జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి విడుదలవుతున్న వరద
: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మంగళవారం 22వేల క్యూసెక్కుల వరద రావడంతో మూడు యూనిట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 24వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
జూరాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మంగళవారం 22వేల క్యూసెక్కుల వరద రావడంతో మూడు యూనిట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 24వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 1000 క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పంప్‌ల ద్వారా 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు 315 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు.
జూరాల నుంచి మొత్తం 27,615 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.5 టీఎంసీలుగా నీటినిల్వను నిర్వహిస్తున్నారు. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 129.19 టీఎంసీలుగా ఉంది. పై నుంచి 25,420 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా విద్యుదుత్పత్తి ద్వారా అదేస్థాయిలో దిగువ నదిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36.67 టీఎంసీలుగా నీటినిల్వ ఉంది. ప్రాజెక్టుకు 20,992 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా విద్యుదుత్పత్తి, ప్రధాన కాలువల ద్వారా 20,250 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 40.72 క్యూసెక్కులుగా నీటినిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 7195 క్యూసెక్కులు వస్తుండగా కాలువ ద్వారా 6222 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.