ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద మొదలైంది. గురువారం సాయంత్రం 55 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా..శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి 89 వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఉదయం 20 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయగా...సాయంత్రం నాలుగు గేట్లను, రాత్రి మరో ఆరు గేట్లు మూసివేసి ప్రాజెక్టు 10 క్రస్టు గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జన్‌కోజల విద్యుత్ కేంద్రంలో 11 యూనిట్లలో విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు.
దిగువకు 81,912 క్యూసెక్కుల నీరు
క్రస్టు గేట్ల ద్వారా 41,400 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి కోసం 37,237 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 95, నెట్టెంపాడుకు 1,500 , కుడి కాల్వకు 500, ఎడమ కాల్వకు 550, కోయిల్‌సాగర్‌కు 630, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 100, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు..ఇలా మొత్తం ప్రాజెక్టు నుంచి 81,912 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్‌కు 69,132 క్యూసెక్కుల నీరు
జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.132 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా...ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 30,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 6వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేçశుల, హంద్రీ నుంచి 1,14,689 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఎడమ, కుడి భూగర్భ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 69,132 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment