్యాయి. సాధారణంగా కృష్ణానది సహజ ప్రవా హాలు జూరాల నుంచి శ్రీశైలానికి వెళ్తుంటాయి. అయితే వర్షాకాలం తర్వాత ఎగువ నుంచి వరద ప్రవాహం ముగిశాక జూరాలలో నీటి లభ్యత పడిపోతుండటం, అవసరాలు భారీగా ఉన్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రివర్స్‌లో జూరాలకు నీటిని తరలించాలని సాగునీటి శాఖ ప్రణాళిక రచించారు. ఇందుకోసం శ్రీశైలంపై ఆధారపడి చేపట్టిన పాలమూరు ప్రాజెక్టులోని కర్వెన రిజర్వాయర్ ద్వారా నీటిని జూరాలకు తరలించేందుకు యోచిస్తున్నారు. దీంతో వేసవిలో కూడా జూరాల ద్వారా తాగునీరు, యాసంగి ఆయకట్టుకు సాగు నీరిచ్చే వీలుకలుగుతుంది. ఇందుకోసం దాదాపు రూ.400 కోట్లతో ప్రాథమిక అంచనాలు వేశారు. ఈ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం ఈ ప్రతిపాదనలకు తుది రూపం రానుంది. సామర్థ్యం తక్కువ, అవసరాలు ఎక్కువ జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, నికర నిల్వ సామర్థ్యం 6.79 టీఎంసీలుగా ఉంది. దీని కింద ఆయకట్టు 1.04 లక్షల ఎకరాలు కాగా, దీనికే 17.84 టీఎం సీల అవసరం ఉంటుంది. దీనికి తోడు జూరాలపై ఆధారపడి నెట్టెంపాడు (21.42 టీఎంసీ–2 లక్షల ఎకరాలు),బీమా(20టీఎంసీ– 2.03లక్షల ఎకరాలు), కోయిల్‌సాగర్ (3.9 టీఎంసీ– 50,250 ఎకరాలు) ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. దీంతో పాటే మిషన్ భగీరథ కింద మరో 7.43 టీఎంసీల అవసరాలకు జూరాలపై ఆధారపడి ఉన్నాయి. జూరాల కింది తాగు, సాగునీటి అవసరాలకు నీటిని అందించాలంటే రోజూ 10 వేల క్యూసెక్కుల మేర నీటి అవసరం ఉంటుంది. అయితే జూరాలలోని నికర నిల్వ సామర్థాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ నిల్వ నీటితో 8 రోజులకు మించి నీరు సరిపోదు. అదీగాక నవంబర్ తర్వాత ఎగువ నుంచి వరద ఆగాక జూరాలకు వచ్చే ప్రవాహాలు 2001–2018 వరకు చూస్తే రోజుకు 2,678 క్యూసెక్కులకు మించి లేదు. ఈ నీటితో జూరాలపై ఉన్న నీటి అవసరా లను, యాసంగిలో సాగునీటి అవసరాలకు నీరివ్వడం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి జూరాలకు రివర్స్‌లో నీటిని తరలించి, వేసవిలోనూ జూరాలలో నీటిలభ్యత పెంచే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. పాలమూరు ప్రాజెక్టులోని నాలుగో రిజర్వాయర్ అయిన 17.34 టీఎంసీ సామర్థ్యం ఉన్న కర్వెన రిజర్వాయర్ నుంచి కోయిల్‌సాగర్, సంగం బండలకు నెలకు ఒక టీఎంసీ, అటునుంచి జూరాలకు నెలకు 1.5 టీఎంసీల నీటిని తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. దీనిపై ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తరలింపు ఇలా.. కర్వెన రిజర్వాయర్ కింద హై లెవల్ కెనాల్ (హెచ్ఎల్సీ)108 కిలోమీటర్లు ఉండగా, దాని ప్రవాహ సామర్థ్యం 2,213 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం కోయిల్‌సాగర్, సంగంబండ మీదుగా జూరాల వరకు నీటిని తరలించాలంటే దాని సామర్థ్యాన్ని 3,564 క్యూసెక్కులకు పెంచాల్సి ఉంటుంది. హెచ్ఎల్సీ 32వ కిలోమీటర్ నుంచి ఒక తూము (ఓటీ) నిర్మించి దాని నుంచి 386 క్యూసెక్కుల నీరు (నెలకు ఒక టీఎంసీ) తరలించేలా కాల్వలను నిర్మించి దాన్ని కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌లో కలిసే హన్వాడ మండలంలోని చిన్నవాగులో కలపాలి. ఇలా కోయిల్‌సాగర్‌కు నీటిని తరలించేందుకు రూ.65 కోట్లు ఖర్చు కానుంది. ఇక కర్వెన రిజర్వాయర్ కింది హెచ్ఎల్సీ 90.7వ కిలోమీటర్ వద్ద మరో తూము నిర్మాణం చేసి, 965 క్యూసెక్కులు (నెలకు 2.5 టీఎంసీ, ఇందులో 1 టీఎంసీ సంగంబండకు, మరో 1.5 టీఎంసీ జూరాలకు) తరలించేలా కాల్వలను తవ్వి దాన్ని నారాయణపేట మండలం సింగారం గ్రామంలో ఉన్న మాలవాగులో కలపాలి. దీనికి రూ.155 కోట్ల మేర ఖర్చు కానుంది. ఇక సంగంబండలో నీరు మిగులు అయితే అవి పెద్దవాగు ద్వారా జూరాల ప్రాజెక్టును చేరతాయి. అయితే ఈ నీటిని తరలించే క్రమంలో వివిధ నిర్మాణాలకు కలిపి రూ.180 కోట్లు ఖర్చు కానుంది. అయితే కర్వెన నుంచి జూరాలకు వరద నీటిని తరలించే క్రమంలో ఇప్పటికే ఎన్ని నిర్మాణాలు ప్రభావితం అవుతాయి.. ఇప్పటికే సాగులో ఉన్న ఆయకట్టు ఏమైనా దెబ్బతింటుందా? అన్న అంశం సమగ్ర సర్వేలోనే తేలనుంది. ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన అనంతరం ఆయన ఆమోదం మేరకు తుది ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. -
జూరాలలో రికార్డు స్థాయి విద్యుదుత్పత్తి
గద్వాల టౌన్ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ఈ సారి రికార్డు స్థాయిలో అధికారులు జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు దిగువన ఉన్న లోయర్ జూరాలలోనూ కృష్ణానదికి జూలై నెలాఖరు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో రికార్డు స్థాయిలో 613.99 మిలియన్ యూనిట్ల జల విద్యుదుత్పత్తిని సాధించారు. 2008లో జూరాల జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇక్కడ 270 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి రికార్డుగా ఉంది. అలాగే గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమైన లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 220 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తే రికార్డుగా ఉంది. తాజాగా ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ ఇప్పటి వరకు ఉన్న రికార్డులను అధిగమించి విద్యుదుత్పత్తిని సాధించారు. జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఈనెల 12వ తేదీ వరకు 310.18 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని, లోయర్ జూరాలలలో 303.81 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించారు. రికార్డు సాధించాం.. జూరాల, లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయి లో ఉత్పత్తిని సాధించాం. కృష్ణానది లో జూలై నెలాఖరు నుంచి వరద కొనసాగుతుండడం వల్లే ఇది సాధ్యమైంది. టర్బైన్లలో ఇబ్బందులు తలెత్తకుండా విద్యుదుత్పత్తిని చేయడంలో జెన్ కో ఇంజనీర్లు చేసిన కృషి అభినందనీయం. వరద కొనసాగినన్ని రోజు లు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తాం. – సురేశ్, చీఫ్ ఇంజనీర్, టీఎస్‌జెన్ కో -
జూరాలకు పెరుగుతున్న వరద
-
జూరాల జలాశయానికి పెరుగుతున్న వరద నీరు
సాక్షి, మహబూబ్ నగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి క్రమంగా వరద నీరు పెరుగుతోంది. ఇన్ ప్లో 26,000 క్యూసెక్కులు కాగా, ఔట్ ప్లో 29,614గా నమోదైంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 8.670 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ మట్టం 318.030 మీటర్లు కాగా, పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. -
జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తివేత
సాక్షి, మహబూబ్‌నగర్ : ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జూరాల ప్రాజెక్టు 44 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 5.85 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 5.87 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.097 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. పూర్తి నిల్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ మట్టం 317.20 మీటర్లు ఉండగా పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. -
పోటెత్తిన కృష్ణమ్మ.. అందాల ఒడిలో శ్రీశైలం
శ్రీశైలం: కృష్ణానది పోటెత్తుతోంది. తుంగభద్ర కూడా తోడైంది. శ్రీశైలం డ్యాంలోకి వరద ప్రవాహం భారీగా ఉండడంతో పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 7,86,752 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. అలాగే తుంగభద్ర జలాశయంలోకి నీటి చేరిక పెరగడంతో రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో 28 గేట్లు ఎత్తి 75,464 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. జలాశయానికి 7.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..దిగువకు 7.61లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం 62 గేట్లకుగానూ..60గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు పర్యటకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శ్రీశైలం అందాలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్లో షేర్ చేశారు. శ్రీశైలానికి పోటెత్తిన వరద జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి పది గంటల ప్రాంతంలో జూరాల నుంచి శ్రీశైలానికి 6,61,760 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. డ్యాం నుంచి దిగువ ప్రాంతాలకు 5,65,977 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 202.5056 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 882.60 అడుగులకు చేరుకుంది. A sight to behold; Krishna water gushing through Srisailam project is a relief to the farmers of Telangana and AP 😊 pic.twitter.com/F7FT10Hnxo — KTR (@KTRTRS) August 11, 2019 -
'ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం లూటీ'
సాక్షి, మహబూబ్‌నగర్(గద్వాల) : కొత్త ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం ఆమె ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలను వృథా చేస్తున్నారన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న చిన్న కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఐదేళ్ల పాలన పూర్తయినా పూర్తి చేయలేకపోయారన్నారు. కృష్ణమ్మ దయతో జూరాలకు నీళ్లు వచ్చాయని, ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు రిజర్వాయర్ల వద్ద ఫొటోలకు ఫోజులు ఇవ్వడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదన్నారు. తమ హయాంలో రైతులకు అన్ని విధాలా సహకరిస్తూ ఎడారి లాంటి నడిగడ్డ ప్రాంతంలో నెట్టెంపాడు ఎత్తిపోతలను చేపట్టానన్నారు. మా హయాంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని, అది ఇక్కడి రైతులకు తెలుసనన్నారు. పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాలకు సాగు నీరందించవచ్చునన్నారు. కేసీఆర్ మొదటి నుంచి పాలమూరుపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. కేసీఆర్‌వి బోగస్ మాటలని, ఆయన మాటలు వినే పరిస్థితిలో జనం లేరని అన్నారు. పెండింగ్‌లో ఉన్న 99 ప్యాకేజీ, రిజర్వాయర్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చేర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, టవర్ మక్బుల్, హన్మంతరాయ, నర్సింహులు, ఆది మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇక మిడ్‌మానేరుకు ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 2 నెలలు ఆలస్యంగా అయినా కరువుతీరా వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన జలాశయాలన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా గోదావరిలోనూ ప్రవాహాలు పెరుగుతుండటంతో అవన్నీ నిండుకుండలుగా మారుతున్నాయి. కడెం, దాని పరీవాహకంలో కురిసిన వర్షాలతో గోదావరి బేసిన్ లోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.18 టీఎంసీలుకాగా 19.14 టీఎంసీల మేర నిల్వలు చేరుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ప్రవాహా లు తగ్గాయి. గేట్లు ఎత్తడంపై అధికారులు సోమ వారం నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్‌మానేరు ప్రాజె క్టుకు ఎత్తిపోసే పనులకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరంలో భాగంగా ఉన్న ప్యాకేజీ–6 నందిమేడారం పంప్‌హౌస్‌లో మొత్తం 124.5 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లలో ఐదింటిని ఇప్పటికే సిద్ధం చేశారు. ఎల్లంపల్లిలో లభ్యతగా ఉన్న నీటితో ఏప్రిల్‌లోనే 5 మోటార్లకు 0.25 టీఎంసీల నీటిని వినియోగించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, ఆ తర్వాత 9.53 కిలోమీటర్ల మేర 11 మీటర్ల వ్యా సంతో ఉన్న జంట టన్నెళ్ల ద్వారా ప్యాకేజీ–6 లోని సర్జ్‌పూల్‌ను నింపి లీకేజీలను పరిశీలించారు. ఎత్తిపోతలకు ప్యాకేజీ–6 సిద్ధంగా ఉం డగా ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం రెండ్రోజుల కిందటే పూర్తయింది. ఈ టన్నెల్లోకి నీటిని వదిలి లీకేజీలు, ఇతరత్రా పరీక్షలను సోమవారం నుంచి మొదలు పెట్టనున్నారు. సోమవారం సాయం త్రం 4 గంటలకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మం డలం మేడారం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా టన్నెల్లోకి నీటిని తరలించే షట్టర్ల వద్ద ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి షట్టర్లను ఎత్తనున్నారు. మరోవైపు పరీక్షలు చేస్తూనే ప్యాకేజీ–8లోని రామడుగు పంప్‌హౌస్‌కు నీటిని పంపనున్నారు. ‘బాహుబలులు’ సిద్ధం.. ప్యాకేజీ–8లోని బాహుబలి మోటార్లకు మంగళవారం నుంచి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ప్యాకేజీ–6 మోటార్లతో పోలిస్తే ప్యాకేజీ–8లోని మోటార్ల సామర్థ్యం 15 మెగావాట్ల మేర ఎక్కువ. ఒక్కో మోటారు సుమారు 15 మీటర్ల ఎత్తు అంటే 4 అంతస్తులు ఉంటుంది. ఈ మోటార్లు 115 మీటర్ల లోతు నుంచి 3,200 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తాయి. ఈ పంప్‌హౌస్‌లో మొత్తంగా 7 మోటార్ల నిర్మాణం చేయాల్సి ఉం డగా ఇప్పటికే ఐదింటిని సిద్ధం చేశారు. ఈ నెల 9 లేదా 10న ఎల్లంపల్లి నుంచి పూర్తిస్థాయిలో ఎత్తిపోతలు చేపట్టి ప్యాకేజీ–6, 7, 8ల ద్వారా నీటిని మిడ్‌మానేరుకు తరలించనున్నారు. కృష్ణా ఉగ్ర తాండవం... పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది ఉగ్రరూపం చూపిస్తోంది. వాగులు, వం కలు నిండిపోవడం, వచ్చిన వరద వచ్చినట్లుగా ఆల్మట్టి, నారాయణపూర్‌లోకి చేరుతుండటంతో ఉధృతి పెరుగుతూనే ఉంది. ఆల్మట్టిలోకి 2.45 లక్షల క్యూసెక్కులు (22 టీఎంసీలు) వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 2.85 లక్షల క్యూసెక్కుల (25.90 టీఎంసీలు) నీటిని దిగవ నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్‌కు వచ్చిన నీటిని దిగువ జూరాలకు వదులుతున్నారు. జూరాలకు 2.33 లక్షల క్యూసెక్కులు (21 టీఎంసీలు) వస్తుండగా అంతే మొత్తంలో శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి 2.20 లక్షల క్యూసెక్కుల (20 టీఎంసీలు) మేర నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 100 టీఎంసీలకు చేరింది. ఈ నాలుగు రోజుల్లోనే ప్రాజెక్టులోకి 66 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. రోజుకు 20 టీఎంసీలకు తగ్గకుండా వరద కొనసాగుతుండటంతో వారం రోజుల్లోనే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 854 అడుగులను దాటిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సైతం తాగు, సాగు అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభు త్వం శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కుల మేర నీటిని వినియోగిస్తోంది. వరద ఇలాగే కొనసాగితే మరో 10 రోజుల్లో దిగువ నాగార్జున సాగర్‌కు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశం ఉంది. మరో 3 రోజులు వర్షాలు రాగల 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపు వంపు తిరిగి ఉందని సీనియర్ అధికారి రాజా రావు తెలిపారు. దీంతో సోమవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. స్వైన్ ఫ్లూ, డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. -
ఖరీఫ్సాగు ప్రశ్నార్థకమేనా?
సాక్షి, ధరూరు: వరుణుడి కరుణ కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. వాస్తవానికి మే నెలాఖరు లేదా జూన్ మొదటివారంలోనే ఏటా సమృద్ధిగా వర్షాలు కురిసి ఈపాటికే నెలరోజుల పంట సాగయ్యేది. ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఒక్క ఎకరంలో కూడా పంటసాగును చేయలేకపోయారు. ఇప్పటికే పంటపొలాలను దున్నుకొని సిద్ధం చేసుకున్న రైతులు ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసుకొని వరుణదేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఊరిస్తున్న మబ్బులు.. ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో తేలికపాటి జల్లులు కురుస్తూ రైతులను ఊరిస్తున్నాయి. ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు నిత్యం నిరాశే ఎదురవుతుంది. ఆరుతడి పంటలతో పాటు మెట్టపంటల సాగును చేసుకునేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు. ఒక్క భారీ వర్షం కూడా కురవకపోవడంతో ఎటు చూసినా వ్యవసాయ పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. ఏ రైతును కదిలించినా దీనగాథలే బయటకు వస్తున్నాయి. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. భూగర్భ జలాలు కూడా రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. బోరుబావుల్లో నుంచి నెలరోజుల క్రితం వరకు రెండు ఈంచుల నీళ్లు వచ్చే బోర్లు, ఒక్క నెలరోజుల వ్యవధిలోనే ఈంచు, అర ఈంచుకు తగ్గిపోయాయి. దీంతో పంటలను సాగు చేసుకునేందుకు బోరుబావులు ఉన్న రైతులు కూడా ముందుకు రావడం లేదు. ధైర్యం చేసి కొంతమంది రైతులు సీడ్‌పత్తి పంటను సాగు చేసుకున్నారు. బోర్లలో రోజురోజుకు నీళ్లు తగ్గుముఖం పడుతుండటంతో వేలాది రూపాయలు ఖర్చుపెట్టి సాగుచేసిన పత్తి పంటపై కూడా రైతులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమయ్యే సబ్సిడీ ఎరువులు, విత్తనాలను కూడా అందుబాటులోకి తేలేదు. మరో పది పదిహేను రోజులు ఇదే గడ్డు పరిస్థితి ఉంటే ఖరీఫ్ పంటసాగు లేనట్లేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని కర్ణాటక, మహారాష్ట్రలో కూడా వర్షాలు కురవకపోవడంతో జూరాలకు సైతం నీళ్లు రాలేదు. ప్రాజెక్టుకైనా నీళ్లు వచ్చి ఉంటే నెట్టెంపాడు ఎత్తిపోతల పంపుల ద్వారా రిజర్వాయర్లను నింపి కాస్తో, కూస్తో పంటలను సాగు చేసుకునే వారమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో తమ పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైందని వాపోతున్నారు. -
జూరాలకు కృష్ణమ్మ రాక ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాల నిమిత్తం ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి విడుదల చేసిన కృష్ణానీరు దిగువన ఉన్న మన రాష్ట్రంలోని జూరాలకు చేరేందుకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆల్మట్టి నుంచి చాలా తక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేయడం, దానిలోనూ ఆవిరి, ప్రవాహ నష్టాలుండటంతో నారాయణపూర్‌కు కేవలం 0.50 టీఎంసీల నీరే చేరింది. ఆ నీటిని ఇప్పటికిప్పుడు విడుదల చేసినా జూరాలకు వచ్చేవరకు మిగిలేది శూన్యమే. మరో పదిరోజులు గడిస్తేనే నీటిపరిమాణంపై స్పష్టత వస్తుంది. ఆవిరి, ప్రవాహ నష్టాలకే సగం నీరు! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు వీలుగా ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి దిగువన ఉన్న జూరాలకు 2.5 టీఎంసీ నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కర్ణాటక ముఖ్యమంత్రికి ఈ నెల 3న విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, నారాయణపూర్ డ్యామ్‌లో సరిపడినంత నీటి లభ్యత లేకపోవడంతో దాని ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి అదేరోజు రాత్రి నారాయణపూర్‌కు నీటి విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి మొత్తంగా 6 వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేసినా, అందులో ఆ రాష్ట్ర అవసరాల నిమిత్తం 3 వేల క్యూసెక్కుల నీటిని కాల్వలకు తరలించారు. మరో 3 వేల క్యూసెక్కులు మాత్రమే నారాయణపూర్‌కు వదిలారు. అయితే, ఆ 3 వేల క్యూసెక్కుల నీటిలో సగం ఆవిరి నష్టాలు, ప్రవాహ నష్టాలకే సరిపోయింది. రైతుల ఆందోళనతో వెనకడుగు ఆల్మట్టి నుంచి జూరాలకు నీటి విడుదలను నిరసిస్తూ కర్ణాటక రైతులు ఆందోళనకు దిగడంతో నీటి ప్రవాహాన్ని పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు వేసింది. నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేసినా, జూరాలకు చుక్క నీరు రావడం కష్టమే. ఎందుకంటే, నారాయణపూర్ నుంచి జూరాలకు 180 కి.మీ.ల దూరం ఉంది. మధ్యలో కర్ణాటక పరిధిలోని గూగుల్, గిరిజాపూర్ అనే చిన్న బ్యారేజీలను దాటుకొని నీరు జూరాలకు రావాల్సి ఉంది. ఈ చిన్న బ్యారేజీలన్నీ ప్రస్తుతం నీరు లేక నోరెళ్లబెట్టడం, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా అక్కడి నుంచి వచ్చే నీటిలో సగం ఆవిరి అయ్యే అవకాశం ఉండటం, దీనికి తోడు ప్రవాహపు నష్టాలు ఎక్కవగా ఉండటంతో నీటి రాక ఆలస్యం కానుంది. ఈ నేపథ్యంలో మరో ఒక టీఎంసీకి మించి నీరు నారాయణపూర్‌కు చేరితేనే అక్కడి నుంచి 10 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అప్పుడే నష్టాలు తక్కువగా ఉండటంతోపాటు త్వరగా నీరు జూరాలకు చేరే అవకాశం ఉంది. నారాయణపూర్‌కు నీటి రాక ఆలస్యమైతే జూరాలకు మరింత జాప్యం జరుగనుంది. ప్రస్తత పరిస్థితుల్లో కనిష్టంగా పది రోజులు అయితే కానీ నారాయణపూర్ నుంచి నీరు జూరాలకు వచ్చే అవకాశం లేదని నీటి పారుదల వర్గాలు అంటున్నాయి. -
ముదిరిన జల వివాదం
అమరచింత (కొత్తకోట): ‘తాగునీటికే దిక్కులేదు.. సాగునీళ్లెందుకు.. ఇక్కడి రైతుల ప్రయోజనాలను కాదని ఎక్కడో దూరంగా ఉన్న రైతుల పంటపొలాలకు సాగునీరును తీసుకెళ్తారా.. ఇంది ఎంతవరకు సమంజసం.. ప్రాణాలు పోయినా నీటిని విడుదల చేయనివ్వం’ అంటూ జూరాల ఎడమకాలువ వద్ద అమరచింత, ఆత్మకూర్ మండలాలకు చెందిన రైతులు ఆదివారం ప్రాజెక్టు ఎడమ కాల్వ వద్ద ఆందోళనకు దిగారు. శనివారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. నీటిని తరలించుకుపోవడానికి వచ్చిన అధికారులతో రైతులు వాదించారు. కాలువ ద్వారా స్వల్పంగా నీటిని తీసుకెళ్తామని చెప్పిన అధికారులు ఆదివారం తెల్లవారుజామునే భారీ పోలీసు బందోబస్తును పెట్టుకుని ఎడమకాలువ ద్వారా ఫుల్లెవల్ వరకు నీటిని తరలించేందుకు వచ్చారు. దీనిని గమనించిన రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకుంటాం.. తమ ప్రాంత రైతుల ప్రయోజనాలను కాదని నీటిని తరలిస్తే ఇక్కడే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు మందు డబ్బాలు చేత బట్టుకుని అక్కడే భీష్మించి కూర్చున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోపాల్దిన్నె రిజర్వాయర్ పరిధిలోని రైతులు వేరుశనగను సాగుచేశారని, వారికి సాగునీరును ఇవ్వాలని వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి జూరాల అధికారులకు విన్నవించడంతో అధికారులు నీటి విడుదలకు పూనుకున్నారు. దీంతో గత రెండు రోజుల నుండి జూరాల ఎడమ కాలువ వద్ద నందిమళ్ల, మూళమల్ల గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగడంతో జల వివాదం ముదురుతోంది. బందోబస్తుతో వచ్చినా భయపడం మొదటిరోజు రైతులనుంచి అడ్డంకులు ఎదురు కా వడంతో రైతులు రెండోరోజు జూరాల ప్రాజెక్టు వ ద్ద ఆర్డీఓ చంద్రారెడ్డి, డీఎస్పీ సృజనల ఆధ్వర్యం లో భారీస్థాయిలో పోలీసులను మోహరింపచేశా రు. ప్రాజెక్టు రహదారిపై ఇతరులకు ప్రవేశం లే కుండా బారీకేడ్లను వేసి జూరాల సిబ్బందితో కలి సి ప్రధాన ఎడమకాలువ రెగ్యులేటర్ల గేట్లను తెరి చారు. విషయాన్ని తెలుసుకున్న నందిమళ్ల, మూ ళమల్ల గ్రామాల రైతులు ప్రాజెక్టు కాలువ వద్దకు చేరుకుని ఆందోళనను నిర్వహించారు. పోలీసులు వెంటనే ఇక్కడి నుంచి తప్పుకోవాలని నీటి ప్రవాహాన్ని ఆపాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే నీళ్ల నిరంజన్‌రెడ్డి జూరాలలో నీళ్లు లేకుండా కంకణం కట్టుకున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన అవసరం లేదు రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న ఆర్డీఓ చంద్రారెడ్డి ఆందోళనకారులను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ఆత్మకూర్ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, పీఎసీఎస్ అధ్యక్షుడు గాడికృష్ణమూర్తి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ హెచ్‌బీ రాజేందర్‌సింగ్, టీఆర్ఎస్ ఆత్మకూర్, అమరచింత మండలాల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్, ఎస్ఎ.రాజు రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం జూరాలలో నాలుగున్నర టీఎంసీల నీరు నిల్వ ఉందని, కేవలం తాగునీటి ప్రయోజనాలకే ఉపయోగపడాలని అధికారులకు చెప్పడంతో వెనుదిరిగారు. అంతా అయిపోయిందని ఆందోళనకు వచ్చిన రైతులు కూడా ప్రాజెక్టును వదిలివెళ్లారు. ఆకస్మికంగా పోలీసు బందోబస్తును వెంట పెట్టుకుని వచ్చిన ఆర్డీఓ చంద్రారెడ్డి, ఈఈ. శ్రీధర్ లు పోలీసుల సహకారంతో అక్కడే ఉన్న కొంతమంది రైతులను చెదరగొట్టి ఎడమ కాల్వ ద్వారా నీటిని దిగువకు వదిలారు. మా నీళ్లు మాకే కావాలి జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకు పడిపోతున్నా దిగువన ఉన్న రైతుల ప్రయోజనాలకు కోసం మా తాగునీటి అవసరాలకు అడ్డంకులు సృష్టిస్తారా.. మేము ఏం పాపం చేశాం.. మా నీళ్లు మాకే కావాలని.. అంటూ మూళమల్ల, నందిమళ్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు. వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి జూరాల బ్యాక్‌వాటర్‌ను పూర్తిగా దిగువప్రాంతానికి తరలించుకపోవడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు. ఆదివారం నీటిని తరలించడానికి వచ్చిన అధికారుల ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ షెట్టర్ల వద్ద అల్పాహారం తింటూ నిరసన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో నాలుగున్నర టీఎంసీల నీరే ఉందని ఇందులో కూడా రెండు టీఎంసీల మేర నీరు పూడికమట్టితో కలిసే ఉందన్నారు. మిగిలింది రెండు టీఎంసీలేనని అది కూడా మాకు దక్కకుండా చేస్తారా.. అని జూరాల ఈఈ శ్రీధర్‌ను నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నీటిని వదలుతున్నామని.. తాగునీటిని ఎలాంటి కొరత ఉండదని హామీ ఇచ్చారు. -
సాగుకు నీళ్లు నిల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ ఆయకట్టుకు ఇప్పటికిప్పుడు నీటి విడుదల సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) తేల్చి చెప్పింది. ప్రధాన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం, లభ్యతగా ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన దృష్ట్యా ఖరీఫ్‌లో నీరివ్వడం కష్టమని స్పష్టం చేసింది. ముఖ్యంగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేకపోవడం, నిల్వలు ఆశించిన స్థాయిలో లేని దృష్ట్యా వాటి కింది ఆయకట్టుకు నీటి విడుదల చేయరాదని నిర్ణయించింది. జూరాల, కడెంలలో నీటి నిల్వలు ఉండటంతో ఇక్కడ ఆయకట్టుకు నీరిచ్చేందుకు కమిటీ అంగీకరించింది. వరద జలాలపై ఆధారపడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ల కింది ఆయకట్టుకు వరద నీటి లభ్యత ఉంటే ఆయకట్టుకు నీరిచ్చుకునేందుకు అంగీకరించింది. తొలి ప్రాధాన్యం తాగునీటికే... రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు గురువారం నీటిపారుదలశాఖ శివమ్ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రత్యేకంగా భేటీ అయింది. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్‌లతోపాటు అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. మిషన్ భగీరథ కింది తాగు అవసరాలు, కనీస నీటిమట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలపై భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా, ఆ అవసరాల మేరకు ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటిమట్టాలను నిర్వహించాల్సిందేనని ఈఎన్సీలు స్పష్టం చేశారు. ఎక్కడైనా కనీస నీటిమట్టాల నిర్వహణలో విఫలమైనట్లు సమాచారం అందింతే నోటీసులు ఇవ్వకుండానే సంబంధిత ఈఈలను సస్పెండ్ చేసి పెనాల్టీలు విధించేలా ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలో 60 టీఎంసీల అవసరం ఉంటుందని, వాటిని పక్కన పెట్టాకే ఖరీఫ్ ఆయకట్టు అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదల కోసం రైతులు చేస్తున్న అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుతం ఎస్సారెస్పీ కింద పూర్తిస్థాయి ఆయకట్టు 9.68 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే 72 టీఎంసీల మేర అవసరం ఉండగా లభ్యత జలాలు మాత్రం 15.93 టీఎంసీలే ఉన్నాయి. ఇందులో 6.5 టీఎంసీల మేర భగీరథకు పక్కన పెట్టడంతోపాటు డెడ్ స్టోరేజీ, ఆవిరి నష్టాలు పక్కనపెడితే మిగిలే 5 టీఎంసీలతో కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్ పరిధిలో సర్దుబాటు చేయడం కష్టమని ప్రాజెక్టు అధికారులు వివరించారు. గతేడాది ఖరీఫ్‌లో పంటలకు అధికారికంగా నీటి విడుదల జరగలేదు. అయితే చెరువులు నింపేందుకు మాత్రం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో గరిష్టంగా 8 టీఎంసీలను విడుదల చేయగా మిడ్ మానేరును నింపేందుకు మరో 10 టీఎంసీలను విడుదల చేశారు. ప్రవాహాలు వచ్చేదాకా అంతే... నాగార్జున సాగర్, సింగూరు, నిజాం సాగర్ల కింద సైతం ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వచ్చే వరకు ఆయకట్టుకు నీటి విడుదల అంశాన్ని పక్కనపెట్టాలని కమిటీ నిర్ణయించింది. సింగూరులో 29.9 టీఎంసీల నిల్వలకుగాను ప్రస్తుతం 7.57 టీఎంసీలే ఉండగా ఇక్కడ భగీరథకు 5.7 టీఎంసీలు పక్కనపెట్టాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అదిపోనూ మిగిలేది ఏమీ లేనందున ప్రాజెక్టు కింది 40 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం లేదని కమిటీ తేల్చింది. దీంతోపాటే సింగూరు దిగువన ఉన్న ఘన్పూర్ ఆయకట్టుకు 40 వేల ఎకరాలకు నీరివ్వడం కష్టమని కమిటీ అభిప్రాయపడింది. నిజాం సాగర్‌లోనూ ప్రస్తుతం 17 టీఎంసీలకుగాను 2.37 టీఎంసీల నిల్వ ఉండగా ఇక్కడ 2.08 లక్షల ఆయకట్టుకు 22 టీఎంసీలు అవసరం ఉందని, అయితే ప్రస్తుత లభ్యత తక్కువగా ఉండటంతో ఈ ఆయకట్టుకు నీరివ్వలేమని తెలిపింది. నాగార్జున సాగర్ కింద 6.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే 54 టీఎంసీలు అవసరమని ప్రాజెక్టు అధికారులు కమిటీకి వివరించారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిలో తెలంగాణకు దక్కే వాటా 43 టీఎంసీలుగా ఉందని, ఇందులో సాగర్ కింద ఏడాదంతా తాగునీటికే 41 టీఎంసీలు అవసరం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాగర్ కింది ఆయకట్టుకూ నీటి విడుదల సాధ్యం కాదని కమిటీ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్లలో ప్రవాహాలు వస్తే ఖరీఫ్ ఆయకట్టుకు నీటి విడుదలపై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది. -
నిండుకుండలా శ్రీశైలం,జూరాల ప్రాజెక్ట్
-
శ్రీశైలానికి రోజుకు 16 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకు కృష్ణా పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల నుంచి వరద ఏమాత్రం తగ్గకపోవడంతో దిగువ ప్రాజెక్టులకు స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. శ్రీశైలానికి శనివారం వరకు 1.88 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. శుక్రవారం సాయం త్రం ఆరు నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకూ 16 టీఎంసీలు జలాశయంలోకి చేరాయి. పది, పదిహేను రోజులపాటూ ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశముందని నీటి పారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా రావాల్సింది 170 టీఎంసీలు శనివారం ఆల్మట్టి నుంచి 1.73 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ఆ నీటినంతా దిగువ నారాయణపూర్‌కు వదిలేస్తున్నారు. అక్కడి నుంచి 1.83 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసి, వాగులు వంకలు పొంగడంతో 1.90 లక్షల క్యూసెక్కుల నీరు జూరాలకు వస్తోంది. జూరాల నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 1.98 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర వరదను దిగువకు వదులుతున్నా రు. దాంతో శ్రీశైలంలోకి శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, సాయంత్రానికి 1.88 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 825 అడుగుల్లో 46 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం జలాశయం నిండా లంటే సుమారు 170 టీఎంసీలు అవసరం. ఒకవేళ వరద తగ్గి కర్ణాటక ప్రాజెక్టుల గేట్లు మూసినా ఆల్మట్టి నుంచి శ్రీశైలం దాకా నదీ గర్భంలోనే 70 నుంచి 80 టీఎంసీల నీరు ఉంటుందని, తుంగభద్ర నుంచి శ్రీశైలం మధ్యలోనూ మరో 30 టీఎంసీల నీరు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆగస్టులో శ్రీశైలం నుంచి సాగర్‌లోకి నీటి విడుదల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
సాగునీరివ్వండి మహాప్రభో!
ఆత్మకూర్ (కొత్తకోట): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో వేలాది ఎకరాల్లో వరిని సాగుచేస్తున్న రైతులకు కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉన్నాయి. మరో 20రోజుల్లో పంట చేతికి వచ్చే ముందు నీటి సరఫరాను నిలిపివేయడంతో మండలంలోని ఆయకట్టు రైతులు సాగుచేసిన వరిపంటలు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారాయి. అసలే సాగునీరందక ఒకపక్క కాల్వల పరిధిలోని గ్రామాల రైతులు ఘర్షణలకు దిగుతుంటే.. మరోపక్క కాల్వలపై ఏర్పాటు చేసిన మోటార్లను అధికారులు తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. 35 వేల ఎకరాల్లో వరి.. జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ, అనుసంధానమైన డీ–6, 7 కాల్వలతోపాటు ఎడమ కాల్వ, రామన్‌పాడు రిజర్వాయర్ కింద సుమారు 35 వేల ఎకరాల్లో వరిని సాగుచేశారు. మరో మూడు తడులు అందితే ఈ పంటలు చేతికొస్తాయి. కానీ జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న కాస్త నీటిని తాగునీటి అవసరాల కోసం రామన్‌పాడు రిజర్వాయర్‌కు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తమ పంట పొలాలకు నీరు అందడం లేదని రైతులు కాల్వలపై మోటార్లను ఏర్పాటు చేసుకొని పొలాలకు నీటిని అందిస్తున్నారు. మరికొంత మంది నీళ్లు ముందుకు వెళ్లకుండా కాల్వల్లో ముళ్లపొదలు, రాళ్లు మట్టితో అడ్డుకట్టలు వేసి నీటిని తోడేసుకుంటున్నారు. ఐఏబీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఈ నెల 15వ తేదీ నాటికి సాగునీరందిస్తామని ప్రకటించారని, ఆ మేరకు నీటిని విడుదలచేసి పంటలను కాపాడాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. తాగునీటికే ప్రాధాన్యం.. రామన్‌పాడు రిజర్వాయర్ నుంచి జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, వనపర్తి తదితర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రామన్‌పాడు రిజర్వాయర్‌లో 1021.08 సామర్థ్యానికి గాను 1014.02 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. రోజురోజుకు ఈ నీటిమట్టం సైతం తగ్గిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. తాగునీటి సరఫరా నిలిచిపోతే జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ తాగునీటి సంగతి పక్కన పెట్టి సాగునీరు విషయం మాట్లాడాలని, మరో పక్షంరోజులపాటు సాగునీరు అందిస్తేనే తాము సాగు చేస్తున్న పంటలు చేతికి వస్తాయని, లేకుంటే పంటలు ఎండిపోయి ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. -
జూరాలకు కొనసాగుతున్న ప్రవాహం
హైదరాబాద్: జూరాల ప్రాజెక్టుకు 28 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. ఔట్‌ఫ్లో 30,680 క్యూసెక్కులు ఉన్నది. 2 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేస్తూ నదిలోకి 24 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. లిఫ్టులు, కాల్వలకు 6600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.377 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి 12,023 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, వచ్చే నీటిని మొత్తం దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌లోకి 11,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 10,647 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా నాగర్ కర్నూల్ జిల్లా మహత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండో లిఫ్టు పంప్ హౌస్ వద్ద రెండు మోటర్లు ఆన్ చేసి 1600 క్యూసెక్కుల నీటిని జొన్నలబొగుడ రిజర్వాయర్‌ను నింపుతున్నారు. జిల్లా తాగునీటి అవసరాలకు వీటిని వినియోగించనున్నట్టు అధికారులు తెలిపారు. సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎగువ నుంచి 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్ ప్లో 4 వేల క్యూసెక్కులున్నట్లు జేఈ శ్రీనివాస్ తెలిపారు. ఒక గేటు సగం మేర ఎత్తి నీటిని వదిలినట్టు ఆయన తెలిపారు . -
కాంగ్రెస్ గెలిచినందుకే వివక్ష
హైదరాబాద్: జూరాల ప్రాజెక్టు కిందవున్న పంటలకి తక్షణమే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. నార్లు పోసుకోవడానికి నీటిని విడుదల చేయాలని ఇప్పటికే రైతులు పలుమార్లు ధర్నాలు చేశారని, గతంలో ప్రతి సంవత్సరం జూరాల నుంచి నీటి విడుదల చేసేవారని గుర్తు చేశారు. జూరాల నుంచి నీటిని విడుదల చేయడంలో పక్షపాతం చూపిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జూరాల నుంచి కోహిలసాగర్ కు నీటివిడుదల చేస్తారు కానీ ఆయకట్టు కింద వున్న రైతులకి నీటివిడుదల చేయడంలో నిర్లక్ష్యం ఎందుకు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గం కాబట్టే వివక్ష చూపుతున్నారా అని సూటిగా అడిగారు. ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించడం పక్కనబెట్టి నార్లు వేసుకోవడానికి రైతులకి తక్షణమే నీటి విడుదల చేయాలని కోరారు. జూరాల కింద వున్న రిజర్వాయర్లని వెంటనే నీటితో నింపాలని డిమాండ్ చేశారు. -
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
గద్వాల: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్నది. జూరాల జలాశయంలోకి 7,797 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండటంతో ప్రస్తుత నీటి నిల్వ 4.45టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657టీఎంసీలు. ఇన్‌ఫ్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. -
వరదొస్తే వణుకే!
గాల్లో దీపంలా డ్యామ్‌ల భద్రత ⇒ అధ్వానంగా జూరాల, సింగూరు జలాశయాల నిర్వహణ ⇒ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు కనీస సిబ్బంది కరువు ⇒ ఆకస్మిక వరదొచ్చినా.. ఆపదొచ్చినా రిటైర్డ్ సిబ్బందే దిక్కు ⇒ మొన్నటి వరద సమయంలో నానా తిప్పలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన జలాశయాల భద్రత గాల్లో దీపంలా మారింది. సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న డ్యామ్‌ల భద్రతకు పెద్దపీట వేయాల్సిన నీటి పారుదల శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా జూరాల, సింగూరు డ్యామ్‌ల నిర్వహణ ప్రమాదకరంగా మారిందని, వీటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లకు తగిన సిబ్బందిని నియమించాలని పలు కమిటీలు సూచించినా.. అదేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో జూరాల, సింగూరు డ్యామ్‌లకు భారీగా వరద వచ్చిన సందర్భాల్లో వాటి నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. జూరాల.. స్పిల్‌వే రోడ్డుకు ప్రత్యామ్నాయమేది? జూరాల ప్రాజెక్టును 1995లో 1.04 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో నిర్మించారు. 12.50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యంతో 927 మీటర్ల పొడవుతో స్పిల్‌వేలు నిర్మించారు. 62 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉన్నాయి. స్పిల్‌వే పై ఉన్న బ్రిడ్జి మీదుగా ఆత్మకూరు, గద్వాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. కార్లు, బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలు బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. 2012లో డ్యామ్ భద్రతను పర్యవేక్షించిన ప్రత్యేక బృందం.. వాహనాల రాకపోకలతో భవిష్యత్‌లో డ్యామ్ నిర్మాణానికి పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. డ్యామ్ గేట్లను తెరవడానికి, సరి చేయడానికి ఉపయోగించే క్రేన్ వ్యవస్థకు ఈ వాహనాల రాకపోకలతో ప్రమాదం ఉందని, క్రేన్ మార్గం దెబ్బతింటే దాన్ని ఆపరేట్ చేయడం సులువు కాదని తెలిపింది. ప్రాజెక్టుకు వరదలు సంభవించిన సమయంలో గేట్ల నిర్వహణ మరీ ప్రమాదకరంగా ఉంటోందని తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 25న ఏకంగా 19.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీన్ని కట్టడి చేసేందుకు అధికారాలు నానా తంటాలు పడాల్సి వచ్చింది. స్పిల్‌వే డ్యామ్‌పై వాహనాలు వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా డౌన్ స్ట్రీమ్‌లో రోడ్డు బ్రిడ్జి కట్టాలని పలు కమిటీలు సూచనలు చేసినా అది సాధ్యం కాలేదు. ఇక స్పిల్‌వే ఓఅండ్ఎంల కోసం వర్క్ ఇన్స్పెక్టర్, గేటు ఆపరేటర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రిషియన్లు, వాచ్మెన్లు, ఆపరేటర్లు కలిపి మొత్తంగా 19 మంది వరకు కావాల్సి ఉండగా... ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. గతేడాది వరద సమయంలో గేట్ల నిర్వహణ కోసం రిటైర్డ్ సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు. సమయానికి తెరుచుకోని సింగూరు గేట్లు సింగూరు ప్రాజెక్టు 1989లో 29.91 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ప్రాజెక్టు స్పిల్‌వే 327 మీటర్లు కాగా.. 17 క్రస్ట్ గేట్లున్నాయి. 8.19 లక్షల క్యూసెక్కుల వరదను డిశ్చార్జి చేసే సామర్థ్యం ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ఇక్కడ 20 రోజుల్లోనే 75 టీఎంసీల మేర వరద వచ్చింది. ఈ సమయంలో ప్రాజెక్టు ప్రొటోకాల్ ప్రకారం మధ్య గేట్లు మొదట తెరవాల్సి ఉండగా.. అవి తెరుచుకోలేదు. దీంతో ఇతర గేట్లను తెరిచి నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. ప్రాజెక్టు గేట్ల ఓఅండ్ఎంను పూర్తిగా గాలికి వదిలే యడం.. రోప్ వైర్ల నిర్వహణను గాలికొదిలేయడమే దీనికి కారణమని తేల్చారు. ప్రాజెక్టు పరిధిలో 13 మంది సిబ్బంది కావాల్సి ఉండగా.. కేవలం ఒక హెల్పర్, ఇద్దరు వాచ్మెన్లతో నెట్టుకొస్తు న్నారు. నైపుణ్యం గల సిబ్బంది లేకుండా వరద, నీటి మట్టాల నిర్వహణ ఎలా చేపడతా రని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా అని నిపుణుల కమిటీ అప్పట్లోనే ప్రశ్నించింది. -
‘అదనపు’ వినియోగాన్ని సర్దండి
ఏపీ అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లనున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో రెండున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ చేసిన అదనపు నీటి వినియోగాన్ని సర్దుబాటు చేసే అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన అవగాహన మేరకు అదనంగా ఏ రాష్ట్రమైనా నీటిని వినియోగిస్తే నీటి లభ్యత ఉన్న సమయాల్లో వాటిని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. 2014-15లో ఏపీకి 367 టీఎంసీల మేర కేటాయించగా.. 33 టీఎంసీల మేర అధికంగా వినియోగించింది. 2015-16లో తెలంగాణ 75 టీఎంసీలు, ఏపీ 129 టీఎంసీలు వాడుకున్నాయి. నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం చూస్తే.. తెలంగాణ కన్నా ఏపీ 13 టీఎంసీలు అదనంగా వాడుకుంది. వీటిలో కొంత నీటినైనా ఈ ఏడాదిలో సర్దుబాటు చేయాలని తెలంగాణ కోరనుంది. చెన్నై తాగునీటిని విడుదల చేయండి..: చెన్నై తాగునీటి అవసరాల నిమిత్తం వారికి ఇప్పటికే కేటాయించిన 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు సోమవారం తెలుగు రాష్ట్రాలకు సూచించింది. శ్రీశైలం నుంచి ఈ నీటిని విడుదల చేయాలంటూ బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. కాగా జూరాల ప్రాజెక్టు పరిధిలో టెలీమెట్రీ అమలు అంశంపైనా సోమవారంతో బోర్డు తన కసరత్తు ముగించింది. 6 చోట్ల టెలిమెట్రీ పరికరాలను అమర్చాలని నిర్ణయించింది. -
వనపర్తి జిల్లా సమగ్ర స్వరూపం
వనపర్తి జిల్లా కలెక్టర్: శ్వేతా మహంతి ఎస్పీ: రోహిణీ ప్రియదర్శిని ఇతర ముఖ్య అధికారులు జేసీ: నిరంజన్ డీఆర్వో: వన జాదేవీ, డీటీవో: మహేందర్ డీఎంఅండ్‌హెచ్‌వో: నాగారాం రెవెన్యూ డివిజన్ 1: వనపర్తి మండలాలు 14: వనపర్తి, గోపాల్పేట, ఖిల్లాఘనపురం, పాన్‌గల్, వీపనగండ్ల, రేవల్లి(కొత్తది), చిన్నంబావి(కొత్తది), కొత్తకోట, అమరచింత(కొత్తది), మదనాపురం(కొత్తది), పెబ్బేరు, శ్రీరంగాపూర్, పెద్దమందడి, ఆత్మకూరు మున్సిపాలిటీ: వనపర్తి, (మేజర్ గ్రామ పంచాయతీలు–పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు) గ్రామ పంచాయతీలు: 215 సాగునీటి ప్రాజెక్టులు: జూరాల ప్రాజెక్టు ఎడమ భాగం, సరళాసాగర్, రామన్‌పాడు, బీమా, అమరచింత ఎత్తిపోతల, రంగసముద్రం, శంకరసముద్రం రిజర్వాయర్లు భారీ పరిశ్రమలు: షుగర్ ఫ్యాక్టరీలు ఎమ్మెల్యేలు: జి.చిన్నారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జూపల్లి కష్ణారావు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఎంపీలు: నంది ఎల్లయ్య(నాగర్‌కర్నూల్), జితేందర్‌రెడ్డి(మహబూబ్‌నగర్) పర్యాటకం, ఆలయాలు: అమరచింతలో జూరాల ప్రాజెక్టు, పెబ్బేరులో శ్రీ రంగనాయకస్వామి ఆలయం, వనపర్తిలో తిరుమలాయగుట్ట జాతీయ రహదారులు: హైవే నం.44 హైదరాబాద్ నుంచి దూరం: 150 కి.మీ. ఖనిజ సంపద: క్వార్జ్ -
జూరాలపైనా సంయుక్త పర్యవేక్షణ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగాన్ని పర్యవేక్షించేం దుకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల వద్ద సంయుక్త పరిశీలన మొదలుపెట్టిన కృష్ణాబోర్డు, జూరాల ప్రాజెక్టుకు కూడా దీన్ని విస్తరించాలని నిర్ణయించింది. జూరాలపై ఆధారపడి తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులకు ఇక్కడి నుంచి ఇష్టారీతిన నీటిని తరలిస్తున్నారన్న ఏపీ వరుస ఫిర్యాదుల నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కృష్టా బోర్డు లేఖలు రాయడంతోపాటు, ఆరు పాయింట్ల వద్ద నీటి ప్రవాహాన్ని లెక్కించేందుకు ఇంజనీర్ల పేర్లను సూచించాలని కోరినట్లు తెలిసింది. ప్రాజెక్టులపై సంయక్త పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై కృష్ణా బోర్డు స్పందించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శ్రీశైలం డ్యామ్, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కల్వకుర్తి పంప్‌హౌజ్‌ల వద్ద, సాగర్ డ్యామ్ కుడి, ఎడమ కాల్వ, ఏఎంఆర్పీ వద్ద ఇరు రాష్ట్రాలు ఎనిమిదేసి మంది ఇంజనీర్లను సూచించగా సంయుక్త పర్యవేక్షణ కొనసాగుతోంది. అయితే జూరాల వద్ద మాత్రం పర్యవేక్షణ లేదు. జూరాల నీటిని వినియోగిస్తూ భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడుల ద్వారా లెక్కల్లో చూపకుండా తెలంగాణ నీటిని తరలిస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో 6 మంది ఇంజనీర్లతో సంయుక్త పర్యవేక్షణ ఉండాలని పట్టుబడుతోంది. -
జూరాలకు పొటెత్తుతున్న వరద
గద్వాల: గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 57,500 క్యూసెక్కులకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రెండు గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తి 65,650 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ కుడి కాలువకు 150 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
జూరాలలో 130మెగావాట్ల విద్యుదుత్పత్తి
జూరాల : కర్ణాటక రాష్ట్రం నుంచి జూరాల ప్రాజెక్టుకు బుధవారం 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నాలుగు టరై్బన్లలో విద్యుదుత్పత్తిని కొనసాగించి 28వేల క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. వీటిద్వారా 130మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు పరివాహక ప్రాంతం నుంచి కేవలం 32,662క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా 128.19 టీఎంసీలను కొనసాగిస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 22,920క్యూసెక్కులను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు కాగా 37.22టీఎంసీలను ఉంచుతున్నారు. పై నుంచి 22,989క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా ప్రాజెక్టులో విద్యుదుత్పత్తితోపాటు రెండు క్రస్టుగేట్లను తెరిచి 19,030క్యూసెక్కుల వరదను జూరాల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. -
సాగర్, జూరాలకు కొనసాగుతున్న వరద
మహబూబ్‌నగర్/నల్లగొండ: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.208 అడుగులకు చేరింది. అయితే ఇన్‌ఫ్లో 2,35,000 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 2,53,659 క్యూసెక్కుల నీటిని 13 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్‌కు స్వల్పంగా వరద పెరిగింది. దీని పూర్తిస్థాయి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 506.70 అడుగులకు చేరింది. ఇందులో ఇన్‌ఫ్లో 32, 713 క్యూసెక్కులు నీరు చేరుతుండగా, ఔట్‌ఫ్లో 13,619 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
ఘాట్లలో కృష్ణమ్మ పరవళ్లు
పుష్కరఘాట్లను ముంచెత్తిన వరద – కొన్ని ఘాట్ల వద్ద ఉధృతంగా కృష్ణా ప్రవాహం – పుష్కరపనులకు అంతరాయం – సోమశిల వీఐపీ ఘాట్‌కు చేరువలో నదీ ప్రవాహం పుష్కరఘాట్లలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడటంతో ప్రాజెక్టుకు వరద ముంచెత్తుతోంది. జూరాల నుంచి శ్రీశైలం డ్యాంకు నీటిని విడుదల చేస్తుండటంతో.. నిన్నటి వరకు రాళ్లు రప్పలతో నిండిన పుష్కరఘాట్లు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నారు. జూరాల బ్యాక్‌వాటర్‌లో ఉన్న పలు పుష్కరఘాట్లు నీటిలో పూర్తిగా ముగినిపోయాయి. మరికొన్న చోట్ల పుష్కరపనులు చేసేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. – కొల్లాపూర్/ఆత్మకూరు/గద్వాల/మక్తల్/పెబ్బేరు/మాగనూరు మక్తల్ మండలంలో ఘాట్ల వద్దకు భారీగా నీళ్లు వచ్చాయి. పసుపుల పుష్కరఘాట్ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఘాట్ మెట్లు కొంతవరకే తేలాయి. పారేవులలో కూడా నీళ్లు భారీగా వచ్చాయి. పంచదేవ్పాడు ఘాట్లలోకి నీళ్లు రావడంతో పనులకు అంతరాయం ఏర్పడుతోంది. ముస్లాయిపల్లి, గడ్డంపల్లి, అనుగొండ ఘాట్లు ఇదివరకే పూర్తిగా మునిగిపోయాయి. ఆత్మకూర్ మండల పరిధిలోని నందిమల్లడ్యాం, జూరాల, మూలమల్ల,ఆరేపల్లి, కత్తేపల్లి ఘాట్లలోకి భారీగా నీళ్లు వచ్చాయి. భక్తులు పుష్కరస్నానం చేసేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఎట్టకేలకు కొల్లాపూర్ మండలం సోమశిల వీఐపీ ఘాట్‌లోకి కృష్ణానది నీరు చేరుతోంది. మరో మూడు రోజుల పాటు వరద నీరు ఇలాగే ప్రవహిస్తే జనరల్ఘాట్ వరకు నీరు వచ్చే అవకాశం ఉంది. మల్లేశ్వరం, మంచాలకట్ట, అమరగిరి, చెల్లెపాడ పుష్కరఘాట్లకు చేరువగా కృష్ణానది నీటిమట్టం ఉంది. నది నీళ్లు పెరగడంతో సోమశిల వద్దకు పర్యాటక శాఖ లాంచీని తీసుకొచ్చారు. మాగనూరు మండలంలోని కృష్ణా ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. గంటగంటలకు నీటి ప్రవాహం పెరుగుతూ ఉండటంతో పలు పుష్కరఘాట్లు పూర్తిగా నీట ముగిగాయి. కృష్ణ వద్ద ఏర్పాటు చేసిన‡ఘాట్ వద్ద దాదాపు 50మెట్ల వరకు నీరు చేరింది. గద్వాలలో నదీ అగ్రహారం ఘాట్లలో 8.91మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉంది. మూడు వరసలు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. మరో రెండు వరుసలు తేలి ఉన్నాయి. నెట్టెంపాడు, ఉప్పేరు, రేవులపల్లి, చింతరేవుల ఘాట్లు 90శాతం మేర మునిగిపోయాయి. రేకులపల్లి, తెలుగోనిపల్లి, బీరెల్లిలో మూడు వరుసలు నదీ ప్రవాహంలో మునిగిపోయాయి. పెబ్బేరు మండలం రంగాపూర్ ఘాట్ వద్ద భారీ వరద ప్రవాహం ఉంది. ఏడు లైన్లతో ఘాట్‌ను నిర్మిస్తుండగా, నాలుగు ఘాట్లు పూర్తిగా నీటిలో ముగినిపోయాయి. వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఘాట్ వద్ద పనులు ఆశించినస్థాయిలో సాగడం లేదు. రాంపూర్, మునగమాన్ దిన్నె ఘాట్ల వద్ద కృష్ణా ప్రవాహం బాగా ఉంది. -
జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి
-
కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి
కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్ల వద్ద ప్రధాన ఆకర్షణగా నిలిచేలా అధికార యంత్రాంగం కృష్ణవేణి విగ్రహాలను ఏర్పాటు చేయిస్తోంది. గత పుష్కరాల సమయంలో పలు ఘాట్లలో కృష్ణవేణి విగ్రహాలను ప్రతిషి్ఠంచారు. పన్నెండేళ్ల క్రితం జరిగిన పుష్కరాల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా బీచుపల్లి, జూరాల ప్రాంతాల్లో కృష్ణవేణి విగ్రహాలను ప్రతిష్ఠించారు. గద్వాలలో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని పుష్కరాలు సమయంలో పట్టణ ప్రధాన కూడలిలో విగ్రహాలను ఏర్పాటు చేయించారు. పుష్కరాలకు గుర్తుగా కృష్ణవేణి విగ్రహాలు గద్వాల: ‘కృష్ణానది సహ్య పర్వతాలపై పుట్టింది. శ్రీకృష్ణ పరమాత్మ సహ్యాద్రిపైన వేదగిరి వద్ద అశ్వత్థరూపంలో నిలిచినపుడు ఆ వేళ్ల నుంచి ఈ నది పుట్టిందని పురాణం చెబుతోంది. కలియుగంలో మునులంతా పాపాన్ని నశింపజేసుకోవడానికి ఈశ్వరుడిని ప్రార్థంచారు. అప్పుడు శివయ్య లింగంరూపంలో సహ్యాద్రిపై అవతరించారని, అక్కడున్న ఉసిరిచెట్టు నుంచి వేణినది పుట్టి, కృష్ణానదిలో కలవడంతో కృష్ణవేణి అయింది.’ పన్నెండేళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కరాల పురస్కరించుకుని వాటి జ్ఞాపకార్థం గద్వాలలో చెరగని ముద్ర వేశారు. పుష్కరాల గుర్తుగా రెండు విడుతలగా కృష్ణవేణి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మొదటిసారి 1992లో గద్వాల పట్టణం నుంచి కృష్ణానదికి వెళ్లే మార్గంలో అప్పటి న్యాయశాఖ మంత్రి డీకే సమరసింహారెడ్డి కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ విగ్రహం అలాగే ఉంది. విగ్రహం ఏర్పాట్లుతో అది కృష్ణవేణి చౌరస్తాగా మారిపోయింది. పట్టణంలో అత్యంత రద్దీ ఉండేది ఇదొక్కటే. 2016 కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే డీకే అరుణ కృష్ణవేణి విగ్రహా ఏర్పాటుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. పాత కృష్ణవేణి విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మొదట సంకల్పించారు. అయితే రాజకీయ కారణాలు, సెంటిమెంట్లు అడ్డురావడంతో విగ్రహ ఏర్పాటులో కొంత జాప్యం జరిగింది. తదనంతరం పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తా నుంచి కృష్ణానదికి స్వాగతం పలికే విధంగా తొమ్మిది అడుగుల కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని డీకే అరుణ సొంత ఖర్చులతో చేయించారు. మే 4వ తేదీన కృష్ణవేణి విగ్రహాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రజలను ఆకట్టుకునే సహజత్వంతో కృష్ణవేణి విగ్రహం ఉట్టిపడుతోంది. ప్రస్తుతం కృష్ణ పుష్కరాలకు గుర్తుగా శోభాయమానంగా మారింది. తల లేని కృష్ణమ్మ.. ఆత్మకూర్: పన్నెండేళ్ల క్రితం జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందిమల్ల పుష్కరఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణవేణి అమ్మవారి విగ్రహాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రతిషి్ఠంచి, ప్రారంభించారు. ఆ తర్వాత ఆలనాపాలన లేకపోవడంతో కృష్ణవేణి విగ్రహం ధ్వంసమైంది. ప్రస్తుతం విగ్రహానికి తల లేదు. అక్కడ నిర్మించిన ఆలయం కూలిపోయి విగ్రహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇక్కడ ఉన్న గుడిని పునరుద్ధరించాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. కొత్తఘాట్లో కొత్త విగ్రహం.. ఇటిక్యాల: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని 2004లో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణవేణి విగ్రహాన్ని ప్రతిషి్ఠం చారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ ఏడాది నూతనంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్‌పై సైతం కృష్ణవేణì విగ్రహాన్ని ప్రతిషి్ఠంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.గురువు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి ముక్కోటి దేవతామూర్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. -
జూరాలకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
జూరాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మంగళవారం 22వేల క్యూసెక్కుల వరద రావడంతో మూడు యూనిట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 24వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 1000 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పంప్‌ల ద్వారా 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు 315 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. జూరాల నుంచి మొత్తం 27,615 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.5 టీఎంసీలుగా నీటినిల్వను నిర్వహిస్తున్నారు. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 129.19 టీఎంసీలుగా ఉంది. పై నుంచి 25,420 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా విద్యుదుత్పత్తి ద్వారా అదేస్థాయిలో దిగువ నదిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36.67 టీఎంసీలుగా నీటినిల్వ ఉంది. ప్రాజెక్టుకు 20,992 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా విద్యుదుత్పత్తి, ప్రధాన కాలువల ద్వారా 20,250 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 40.72 క్యూసెక్కులుగా నీటినిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 7195 క్యూసెక్కులు వస్తుండగా కాలువ ద్వారా 6222 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
కృష్ణమ్మ.. వచ్చిందమ్మా
- బుధవారం సాయంత్రానికల్లా 7 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ - ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి విడుదల సాక్షి, హైదరాబాద్/జూరాల : కృష్ణమ్మ వచ్చేసింది. కర్ణాటక నుంచి బిరబిర పరుగులు పెడుతూ బుధవారం పాలమూరు జిల్లాలోని జూరాలను చేరింది. ఇప్పటిదాకా కేవలం 3.58 టీఎంసీల నీటి నిల్వతో ఉన్న ఈ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వరద వస్తుండటంతో సాయంత్రానికల్లా నీటి నిల్వ 7 టీఎంసీలకు చేరింది. రాత్రిలోగా పూర్తిస్థాయి నీటిమట్టం 9.65 టీఎంసీలకు చేరనుండటంతో ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. జూరాలకు మధ్యాహ్నం 12 గంటలకు లక్ష క్యూసెక్కులతో మొదలైన ఇన్‌ఫ్లో సాయంత్రం 6 గంటలకల్లా 90 వేల క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గుడ్డెందొడ్డి మొదటి పంప్‌హౌస్‌లో రెండు పంపులను ప్రారంభించి 750 క్యూసెక్కులను నె ట్టెంపాడు రెండో పంప్‌హౌస్‌కు పంపుతున్నారు. సోమవారం సాయంత్రం కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు క్రస్టుగేట్లను తెరవడంతో కృష్ణా వరద రాష్ట్రం వైపు పరుగులు పెట్టింది. ఎగువ నుంచి మొత్తం 1.37 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. అయితే బుధవారం వరద ఉధృతి తగ్గడంతో కర్ణాటక అధికారులు నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లన్నింటినీ మూసేశారు. కేవలం విద్యుదుత్పత్తి ద్వారా 6 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్పైన ఉన్న ఆలమట్టి ప్రాజెక్టుకు 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో విద్యుదుత్పత్తి ద్వారా 15 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులోనూ అన్ని గేట్లను మూసివేశారు. నేడు పంప్‌హౌస్‌ల ప్రారంభం జూరాలపై ఆధారపడిన నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల పంప్‌హౌస్‌లను గురువారం నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు ఆత్మకూర్ మండలంలోని భీమా లిఫ్ట్-2 పంప్‌ను ప్రారంభించిన అనంతరం 10.30 గంటలకు నెట్టెంపాడు ఫేజ్-2, తర్వాత కొత్తకోట సమీపంలోని భీమా ఫేజ్-2ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నర్వ మండలంలోని నాగిరెడ్డిపల్లి వద్ద కోయిల్‌సాగర్-1 లిఫ్ట్ పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. జూరాల కింద ఉన్న లక్ష ఎకరాలతో పాటు కల్వకుర్తి కింద 1.50 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.50 లక్షలు, భీమా ద్వారా 1.40 లక్షలు, కోయిల్‌సాగర్ ద్వారా 20 వేల ఎకరాలకు కలిపి మొత్తంగా 5.60 లక్షల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జూరాల నీటిని వీలైనంత ఎక్కువగా ఈ ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లకు మళ్లించాలని ఇప్పటికే నిర్ణయించారు. కృష్ణా జలాల్లో తమకున్న నీటి వాటా 299 టీఎంసీల్లోంచే ఈ నీటిని వాడుకుంటున్నందున ఇందుకు ఎవరి అభ్యంతరం ఉండబోదని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుదుత్పత్తి ప్రారంభం జూరాల ప్రాజెక్టులో బుధవారం రాత్రి 9.30 గంటల నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించారు. మొత్తం ఆరు టర్బయిన్లు ఉండగా ఒక టర్బయిన్ ద్వారా 35 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేస్తూ 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం ఉదయం మిగతా 5 టర్బయిన్లతోపాటు లోయర్ జూరాల నుంచి కూడా విద్యుదుత్పత్తిని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
జూరాల ప్రాజెక్టుకు జల కళ
-
జూరాలకు బిర బిరా కృష్ణమ్మ
ఎగువనున్న కర్ణాటక ప్రాజెక్టులు నిండటంతో కృష్ణా జలాలు బుధవారం రాత్రికి లేక గురువారం ఉదయం జూరాలకు చేరనున్నాయి. ప్రస్తుతం నారాయణపూర్ డ్యామ్ నుంచి 77వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ఆల్మట్టి నుంచి నీటి విడుదల భారీగా ఉండటంతో నారాయణఫూర్ నుంచి ఔట్ ఫ్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆశగా రాష్ట్ర ప్రాజెక్టులు.. ఎగువ వర్షాలతో కర్ణాటకలోని ప్రాజెక్టుల్లో సుమారు 200 టీఎంసీల నీరు చేరగా, రాష్ట్రంలోని ప్రాజెక్టులో మాత్రం కేవలం 8టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. దీంతో మన ప్రాజెక్టులన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 590 అడుగుల మట్టానికి గానూ నీటి నిల్వ 503 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో 885 అడుగులకు గానూ కేవలం 788 అడుగులో 23టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంది. జూరాలలో కేవలం 9.66 టీఎంసీలకు 3.58 టీఎంసీల నీరు ఉంది. రెండేళ్లుగా సరైన ప్రవాహాలు లేక వట్టిపోయిన ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. -
కర్ణాటకలో కృష్ణమ్మ పరవళ్లు
- 4 రోజుల్లో ఆలమట్టి, తుంగభద్రలోకి 30 టీఎంసీల నీరు - ఆలమట్టికి 1.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం - ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో ఇలాగే ఉంటే ఆగస్టు కల్లా శ్రీశైలం, జూరాలకు నీరు సాక్షి, హైదరాబాద్/జూరాల : కృష్ణా నది ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ప్రాజెక్టులకు భారీగా నీరు చేరుతోంది. గడిచిన నాలుగు రోజుల్లోనే అక్కడి ప్రధాన ప్రాజెక్టులైన ఆలమట్టి, తుంగభద్రల్లోకి 30 టీఎంసీల మేర నీరు వచ్చింది. బుధవారం సైతం ఆలమట్టికి 1.27 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాలు కొనసాగుతుండటంతో ఒకట్రెండు రోజుల్లో మరో 20 టీఎంసీల నీరు చేరే అవకాశ ం ఉంది. ఎగువ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో చేరితే దిగువకు క్రమంగా ప్రవాహాలు మొదలుకానున్నాయి. ఎగువన ప్రస్తుతం మాదిరే ప్రవాహాలు కొనసాగితే ఆగస్టు రెండు లేక మూడో వారానికి శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులకు నీరు చేరే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు దక్షిణ తెలంగాణలో ప్రస్తుతం వర్షాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లోలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువన ఇదీ పరిస్థితి.. ఆలమట్టి నిల్వ సామర్థ్యం 129.7 టీంసీలు. ఈ ప్రాజెక్టులోకి నాలుగు రోజుల క్రితం వరకు కొత్తగా 19 టీఎంసీల నీరు చేరింది. బుధవారం నాటికి అది 39.7 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 54.48 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో ఆలమట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.50 టీఎంసీల నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు నిండితే కృష్ణమ్మ తెలంగాణ వైపు వైపు పరుగులు తీసే అవకాశం ఉంది. కర్ణాటకలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.86 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 11,756 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా తాగునీటి అవసరాలకు 756 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూరాలకు వస్తోంది తక్కువే.. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.57 టీఎంసీల నిల్వ ఉంది. జూరాలకు ఇన్‌ఫ్లో కేవలం 35 క్యూసెక్కులు మాత్రమే ఉండగా.. అదేస్థాయిలో ఎడమ కాల్వ ద్వారా తాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న శ్రీశైలం రిజర్వాయర్‌కు 28 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 590 అడుగులకు గానూ 504 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలోనూ 885 అడుగులకుగానూ నీటినిల్వ 788.4 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో లభ్యతగా ఉన్న 23.72 టీఎంసీలపైనే రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. -
జూరాలకు ప్రాజెక్టుకు వరద ప్రవాహం
జూరాల : కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మంగళవారం జూరాల ప్రాజెక్టుకు 1615 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 1085 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలి పారు. వర్షాలు ఇలాగే కురిస్తే నెల రోజుల్లో ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయికి చేరి నారాయణపూర్ ద్వారా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా ఇన్‌ఫ్లో వివరాలిలా ఉన్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.06 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు వంద కి.మీ. దూరం దిగువన కర్ణాటక రాష్ర్టంలోనే ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు. కాగా ప్రస్తుతం కేవలం 14.37 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 4,249 క్యూసెక్కులు వచ్చిచేరుతోంది. ఇక జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 2.54 టీఎంసీలుగా ఉంది. వర్షాలతో 1,615 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో ఉన్న తుంగభద్రా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 110.86 టీఎంసీలు. కాగా ప్రస్తుతం నీటి నిల్వ కేవలం 3.56 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో 471 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టు నుంచి 206 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
ఎట్టకేలకు ‘జూరాల’కు మరమ్మతు!
