ధరూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగింది. నీటి ప్రవాహం తగ్గడంతో రెండ్రోజుల క్రితం గేట్లు మూసివేయగా..బుధవారం ఉదయం నుంచి ఇన్‌ఫ్లో పెరిగింది. రాత్రి 10 గంటల సమయంలో ప్రాజెక్టుకు 95వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..పది క్రస్టు గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి 39,580 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు.
అదేవిధంగా 12 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 38,864 క్యూసెక్కులు వదులుతుండగా..మొత్తంగా జూరాల నుంచి 83,077 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 7.836 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలం జలాశయానికి జూరాల క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 78,444 క్యూసెక్కులు, సుంకేసుల ద్వారా 886 క్యూసెక్కులు మొత్తం 79,330 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 854.40 అడుగులమేర 90.348 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment