reserviour
-
రేపటి పూజలో కేసీఆర్ పాల్గొంటారు: హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రేపు(మే 29) జరిగే కొండపోచమ్మ రిజర్వేయర్ ప్రారంభోత్సవ పూజకు పరిమిత ప్రజాప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండపోచమ్మ దేవాలయంలో రేపు జరిగే పూజలో సీఎం కేసిఆర్ పాల్గొంటారని తెలిపారు. ఈ పూజకు గజ్వేల్ ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మనమందరం కలిసి జరుపుకోవాల్సిన పండగ కానీ మహమ్మారి కారణంగా ఇది సాధ్యం కాదు. కాగా రేపు సీఎం కేవలం రిజర్వాయర్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రజలు ఎప్పుడైన వచ్చి సామాజిక దూరం పాటిస్తూ రిజర్వాయర్ సందర్శించవచ్చని చెప్పారు. ప్రారంభోత్సవానికి దయచేసి ప్రజలు ఎవరూ కూడా రావోద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. (‘సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలి’) -
నగరవాసులకు తప్పని నీటి కష్టాలు
-
కరువు నేలకు జలకళ
కరువునేల కళకళలాడనుంది.. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న మాగాణి భూముల్లో కృష్ణమ్మ పరుగులు తీయనుంది.. వలసలకు పేరొందిన పాలమూరు దశ మారనుంది..!జిల్లాలో ఏడులక్షల ఎకరాలతో పాటు మరోరెండు జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ప్రతిష్టాత్మక పాలమూరు ఎత్తిపోతల పథకానికి మొదటి అడుగుపడింది. మొదటి రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు మొదటివారంలో టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించింది. జూరాల: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మొదటి అడుగుపడింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటిపంపు ద్వారా నీటిని పంపింగ్ చే సి నిల్వచేసే నార్లాపూర్ రిజర్వాయర్ సమగ్ర నివేదిక పనులు పూర్తిచేశారు. ఇందుకోసం అవసరమైన 2625 ఎకరాలు సేకరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. నెలాఖరులోగా ప్రాజెక్టు సమగ్ర నివేదికను సిద్ధంచేసే విధంగా నీటిపారుదలశాఖ అధికారులు పనులను వేగవంతం చేశారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఆగస్టు మొదటివారంలో పథకం పనులకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు రంగం సి ద్ధంచేస్తున్నారు. మొదటి రిజర్వాయర్ ప రిధిలో ముంపునకు గురయ్యే అంజన్గిరితండా వాసులను జిల్లామంత్రి కలిసి ప్రా జెక్టు పనులకు సహకరించేలా అంగీకరింపజేశారు. దీంతో ప్రాజెక్టు పనులకు సం బంధించిన మొదటిదశకు అడ్డంకులు తొ లగినట్లయింది. ప్రాజెక్టును మూడు జి ల్లాల్లో 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు హైదరాబాద్ మహానగరానికి 20టీఎంసీల తాగునీటిని అందించే లక్ష్యంతో చేపడుతున్న ఈ పథకాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి మూడేళ్లలోనే పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. జిల్లా నేతలతో సీఎం సమీక్ష గురువారం రాత్రి జిల్లా ఎంపీ ఏపీ జి తేందర్‌రెడ్డి ఇంట్లో సీఎం కేసీఆర్, నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో పాటు ముఖ్యఅధికారులతో కలిసి పాల మూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై సమీక్షించారు. వచ్చేనెలలో టెండర్లు పిలచి పనులను ప్యాకేజీలుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. వలసలకు నిలయమైన జి ల్లాలో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణానది జలాలను కరువునేలకు అందించే పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టు స్వరూపం ఇలా.. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ గ్రామానికి సమీపంలో మొదటి పంప్‌హౌస్ ఏర్పాటుచేస్తారు. ఇక్కడి నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు. ఇక్కడినుంచి ఏదుల రిజర్వాయర్‌కు, అక్కడినుంచి వట్టెం రిజర్వాయర్ లో 14.37టీఎంసీల నీటిని నిల్వచేస్తారు. వట్టెం రిజర్వాయర్ పరిధిలో 20వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. అనంతరం ఇక్కడినుంచి ప్రధానకాల్వ ద్వారా లోకిరేవు రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు. తద్వారా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఇక్కడినుంచి రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేస్తారు. రిజర్వాయర్ నుంచి నాలుగు ప్రధానకాల్వల ద్వారా సాగునీరందేలా డిజైన్‌చేశారు. దక్షిణ బ్రాంచి కాల్వ ద్వారా 20వేల ఎకరాలకు, తూర్పు కాల్వ ద్వారా 30వేల ఎకరాలకు, ఉత్తరకాల్వ ద్వారా 1.65లక్షల ఎకరాలకు, పడమర కాల్వ ద్వారా 1.30లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వచ్చేనెలలోనే పాలమూరు టెండర్ల ప్రక్రియ ఈనెలాఖరులోగా పాలమూరు ఎత్తిపోతల పథకం డీపీఆర్ సిద్ధం చేసి డిజైన్‌ను ఈఎస్సీ డిజైన్స్ విభాగానికి పంపి అనుమతి రాగానే వచ్చేనెలలోనే టెండర్లను పిలిచేలా పనులను వేగంగా కొనసాగిస్తున్నాం. పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వీలైనంత త్వరగా పనులు చేపట్టేలా అన్నిదశల్లో ప్రయత్నాలు సాగుతున్నాయి. - ఖగేందర్, చీఫ్ ఇంజనీర్ -
నిర్వాసితులకు అండగా ఉంటాం!
ఎమ్మెల్యే : పెద్దాయనా.. మీకేమైనా సమస్యలున్నాయా? బక్క కుర్మన్న : సారూ..! మాకు కొత్తగా ఇండ్లు ఎక్కడ ఇస్తరోనని తిప్పలు. ఒకసారి కలెక్టరమ్మ ఊర్నె లేప్కపొమ్మని సెప్పింది. ఇండ్లకోసం 40 ఎకరాలిచ్చిన గూడ్క.. అడివిల ఉండలేం. ఊరంతా ఒక్కసారి లేప్క పోవాలంటె ఎట్లయితది! మేమంతా యాడ ఉండేది. ఎకరాకు రూ.70 వేలు, రూ.90 వేలు పరిహారం ఇచ్చిండ్రు. బాగనే ఉంది.. పదేండ్ల కింద ఇచ్చిన పరిహారం యాడ సరిపోతది? ఇండ్లు కట్టియ్య పోయిరి. ఇప్పుడు మేం ఏడ ఉండాలె చెప్పుండ్రు. ఎమ్మెల్యే : పెద్దాయనా! శంకరసముద్రం నిర్వాసితులకు ఇళ్లు కట్టించేందుకు 119 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. మీకే కాదు. ఇతర గ్రామాల వారికీ ఇళ్లు కట్టించాల్సి ఉంది. ఒక్కసారే ఇళ్లన్నీ పోవు. డ్యాం కట్టే స్థలాన్ని బట్టి విడతలుగా వెళ్లాలి. మిగతావి డ్యాం పూర్తయినంక వెళ్లాలి. మీ ఇంటికి పరిహారమెంత వచ్చింది? బక్క కుర్మన్న: మా ఇంటికి నష్టపరిహారం కింద రూ. 7.50 లక్షలు మంజూరైనయి. వాటిని ఇప్పించేందుకు కష్టపడిన వకీలు 30శాతం డబ్బులు తీసుకోగా, మిగిలిన రూ.5.30 లక్షలు చేతికి వచ్చినయ్. ఎమ్మెల్యే: అన్నా.. నీపేరేంటి? రిజర్వాయర్ నిర్మాణం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బాధిత రైతు : నా పేరు బాలస్వామి. శంకరసముద్రం రిజర్వాయర్‌ను నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది రైతులకు ప్రయోజనం కలిగించే ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు మేం పొలాలు, ఇళ్లు త్యాగం చేశాం. నష్టపరిహారం కూడా ఇచ్చారు. కానీ ఇండ్లు నిర్మించేందుకు రోడ్డు పక్కన్నస్థలాన్ని అడుగుతున్నాం. ఎమ్మెల్యే : నష్టపరిహారం అందజేయడంలో ఆలస్యానికి కారణం ఏమనుకుంటున్నారు? శేఖర్‌గౌడ్ : గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ముగ్గురు కలెక్టర్లు మారారు. నిర్వాసితులకు ఇళ్లు నిర్మించేందుకు స్థలం కూడా కేటాయించడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. మాకు రోడ్డుపక్కన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. మీ నుంచి పరిష్కారం అవుతదని ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే: శంకరసముద్రం నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు గతనెల రాష్ట్ర మంత్రి హరీష్‌రావు వచ్చి వెళ్లినంకా పనులు ఏమైనా జరిగాయా? శేఖర్‌గౌడ్ : గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిర్వాసితులకు కొంతఊరట కలుగుతోంది. ఈ మధ్య మంత్రి హరీష్‌రావు సారూ.. కానాయిపల్లికి వచ్చిన సందర్భంలో మా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణం పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే: మంత్రి హరీష్‌రావు వచ్చిపోయినంక సమస్య ఏమైనా పరిష్కారమైందా? బందెన్న: గత ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఇళ్లు నిర్మించుకునేందుకు అనువుగా లేదు. ఈ విషయాన్ని మంత్రి హరీష్‌రావుకు విన్నవించాం. ఆయన అప్పటికప్పుడు మాకోసం కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. గ్రామస్తుల కోరిక మేరకురోడ్డు పక్కనే నిర్వాసితులకు ఇళ్లు నిర్మించాలనిఅధికారులను ఆదేశించారు. మాకోసం కేటాయించిన 40 ఎకరాల్లో 20 ఎకరాల స్థలాన్ని ఇళ్ల నిర్మాణానికి కేటాయిస్తూ మంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యే : మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంజన్న: రిజర్వాయర్ నిర్మాణం కోసం కాంట్రాక్టర్ మా పొలాల వద్ద సామాను వేసుకుంటున్నారు. దీంతో రిజర్వాయర్ పూర్తయ్యే వరకైనా పంటలు వేసుకోవాలంటే వీల్లేకుండా పోయింది. రిజర్వాయర్ నీటిముంపు పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఒడ్డున ఉన్న పొలాలకు అక్కడి నుంచి విద్యుత్ సరఫరా కావడం లేదు. పొలాలకు బండ్లబాట కూడా లేకుండా పోయింది. నీట మునిగిన 11 ట్రాన్స్ఫార్మర్లు బయటకు తీసి గడ్డ మీద ఉన్న పొలాలకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. విద్యుత్‌శాఖ అధికారులు దీన్ని పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే : విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తా! ఇళ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొత్త శ్రీనివాసులు: శంకరసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో పరిహారం కింద పదేళ్ల క్రితం రూ.78వేలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు గోడలు కూడా నిర్మించుకోలేని పరిస్థితి. దీని దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయాలని మంత్రి హరీష్‌రావుకు విన్నవించాం. మీ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం చేయాలి. నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకునేందకు స్థలం కేటాయించడంతో పాటు రూ.3.50లక్షల ప్యాకేజీ ఇవ్వాలి. ఎమ్మెల్యే : మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనిచేస్తున్నాడని మీరు భావిస్తున్నారా? కొత్త శ్రీనివాసులు: మీరు ఎమ్మెల్యే అయ్యాక మా వద్దకు రావడం ఇది మూడోసారి. గతంలో ఎవరూ ఇక్కడకు రాలేదు. ఇక్కడి నిర్మాణం పనులే కాకుండా, నిర్వాసితులకు సైతం మీ ఆధ్వర్యంలో వేగంగా సాయం అందుతుందా? ఎమ్మెల్యే : అన్నా..! మీ సమస్య ఏంటి? ఆంజనేయులు: మా తండాకు చుట్టుతా నీళ్లొస్తున్నయి. దీంతో మేం తండాలో నివాసం ఉండలేకపోతున్నం. మావి మొత్తం 60ఇళ్లు ఉన్నాయి. మా తండాకు పొయ్యే బాట కూడా మునిగిపోయింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మా తండా పూర్తిగా మునిగిపోతది. మా ఊరికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా రోడ్డు వేయండి. లేదంటే తండాను మరోచోటుకు మార్చండి. -
ఆరేళ్లయినా అతీగతీ లేదు
కరీంనగర్ : హుస్నాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి కోసం ఒగులాపూర్(తోటపల్లి-ఒగులాపూర్) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్‌లో చిగురుమామిడి మండలం ఒగులాపూర్ పూర్తిగా ముంపునకు గురవుతుండగా, నారాయణపూర్, ఇందుర్తి, వరికోలు, బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్, కోహెడ మండలం రాంచంద్రాపూర్ పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి. 1.7 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.131.67 కోట్లు. 49 వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. రిజర్వాయర్ విస్తీర్ణం 3,600 ఎకరాలు కాగా, ఒగులాపూర్‌లో 670 ఎకరాలు, గాగిల్లాపూర్‌లో 359, వరికోలులో 866, రాంచంద్రాపూర్‌లో 646, ఇందుర్తిలో 780, నారాయణపూర్‌లో 35 ఎకరాలు సేకరించాలి. ఇప్పటివరకు 1495 ఎకరాల భూమి(42 శాతం) మాత్రమే పరిహారం అందించి సేకరించారు. ఇంకా 2105 ఎకరాలకు పరిహారం అందించాలి. 2015 లోపు పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇంకా కొన్ని చోట్ల భూసేకరణ దశలోనే ఉంది. పరిహారమేదీ ? ప్రాజెక్టు నిర్మాణంలో భూములతోపాటు ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం మాత్రం రావడం లేదు. 42 శాతం భూములకు మాత్రమే పరిహారం చెల్లించారు. వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.2.10 లక్షలు చెల్లించారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిమాండ్ ఎకరాకు రూ.4 నుంచి రూ.5 లక్షల మధ్య ఉన్నా అంతమేర చెల్లించలేదు. ఇప్పుడు అక్కడ ధర ఎకరాకు రూ.8 నుంచి రూ.12 లక్షలు పలుకుతోంది. ఇంత విలువైన భూములను కేవలం రూ.2.10 లక్షలకే అప్పగించి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం పెంచి ఎకరానికి రూ.5 లక్షలు చెల్లించాలని కోరుతున్నారు. ముంపు గ్రామాలు కావడంతో అభివదిృ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లు గుంతలు పడ్డాయి. ఎలా పనులు చేపట్టడం లేదు. మంత్రిపైనే ఆశ సాగునీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు సొంత గ్రామమైన తోటపల్లిలో రిజర్వాయర్ పనులపై ఆయన దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద పునరావసం కల్పించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. పాక్షిక ముంపు గ్రామాలను పూర్తి ముంపు గ్రామాలుగా ప్రకటించాలని కోరుతున్నారు. -
నత్తనడకన ‘టూ టీఎంసీ’
తూర్పు డివిజన్‌కు సాగునీరందించే టూ టీఎంసీ రిజర్వాయర్ నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. మూడేళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఆరేళ్లయినా కొలిక్కి రాకపోగా ప్రభుత్వం మరో నెల గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. భూసేకరణకే దిక్కులేకపోగా నెల రోజుల్లో పనుల పూర్తి అసంభవమే కానుంది. ముత్తారం : ముత్తారం మండలం మచ్చుపేట పరిధి శుక్రవారంపేట చింతలచెరువు వద్ద రెండు టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 సెప్టెంబర్ 19న శంకుస్థాపన చేశారు. ముత్తారం, కమాన్‌పూర్ మండలాల్లోని 21 గ్రామాల పరిధిలోని 20 వేల ఎకరాలకు సాగునీరందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. రూ.102.07 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు మూడు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. కాంట్రాక్టును మెగా ఇంజినీరింగ్ కంపెనీ సంస్థ దక్కించుకుంది. చింతల చెరువును రిజర్వాయర్‌గా ఆధునికీకరించి 45.55 కిలోమీటర్ల పొడవున కాలువలు ఏర్పాటు చేసి సాగునీరందించేలా ప్రణాళికలు రూపొందించారు. చెరువును ఇప్పటివరకు ఆధునికీకరించలేదు. ప్రధాన కాలువ తూము నిర్మాణ పనులు అర్ధంతరంగానే నిలిచిపోయాయి. రిజర్వాయర్ నుంచి ఓడేడ్ వరకు 13.5 కిలోమీటర్ల పొడవు ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా 5.5 కిలోమీటర్ల పొడవు ప్రధాన కాలువ నిర్మించారు. మధ్యమధ్యలో లైనింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 32 కిలోమీటర్ల పొడవు ఉపకాలువలు నిర్మించాల్సి ఉండగా 15 కిలోమీటర్ల పొడవు మాత్రమే నిర్మాణం పూర్తయింది. ఇందులో కూడా అక్కడక్కడ లైనింగ్ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కాలువల నిర్మాణానికి 563.11 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా 120 ఎకరాల భూసేకరణ మిగిలిపోయింది. తమ ఆమోదం లేకుండా ఇష్టం వచ్చినట్లు పరిహారం చెల్లిస్తూ తమ భూముల్లో దౌర్జన్యం కాలువలు తవ్వుతున్నారని కేశనపల్లి రైతులు కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణలో జాప్యం జరుగుతోంది. కోర్టులో వేసిన పిటిషన్ వెకేట్ అయినా నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం చెల్లించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. మూడేళ్ల క్రితమే గడువు పూర్తికాగా, క్షేత్రస్థాయి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడేళ్లుగా గడువు పొడిగిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు రూ.70 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.32 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు పనుల పూర్తికి డిసెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు పొడిగించినా అప్పటిలోగా పనులు పూర్తికావడం అనుమానంగానే ఉంది. ఆరేళ్లలో పూర్తికాని పనులు మరో నెలరోజుల్లో పూర్తవడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని రిజర్వాయర్ పనులు వేగవంతం చేసి సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ప్రాజెక్టు ఎస్ఈ వెంకటేశ్వర్లును ‘సాక్షి’ వివరణ కోరగా రైతులు సహకరిస్తే జూన్‌లోగా పనులు పూర్తి చేసి సాగునీరందిస్తామని తెలిపారు. -
ప్రమాదం అంచున కనిగిరి రిజర్వాయర్
బుచ్చిరెడ్డిపాళెం(రూరల్), న్యూస్‌లైన్: డెల్టా ప్రాంతంలో అతి ముఖ్యమైన కనిగిరి రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. 2007లో కనిగిరి రిజర్వాయర్ పటిష్టత కోసం నాటి సీఎం వైఎస్సార్ నిధులు కేటాయించినప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు ఆగిపోయాయి. తిరిగి టెండర్లు నిర్వహించకుం డా అధికారులు పనులు రద్దు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ ప్రధాన కాలువ అయిన సదరన్ చానల్ గేట్ల వద్ద కట్ట మధ్య భాగంలో పగుళ్లు ఇచ్చాయి. అలాగే సదరన్ చానల్ గేట్ల వద్ద కూడా రివిట్మెంట్లు, కాంక్రీట్ దిమ్మెలు దెబ్బతిని శిథిలావస్థకు చేరాయి. 2011లో సదరన్ చానల్ గేట్లు కొట్టుకుపోవడంతో రిజర్వాయర్ నీటి మట్టాన్ని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ గేట్లను ఏర్పాటు చేసేందుకు ఖర్చు చేసిన లక్షలాది రూపాయల వృథా కావడంతో పాటు రెండు టీఎంసీల నీళ్లు సముద్రం పాల య్యాయి. కొత్త గేట్ల ఏర్పాటుతోనే తమ పని అయిపోయిందన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆ గేట్ల సమీపంలోనే కాంక్రీట్, రివిట్మెంట్లు దెబ్బతినడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న కాలంలో భారీ వర్షాలు కురిస్తే పైపక్కనున్న కట్ట, గేట్ల వద్ద రివిట్మెంట్ కోతకు గురై ఎక్కడ పెను ప్రమాదం సంభవిస్తోందనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రిజర్వాయర్ కట్ట పై భాగంలో నిర్మించిన గోడలు కూడా కూలి ఉండటం నీటి పారుదల శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కనిగిరి రిజర్వాయర్‌కు ప్రమాదం సంభవించకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
చివరి ఆయకట్టుకూ నీరిస్తాం
జలదంకి, న్యూస్‌లైన్ : కావలి కాలువ, చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ శ్రీకాంత్ రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన వెంకటేశ్వరపాళెం మేజర్ నుంచి కావలి కాలువపై పర్యటించారు. ఈ సం దర్భంగా కాలువ పరిధిలోని రైతులు సాగునీటి ఎద్దడిపై కలెక్టర్ దృష్టికి తెచ్చా రు. కావలి కాలువకు విడుదలవుతున్న నీటి ప్రవాహం, వెంకటేశ్వరపాళెం మేజర్ కు వస్తున్న నీటి ప్రవాహాన్ని కొలతలు వేసి తెలుసుకున్నారు. చినక్రాక వద్ద కావ లి కాలువ ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వెళుతున్న నీటి ప్రవాహాన్ని పరి శీలించారు. ఎస్వీపీఎం వద్ద కావలి కాలువకు 200 క్యూసెక్కుల నీరు వస్తుండగా, చినక్రాక వద్దకు వచ్చే సరికి 100 క్యూసెక్కుల మేర మాత్రమే నీరు వస్తున్న విషయాన్ని గమనించారు. ఇలా అయితే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీరు వచ్చే పరిస్థితి లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో కలెక్టర్ సంగం బ్యారేజీ వద్ద నీటి మట్టం మరింతగా పెంచి కాలువలోకి నీటి సామర్థ్యాన్ని పెంచాలని ఫోన్లోనే సోమశిల అధికారులను ఆదేశిం చారు. అనంతరం హనుమకొండపాళెం, బ్రాహ్మణక్రాక మేజర్ రైతులు తమ పొ లాలు ఎండుతున్నాయని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన ఆ రెండు మేజ ర్ల పరిధిలోని ఎండిన పంట పొలాలను పరిశీలించారు. హనుమకొండపాళెం మేజర్ నుంచి చెరువుకు 50 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే తమ బాధలు తీరుతాయని రైతులు కోరారు. జలదంకి పెద్దచెరువు పరిధిలో కూడా పొలాలు ఎండుతున్న విషయాన్ని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఒకటి..రెండు రోజుల్లో రైతుల ఆందోళన తీరుస్తామన్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వండి మండలంలోని కొత్తపాళెం ఫీడర్‌కు వి ద్యుత్ సరఫరా సక్రమంగా ఇవ్వాలని కలెక్టర్ శ్రీకాంత్ ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తపాళెం ఫీడర్‌కు చెందిన రైతులు బ్రాహ్మణక్రాక సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్ చినక్రాకకు వెళుతూ సబ్‌స్టేషన్ ఎదు ట రైతులు ఆందోళన గమనించి ఆగి వారిని ప్రశ్నించారు. పది రోజుల నుంచి కరెంటు సరఫరా సక్రమంగా ఇవ్వడం లేదని, దీంతో తమ పొలాలు ఎండుతున్నాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కలెక్టర్ కరెంట్ సక్రమంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటూ ట్రాన్స్‌కో ఏఈ గోపీని ప్రశ్నిం చారు. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, ఫ్యూజులు, జంపర్లు పోతుండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. దీంతో కలెక్టర్ ట్రాన్స్‌కో సీఎండీ దొరకు ఫోన్ చేసి వెంటనే కొత్తపాళెం ఫీడర్‌కు చెందిన రైతులకు కరెంటు సరఫరా సక్రమంగా జరిగే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. సబ్‌స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వెంకటరమణారెడ్డి, సోమశిల ఎస్ఈ సోమశేఖర్, డీఈలు రాఘవరా వు, రాజేం ద్రప్రసాద్, తహశీల్దార్ మాల్యాద్రి ఉన్నారు. కావలి కాలువపై కలెక్టర్ పర్యటన దగదర్తి: మండలంలో కాట్రాయపాడు నుంచి బోడగుడిపాడు సమీపంలో ఉన్న వెంకటేశ్వరపాళెం మేజర్ చానల్ వరకు కావలి కాలువపై కలెక్టర్ శ్రీకాంత్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా బోగోలు, జలదంకి మండలాలకు చెంది న రైతులు తమ పొలాలు ఎండిపోకుండా ఉండేందుకు సాగునీరు అందివ్వాలని కో రారు. ప్రస్తుతం కావలి కాలువలో వస్తు న్న సాగునీరు పంట పొలాలకు సరిపోవడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకుని వ చ్చారు. కావలి కాలువ నుంచి జలదంకి మండలంలోని చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సరిపడి సాగునీరు అంద క ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయన్నారు. కాలువలో నీటి మట్టాన్ని పెంచాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ పం టలు ఎండిపోకుండా చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీఓ వెంకటరమణారెడ్డి, దగదర్తి తహశీల్దార్ జయప్రకాష్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులకు అండగా నిలుస్తాం బిట్రగుంట: శ్రీవెంకటేశ్వరపాళెం మేజర్ ఆయకట్టు రైతులకు అండగా నిలిచి పైర్లు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కలెక్టర్ శ్రీకాంత్ అన్నారు. కావలి కాలువ 30వ కిలో మీటరు వద్ద ఎస్వీపీఎం రెగ్యులేటర్‌ను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువకు 400 క్యూసెక్కుల నీరు అందుతుండగా శ్రీవెంకటేశ్వరపాళెం మేజర్‌కు 110 క్యూ సెక్కులు, మిగిలిన నీటిని చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ కొండబిట్రగుంట ప్రాంతంలోని పైర్లు కాపాడేం దుకు శ్రీవెంకటేశ్వరపాళెం మేజర్‌కు నీటి ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు ఎస్వీపీఎం ద్వారా రైతులకు సాగునీరు అందించనున్నామన్నా రు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ పైర్లను సంరక్షించుకోవాలని సూచించారు. ఆయన వెంట కావలి ఆర్డీఓ వెంకటరమణారెడ్డి, సోమశిల, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. -