1996లో ప్రాజెక్టు ఆరంభం మొదలు ఇంతవరకు లేని మరమ్మతులు పట్టించుకోని గత ప్రభుత్వాలు తాజాగా రూ. 15 కోట్లతో అంచనాలు సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతు పనులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. 1996లో ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తర్వాత తొలిసారి ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి కొత్త కళను తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే చేపట్టాల్సిన మరమ్మతు పనులను గుర్తించిన నీటి పారుదల శాఖ వాటికి అయ్యే ఖర్చుపై అంచనాలను సైతం సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపింది. పూర్తి పరిశీలన అనంతరం ఈ పనులకు మోక్షం లభించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. 11.94 టీఎంసీల నిల్వ, 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో 1.04 లక్షల ఆయకట్టు లక్ష్యంగా 1996లో జూరాల ప్రాజెక్టును ప్రారంభించిన విషయం తెలిసిందే. 27.80 మీటర్ల ఎతై్తన డ్యామ్‌కు 64 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఉన్నాయి. వీటిని పైకి ఎత్తాలన్నా, దించాలన్నా అందుకు ఉపయోగించే వైర్ రోప్స్ అత్యంత కీలకం. అవి సరిగా, బలంగా ఉంటేనే గేట్లను ఎత్తడం, దించడం సాధ్యమవుతుంది. లేదంటే గేట్లు తెరుచుకోవడం కష్టం. దీంతో పాటే గేట్లకు ఎప్పటికప్పుడు పెయింటింగ్ వేయడం సైతం అత్యంత ముఖ్యం. అది చేయని పక్షంలో తుప్పుపట్టి గేట్లకు రంధ్రాలు పడతాయి. దీనివల్ల డ్యామ్ భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. డ్యామ్ కట్టిన 15 ఏళ్ల తర్వాత జూరాల ప్రాజెక్టు నిర్వహణ, డ్యామ్ భద్రతపై దృష్టి పెట్టిన అప్పటి డ్యామ్ సేఫ్టీ ప్యానల్ మరమ్మతులు అవసరమని, వీలైనంత త్వరగా దాన్ని చేపట్టాలని సూచించింది. అయితే ప్యానల్ సూచనను పెద్దగా పట్టించుకోని అప్పటి ప్రభుత్వాలు ఎలాంటి మరమ్మతు చర్యలకు పూనుకోలేదు. తర్వాత కాలంలోకూడా అదే డ్యామ్ సేఫ్టీ ప్యానల్‌తో పాటు, ఇతర ఇంజనీరింగ్ శాఖల నిపుణులు 2011లో ఒకమారు, 2013లో మరోమారు జూరాల మరమ్మతుల అవసరాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఫలితం కానరాలేదు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ తొలిసారి జూరాల మరమ్మతుల అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. పనులకు అయ్యే అంచనా వ్యయాలను సిద్ధం చేసి పంపాలన్న ఉన్నతాధికారుల సూచనతో కదిలిన డ్యామ్ అధికారులు రూ.15 కోట్లతో అంచనాలు తయారు చేశారు. వీటిని త్వరలోనే ప్రభుత్వ ఆమోదంకోసం పంపనున్నారు. కాగా, వీలైనంత త్వరగా ఈ నిధులను ఇచ్చేందుకు ప్రభుత్వం సైతం సిద్ధంగా ఉందని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. -
జూరాల-పాకాల ప్రాజెక్టుకు భారీ టన్నెల్
124 కిలోమీటర్ల భారీ టన్నెల్ నివేదికలో ప్రతిపాదించిన వ్యాప్కో సంస్థ జూరాల ప్రాజెక్ట్, మహబూబ్ నగర్, భారీ టన్నెల్ సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు నుంచి 60 నుంచి 70 టీఎంసీల నీటిని వరంగల్ జిల్లా పాకాల వరకు తీసుకు వెళ్లేందుకు ఉద్దేశించిన జూరాల-పాకాల ప్రాజెక్టు కాల్వ నిర్మాణానికి 124 కిలోమీటర్ల భారీ జంట టన్నెల్లను నిర్మించాల్సి ఉంటుందని సంబంధిత సర్వే సంస్థ ‘వ్యాప్కో’ స్పష్టం చేసింది. కొద్దికాలమే వరద ఉంటున్నందున పెద్దఎత్తున నీటిని కాల్వద్వారా తరలించడం సాధ్యం కాదని తేల్చింది. అంతేకాక కాల్వ నిర్మాణానికి భారీగా భూసేకరణ చేయాల్సి ఉంటుందని, దీంతో ఇప్పటికే సాగవుతున్న ఆయకట్టు దెబ్బతినడంతోపాటు, ధనవ్యయం ఎక్కువయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. జూరాలలో వరద ఉండే 35 రోజుల్లో 70 టీఎంసీల నీటిని వరంగల్ జిల్లా పాకాల వరకు మధ్యలో చిన్ని నీటివనరులను నింపుతూ, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని సుమారు 10 లక్షల ఎకరాల ఆయకట్టు కోసం దీనిని చేపడుతున్నారు. సమగ్ర నివేదిక తయారీ బాధ్యతలను వ్యాప్కోకు కట్టబెట్టారు. ఈ సంస్థ ఇప్పటికే 50 శాతం సర్వే పనులను పూర్తిచేసి, ఇటీవలే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. తుదిసర్వేను డిసెంబర్ మూడో వారానికి పూర్తిచేసి సర్కార్‌కు సమగ్ర నివేదిక అందజేయనుంది. జూరాల నుంచి 4 కిలోమీటర్ల ఓపెన్ ఛానల్ తర్వాత 124 కిలోమీటర్ల భారీటన్నెల్ను సంస్థ ప్రతిపాదించింది. కెనాల్‌తో భారీ వ్యయం: జూరాల కన్నా పాకాల ఎత్తున ఉండడంతో నీటిని 310 మీటర్ల ఎత్తునుంచి నాలుగైదువందల మీటర్ల ఎత్తువరకు తరలించాల్సి ఉంటుంది. ఇది కెనాల్ ద్వారా సాధ్యం కాదని సంస్థ తేల్చింది. జూరాలలో వరద ఉండే 35 రోజుల్లో 70 టీఎంసీల నీటిని తరలించాలంటే 12 వేల క్యూసెక్కుల నీటిని ప్రతిరోజూ తరలించాలి. ఇందుకు వెడల్పు ఎక్కువగా ఉండే కెనాల్ అవసరం. కెనాల్ల తవ్వకం జరిపితే ఎత్తుకుపోయే కొలది గరిష్టంగా 100 మీటర్లలోతు వరకు తవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా కెనాల్ లోతు 50 మీటర్లకు మించి చేపట్టలేరు. అదీగాక కాల్వ నిర్మాణం చేపడితే దానికి కొత్తగా దారులు, డ్రెయిన్లు నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం మరికొంతభూమి సేకరించాల్సి ఉంటుంది. వరదకాల్వ పూర్తిగా నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల ఆయకట్టు గుండా పోనుండడంతో అది దెబ్బతినే అవకాశం ఉంది. భూసేకరణ, కాల్వల నిర్మాణం ఖర్చుకూడా తడిసి మోపెడవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సంస్థ టన్నెల్ నిర్మాణానికి మొగ్గుచూపింది. అయితే ఒక టన్నెల్ ద్వారా 12 వేల క్యూసెక్కుల నీటిని తరలించడం సాధ్యం కానందున రెండుటన్నెల్ల ఏర్పాటు తప్పనిసరని చెబుతోంది. ఇవి జూరాల ఎగువన నాలుగు కిలోమీటర్ల నుంచి నల్లగొండ జిల్లా డిండి వరకు ఉండే అవకాశం ఉంది. 15 వరకు రిజర్వాయర్లు: ప్రాజెక్టు పరిధిలో 15 వరకు రిజర్వాయర్ల అవసరం ఉందని సంస్థ నిర్ధారించినట్టు తెలిసింది. డిండి తర్వాత ఈ రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతానికి ఐదారు రిజర్వాయర్లకు స్థలాలను గుర్తించినట్టు తెలిసింది. -
జూరాలతో రైతాంగానికి మేలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూగర్భజలాలపై ఆధారపడిన జిల్లా రైతాంగానికి ‘పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల’ పథకంతో మేలు చేకూరనుందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పది లక్షల ఎకరాలను స్థిరీకరించే ఈ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వ హయాంలోనే అంకురార్పణ జరిగిందని, సమగ్ర సర్వే కూడా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే జిల్లాలోని 18 మండలాలకు సాగు, తాగు నీరు అందుతుందని స్పష్టం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో టీఆర్ఆర్ మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు సర్వే పనులకు గత ప్రభుత్వం రూ.6.91 కోట్లు కేటాయించిందని, వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని కేసీఆర్ సర్కారు ప్రకటించడం జిల్లా రైతాంగానికి శుభపరిణామం అని అన్నారు. గండేడ్‌లో నిర్మించే 45టీఎంసీల జలాల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను ప్రతిపాదిస్తున్నారని, తద్వారా పరిగి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. బీడువారిన పొలాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్ధేశంతో దివంగత నేత వైఎస్ రాజ శేఖరరెడ్డి జూరాల-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాలనే యోచన చేశారని, అందులో భాగంగానే కిరణ్ సర్కారు ప్రాజెక్టు ప్రాథమిక సర్వేకు నిధులు విడుదల చేసిందని తెలిపారు. దాదాపు రూ.10వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదిస్తున్న ఈ పథకం అమలుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ప్రక టించారని గుర్తు చేశారు. -
కృష్ణమ్మకు జలకళ
ప్రకాశం బ్యారేజి నుంచి కాల్వలకు నీటి విడుదల ఇన్‌ఫ్లో : 28,001 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో : 18,430 క్యూసెక్కుల నీరు కృష్ణానదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజి నుంచి పంట కాలువలకు గురువారం నీరు విడుదల చేశారు. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్‌లో గురువారం సాయంత్రం ఆరుగంటల సమయానికి నీటిమట్టం 585.70 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో బాగా ఉండటంతో ప్రకాశం బ్యారేజి నుంచి నీరు విడుదల చేశారు. నీటి ఉధృతి అధికంగా ఉండటంతో బ్యారేజి గేట్ల నుంచి నీరు పొంగిపొర్లుతోంది. గతవారం నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద 9 అడుగులకు అటూఇటుగా నీటి మట్టం నిలకడగా ఉంటోంది. గురువారానికి నీటి మట్టం 12 అడుగులకు పెరిగింది. శుక్రవారం ఉదయానికి ఎగువ నుంచి 28,001 క్యూసెక్కుల నీరు బ్యారేజి వద్దకు రానుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో దిగువ మండలాల ఆయకట్టుకు ఇప్పటికీ నీరు అందని పరిస్థితి ఉంది. ప్రధానంగా నాగాయలంక, అవనిగడ్డ, కైకలూరు, కోడూరు మండలాల రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బ్యారేజి నుంచి గురువారం 18,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 10,248 క్యూసెక్కులు, బందరు కాల్వకు 2,311, ఏలూరు కాల్వకు 1,352, రైవస్ కాల్వకు 4,401 , కృష్ణా తూర్పు బ్లాక్‌కు 2,184, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వలకు 7,837 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. అలాగే గుంటూరు నగర తాగు నీటి అవసరాలకు వినియోగించే గుంటూరు చానల్‌కు 345 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కాగా పొంగి పొర్లుతున్న కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు సందర్శకులు బ్యారేజి వద్దకు తరలి రావడంతో సందడి నెలకొంది. - భవానీపురం -
జూరాలకు మళ్లీ వరద
వరద ఉధృతి తగ్గడంతో రెండు రోజుల క్రితం మూసివేసిన జూరాల ప్రాజెక్టు గేట్లను డ్యాం అధికారులు సోమవారం మళ్లీ ఎత్తారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తారు. ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. గత రెండురోజులుగా ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో ఉండడంతో క్రస్టుగేట్లను మూసివేసిన విషయం తెలిసిందే. సోమవారం పెరిగిన వరద ఆధారంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పీజేపీ అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి 7.30గంటల వరకు జూరాల నీటిమట్టం 1044 అడుగులు ఉంది. ప్రాజెక్టు 12 క్రస్టుగేట్ల ద్వారా 1.24 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 1613 అడుగులు ఉంది. ఈ ప్రాజెక్టుకు 1.20లక్షల ఇన్‌ఫ్లో ఉండగా, 20 క్రస్టుగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 1704 అడుగులు ఉంది. 85,375 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 5 క్రస్టుగేట్ల ద్వారా 1.15లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జెన్కో జలవిద్యుత్ కేంద్రంలోని ఆరుయూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. -
గ్రేటర్‌కు జూరాల జలాలు
-
గ్రేటర్‌కు జూరాల జలాలు
►కొత్త ప్రాజెక్టుకు జలమండలి శ్రీకారం ►సిద్ధమైన పథకం ఫైలు.. సీఎం ఆమోదమే తరువాయి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తరలించి శివారు ప్రాంత దాహార్తిని తీర్చేందుకు జలమండలి మరో బృహత్తర మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది. సుమారు 123 కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి నీటిని తరలించే ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు వ్యయం కాగలదని అంచనా. ఈ పథకం ద్వారా నగరానికి రోజువారీగా 90 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించాలన్నది లక్ష్యం. ఈ పథకానికి సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు పంపినట్లు తెలిసింది. ఆయన ఆమోదముద్ర పడడమే తరువాయి. కృష్ణా మూడోదశ.. గోదావరి మంచినీటి పథకాలతో పాటు ఇది నగరానికి ప్రత్యేక పథకం కానుంది. జూరాల-హైదరాబాద్ పథకం తీరిదీ.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. జూరాల నుంచి రామన్‌పాడు జలాశయానికి 0.388 టీఎంసీల నీటిని తరలించి అక్కడి నుంచి నగరానికి మంచినీటి సరఫరా చేయాలన్నది జలమండలి లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద 123 కిలోమీటర్ల మేర 2200 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్ స్టీల్ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో పంపింగ్ మెయిన్ 96 కిలోమీటర్లు, గ్రావిటీ మెయిన్ 27 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పథకం పనులను నాలుగు ప్యాకేజీలుగా చేపట్టాలని జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్యాకేజీల వారీగా పనుల వివరాలివీ.. ప్యాకేజీ-1: 35 కిలోమీటర్లు. రామన్‌పాడు నుంచి మూసాపేట్ వరకు 85 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మాణం ప్యాకేజీ-2: 27 కిలోమీటర్లు. మూసాపేట్ నుం చి జడ్చర్ల-150 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మాణం ప్యాకేజీ-3: 34 కిలోమీటర్లు. జడ్చర్ల నుంచి షాద్‌నగర్-90 మీటర్ల ఎత్తున లిఫ్ట్ నిర్మాణం ప్యాకేజి-4: 27 కిలోమీటర్లు. షాద్‌నగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓఆర్ఆర్ జంక్షన్ వరకు గ్రావిటీ (భూమ్యాకర్షణ శక్తి) ద్వారా నీటి తరలింపు అన్ని ప్రాంతాలకు నీటి సరఫరాకు.. రింగ్ మెయిన్1: జూరాల నుంచి తరలించిన నీటిని గ్రేటర్ నగరం నలుమూలలా సరఫరా చేసేందుకు ఓఆర్ఆర్ జంక్షన్- లింగంపల్లి వరకు మంజీరా సరఫరా నెట్వర్క్ పరిధిలోకి 30 కి.మీ. మేర నీటిని తరలించాల్సి ఉంటుంది. రింగ్ మెయిన్ 2: ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి ఉప్పల్, సైనిక్‌పురి మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు సుమారు 60 కి.మీ. మేర పైప్‌లైన్‌ను నిర్మించి నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. జంట జలాశయాలకూ జల కళ.. జూరాల నీటిని షాద్‌నగర్ మీదుగా లక్ష్మీదేవిపల్లి నుంచి గ్రావిటీ (భూమ్యాకర్షణ శక్తి) ఆధారంగా ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి ఆరాంఘర్ మీదుగా ఉస్మాన్‌సాగర్ (గండిపేట్), హిమాయత్ సాగర్లకు తరలించాలని ప్రతిపాదించారు. దీంతో జంట జలాశయాలు అన్ని కాలాల్లోనూ జలకళతో నిండుగా ఉండడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. టాటా కన్సల్టెన్సీకి ప్రతిపాదనల బాధ్యత జూరాల- హైదరాబాద్‌కు కృష్ణా జలాలను తరలించే ప్రాజెక్టుపై సమగ్ర ప్రతిపాదనలు, డిజైన్ సిద్ధం చేసే బాధ్యతలను జలమండలి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు అప్పగించనుంది. ఈ సంస్థ గతంలో కృష్ణా మొదటి, రెండు, మూడో దశ పథకాలకు డిజైన్లు, సమగ్ర ప్రాజెక్టు అంచనాలు సిద్ధం చేసిన విషయం విదితమే. -
అన్నదాత ఆశలు ఆవిరి
* ప్రధాన రిజర్వాయర్లలోకి చేరని నీరు * 250 టీఎంసీల మేర కొరత * అక్టోబర్ తర్వాతి పరిస్థితిపై అప్పుడే ఆందోళన * సాగు, తాగు నీటి కష్టాలు తప్పవంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో ప్రధాన ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆశించిన మేరకు వర్షాలు పడకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రెండు నెలలు గడుస్తున్నా వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకోకపోవడం రైతులను కలవరపెడుతోంది. ప్రస్తుతం రాష్ర్టంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాగునీటికీ కష్టాలు తప్పవటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తంగా 250 టీఎంసీల మేర నీటి కొరత ఉందని అధికారులు అంచనా వేశారు. కృష్ణాతో పోల్చితే గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో కొత్తగా చుక్క నీరు కూడా చేరడం లేదు. దీంతో శ్రీరాంసాగర్, సింగూర్, నిజాంసాగర్, దిగువ మానేరు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ఈ సీజన్‌కు ప్రాజెక్టులపరంగా115 టీఎంసీల మేర కొరత ఉండగా, కృష్ణాపై ఉన్న నాగార్జునసాగర్, జూరాలలో మరో 130 టీఎంసీల మేర నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. మరో 15 రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా కష్టతరంగా మారనుందని అధికారులే అంటున్నారు. ప్రాజెక్టుల తాజా పరిస్థితి సింగూరు: జంట నగరాల తాగునీటి అవసరాలను తీర్చడంలో ముందున్న సింగూరు నుంచి ఈ ఏడాది పొడవునా నీటి సరఫరా కష్టంగా మారనుంది. ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు ఏటా 6 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా, అందులో ఇప్పటికే గ్రావిటీ ద్వారా, మంజీరా పంపింగ్ ద్వారా 5.2 టీఎంసీల మేర నీటి సరఫరా జరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 0.8 టీఎంసీల బ్యాలెన్సింగ్ మాత్రమే ఉంది. మొత్తం సామర్థ్యం 30 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 11.26 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అక్టోబర్ తర్వాత రాజధాని తాగునీటి అవసరాలకు సింగూర్ జలాల పంపిణీ కష్టంగా మారనుంది. ఎస్సారెస్పీ: ఎస్సారెస్పీలో ఈ ఏడాది చుక్క నీరు కూడా కొత్తగా వచ్చి చేరలేదు. దీంతో 90.31 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గానూ కేవలం 20.75 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి సాధారణంగా ఏటా 5.5 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడతారు. కానీ ప్రస్తుత నిల్వలను బట్టి తాగునీటికి 4 టీఎంసీలు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీటి కటకట తప్పేలా లేదు. రానున్న రబీలో ప్రాజెక్టు పరిధిలోని 9.68 లక్షల ఎకరాల ఆయకట్టుపై ఆశలు పెట్టుకోవడం అత్యాశే. నాగార్జునసాగర్: సాగర్ జలాశయం పరిధిలోనూ గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎగువ నుంచి అంతా ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టులో 312.045 టీఎంసీల నిల్వ సామర్థ్యానికిగానూ 183.77 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో 6.50 లక్షల ఎకరాలకు గాను కేవలం 4 లక్షల ఎకరాలకే సాగు నీరిచ్చారు. ఇక ఆంధ్రా ప్రాంతంలో 14.50 లక్షల ఎకరాలకు గానూ 5.50 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. జూరాల: జూరాలలో పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ వారం రోజులుగా ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం 1383 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉండగా వెయ్యి క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. మండుతున్న రైతు గుండె అసలే వర్షాలు లేక కలవరపడుతుంటే.. కరెంటు కోతలూ తోడవడంతో రైతుల గుండెలు మండుతున్నాయి. అందుబాటులో ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేక మథనపడుతున్నారు. కళ్లముందే పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. అరకొర వర్షాలతో ఈసారి ఆలస్యంగా పనులు మొదలుపెట్టిన అన్నదాతలకు ఇది శాపంగా మారింది. కరెంటు లేక బోర్లు, బావుల్లో ఉన్న నీటిని కూడా వినియోగించుకోలేకపోతున్నారు. ఉచిత విద్యుత్ సరఫరాను ఏడు గంటల నుంచి ఆరు గంటలకు ప్రభుత్వం అధికారికంగానే కుదించింది. అయితే పేరుకే ఆరు గంటలు కానీ పట్టుమని రెండు మూడు గంటల కరెంటు కూడా అందడం లేదు. హైదరాబాద్‌లో 4 గంటలు, జిల్లా కేంద్రాల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటల పాటు సరఫరా నిలిపేస్తున్నారు. ఇక గ్రామాల్లోనైతే కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరిశ్రమలకూ వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలులో ఉంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరగడంతో రాష్ర్టవ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ డిమాండ్ అంచనాలను మించి ఉంటోంది. 19వ తేదీన రాష్ట్రంలో 147 మిలియన్ యూనిట్ల(ఎంయూ) డిమాండ్ నమోదు కాగా, సరఫరా మాత్రం 135 ఎంయూలకే పరిమితమైంది. పాతాళంలో భూగర్భ జలాలు రాష్ర్టంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు, బావులు వట్టిపోయాయి. దీంతో ఖరీఫ్ సీజన్లో గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. తాగునీటికి కటకట ఏర్పడుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భూగర్భ జలాలు పాతాళంలోకి వెళ్లిపోయాయి. తెలంగాణలోని ఏడు జిల్లాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది జూలై నెలలో ఆదిలాబాద్ జిల్లాలో 5.49 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యంకాగా.. ఈ ఏడాది జూలైలో 8.84 మీటర్లలోకి పడిపోయాయి. ఇదే కాలంలో నిజామాబాద్ జిల్లాలో 7.60 మీటర్ల నుంచి 10.85 మీటర్లకు, కరీంనగర్ జిల్లాలో 6.45 మీటర్ల నుంచి 9.08 మీటర్లకు.. ఖమ్మం జిల్లాలో 6.33 మీటర్ల లోతు నుంచి 8.70 మీటర్లకు చేరాయి. ఇక హైదరాబాద్‌లో 7.39 మీటర్ల నుంచి 9.59 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. మెదక్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోనూ భూగర్భజలాలు అడుగంటాయి. కాగా రాష్ట్రంలో ఈ సీజన్లో జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం(ఆగస్టు 20) నాటికి సాధారణంగా 517.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 231.3 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే ఏకంగా 55 శాతం లోటు కనిపిస్తుంది. -
జూరాల 27 క్రస్ట్‌గేట్ల ఎత్తివేత
ధరూరు: మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో సోమవారం స్వల్పంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు లక్షా 52 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, సోమవారం సాయంత్రం వరకు లక్షా 65 వేల క్యూసెక్కులకు చేరుకున్నట్లు చెప్పారు. రాత్రి 8గంటల వరకు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం 318.100 మీటర్లుగా ఉంది. లక్షా 65 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా 27 క్రస్టుగేట్ల ద్వారా లక్షా 41 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కర్ణాటకకు సరఫరా అవుతున్న ‘జూరాల’ విద్యుత్ గద్వాల: జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను తొలిసారిగా సోమవారం సాయంత్రం 4.20 గంటల నుంచి కర్ణాటకకు సరఫరా ప్రారంభమైంది. ఈ మేరకు గతంలో ఒప్పందం కుదిరింది. శ్రీశైలానికి వరద ఉధృతి: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరి గింది. జూరాల నుంచి 1,39,125 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1.70 లక్షల క్యూసెక్కుల నీరు సోమవారం శ్రీశైలం డ్యామ్‌కు చేరింది. -
కృష్ణా, తుంగభద్ర పరవళ్లు
* జూరాల నిండుకుండ * శ్రీశైలానికి జల సిరి.. 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో * తుంగభద్ర, సుంకేశుల డ్యాం గేట్ల ఎత్తివేత * సాగర్‌కు వస్తోంది 13,800 క్యూసెక్కులే సాక్షి యంత్రాంగం: కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కర్ణాటకలోని ప్రాజెక్టులు దాదాపు నిండిపోయాయి. ఫలితంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి దగ్గరవుతోంది. అందువల్ల 33 గేట్లను ఎత్తి రిజర్వాయర్‌లోకి చేరుతున్న నీటి పరిమాణానికి సమానంగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ఒక్క టీఎంసీ నీరు చేరితే జూరాల పూర్తిగా నిండుతుంది. దీంతో ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని యథావిధిగా కిందకు వదలిపెడుతున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1.46 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల నుంచే కాకుండా తుంగభద్ర నుంచి విడుదలైన నీరు రోజా గేజింగ్ పాయింట్ ద్వారా శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. జూరాల నుంచి 1,65,304 క్యూసెక్కులు, రోజా గేజింగ్ పాయింట్ నుంచి 46 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 11 టీఎంసీలకు పైగా నీరు డ్యాంలో చేరింది. పీక్‌లోడ్ అవర్స్‌లో విద్యుదుత్పాదన చేస్తూ నాగార్జునసాగర్‌కు 9,402 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సుంకేసుల జలాశయానికి కూడా భారీగా వరద నీరు వస్తోంది. సుంకేసులకు ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో 1.65 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో సుంకేసుల నుంచి 29 గేట్లు ఎత్తి తుంగభద్ర నది నుంచి శ్రీశైలం వైపునకు 1.10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అదే విధంగా కడప-కర్నూలు (కేసీ) కాలువకు 2,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఎగువ ప్రాజెక్టులన్నీ దాదాపు నిండే దశలో ఉన్న నేపథ్యంలో.. ఆ ప్రాంతాల్లో మరో వారం రోజులు వర్షాలు భారీగా కురిస్తే శ్రీశైలంలో నీటి మట్టం బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. నాగార్జునసాగర్‌కు అతి తక్కువగా 13,800 క్యూసెక్కుల నీరు వస్తోంది. మొత్తం మీద ఈ ఏడాది కంటే గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది ఇదే రోజుకు శ్రీశైలంలో 183 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌లోనూ 230 టీఎంసీల నీరు ఉంది. గోదావరి బేసిన్‌కు ఎగువున వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. తెలంగాణ, ఏపీలో వర్షాలు కురవడంతో దిగువున ధవళేశ్వరం వద్ద 1.90 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా..1.89 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. తుంగభద్ర తీరప్రాంతాల్లో హై అలర్ట్ తుంగభద్రకు భారీ వరద ఉధృతి కొనసాగుతోంది. భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆర్డీఎస్కు ఎగువనున్న కౌతాళం, కోసిగి పరిధిలో పత్తి, సజ్జ తదితర పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. తుంగభద్ర జలాశయానికి ప్రస్తుతం రెండు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని, దీంతో డ్యాంకున్న 33 గేట్లను ఎత్తి దిగువకు అదే పరిమాణంలో నీటిని వదులుతున్నట్లు తుంగభద్ర బోర్డు సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం సాయంత్రానికి కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతానికి వరదనీరు చేరుకుంది. మంత్రాలయం వద్ద వరద నీరు 1.45 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. భారీ ఎత్తున వరద నీరు వస్తుండటంతో కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్ నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖం చాటేస్తున్న అల్పపీడనం! సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముఖం చాటేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు రావాల్సిన ఈ అల్పపీడనం వాయవ్య, ఉత్తర బంగాళాఖాతం మీదుగా కోల్‌కతా తీరం వైపు పయనిస్తోంది. దీని ప్రభావం ఏపీ, తెలంగాణలపై ఉండబోవని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగడం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణలో కొన్ని చోట్ల జల్లులు పడొచ్చు. -
నిండుకుండలా జూరాల ప్రాజెక్టు
-
ఆగాలా... సాగాలా!
సాగునీటి విడుదలపై వీడని సందిగ్ధత శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండితేనే దిగువకు విడుదల ఆ నీరు ప్రకాశం బ్యారేజీకి చేరేందుకు 15 రోజుల సమయం పట్టే అవకాశం వర్షాలపైనే రైతుల ఆశలు కృష్ణాడెల్టాకు సాగునీటి విడుదలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఎగువున ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల తదితర ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండటంతో డెల్టా రైతుల్లో ఖరీఫ్‌పై ఆశలు చిగురి స్తున్నాయి. అయితే సాగునీరు విడుదల చేసే తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో డెల్టాతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. మచిలీపట్నం : జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా జూలై నెలాఖరుకు కేవలం 40 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. 5.89 లక్షల ఎకరాల్లో ఇంకా నాట్లు పూర్తికాలేదు. ఈ తరుణంలోనూ ప్రభుత్వం డెల్టాకు నీటి విడుదల అంశంపై మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటి వరకు కాలువలకు విడుదల చేసిన నీటిని తాగు అవసరాలకే వాడాలని నీటిపారుదల శాఖాధికారులు స్పష్టంచేశారు. జూలైలో వర్షంపైనే నమ్మకం పెట్టుకుని రైతులు నారుమడులు పోసుకున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో నారుమడులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. 25 వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా, మరో 15 వేల ఎకరాల్లో బోరునీటి ఆధారంగా వరినాట్లు పూర్తిచేశారు. నారుమడులతో పాటు వరినాట్లు పూర్తయిన పొలాలకు నీరు అందక పైరు చనిపోయే స్థితికి చేరుకుంది. ఈ దశలో జూలై ఆఖరి వారంలో కురిసిన వర్షాలకు నారుమడులు, నాట్లు పూర్తయిన పొలాల్లో పైరు జీవంపోసుకుంది. అయితే వరిసాగు సజావుగా సాగాలంటే కాలువలకు సాగునీరు విడుదల చేయాల్సిందేనని రైతులు కోరుతున్నారు. మరో 15 రోజులు ఆగాల్సిందేనా..! ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవటంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండాయని నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. జూరాల నుంచి లక్ష క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోందని పేర్కొంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు నీరు చేరాలి. అనంతరం నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సాగునీరు విడుదల జరగాలి. ఎగువ రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు కురిస్తేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం జరగాలంటే కనీసం 15 రోజుల సమయం పడుతుందని జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖాధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీరు ఉన్నా రాష్ట్ర విభజన నేపథ్యంలో డెల్టా ప్రాంతానికి ఎప్పటికీ సాగునీటి విడుదల చేస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణాడెల్టాలో ఖరీఫ్‌లో 80 టీఎంసీల నీరు సరిపోతుంది. అయితే పాలకులు మాత్రం సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తామనేది చెప్పకుండా డెల్టా రైతులకు మంచే జరుగుతుందని చెప్పి తప్పించుకుంటున్నారు. గత ఏడాదీ ఆలస్యం గానే సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులన్నీ నిండిన అనంతరం ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 350 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఈ ఏడాది ఇంత వరకు సాగునీటి విడుదలపై అధికారిక ప్రకటన చేయలేదు. అవసరమైన సమయంలో సాగునీటిని విడుదల చేయకుండా ఎగువ ప్రాజెక్టులన్నీ నిండిన అనంతరం ప్రకాశం బ్యారేజీ నుంచి సాగునీటిని సముద్రంలోకి వదిలే పరిస్థితి ఈ ఏడాదీ ఉంటుందనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. రెండో పంటపైనా ప్రభావం ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే రెండు నెలలు పూర్తయింది. కాలువలకు నీరు విడుదల చేయకపోవడంతో సముద్రతీరంలోని మండలాల్లో ఇప్పటికీ నారుమడులు పోస్తూనే ఉన్నారు. ఈ నెల 15వ తేదీనాటికి వరినాట్లు పూర్తి చేయకుంటే ఆ ప్రభావం రెండో పంటపైనా పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిసినా కాలువలకు నీరు విడుదల చేయకుంటే ఉపయోగం ఉండదని రైతులు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో వరినాట్లు పూర్తిచేస్తే నవంబర్ నాటికి పొట్టదశకు చేరుతుంది. ఈ నెలలో సంభవించే తుపానుల ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే పైర్ల దెబ్బతిని రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. వరినాట్లు ఆలస్యమై డిసెంబర్లో కోతలు పూర్తిచేస్తే రెండో పంట మినుముకు సాగు చేసేందుకు సమయం చాలదు. డిసెంబర్ వరకు వరికోతలు పూర్తి చేయకుంటే చలిగాలుల ప్రభావంతో వరికి తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుందని, పక్వానికి వచ్చిన కంకులకు మెడ విరుపు తెగులు వ్యాపిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి డెల్టాకు సాగునీటికి విడుదలకు కృషిచేయాలని కోరుతున్నారు. -
శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు
-
శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు..
శ్రీశైలం/గద్వాల/సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఎట్టకేలకు శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. జూరాల ప్రాజెక్టు నుంచి దిగువనున్న శ్రీశైలానికి బుధవారం సాయంత్రం నీరు విడుదలైంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండడంతో జూరాల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదనను అధికారులు ప్రారంభించారు. తద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 52.0555 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయ నీటిమట్టం 832.40 అడుగులుగా నమోదైంది. ఆలమట్టి నుంచి స్థిరంగా ఔట్ ఫ్లో.. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయం నుంచి దిగువకు ఔట్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం లక్షా పదివేల 500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. జలాశయంలో నీటిమట్టాన్ని 518.6 (గరిష్టం 519.6) మీటర్ల వద్ద కొనసాగిస్తున్నారు. మొత్తం 26కుగాను 16 గేట్లను ఎత్తివేశారు. దిగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,09,889 క్యూసెక్కులు వస్తుండగా ప్రాజెక్టులో 25 క్రస్టుగేట్లను 0.75 మీటర్లు తెరచి దిగువ నదిలోకి 96,295 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాలకు 99,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జూరాల రిజర్వాయర్ గరిష్టస్థాయికి చేరడంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను గురువారం తెరిచే అవకాశముంది. స్థిరంగా అల్పపీడనం సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉన్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. రేపు విజయవాడకు సచిన్ రాక సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ ఎంజీ రోడ్డులో రూ.125 కోట్లతో నిర్మించిన పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్‌ను శుక్రవారం ఉదయం ప్రఖ్యాత క్రికెటర్, ఎంపీ, భారతరత్న సచిన్ టెండూల్కర్ ప్రారంభించనున్నారు. బుధవారం పీవీపీ గ్రూప్స్ మేనేజింగ్ డెరైక్టర్ పొట్లూరి సాయిపద్మ ఈమేరకు వివరాలను వెల్లడించారు. -
పాలమూరు, జూరాల ప్రాజెక్టులపై సర్వే
నీటి పారుదల శాఖ సమీక్షలో సీఎం నిర్ణయం హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాల మూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టు పనులకు సర్వే నిర్వహించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సమర్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంబంధిత విభాగాలను ఆదేశించారు. నివేదికను సమర్పించేందుకు రెండు నెలల గడువు విధించారు. సర్వే, డీపీఆర్‌ల నిమిత్తం రూ.8.76 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సాగునీటి రంగంలో తొలి ప్రాధాన్యం మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులకే ఇస్తామని చెబుతూ వ స్తున్న తెలంగాణ సర్కార్ ఆ దిశగా తన కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదలశాఖ కార్యదర్శి అరవింద్రెడ్డిలతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. పాలమూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇందుకు సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తగిన నిధులు విడుదల చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. తొలుత సర్వే, డీపీఆర్‌ల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ.5.73 కోట్లు, జూరాల-పాకాల ప్రాజెక్టుకు రూ.3.03 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు సర్వే పనులను ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి, జూరాల-పాకాల పనులను వ్యాప్కోకు అప్పగించారు. రాష్ర్టంలోని కుటుంబాల సమగ్ర వివరాలతో డేటాబేస్ ఈ నెల రెండో వారంలో రాష్ర్టవ్యాప్తంగా చేపట్టనున్న ఆర్థిక, సామాజిక సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సర్వేతో తెలంగాణలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులు, సామాజిక పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి డేటాబేస్ రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. -
శోకసంద్రం
పెద్దమ్మను చూద్దామని ఒకరు.. అక్క కష్టసుఖాలను పంచుకుందామని మరొకరు.. మిత్రులను పలకరిద్దామని ఇంకొకరు..ఇలా వేసవి సెలవుల్లో ఒకరోజు హ్యాపీగా గడుపుదామని వచ్చిన వీరిని ‘కృష్ణమ్మ’ పొట్టనపెట్టుకుంది. గలగల పారుతున్న జూరాల నీళ్లను చూసి ఈత కొడదామన్న వారి సరదా అంతలోనే ప్రాణం తీసింది. ఒకరి తరువాత మరొకరు మునకేసిన నలుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. రాత్రివరకు గాలించినా వారి ఆచూకీ లభించలేదు. ఆర్తనాదాలు, రోదనలతో జూరాలతీరం శోకసంద్రంగా మారింది. ధరూరు/ఆత్మకూరు, న్యూస్‌లైన్: ఈత కోసం జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానదిలోకి దిగిన నలుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం జరి గింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం గద్వాల పట్టణంలోని శేరెల్లివీధిలోని మహిమూదాకు దగ్గరి బంధువులు. ఆమె కుటుం బసభ్యులను చూసేందుకు శనివారం వారు ఇక్కడికి వచ్చారు. రాత్రి ఇక్కడే గడిపి ఉదయం ఆత్మకూరులోని మరో బంధువులను చూసేందుకు జీపులో బయలుదేరి వెళ్లారు. అక్కడే భోజనం చేసి తిరిగి మధ్యాహ్నం గద్వాలకు తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని జూరాల ప్రాజెక్టును చూసి అక్కడే కొద్దిసేపు సేదతీరుదామని నిర్ణయిం చుకున్నారు. వేసవి కావడం, ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో వారు కుడికాల్వకు నీటిని విడుదల చేసే రెగ్యులేటరీ వద్దకు చేరుకున్నారు. మొదట షాకీర్ (17) ఈత కొట్టేందుకు కా ల్వలోకి దిగాడు. ఈత రాకపోవడంతో మునుగుతూ..తేలుతూ కనిపించాడు. ఇది గమనించిన సా బేర్ (20), మోసిన్(19), సమీర్(19)లు వెంటనే అతని కాపాడేందుకు కాల్వలోకి దూకారు. ఒకరి తరువాత మరొకరు నీటిలోకి జారుకుని కనిపించకుండాపోయారు. ఐదుగురిలో జుబేర్ అనే యువకుడు ఈతరాక కొట్టుమిట్టాడుతుండటంతో జాల ర్లు కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని గాలింపు చర్య లు ప్రారంభించారు. గజ ఈతగాళ్లతో గద్వాల సీఐ రఘు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. మట్టిలో కూరుకుపోయి ఉండొచ్చని, లేదా కుడికాల్వకు వదులుతున్న నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రా త్రి పొద్దుపోవడంతో శవాల వెలికితీత ఇబ్బందికరంగా మారడంతో పోలీసులు వెనుదిరిగారు. ఒకరి కోసం ఒకరు.. ఒకరి కోసం మరొకరు జూరాల కాల్వలోకి దిగి గల్లంతయ్యారు. మృతుల్లో సమీర్ గద్వాలకు చెందినవాడు. స్థానికంగా కార్పెంటర్‌గా పనిచేస్తూ తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. హైదరాబాద్‌కు చెందిన సాబేర్, మోసీన్, షాకీర్ లు అక్కడే చదువుకుంటున్నారు. వేసవి సెలవులు కావడంతో తన ఇంటికి వచ్చిన వీరిని సమీర్ ఆత్మకూర్‌లోని తనసోదరి హలీమా, బావ సర్దార్ ఇంటికి వెళ్లారు. అక్కడే భోజనాలు ముగించుకుని తిరుగుముఖం పట్టారు. మార్గమధ్యంలోనే పీజేపీ కాల్వలో యువకులు గల్లంతయ్యారు. ఈ విషయం తెలియడంతో సమీర్ అక్కాబావలు కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన స్థలానికి వెళ్లి బోరున విలపించారు. తన సోదరుడితో పాటు చిన్నాన్న కొడుకులు గల్లంతవడంతో హలీమా ఇంట్లో విషాదం అలుముకుంది. మిన్నంటిన రోదనలు కళ్ల ముందే ఉండి క్షణాల్లోనే నీటిలో మునిగి తమ పిల్లలు కనిపించకుండా పోవడంతో అక్కడే ఉన్న బంధువుల రోదనలు మిన్నంటాయి. రాత్రి కావడంతో బంధువులను గద్వాలలోని బంధువుల ఇంటికి తరలించేందుకు ప్రయత్నించగా..అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు లేనిదే ఎలా వెళ్లమంటారంటూ పోలీసులను ప్రశ్నించడంతో విషాదవాతావరణం నెలకొంది. -
‘జూరాల’లో నలుగురి మునక
ఒకరి మృతదేహం లభ్యం లభించని ముగ్గురి ఆచూకీ ధరూరు, న్యూస్‌లైన్: మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల రిజర్వాయర్‌లో నలుగురు మునిగి పోయారు. స్థానికులు, బాధితులు కథనం మేరకు.. హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతానికి చెందిన కుటుంబం గద్వాలలోని శేరెల్లివీధికి చెందిన మహిమూదా ఇంటికి శనివారం వచ్చింది. రాత్రి గద్వాలలోనే ఉండి ఆదివారం ఉదయం ఆత్మకూరులోని బంధువులను చూసేందుకు జీపులో వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గద్వాలకు తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలోని జూరాల ప్రాజెక్టును చూసి అక్కడే కొద్దిసేపు గడిపి వెళ్దామని ఆగారు. వేసవి కావడం, ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గి ఉండడంతో వారు కుడికాల్వకు నీటిని విడుదల చేసే రెగ్యులేటరీ వద్దకు చేరుకున్నారు. అక్కడ నీళ్లలో ఆడుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన షాకీర్ (17) మునిగిపోయాడు. గమనించిన తోటివారు సాబేర్ (20), మోసిన్ (19)తో పాటు గద్వాల పట్టణానికి చెందిన వారి బంధువుల అబ్బాయి సమీర్ (19) షాకీర్‌ను కాపాడబోయి ఒకరివెంట మరొకరు ఐదుగురూ నీటిలో మునిగిపోయారు. జుబేర్‌ను జాలర్లు కాపాడారు. రిజర్వాయర్‌లో ఒండ్రుమట్టి పేరుకుపోవడంతో పాటు యువకులకు ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. ఆదివారం రాత్రి వరకు షాకీర్ ఒక్కరి మృతదే హమే లభించింది. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు.. జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, న్యూస్‌లైన్: నీళ్లలోకి దిగి గల్లంతైన యువకుల ఉదం తం స్థానికంగా విషాదం నింపింది. బోరబండ సైట్-1కి చెందిన మహమ్మద్ కుమారులు సాబేర్, షాకిర్ పదో తరగతి పూర్తి చేశారు. షాకిర్ అమీర్‌పేటలోని చెప్పుల దుకాణంలో పనిచేస్తుండగా, సాబేర్ ఇంటి దగ్గరే ఉంటూ చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబానికి సహాయపడుతున్నాడు. అదే ప్రాంతంలో ఉండే వీరి సమీప బంధువు మోసిన్ (19) కూడా చెప్పుల షాపులో పనిచేస్తున్నాడు. వీరు ముగ్గురూ కలిసి శనివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో ఉండే పెదనాన్న ఇంటికి వెళ్లారు. ఆదివారం ఈత కొట్టడానికని సమీపంలోని జూరాల ప్రాజెక్టుకు వెళ్లి గల్లంతయ్యారు. వీరి తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన గద్వాల బయలుదేరి వెళ్లారు. -
ట్రయల్ రన్...నూరో ‘సారీ’..!
ధరూరు, న్యూస్‌లైన్ : నియోజకవర్గం లోని 184 గ్రామాలకు తాగు నీరందిం చేందుకు నిర్మించిన భారీ తాగునీటి పథ కం ట్రయల్న్ ్రమరో మారు విఫలమయింది. రూ. 72 కోట్ల వ్యయతో మం డల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ పనుల్లో భాగంగా 2008 ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ ట్రయల్న్ ్రనిర్వహిస్తూనే ఉన్నారు. దాదాపు వంద సార్లకు పైగానే ట్రయల్న్ ్రనిర్వహించడం...పగలడంతోనే సరిపోయింది. మంగళవారం రాత్రి నిర్వహించిన ట్రయల్న్‌త్రో ధరూరు- మన్నాపురం గ్రామాల మద్య పైప్‌లైన్ పగిలిపోయింది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గాని, సంబంధిత కాంట్రాక్టర్లు కాని పట్టించుకోక పోవడంతో రాత్రంతా నీరు వృధా అయింది. మండల కేంద్రానికి చెందిన చిన్న వెంకట్రామిరెడ్డి, అల్వలపాడు యామరెడ్డి, ర్యాలంపాడు తిమ్మప్ప, సవారన్న, వెంకటన్న, తదితర రైతుల పొలాలు నీట మునిగాయి. గత వారం రోజుల క్రితం వేసిన వరి నాట్ల తో పాటు, కూరగాయల తోటలు, వేరు శనగ పంట కట్టలు తెగి నీటిలో మునిగిపోయాయి. బుధవారం ఉదయం బాధిత రైతులు తమ పొలాలకు వెళ్లి చూడడంతో పంట నీట మునిగిన విషయాన్ని గమనించి లబోదిబోమన్నారు. పొలం గెట్లు కోతకు గురై ఇసుక మేటలు పెట్టాయి. దీంతో తీవ్ర నష్టం ఏర్పడింది. ఇసుక మేటలు పెట్టిన, నీట మునిగిన పంట నష్టం విలువ దాదాపు రూ. 2 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. స్థానిక విలేకర్లు పైపులు పగిలన ప్రాంతానికి చేరుకుని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ చేయడంతో పంపును నిలిపివేసి పైప్‌లైన్‌ను సరి చేస్తామన్నారు. నాసిరకం పైపులు వేయడం మూలంగా తరచూ పగిలిపోయి అటు రైతులకు, ఇటు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టాలను కొని తెస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్లైన్లు పగిలి తీవ్ర నష్టం జరిగిన రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతీ సారి ఇక్కడే పగులుతోంది ట్రయల్న్ ్రచేసిన ప్రతీసారి మా పొలాల వద్దనే పగులుతోంది. రాత్రి ట్రయల్న్ ్రచేయడం వల్ల పగిలిన పైప్‌లైన్‌ను గమనించలేకపోయాము. వేలకు వేలు ఖర్చు చేసి సాగు చేసుకున్న వరి పంట నీటిలో మునిగిపోయింది. తెల్లవారు జాము నుంచి ఫోన్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గెట్లు తెగిపోయాయి. పొలంలో ఇసుక మేటలు పెట్టాయి. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు. - యామరెడ్డి, రైతు అన్నదాతలపైనే అన్ని ఆటుపోటులు రైతులపైనే కక్ష తీర్చుకుంటున్నాయి. దానికి తోడు పైప్‌లైన్ పగుళ్లు తీవ్ర దెబ్బ తీస్తున్నాయి. తాగునీరందేది దేవుడెరుగు. కానీ అదే తాగునీటి పైప్‌లు రోజూ ఏదో ప్రాంతంలో పగులుతున్నాయి. నష్టాన్ని ఎవరు భరిస్తారు. అధికారులు మాత్రం మేమింతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. -తిమ్మప్ప, రైతు -
నత్తేనయం!
గద్వాల, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రధాన సాగునీటి వనరు కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టు పనులు మూడు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయకట్టు పరిధిలో ఫీడ ర్ చానెల్స్, డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కా ల్వ లు, ప్రధానకాల్వల వెంట పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. నిధుల కేటాయిం పులో పాలకుల అలసత్వం.. పనులు చే పట్టడంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణం గా ఆయకట్టుకు సకాలంలో సాగునీ టిని అం దించలేకపోతున్నారు. ఇలా సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు ఏటా న ష్టపోతూనే ఉన్నారు. జిల్లాలోని ఐదు ని యోజకవర్గాల పరిధిలో 1.07లక్షల ఎకరాలకు సా గునీటిని అందించాలనే లక్ష్యం తో 33 ఏళ్ల క్రితం ప్రారంభించిన జూరాల ను 1996 ఆగస్టు 5న జాతికి అంకితం చే శారు. కాగా, ఆయకట్టులో ఉన్న చివరి ప్రాంతాలైన కుడికాల్వ పరిధిలోని ఇటిక్యాల, మానవపాడు, ఎడమ కాల్వ పరి ధిలోని పెబ్బేరు, వీపనగండ్ల మండలాల పరిధిలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, ఫీడర్ చా నెల్స్ను పూర్తిస్థాయిలో ఆధునికరించాల్సి ఉంది. ఏటా చివరి ఆయకటుకు నీళ్లందకపోవడంతో రైతులు ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది. అ యి తే 1981 నుంచి ఇప్పటివరకు జూరాల ప్రా జెక్టు నిర్మాణం, కాల్వల ఆధునికీకరణ కో సం ప్రభుత్వం రూ.1568 కోట్లు ఖర్చుచేసింది. మరో రూ.495 కోట్లతో రూ. 2063 కో ట్ల అంచనా వ్యయానికి రివైజ్డ్ అంచనాకు అ నుమతి ఇవ్వాల్సిందిగా జూరాల అధికారు లు ప్రభుత్వాన్ని కోరారు. ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో ప్రభుత్వం నిధులి వ్వడం జూరాల ప్రాజెక్టు చరిత్రలో సా ధ్యం కాలే దు. మళ్లీ అరకొర నిధులు కే టాయించడం, పనులు పూర్తి కావడానికి మరికొన్నేళ్ల పాటు కాలయాపన కావడం తప్పదు. బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల కు నీటిని అందించే రిజర్వాయర్‌గా ఉన్న జూరాల పనులు ఇప్పట్లో పూర్తయ్యే ప రి స్థితులేవీ కనిపించడం లేదు. ప్రధాన కా ల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫీడర్ చానెల్స్, పి ల్ల కాల్వలు, కాల్వల వెంట రోడ్డు పనుల ను చేపట్టాల్సి ఉంది. అలాగే ఆయకట్టు గ్రామాల్లో పంచాయతీరాజ్ రోడ్లు, పునరావాస కేంద్రాల్లో తగిన సౌకర్యాలను కల్పించాలి. పునరావాస పనులకు ప్రతిపాదనలు గార్లపాడు-2, నాగర్‌దొడ్డి, ఉప్పేరు-3, అనుగొండ, అంకెన్‌పల్లి కొత్త పునరావాస కేంద్రాల్లో వసతుల కల్పనకు రూ.150 కో ట్లు. ఆయకట్టు పరిధిలో రోడ్ల నిర్మాణాని కి రూ.150 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లు, ఫీల్డ్ ఛానల్స్‌ల ఆధునికీకరణకు రూ.100కోట్లు. జూ రాల ప్రాజెక్టులో మిగిలిపోయిన పనుల కు రూ.95 కోట్లు కావాల్సిందిగా అధికారు లు రివైజ్డ్ అంచనాలు రూపొందించి ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జూరాల ప్రాజెక్టు వద్ద సౌకర్యాలు కనుమరుగు జూరాల ప్రాజెక్టు రాష్ట్రంలోనే అతి ఎక్కువ గా 67 క్రస్టుగేట్లతో నిర్మితమైంది. ప్రా జెక్టు సందర్శకులకు కనీసం నిల్వనీడలేని పరి స్థితి నెలకొంది. ప్రాజెక్టు అంచనాలో నే గా ర్డెన్లకు సంబంధించిన ప్రతిపాదన లు ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు నిధులు కే టాయించలేదు. గతంలో రూ.11.50 కోట్ల వ్యయంతో గార్డెన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు చేయకుండానే రద్దుచేశా రు. ఆ తర్వాత ఈ పనులను ఉద్యానవన శాఖకు బదిలీ చేసినా ఇప్పటివరకు అ తీ గతి లేదు. పెం డింగ్ పనులను పూర్తిచేసేందుకు సరైన నిధులు కేటాయిస్తేనే ఆ యకట్టు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. -
ప్రారంభమై నిలిచిపోయిన విద్యుదుత్పత్తి
ధరూరు, న్యూస్‌లైన్: జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్లో విద్యుదుత్పత్తి ప్రారంభమై నిలిచిపోయినట్లు జెన్కో అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 1835 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని, మంగళవారం సాయంత్రం 3 గంటలకు ఒక యూనిట్ విద్యుదుత్పత్తి నిమిత్తం ఆరువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు పీజేపీ అధికారి కృష్ణయ్య తెలిపారు. విద్యుదుత్పత్తి ప్రారంభానికి ముందు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం 318.50 మీటర్లుగా ఉండగా, రాత్రి 7 గంటల వరకు 318.45 మీటర్లకు తగ్గడంతో విద్యుదుత్పత్తిని నిలిపి వేశామని చెప్పారు. ఆయకట్టు రైతులకు కుడి, ఎడమ కాల్వల ద్వారా 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నీటి మట్టం 491.246 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఔట్‌ఫ్లో లేవన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటి మట్టం 517.200 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్‌ఫ్లో లేవని, విద్యుదుత్పత్తి ద్వారా 6వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
లోయర్ జూరాల ట్రయల్న్‌క్రు నీటి విడుదల
ధరూరు, న్యూస్‌లైన్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న లోయర్ జూరాలలో నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న విద్యుదుత్పత్తి యూనిట్ల ట్రయల్న్ ్రనిమిత్తం పీజేపీ అధికారులు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీటిని విడుదల చేసినట్లు పీజేపీ అధికారి కృష్ణయ్య తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రార ంభమైన ప్రాజెక్టు దిగువన లోయర్ జూరాల నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయి ట్రయల్న్‌క్రు సిద్ధం చేశారు. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోయినప్పటికీ ట్రయల్న్ ్రకోసం 3వేల క్యూసెక్కుల నీటిని ఎగువన ఉన్న జెన్కో జలవిద్యుత్ కేంద్రంలోని 1వ యూనిట్ ద్వారా దిగువకు విడుదల చేశారు. దీంతో ఈ యూనిట్లో 15 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయినట్లు జెన్కో అధికారులు చెప్పారు. రాత్రి ఏడు గంటల వరకు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం 318.40 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 1350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, కుడి కాల్వ ద్వారా 350 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 491.600 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఎలాంటి ఔట్‌ఫ్లో లేదు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 517.490 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లోలు లేవని, 6వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి విడుదల చేస్తున్నారు. -
ముచ్చటగా మూడేళ్లు..!
జిల్లాలో కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేసిన 17ఏళ్ల తరువాత మరమ్మతులకు ప్రభుత్వం ఉపక్రమించింది. గత మూడే ళ్లుగా కొనసాగుతున్న ఈ పనులను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఐదు క్రస్టుగేట్ల ఇనుప తాళ్ల మార్పునకు రూ.38 లక్షలతో గత రెండురోజుల క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. త్వరలోనే ఈ పనులను చేపట్టనున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి ప్రాజెక్టు క్రస్టుగేట్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా, నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. కిలోమీటర్ మేర ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం చేయడంతోపాటు, 67 క్రస్టుగేట్లను అమర్చారు. ప్రతి ఐదేళ్లకోసారి క్రస్టు గేట్ల రబ్బర్ బీడింగ్లను మార్చడం, తుప్పు పట్టకుండా కలర్ వేయడం, ఇనుప తాళ్ల నిర్వాహణ తదితర మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇవేవీ చేపట్టకపోవడంతో గత మూ డేళ్లుగా 50 గేట్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. దీని కితోడు 2012 రబీ సీజన్లో నారాయణపూ ర్ ప్రాజెక్టు నుంచి రీజనరేట్ వాటర్ రాకపోవడంతో ఆయకట్టుకు నీళ్లివ్వలేని పరిస్థితి ఏర్పడింది. లీకేజీల రూపంలో ఉన్న నీరం తా దిగువనదిలోకి పోవడంతో రైతులు ఆం దోళనకు దిగారు.స్పందించిన ప్రభుత్వం క్ర స్టుగేట్ల మరమ్మతులకు టెండర్లను పిలిచింది. మరమ్మతులకు టెండర్లు మొదటి దశ టెండర్లలో ముంబాయికి చెందిన కంపెనీ ముందుకు రాగా, గతేడాది ఫిబ్రవరి వరకు కేవలం 50 క్రస్టుగేట్లకు మాత్రమే మరమ్మతులు చేయగలిగారు. మిగిలి ఉన్న క్రస్టుగేట్ల మరమ్మతులతోపాటు, ఐదు క్రస్టుగేట్ల ఇనుప తాళ్ల మార్పునకు రూ.38 లక్షలతో గతనెల క్రితం టెండర్లు పిలిచి రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. వచ్చే ఫిబ్రవరి నాటికి క్రస్టుగేట్ల మరమ్మతులను పూర్తి చేసి రిజర్వాయర్ నీళ్లు లీకేజీల ద్వారా దిగువకు వెళ్లకుండా పూర్తిస్థాయి నీటి కట్టడి చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై జూరాల క్రస్టు గేట్ల నిర్వాహణ డివిజన్ ఈఈ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఐదు క్రస్టుగేట్లకు రోప్‌లను మార్చే టెండర్లను పూర్తి చేశామని, పూర్తి స్థాయిలో రబ్బర్ బీడింగ్ల ఏర్పాటు కూడా ఫిబ్రవరి నాటికి పూర్తి చేసే విధంగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. -
పాలమూరు ఎత్తిపోతల రూపశిల్పి ధర్మారెడ్డి
పాన్‌గల్, న్యూస్‌లైన్: పాలమూరు జి ల్లాలో పలు ఎత్తిపోతల సృష్టికర్త, అలా గే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపశిల్పి..రిటైర్డ్ ఇంజనీర్ అ లూపూర్ ధర్మారెడ్డి దశదినకర్మ ఆది వా రం మండల పరిధిలోని కల్వరాల గ్రా మంలో నిర్వహించనున్నరు. పాల మూ రు ఎత్తిపోతల పథకం రూపకల్పన..అ నుమతులు, నిధులు సాధించేం దుకు అవిశ్రాంతంగా కృషిచేసిన ఆయ న అ నారోగ్యం కారణంగా ఈనెల 14వ తేదీ న హైదరాబాద్‌లో కనుమూశారు. మం డలంలోని కల్వరాల గ్రామంలో జ న్మిం చిన ధర్మారెడ్డి ఇరిగేషన్‌శాఖలో ఏఈగా పనిచేశారు. పదవీకాలం ముగిసిన నా టినుంచి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరంలో క్రియాశీలక పాత్ర పోషిం చారు. 2006 నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం ప్రతిపాదనలు కొ నసాగుతూనే ఉన్నాయి. కల్వకుర్తి, నె ట్టెంపాడు, భీమా పథకాలను పరిశీ లిస్తూనే ఇంజనీర్స్ ఫోరం ఆధ్వర్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి వరద జలాల్లో 70 టీఎంసీల నీటిని జిల్లాలోని షాద్‌నగర్ వరకు వివిధ దశల్లో ఎత్తిపోస్తూ మ హబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జి ల్లాల్లోని 56 దుర్భిక్ష మండలాలకు నీ రివ్వగల పథకానికి రూపకల్పన చేశా రు. వీరిలో అగ్రగణ్యులు దివంగత ధ ర్మారెడ్డి. ఈ పథకం మొదట షాద్‌నగర్ ఎత్తిపోతలుగా మొదలై, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలుగా రూపుదాల్చిం ది. 2006- 2009 వరకు ఈ పథకంపై జరిగిన అన్ని పోరాటాల్లో ధర్మారెడ్డి పాల్గొన్నారు. 2009లో కొడంగల్ ఎన్నికల సభలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చి న తరువాత, 2013 ఆగస్టు 8న జీఓ సా ధించేకునేవరకు ప్రతి కార్యక్రమంలో నూ ఆయన పాల్గొన్నారు. అలాగే 2012 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల పా టు జిల్లాలో పర్యటించిన సమయంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రయోజనాలపై సీఎంకు వివరించి అనుమతులు సాధించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. ఆదివారం జరిగే వర్ధంతి కార్యక్రమానికి తెలంగాణ రిటైర్డు ఫోరం నాయకులు, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌తో పాటు కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరుకానున్నట్లు ధర్మారెడ్డి కుటుంబసభ్యులు తెలిపారు. -
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
విశాఖ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటిమట్టం 884.80 అడుగులకు చేరడంతో 5 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు కు నీరు విడుదల చేస్తున్నారు. నిన్న లక్ష 39 వేల 685 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జూరాల, తుంగభద్రల నుంచి 2 లక్షల ఒక వెయ్యి 462 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. విద్యుత్ ఉత్పాదన అనంతరం సాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 213.8 టీఎంసీలు కాగా జలాశయం నీటిమట్టం 884.70 అడుగులుగా నమోదైంది. మరోవైపు కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా 33.298 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన జరిగిందని అధికారులు తెలిపారు. శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీటితో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరుకోవడంతో... 16గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2లక్షల 9వేల క్యూసెక్కులు... ఔట్ ఫ్లో లక్షా 86వేల క్యూసెక్కులు ఉంది. -
వీడని గ్రహణం
గద్వాల, న్యూస్‌లైన్: ఏ ముహూర్తంలో జూరాల భారీ తాగునీటి పథకానికి శ్రీకా రం చుట్టారో తెలియదు కానీ గ్రహణం వీడటం లేదు. ఒకచోట తప్పితే మరోచో ట పైపులకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఈ పథకంలో కీలకమైన కొండగట్టు రిజర్వాయర్ నుంచి పంపిణీలైన్ ద్వారా మొదటి దశలో 31 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ట్రయల్న్‌న్రు గత నెలలో ప్రారంభించారు. నాటినుంచి ఇప్పటివరకు పది చోట్ల పైపులకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మన్నాపూరం వద్ద మరో లీకేజీ ఏర్పడింది. కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పంప్‌హౌస్ నుంచి కొండగట్టు వరకు 70చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. చివరికి పైపులను పూర్తిగా తొలగించి, డీఐ పైపులు వేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. హైదరాబాద్‌లో పైపులకు సంబంధించిన డిజైన్ అప్రూవల్ ఏ అంచనాల మేరకు చేశారో తెలియదు కానీ జూరాల తాగునీటి పథకం ఏడాదిగా గు క్కెడు నీళ్లు ఇవ్వలేనిస్థితిలో ఉంది. జూ రాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 184 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో 2005లో భారీ తాగునీటి పథకానికి మంజూరుఇచ్చారు. మొదట హడ్కో నిధులతో ఈ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, *110 కోట్ల వ్యయంతో పూర్తి చేసేందుకు సీఎం ఫండ్ నుంచి కొంత, ప్రపంచబ్యాంక్ నిధుల నుంచి మరికొంత సర్దుబాటుచేసింది. ఇంతచేసినా గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పథకం నుంచి నీటిని విడుదల చేసేందుకు అన్ని పనులు పూర్తిచేశారు. ఈ మేరకు సీఎం చేత మంచినీటి పథకాన్ని ప్రారంభోత్సవం చేయించాలని నిర్ణయించి, పైపులైన్లలో పగుళ్లు ఏర్పడటంతో వాయిదా వేశారు. జూరాల రిజర్వాయర్ వద్ద ఉన్న పంప్‌హౌస్ నుంచి కొండగట్టు వరకు నాలుగున్నర కిలోమీటర్ల పైపులైన్లలో ఏర్పడిన పగుళ్లతో చివరకు మే నెలలో పైపులనే తొలగించేశారు. ఆదిలోనే హంసపాదు ఈ లైన్ ట్రయల్న్ ్రనిర్వహించి విజయవంతమైందని, కొండగట్టుపై ఉన్న రిజర్వాయర్‌కు నీటిని అందించామని అధికారులు సంతోషపడ్డారు. కొండగట్టు నుంచి పైప్‌లైన్‌కు ఇప్పటికి పదిచోట్లకు పైగా పగుళ్లు ఏర్పడ్డాయి. బాగుచేయడం, ట్రయల్న్ ్రనిర్వహించడం, మరో చోట పగుళ్లు ఏర్పడడం ఇలా డిస్ట్రిబ్యూషన్ లైన్ పగుళ్లతో గ్రామాలకు నీళ్లను అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ డీఈ మేఘారెడ్డిని వివరణ కోరగా.. డిస్ట్రిబ్యూషన్ లైన్లో ట్రయల్న్ ్రనిర్వహిస్తున్నామని తెలిపారు. పగుళ్లు సాధారణమేనని, త్వరగా వీటన్నింటిని బాగుచేసి మొదటి దశ గ్రామాలకు తాగునీటిని అందిస్తామన్నారు. 24 గ్రామాలకు నిలిచిన నీటి సరఫరా శాంతినగర్, న్యూస్‌లైన్: వడ్డేపల్లి మం డలం రాజోలి గ్రామంలో నిర్మించిన రా జోలి తాగునీటి పథకం నుంచి గురువా రం 24 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రాజోలి సమీపంలో తుంగభద్ర నదిలో నిర్మించిన ఇంటెక్‌వెల్‌కు నీరు అందకపోవడంతోనే సమస్య తలెత్తిందని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తెలిపా రు. 10 రోజుల క్రితం ఇలాగే పూర్తిగా నీటిని దిగువకు విడుదల చేయగా ఒకరోజు మోటార్లు నిలిపేయడంతో సమస్య తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. రెండోసారి సమస్య పునరావృతమైందని, దీంతో శుక్రవారం నీటిని సరఫరా చేయలేమని చెప్పారు. ఈ విషయమై బ్యారే జీ వర్క్ఇన్స్పెక్టర్ మునిస్వామిని వివరణ కోరగా.. ఎగువనుంచి ఇన్‌ఫ్లో భారీగా వ స్తున్న సమయంలో బ్యారేజీ భద్రత దృ ష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిగువకు నీటిని విడుదల చేస్తామన్నారు. -
జూరాలకు స్వల్పంగా తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు, న్యూస్‌లైన్ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు బుధవారం ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారి కృష్ణయ్య తెలిపారు. మంగళవారం రాత్రి ప్రాజెక్టుకు 59, 730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, బుధవారం రాత్రి 7.30 గంటల వరకు జూరాల ప్రాజెక్టుకు 53, 947 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. దీంతో ప్రాజెక్టు ఆరు క్రస్టు గేట్లను ఒక మీటరు, రెండు క్రస్టు గేట్లను అర మీటర్ చొప్పున ఎత్తి 29,212 క్యూసెక్కుల నీటినినదిలోకి విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రంలోని మూడు యూనిట్ల విద్యుదుత్పత్తి నిమిత్తం 24వేల క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటి నిమిత్తం 1100 క్యూసెక్కుల నీరు, మొత్తం ప్రాజెక్టు నుంచి 54, 312 క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటి మట్టం 492.110 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 12143 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, విద్యుదుత్పత్తి యూనిట్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటి మట్టం 519.400 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లేవని విద్యుదుత్పత్తి యూనిట్ల ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి... జెన్కో జలవిద్యుత్ కేంద్రంలోని మూడు యూనిట్లలో రెండు రోజులుగా నిరవధికంగా విద్యుదుత్పత్తి కొనసాగుతున్న జెన్కో అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం వరకు జలవిద్యుత్ కేంద్రంలోని 1,4 యూనిట్లు కొనసాగుతుండగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆరవ యూనిట్ సాంకేతిక లోపాలను సరిచేసుకొని అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మూడు యూనిట్లలో పూర్తి స్థాయిలో 117 మెగా వాట్ల విద్యుదుత్పత్తి అవుతున్నట్లు అధికారులు వివరించారు. -
కళకళలాడుతున్న జూరాలా ప్రాజెక్టు