jurala dam
-
నేడు మల్లన్న చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం/నాగార్జునసాగర్: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణమ్మ శనివారం చేరుకోనుంది. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యా మ్ల నుంచి విడుదల చేస్తున్న వరద ప్రవాహం శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. జూరాలలో విద్యుత్ కేంద్రం, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం వర ద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. పశి్చమ క నుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా ప్రధాన పా యలో శుక్రవారం వరద మరింత తగ్గింది.ఆల్మట్టి డ్యామ్‌లోకి 43,478 క్యూసెక్కుల నీరు రాగా, గేట్లు ఎత్తి 65,480 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 65,801 క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 70,780 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి దిగువకు 34,818 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తుండటంతో నీటి నిల్వ 33.11 టీఎంసీలకు తగ్గింది. నాగార్జునసాగర్‌లోకి వరద ప్రవాహం చేరడం లేదు. సాగర్ కుడి కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా 8,165 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 123.5 టీఎంసీలకు తగ్గింది. నేడు తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశంకృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,08,270 క్యూసెక్కుల రా కతో నీటి నిల్వ 58.67 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర బే సిన్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని సీడబ్ల్యూసీ ) అంచనా వేసింది. వరద ఇలానే కొనసాగితే నాలుగు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుంది. సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలనాగార్జునసాగర్ జలాశయం నుంచి ఎడమకాల్వ ద్వారా అధికారులు శుక్రవారం 4వేల క్యూసెక్కులకు నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీలోని వివిధ జిల్లాలకు గత రెండు రోజుల నుంచి నిత్యం 5,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం వద్ద 8.500 మీటర్ల ఎత్తులో నీటిప్రవాహంతెలంగాణలోని గోదావరి, మహారాష్ట్రలో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగింది. అన్నారం(సరస్వతీ) బరాజ్ వద్ద మానేరు వాగు నుంచి 15 వేల క్యూసెక్కుల వరద రాగా, బరాజ్‌లోని మొత్తం 66 గేట్లు పూర్తిగా పైకి ఎత్తి నీటిని దిగు వకు వదిలారు. ఆ వరద నీరు దిగువన కాళేశ్వరం వద్ద కలు స్తోంది. గడ్చిరోలి జిల్లా మీదుగా ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. ఆ నీరంతా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కలుస్తుండడంతో పుష్కరఘాట్లను తాకుతూ వరద దిగువకు తరలిపోతోంది. పుష్కర ఘాట్ల వద్ద 8.500 మీటర్లు ఎత్తులో నీటిప్రవాహం కొనసాగుతోంది. అక్కడినుంచి మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు వరద తాకిడి పెరుగుతోంది. బరాజ్ వద్ద 3.73 లక్ష ల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది.బరాజ్‌లో మొ త్తం 85 గేట్లు పైకి ఎత్తి వచి్చన వరదను వచి్చనట్టు దిగువకు తరలిస్తున్నారు. దిగువన తుపాకులగూడెం బరాజ్‌లోకి 3,75, 430 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదిలారు. దుమ్ముగూడెం(సీతమ్మసాగర్)లోకి 3,47,511 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్దకు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 3.75 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం(సముద్ర మట్టానికి) 40.2 మీటర్లకు వరద చేరింది. -
జూరాలకు స్వల్ప ఇన్‌ఫ్లో...
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 7గంటల వరకు కేవలం 317 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 67 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 161 క్యూసెక్కులు క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 388 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 768 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టిం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.048 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. -
శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద
సాక్షి, కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి నిలకడగా నీరు చేరుతోంది. వరద తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినా ఇప్పటకీ అత్యధికంగానే నీరు వస్తోంది. జూరాల స్పిల్ వే నుంచి 7,11,782 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 98,516 క్యూసెక్కులు కలుపుకొని మొత్తంగా 8,10,298 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ నుంచి పది గేట్ల ద్వారా 7,46,383 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్ననాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కాగా, జూరాలకు ఎగువ ప్రాంతాల నుంచి 7,16,000 క్యూసెక్కులు నీరు వస్తోంది. 55 గేట్ల ద్వారా శ్రీశైలానికి 7,17,910 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 5.928 టీఎంసీలు ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ఉంటే ప్రస్తుతం నీటి నిల్వ మట్టం 316.49 మీటర్లు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివరాలు : ఇన్ ఫ్లో.. 7,55,850 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో.. 5,15,433 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం..590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం.. 582 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 288 టీఎంసీలు. -
తెలంగాణలోకి ప్రవేశించిన కృష్ణా జలాలు
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కర్ణాటకలోని నారాయణపుర్ జలశయం నుంచి విడుదల చేసిన కృష్ణా జలాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. సోమవారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లాలోకి చేరుకున్నాయి. మండు వేసవిలో తాగు నీటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణానది జలాలు తరలి వస్తున్నాయి. పాలమూరు ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను అధిగమించడానికి కేసీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రితో నడిపిన దౌత్యం కారణంగా మూడు రోజుల క్రితం నారాయణపుర్ నుంచి జూరాలకు నీటిని విడుదల ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి కృష్ణా జలాలు జూరాల జలశయానికి చేరనున్నాయి. నారాయణపేట ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి మొదట నారాయణపురకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నారాయణపుర డ్యాం నుంచి జూరాలకు నీటి విడుదల జరుగుతోంది. మొదట 2,110 క్యూసెక్కులతో నీటి విడుదల ప్రారంభమైంది. మరుసటి రోజు 8 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాటికి కృష్ణా జలాలు జూరాల జలశయానికి చేరతాయి అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే 2.5 టీఎంసీల నీటి విడుదల పూర్తయిట్లు ప్రాజెక్టు ఇంజనీరు వెల్లడించారు. -
జూరాల ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు
-
జూరాలకు కొనసాగుతున్న వరద
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా జూరాల జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 14,956 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 12, 271 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తతం రిజర్యాయర్లో నీటిమట్టం 11.67 టీఎంసీలు ఉందని అధికారులు తెలిపారు.