
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 7గంటల వరకు కేవలం 317 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 161 క్యూసెక్కులు క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 388 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.048 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment