జూరాల 27 క్రస్ట్‌గేట్ల ఎత్తివేత
ధరూరు: మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో సోమవారం స్వల్పంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టుకు లక్షా 52 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, సోమవారం సాయంత్రం వరకు లక్షా 65 వేల క్యూసెక్కులకు చేరుకున్నట్లు చెప్పారు. రాత్రి 8గంటల వరకు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం 318.100 మీటర్లుగా ఉంది. లక్షా 65 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా 27 క్రస్టుగేట్ల ద్వారా లక్షా 41 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కర్ణాటకకు సరఫరా అవుతున్న ‘జూరాల’ విద్యుత్
గద్వాల: జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను తొలిసారిగా సోమవారం సాయంత్రం 4.20 గంటల నుంచి కర్ణాటకకు సరఫరా ప్రారంభమైంది. ఈ మేరకు గతంలో ఒప్పందం కుదిరింది.
శ్రీశైలానికి వరద ఉధృతి: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరి గింది. జూరాల నుంచి 1,39,125 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1.70 లక్షల క్యూసెక్కుల నీరు సోమవారం శ్రీశైలం డ్యామ్‌కు చేరింది.