పంటలను ముంచిన జల చౌర్యం
గుత్తి రూరల్, న్యూస్‌లైన్ : బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నేతల స్వార్థం 15 గ్రామాల అన్నదాతలకు భారీ నష్టం తెచ్చిపెట్టింది. చేపల పెంపకం కోసం చెరువుకు అక్రమంగా నీటిని తరలించేందుకు రిజర్వాయర్‌కు గండికొట్టారు. గండి కొట్టిన తర్వాత ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోవడంతో పిల్ల కాల్వలన్నీ తెగిపోయి నీరు పంట పొలాలను ముంచెత్తింది. గంటల వ్యవధిలోనే రూ.కోటి దాకా పంట నష్టం వాటిల్లింది. బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు... ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రాహ్మణపల్లి చెరువు పూర్తిగా నిండింది. ఇక్కడి కాంగ్రెస్ నేతలు చేపల పెంపకం చేపట్టాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా అనధికారికంగా ఈ చెరువులో చేప పిల్లలను వదిలారు. ఇదే సమయంలో ఆయకట్టుకు నీటిని వదలడంతో చెరువులో నీటిమట్టం తగ్గుతూ వచ్చింది. చేప పిల్లలను కాపాడుకునేందుకు ఈ సారి కాంగ్రెస్ నేతలు చెర్లోపల్లి వద్ద ఉన్న చండ్రాయునికుంట రిజర్వాయర్ నీటిపై కన్నేశారు. అక్కడి నుంచి ఎలాగైనా తమ చెరువుకు నీటిని తరలించి నింపుకోవాలనుకున్నారు. ఇందుకు ఎమ్మెల్యేను సంప్రదించారు. అందుకాయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకేముంది వారు సోమవారం రాత్రి మందీ మార్బలంతో వెళ్లి రిజర్వాయర్ వద్ద గండికొట్టారు. నీటి ఉధ ృతి ఎక్కువగా ఉండటంతో కాలువ వెంబడి ఉన్న గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల్లోని 15 గ్రామాల్లో దాదాపు 500 ఎకరాలలో సాగు చేసిన వేరుశనగ, జొన్న, వరి, కంది, ఆముదం పంటలు కొట్టుకుపోయాయి. ఎక్కడికక్కడ కోతకు గురికావడం, భూసారం కొట్టుకుపోవడంతో పదేళ్ల వరకు పంటలు సాగు చేసే పరిస్థితి లేకుండా పోయిందని చెర్లోపల్లికి చెందిన రైతులు రామాంజనేయులు, ఆకుల వెంకటేష్, మారెన్న, నర్సన్న, లాలెమ్మ, లక్ష్మిదేవి, ఆకుల రామాంజనేయులు, వెంకటలక్ష్మమ్మ, గోవిందు, సుంకమ్మ, ఆంజనేయులు, పెద్ద మారెప్ప, వెంకట్రాముడు, సుశీలమ్మ, రామన్న, నారాయణమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. అధికార పార్టీ నాయకులు చేపల పెంపకం ద్వారా రూ,లక్ష నష్టం వస్తుందని కక్కుర్తి పడి రిజర్వాయర్‌కు గండికొట్టి తమ పంటలను నీటిపాలు చేసి.. కోటి రూపాయల దాకా పెట్టుబడులు కోల్పోయేలా చేశారని బాధితులు శాపనార్థాలు పెట్టారు. ఇంత భారీ నష్టం జరిగినా రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు అధికారులు తిరిగి చూడలేదని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జల చౌర్యంపై సీపీఐ మండల కార్యదర్శి రాము, నాయకులు పూలమాబు, రమేష్, టీడీపీ మండల మాజీ కార్యదర్శి కోనంకి కృష్ణ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. -
నీళ్లే లేవు.. వరద కాలువట!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘ఎద్దు ఈనిందంటే గాటికి కట్టెయ్..’ అన్నట్లుంది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారుల తీరు. పెన్నా నదిలో నీటి లభ్యతే లేకపోవడం వల్ల చాగల్లు రిజర్వాయర్‌కు చుక్క నీరు చేరడం లేదు. నీళ్లే లేని ఆ రిజర్వాయర్ నుంచి 11.5 కిలోమీటర్ల మేర వరద కాలువ తవ్వడం ద్వారా మూడు చెరువులకు నీళ్లందించడంతోపాటు 31,183 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చునని జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ప్రతిపాదించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అధికారులు తన మాటను ఖాతరు చేయకపోవడంతో తనకు సన్నిహితుడైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో ప్రతిపాదనలు పంపాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆ మేరకు రూ.24.72 కోట్ల వ్యయంతో వరద కాలువ తవ్వడానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి అరవిందరెడ్డి ఆ ప్రతిపాదనలను కనీసం సరిచూసుకోకుండా వరద కాలువ తవ్వకానికి పరిపాలనా పరమైన ఉత్తర్వులను(జీవో ఎంఎస్ నెం: 89) సెప్టెంబరు 2న జారీ చేశారు. మాజీ మంత్రి ఒత్తిడి మేరకు ఆ పనులకు ఆగమేఘాలపై టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పరిధిలో పెన్నా నది పరివాహక ప్రాంతంలో 650 ఎంసీఎఫ్‌టీల జలాలు లభిస్తాయని హెచ్చెల్సీ(తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ) అధికారులు అంచనా వేశారు. వాటి ఆధారంగా రూ.202 కోట్ల వ్యయంతో 1.5 టీఎంసీల సామర్థ్యంతో పెద్దపప్పూరు మండలం జూటూరు వద్ద చాగల్లు రిజర్వాయర్, పెద్దవడుగూరు మండలం పెండేకల్లు వద్ద రూ.102 కోట్ల వ్యయంతో 0.65 టీఎంసీల సామర్థ్యంతో పెండేకల్లు రిజర్వాయర్‌ను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ఆ మేరకు రెండు రిజర్వాయర్లను మంజూరు చేసిన ప్రభుత్వం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. రెండున్నరేళ్ల క్రితమే రెండు రిజర్వాయర్ల పనులనూ కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. కానీ.. వర్షాభావ పరిస్థితుల వల్ల పెన్నా నదికి జలకళ చేకూరలేదు. రెండున్నరేళ్లుగా రిజర్వాయర్లలోకి చుక్క నీరు చేరలేదు. ఇదే పెన్నానదిపై రామగిరి మండలం పేరూరు వద్ద 5.3 టీఎంసీల సామర్థ్యంతో ఎగువ పెన్నా, కూడేరు మండలం కొర్రకోడు వద్ద 11.10 టీఎంసీల సామర్థ్యంతో పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్), గార్లదిన్నె మండలం పెనకచర్ల వద్ద 5.17 టీఎంసీల సామర్థ్యంతో మధ్య పెన్నార్ జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటకలో పెన్నానదిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మించడం వల్ల రెండున్నర దశాబ్దాలుగా