ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న లోయర్ జూరాలలో నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న విద్యుదుత్పత్తి యూనిట్ల ట్రయల్న్‌క్రు పీజేపీ అధికారులు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ధరూరు, న్యూస్‌లైన్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన ఉన్న లోయర్ జూరాలలో నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న విద్యుదుత్పత్తి యూనిట్ల ట్రయల్న్ ్రనిమిత్తం పీజేపీ అధికారులు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీటిని విడుదల చేసినట్లు పీజేపీ అధికారి కృష్ణయ్య తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రార ంభమైన ప్రాజెక్టు దిగువన లోయర్ జూరాల నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తయి ట్రయల్న్‌క్రు సిద్ధం చేశారు. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోయినప్పటికీ ట్రయల్న్ ్రకోసం 3వేల క్యూసెక్కుల నీటిని ఎగువన ఉన్న జెన్‌కో జలవిద్యుత్ కేంద్రంలోని 1వ యూనిట్ ద్వారా దిగువకు విడుదల చేశారు. దీంతో ఈ యూనిట్‌లో 15 మెగావాట్ల విద్యుదుత్పత్తి అయినట్లు జెన్‌కో అధికారులు చెప్పారు. రాత్రి ఏడు గంటల వరకు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం 318.40 మీటర్లుగా ఉంది.
ప్రాజెక్టుకు 1350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, కుడి కాల్వ ద్వారా 350 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 491.600 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఎలాంటి ఔట్‌ఫ్లో లేదు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 517.490 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లోలు లేవని, 6వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి విడుదల చేస్తున్నారు.