తొలకరి జల్లులతో హైదరాబాద్ నగరం పులకించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం చల్లబడింది. భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు లాక్‌డౌన్ సమయం పెంచడంతో హైదరాబాద్ రహదారులపై సందడి పెరిగింది. కాగా, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతోంది.
1/10
ఆదిలాబాద్ పట్టణాన్ని గురువారం మిట్టమధ్యాహ్నం కారుమబ్బులు ఇలా కమ్మేశాయి. పట్టణమంతా ఒక్కసారిగా చీకటిగా మారింది. మేఘాలు పట్టణంపై పడతాయా అన్నట్లుగా ఉన్న మబ్బులను పట్టణ ప్రజలు ఆసక్తిగా చూశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
2/10
నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి భారీ వర్షం పడింది.
3/10
హైదరాబాద్: గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ సీటీసీ ప్రాంగణంలో గురువారం ‘ఫ్యామిలీ టీకా డ్రైవ్’ను ప్రారంభించిన పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్.
4/10
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం 16,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు యూనిట్లలో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని జెన్‌కో డీఈ ప్రభాకర్ తెలిపారు. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.521 టీఎంసీల నిల్వ ఉంది.
5/10
ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద గురువారం గంభీరంగా కనిపిస్తున్న వాతావరణం
6/10
కెనడాలోని టొరంటోలో గురువారం సంభవించిన సూర్యగ్రహణం దృశ్యమిది. ఈ అద్భుత దృశ్యం కెనడా తదితర దేశాల్లో గోచరమయింది.
7/10
అమెరికాలోని అరిజోనా రాష్ట్రం యుమాలో సరిహద్దు గోడ ఖాళీకి ఆనుకుని ఉన్న రాతి కాల్వ నుంచి బయటకు రావడానికి సాయం అందుకుంటున్న హైతీ వలసదారు.
8/10
కోవిడ్–19పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా కోల్‌కతాలోని తల్లి, ఆమె పిల్లల విగ్రహాలకు తొడిగిన మాస్క్‌లు
9/10
ఢిల్లీలోని యమునా ఖాదర్ మయూర్ విహార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పంచ్‌శీల్ శిక్షణ్ సంస్థాన్‌లో ఆరుబయట ట్యూషన్ తరగతులకు హాజరైన మురికివాడల బాలలు.
10/10
పగటిపూట లాక్‌డౌన్ సడలించడంతో హైదరాబాద్‌లో తొలిరోజు ప్రశాంత వాతావరణం కనిపించింది. మొజాంజాహీ మార్కెట్ వద్ద పైన మెట్రో రైలు.. కింద వాహనాల పరుగులు తీసుస్తున్న దృశ్యం.
Comments
Please login to add a commentAdd a comment