ఎగువ పెన్నా, పీఏబీఆర్, మధ్య పెన్నార్ జలాశయంలోకి నది ద్వారా చుక్క నీళ్లు చేరడం లేదు. కేవలం 1996లో మాత్రమే ఎగువ పెన్నా, పీఏబీఆర్లు నిండాయి. అప్పటి నుంచి నేటి వరకూ ఆ ప్రాజెక్టులు తుంగభద్ర డ్యామ్ నుంచి హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసుకోవడానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మాత్రమే ఉపయోగపడ్డాయి. ఎగువ పెన్న నీళ్లులేక దిష్టిబొమ్మగా మారింది. ఈ మూడు ప్రాజెక్టులు నిండితే గానీ కొత్తగా నిర్మించిన చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లలోకి నీళ్లు చేరవు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పెన్నాలో నీళ్లు లభించవనే భావనకు వచ్చిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా నది జలాల వివాదంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించిన తర్వాత.. లభించే అదనపు జలాల్లో ఎగువ పెన్నా, పీఏబీఆర్, మధ్య పెన్నాతోపాటు చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లకు నికర జలాలను కేటాయించేందుకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదెక్కడి చోద్యం..? తాడిపత్రి నియోజకవర్గంలో ఇటీవల మాజీ మంత్రి ప్రభ తగ్గుతూ వస్తోంది. చాగల్లు రిజర్వాయర్‌ను హంద్రీ-నీవా ద్వారా వచ్చే కృష్ణా జలాలతో నింపి, రైతులను ఆకట్టుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే అక్టోబరు 30న జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను పీఏబీఆర్‌కు విడుదల చేశారు. పీఏబీఆర్ నుంచి మధ్య పెన్నార్‌కు జలాలు చేరుతాయి. మధ్య పెన్నార్ నుంచి చాగల్లు రిజర్వాయర్‌కు అదే రోజున నీటిని విడుదల చేశారు. కానీ.. ఇందుకు అనుమతి లేకపోవడంతో నీటి విడుదలను అధికారులు ఆపేశారు. దీన్ని బట్టి చూస్తే చాగల్లు రిజర్వాయర్‌కు నీటి లభ్యత లేదన్నది స్పష్టమవుతోంది. ఇది ఆ మాజీ మంత్రికి తెలియంది కాదు. కానీ.. చాగల్లు నుంచి వరద నీటిని తరలించి మంత్రి శైలజానాథ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులను నింపడంతోపాటు హెచ్చెల్సీ ఆయకట్టును స్థిరీకరించవచ్చునని ఆయన ప్రతిపాదించారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని హెచ్చెల్సీ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. నీటి లభ్యతే లేని నేపథ్యంలో వరద కాలువకు ప్రతిపాదనలు పంపితే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని ఆయనకు తెగేసి చెప్పామని హెచ్చెల్సీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అధికారులు తన మాటను ఖాతరు చేయకపోవడంతో సీఎంపై ఒత్తిడి తెచ్చారు. సీఎం జోక్యం చేసుకోవడంతో ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనల అమలు సాధ్యాసాధ్యాలను కనీసం పరిశీలించకుండానే నీటి పారుదలశాఖ కార్యదర్శి అరవిందరెడ్డి చాగల్లు వరద కాలువ తవ్వకానికి సెప్టెంబరు 2న పరిపాలనపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే టెండరు పిలిచి.. పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలంటూ హెచ్చెల్సీ అధికారులపై మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. నవ్విపోదురు గాక.. తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోనే 0.5 టీఎంసీల సామర్థ్యంతో సుబ్బరాయసాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటిని ఈ రిజర్వాయర్‌లో నిల్వ చేసి.. తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ ఆయకట్టుతోపాటు ప్రత్యేక కాలువ ద్వారా పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతపల్లి చెరువులకు నీళ్లందిస్తున్నారు. ఇటీవల టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో హెచ్చెల్సీ కోటాకు కోత వేస్తుండటం వల్ల ఈ మూడు చెరువులకు నీళ్లు నింపలేని దుస్థితి నెలకొంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న చిన్న నీటిపారుదలశాఖ అధికారులు పుట్లూరు మండల పరిధిలో కురిసే వర్షపు నీటిని ఆ మూడు చెరువులకు తరలించేందుకు రూ.73 లక్షలతో జాజికొండ వాగును ఆధునికీకరించారు. సుబ్బరాయసాగర్ను ఆధునికీకరిస్తే, నీటి వృథాకు అడ్డుకట్ట వేయడంతోపాటు ఆ మూడు చెరువులకు సులభంగా నీటిని అందించవచ్చునని హెచ్చెల్సీ అధికారులే అంగీకరిస్తున్నారు. ఆ ప్రయత్నం చేయకుండా.. చాగల్లు నుంచి వరద కాలువ తవ్వకానికి ప్రతిపాదనలు పంపడంపై సదరు శాఖ అధికారులే నవ్వుకుంటున్నారు. -
వీడని గ్రహణం
గద్వాల, న్యూస్‌లైన్: ఏ ముహూర్తంలో జూరాల భారీ తాగునీటి పథకానికి శ్రీకా రం చుట్టారో తెలియదు కానీ గ్రహణం వీడటం లేదు. ఒకచోట తప్పితే మరోచో ట పైపులకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఈ పథకంలో కీలకమైన కొండగట్టు రిజర్వాయర్ నుంచి పంపిణీలైన్ ద్వారా మొదటి దశలో 31 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ట్రయల్న్‌న్రు గత నెలలో ప్రారంభించారు. నాటినుంచి ఇప్పటివరకు పది చోట్ల పైపులకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మన్నాపూరం వద్ద మరో లీకేజీ ఏర్పడింది. కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పంప్‌హౌస్ నుంచి కొండగట్టు వరకు 70చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. చివరికి పైపులను పూర్తిగా తొలగించి, డీఐ పైపులు వేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. హైదరాబాద్‌లో పైపులకు సంబంధించిన డిజైన్ అప్రూవల్ ఏ అంచనాల మేరకు చేశారో తెలియదు కానీ జూరాల తాగునీటి పథకం ఏడాదిగా గు క్కెడు నీళ్లు ఇవ్వలేనిస్థితిలో ఉంది. జూ రాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 184 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో 2005లో భారీ తాగునీటి పథకానికి మంజూరుఇచ్చారు. మొదట హడ్కో నిధులతో ఈ పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, *110 కోట్ల వ్యయంతో పూర్తి చేసేందుకు సీఎం ఫండ్ నుంచి కొంత, ప్రపంచబ్యాంక్ నిధుల నుంచి మరికొంత సర్దుబాటుచేసింది. ఇంతచేసినా గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పథకం