గద్వాల, న్యూస్‌లైన్: ఏ ముహూర్తంలో జూరాల భారీ తాగునీటి పథకానికి శ్రీకా రం చుట్టారో తెలియదు కానీ గ్రహణం వీడటం లేదు. ఒకచోట తప్పితే మరోచో ట పైపులకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఈ పథకంలో కీలకమైన కొండగట్టు రిజర్వాయర్ నుంచి పంపిణీలైన్ ద్వారా మొదటి దశలో 31 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ట్రయల్న్‌న్రు గత నెలలో ప్రారంభించారు. నాటినుంచి ఇప్పటివరకు పది చోట్ల పైపులకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మన్నాపూరం వద్ద మరో లీకేజీ ఏర్పడింది. కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పంప్‌హౌస్ నుంచి కొండగట్టు వరకు 70చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. చివరికి పైపులను పూర్తిగా తొలగించి, డీఐ పైపులు వేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. హైదరాబాద్‌లో పైపులకు సంబంధించిన డిజైన్ అప్రూవల్ ఏ అంచనాల మేరకు చేశారో తెలియదు కానీ జూరాల తాగునీటి పథకం ఏడాదిగా గు క్కెడు నీళ్లు ఇవ్వలేనిస్థితిలో ఉంది. జూ రాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 184 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో 2005లో భారీ తాగునీటి పథకానికి మంజూరుఇచ్చారు.
మొదట హడ్కో నిధులతో ఈ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, *110 కోట్ల వ్యయంతో పూర్తి చేసేందుకు సీఎం ఫండ్ నుంచి కొంత, ప్రపంచబ్యాంక్ నిధుల నుంచి మరికొంత సర్దుబాటుచేసింది. ఇంతచేసినా గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పథకం నుంచి నీటిని విడుదల చేసేందుకు అన్ని పనులు పూర్తిచేశారు. ఈ మేరకు సీఎం చేత మంచినీటి పథకాన్ని ప్రారంభోత్సవం చేయించాలని నిర్ణయించి, పైపులైన్లలో పగుళ్లు ఏర్పడటంతో వాయిదా వేశారు. జూరాల రిజర్వాయర్ వద్ద ఉన్న పంప్‌హౌస్ నుంచి కొండగట్టు వరకు నాలుగున్నర కిలోమీటర్ల పైపులైన్లలో ఏర్పడిన పగుళ్లతో చివరకు మే నెలలో పైపులనే తొలగించేశారు.
ఆదిలోనే హంసపాదు
ఈ లైన్ ట్రయల్న్ ్రనిర్వహించి విజయవంతమైందని, కొండగట్టుపై ఉన్న రిజర్వాయర్‌కు నీటిని అందించామని అధికారులు సంతోషపడ్డారు. కొండగట్టు నుంచి పైప్‌లైన్‌కు ఇప్పటికి పదిచోట్లకు పైగా పగుళ్లు ఏర్పడ్డాయి. బాగుచేయడం, ట్రయల్న్ ్రనిర్వహించడం, మరో చోట పగుళ్లు ఏర్పడడం ఇలా డిస్ట్రిబ్యూషన్ లైన్ పగుళ్లతో గ్రామాలకు నీళ్లను అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మేఘారెడ్డిని వివరణ కోరగా.. డిస్ట్రిబ్యూషన్ లైన్‌లో ట్రయల్న్ ్రనిర్వహిస్తున్నామని తెలిపారు. పగుళ్లు సాధారణమేనని, త్వరగా వీటన్నింటిని బాగుచేసి మొదటి దశ గ్రామాలకు తాగునీటిని అందిస్తామన్నారు.
24 గ్రామాలకు నిలిచిన నీటి సరఫరా
శాంతినగర్, న్యూస్‌లైన్: వడ్డేపల్లి మం డలం రాజోలి గ్రామంలో నిర్మించిన రా జోలి తాగునీటి పథకం నుంచి గురువా రం 24 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
రాజోలి సమీపంలో తుంగభద్ర నదిలో నిర్మించిన ఇంటెక్‌వెల్‌కు నీరు అందకపోవడంతోనే సమస్య తలెత్తిందని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ తెలిపా రు. 10 రోజుల క్రితం ఇలాగే పూర్తిగా నీటిని దిగువకు విడుదల చేయగా ఒకరోజు మోటార్లు నిలిపేయడంతో సమస్య తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. రెండోసారి సమస్య పునరావృతమైందని, దీంతో శుక్రవారం నీటిని సరఫరా చేయలేమని చెప్పారు. ఈ విషయమై బ్యారే జీ వర్క్‌ఇన్‌స్పెక్టర్ మునిస్వామిని వివరణ కోరగా.. ఎగువనుంచి ఇన్‌ఫ్లో భారీగా వ స్తున్న సమయంలో బ్యారేజీ భద్రత దృ ష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిగువకు నీటిని విడుదల చేస్తామన్నారు.
వీడని గ్రహణం
Published Fri, Sep 13 2013 3:58 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement