సాక్షి, కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి నిలకడగా నీరు చేరుతోంది. వరద తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినా ఇప్పటకీ అత్యధికంగానే నీరు వస్తోంది. జూరాల స్పిల్ వే నుంచి 7,11,782 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 98,516 క్యూసెక్కులు కలుపుకొని మొత్తంగా 8,10,298 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం డ్యామ్ నుంచి పది గేట్ల ద్వారా 7,46,383 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్ననాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
కాగా, జూరాలకు ఎగువ ప్రాంతాల నుంచి 7,16,000 క్యూసెక్కులు నీరు వస్తోంది. 55 గేట్ల ద్వారా శ్రీశైలానికి 7,17,910 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 5.928 టీఎంసీలు ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ఉంటే ప్రస్తుతం నీటి నిల్వ మట్టం 316.49 మీటర్లు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివరాలు : ఇన్ ఫ్లో.. 7,55,850 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో.. 5,15,433 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం..590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం.. 582 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 288 టీఎంసీలు.
Comments
Please login to add a commentAdd a comment