నుంచి నీటిని విడుదల చేసేందుకు అన్ని పనులు పూర్తిచేశారు. ఈ మేరకు సీఎం చేత మంచినీటి పథకాన్ని ప్రారంభోత్సవం చేయించాలని నిర్ణయించి, పైపులైన్లలో పగుళ్లు ఏర్పడటంతో వాయిదా వేశారు. జూరాల రిజర్వాయర్ వద్ద ఉన్న పంప్‌హౌస్ నుంచి కొండగట్టు వరకు నాలుగున్నర కిలోమీటర్ల పైపులైన్లలో ఏర్పడిన పగుళ్లతో చివరకు మే నెలలో పైపులనే తొలగించేశారు. ఆదిలోనే హంసపాదు ఈ లైన్ ట్రయల్న్ ్రనిర్వహించి విజయవంతమైందని, కొండగట్టుపై ఉన్న రిజర్వాయర్‌కు నీటిని అందించామని అధికారులు సంతోషపడ్డారు. కొండగట్టు నుంచి పైప్‌లైన్‌కు ఇప్పటికి పదిచోట్లకు పైగా పగుళ్లు ఏర్పడ్డాయి. బాగుచేయడం, ట్రయల్న్ ్రనిర్వహించడం, మరో చోట పగుళ్లు ఏర్పడడం ఇలా డిస్ట్రిబ్యూషన్ లైన్ పగుళ్లతో గ్రామాలకు నీళ్లను అందించలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ డీఈ మేఘారెడ్డిని వివరణ కోరగా.. డిస్ట్రిబ్యూషన్ లైన్లో ట్రయల్న్ ్రనిర్వహిస్తున్నామని తెలిపారు. పగుళ్లు సాధారణమేనని, త్వరగా వీటన్నింటిని బాగుచేసి మొదటి దశ గ్రామాలకు తాగునీటిని అందిస్తామన్నారు. 24 గ్రామాలకు నిలిచిన నీటి సరఫరా శాంతినగర్, న్యూస్‌లైన్: వడ్డేపల్లి మం డలం రాజోలి గ్రామంలో నిర్మించిన రా జోలి తాగునీటి పథకం నుంచి గురువా రం 24 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రాజోలి సమీపంలో తుంగభద్ర నదిలో నిర్మించిన ఇంటెక్‌వెల్‌కు నీరు అందకపోవడంతోనే సమస్య తలెత్తిందని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తెలిపా రు. 10 రోజుల క్రితం ఇలాగే పూర్తిగా నీటిని దిగువకు విడుదల చేయగా ఒకరోజు మోటార్లు నిలిపేయడంతో సమస్య తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. రెండోసారి సమస్య పునరావృతమైందని, దీంతో శుక్రవారం నీటిని సరఫరా చేయలేమని చెప్పారు. ఈ విషయమై బ్యారే జీ వర్క్ఇన్స్పెక్టర్ మునిస్వామిని వివరణ కోరగా.. ఎగువనుంచి ఇన్‌ఫ్లో భారీగా వ స్తున్న సమయంలో బ్యారేజీ భద్రత దృ ష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిగువకు నీటిని విడుదల చేస్తామన్నారు. -
శ్రమించారు..సాధించారు !
మక్తల్, న్యూస్‌లైన్: అధికారులు, సిబ్బంది శ్రమించి సాధించారు. ఎట్టకేలకు రాజీవ్ భీమా ఫేజ్-1 పంప్‌హౌస్ ట్రయల్న్ ్రశుక్రవారం విజయవంతమైంది. ఇక్కడి నుంచి నీటిని భూత్పూర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. మక్తల్ మండలం చిన్నగోప్లాపూర్ గ్రామం వద్ద నిర్మించిన భీమా మొదటి దశ పంపుహౌస్ మోటార్లను ఈనెల 15న మంత్రి డీకే అరుణ స్విచ్ ఆన్‌చేసి ప్రారంభించగా మోటార్లు మొరాయించిన విషయం తెలిసిందే.. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు. సుమారు 24గంటల పాటు శ్రమించిన అధికారులు మోటార్ పంపుల్లో తలెత్తిన సాంకేతికలోపాన్ని సరిచేశారు. గురువారం మంత్రి అరుణ కంప్యూటర్ సిస్టం ద్వారా పంపులను ఆన్‌చేయగా మొరాయించాయి. మోటార్లు ఆన్ కాగానే లోఓల్టేజీ సమస్య తలెత్తింది. దీంతో మోటార్లు డౌన్ కావడంతో పంపులు పనిచేయలేదు. పటేల్ కంపెనీ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది శ్రమించి పంప్‌లను తిరిగి ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ మేరకు భీమాలో అంతర్భాగమైన భూత్పూర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయడానికి చిన్నగోప్లాపూర్ వద్ద నుంచి ఫేజ్-1 పంప్‌హౌస్ నుంచి నీటిని విడుదల చేసినట్లు సంగంబండ ఈఈ శ్రీనివాస్‌రావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. శనివారం ఉదయం వరకు భూత్పూర్ రిజర్వాయర్‌లోకి గ్రావెటీ కెనాల్ ద్వారా నీళ్లు చేరుతాయన్నారు. కార్యక్రమంలో సంగంబండ డిప్యూటీ ఈఈ వెంకటస్వామి, పటేల్ కంపెనీ ప్రతినిధులు కృష్ణారెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా భీమా మొదటిదశ పంప్‌హౌస్ ట్రయల్న్ ్రవిజయవంతం కావడం పట్ల ఈప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా మక్తల్ నియోజకవర్గంలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. -
ఎల్ఎండీ గేటెత్తారు..
తిమ్మాపూర్, కరీంనగర్, న్యూస్‌లైన్ : దిగువ మానేరు జలాశయం(ఎల్ఎండీ) పూర్తిస్థాయిలో నిండడంతో గురువారం ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా విడుదల చేసిన 6 వేల క్యూసెక్కుల నీరు గురువారం మధ్యాహ్నం ఎల్ఎండీకి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 920 అడుగులు(24 టీఎంసీలు). ప్రస్తుతం ప్రాజెక్టులో 919.65 అడుగులు(23.372 టీఎంసీలు) నీరుండగా రిజర్వాయర్‌కు కాకతీయ కాలువతోపాటు వరద కాలువ ద్వారా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో గురువారం సాయంత్రం 4.40 సమయంలో సీఈ శంకర్ పదో నంబర్ గేటు ఎత్తి రెండు వేల క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి వదిలారు. ప్రస్తుతం వరద కాలువ ద్వారా ఆరు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా రెండు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే శుక్రవారం మరో గేటు ఎత్తే అవకాశముంది. వరద కాలువ నుంచి వచ్చే నీటిని గంట గంటకు లెక్కించి గేట్లు తెరవడం, లేదా మూయడం చేస్తామని సీఈ తెలిపారు. కార్యక్రమంలో జీవీసీ 4 ఎస్ఈ రుక్మారెడ్డి, తహశీల్దార్ భుజంగరావు, ఈఈ గుణవంతరావు, డీఈఈ రాములు, ఏఈ కాళిదాసు, కేడీసీసీబీ డెరైక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, వర్క్ఇన్స్పెక్టర్లు అహ్మద్, బుచ్చయ్య తదితరులున్నారు. మరో గేటు ఎత్తే అవకాశం ఒక గేటు ఎత్తి మానేరుకు నీరు వదిలిన అధికారులు దిగువకు వెళ్లే కాకతీయ కాలువకు నీటి విడుదల గురువారం సాయంత్రం నిలిపివేశారు. ఓ యువకుడు ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతు కాగా మృతదేహం వెలికితీసేందుకు నీటి విడుదల ఆపాలని పోలీసుల కోరడంతో నిలిపివేశారు. గతంలో కాలువ మరమ్మతు జరిగిన ప్రదేశంలో మట్టి కొట్టుకుపోవడంతో అక్కడ ఇసుక సంచులు వేయడానికి చర్యలు చేపట్టారు. శుక్రవారం ఇసుక సంచులు కాలువలో వేస్తామని చెప్పారు. ఆ తర్వాతనే నీటిని మళ్లీ దిగువకు వదులుతామన్నారు. నీటిమట్టం పరిశీలనకు సెన్సార్బాల్స్ రిజర్వాయర్‌లో నీటి మట్టం పరిశీలనకు రిజర్వాయర్ ఇన్‌టేక్ వెల్ వద్ద సెన్సార్ బాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇన్‌ఫ్లో పెరగడంతో అలల తాకిడికి బయట నీటి మట్టం సరిగా అంచనా వేయలేకపోతున్నామని, అందుకే అలల తాకిడి ఉండని ఇన్‌టేక్ వెల్‌లో సెన్సార్ బాల్స్ ఏర్పాటు చేస్తే నీటి మట్టాన్ని సరిగ్గా అంచనా వేయడానికి వీలుంటుందని అధికారులు చర్చించారు. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, దీనికి అంచనా వేయాలని సీఈ శంకర్ సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. -
నేతలకు పట్టని పోతిరెడ్డిపాడు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నదుల ప్రవాహం కట్టలు తెంచుకుంది. ప్రధాన జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ 204 టీఎంసీలకు చేరింది. 10 గేట్లు తెరిచి దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. రేపో మాపో సాగర్ గేట్లు కూడా తెరిచి లక్షలాది క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలడం కూడా ఖాయమైంది. కానీ... కృష్ణాను ఆనుకొని ఉన్న మన జిల్లాలో మాత్రం చెరువులు, కుంటలు నిండని పరిస్థితి. రెండు నదులు పక్కనుంచే పారుతున్నా... జలాశయాలు నిండినా... ఈసారైనా కరువుతీరా ఖరీఫ్‌ను సాగుచేసుకుంటామో లేదో తెలియని అయోమయంలో జిల్లా రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. దివంగత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే నాథుడు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. శ్రీశైలం నిండుకుండలా మారినా... పక్కనే ఉన్న వెలుగోడు రిజర్వాయర్ సాధారణ సామర్థ్యానికి రావడానికి ఇంకెన్ని రోజులు వేచిచూడాలో అర్థం కాని పరిస్థితి. తుంగభద్ర నుంచి దిగువకు లక్షన్నర క్యూసెక్కుల వరదనీరు వదులుతున్నా... ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లోని 16 మండలాలకు నీరందించే ఎల్ఎల్సీకి నీరు వదిలేందుకు కర్ణాటక అధికారులకు మనసొప్పడం లేదు. తద్వారా జిల్లా రైతాంగం ఖరీఫ్ మీద పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. 44వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచడం కలేనా? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రవాహ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచాలన్న డిమాండ్ నెరవేర్చడంలో పాలకులు విఫలమవుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో 21.12.2005న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అనంతపురం జిల్లాలోని పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్)కు 10 టీఎంసీల నీరు సరఫరా చేయడంతోపాటు, కర్నూలు జిల్లాలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచాలని అన్ని పార్టీలు తీర్మానించాయి. ఇందులో భాగంగా శ్రీశైలం కుడికాల్వను వెడల్పు చేసి లైనింగ్ ద్వారా బనకచర్ల కాంప్లెక్స్ వద్ద కూడా 44వేల క్యూసెక్కుల ప్రవాహానికి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసేందుకు జీవోనెంబర్ 170ని విడుదల చేస్తూ పరిపాలక అనుమతులు కూడా మంజూరయ్యాయి. అలాగే పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటి సరఫరా 5 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంచుతూ 698 జీవో జారీ అయింది. అయితే పోతిరెడ్డిపాడు నుంచి పీఏబీఆర్‌కు తిన్నగా నీటిసరఫరా చేసే అవకాశం లేదు. ఈ నీటిని తుంగభద్ర హెచ్ఎల్సీ నుంచి సేకరించి పీఏబీఆర్‌కు సరఫరా చేయాలి. ఈ 10 టీఎంసీల నీరు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా సేకరించి కేసీ కెనాల్‌కు సరఫరా చేయాలి. ఈ నీటితో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి వినియోగించాల్సిన నీరు 112 టీఎంసీలకు పెరుగుతుంది. ఈ నీటిని 30 వరదరోజుల్లో సేకరించాలంటే పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44వేల క్యూ సెక్కుల సేకరణకు అనుకూలంగా ఉం డాలి. కానీ 8ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం కొంతమేర సాఫల్యం చెందినా ఎస్ఆర్ఎంసీ పూర్తికాకపోవ డం, కాలువల ఆధునికీకరణ పనులు ముందుకు సాగకపోవడంతో జిల్లా వాసులకు అన్యాయం జరుగుతోంది. పోతిరెడ్డిపాడుకు 12వేల క్యూసెక్కులేనా? మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 882.90 అడుగులు. దాదాపు 204 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 4,12,066 క్యూసెక్కులు వచ్చి చేరుతుంటే, ఔట్‌ఫ్లో 2,52,610 క్యూసెక్కులు. విద్యుదుత్పాదనకు మరో 75వేల క్యూసెక్కుల నీటి ని వదులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్ సాధారణ సామర్థ్యానికి చేరుకుంటోంది. కానీ శ్రీశైలం బ్యాక్‌వాటర్ ద్వారా సరఫరా కావలసిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు మాత్రం 12వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారు. 30 వరద దినాల్లో 102 టీఎంసీల నీటిని సేకరించేందుకు ఇదెంత మాత్రం ఉపయోగం కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా... సర్కారు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం విడుదలవుతున్న 12వేల క్యూసెక్కుల నీటిలో 2వేల క్యూసెక్కులు ఎస్ఆర్బీసీకి, 3000 కేసీ కెనాల్‌కు, 7వేల క్యూసెక్కులు వెలుగోడు రిజర్వాయర్‌కు వదులుతున్నారు. వెలుగోడు రిజర్వాయర్ సామర్థ్యం 12.5 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి మట్టం 3 టీఎంసీలు మాత్రమే. పోతిరెడ్డిపాడు ద్వారా వదులుతున్న 7వేల క్యూసెక్కులతో రోజుకు 0.6 టీఎంసీల వరద నీరు మాత్రమే వీబీఆర్‌కు చేరుతోంది. ఈ లెక్కన రిజర్వాయర్ ఎప్పుడు నిండుతుందో... కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు ఖరీఫ్ సీజన్ మొత్తం ఎలా ఇస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కాగా 30 వరద రోజుల్లోనే పోతిరెడ్డిపాడుకు నీరు విడుదల చేయాలన్న నిబంధన వల్ల 12వేల క్యూసెక్కుల నీటి విడుదల ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.