కరీంనగర్ : హుస్నాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి కోసం ఒగులాపూర్(తోటపల్లి-ఒగులాపూర్) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్‌లో చిగురుమామిడి మండలం ఒగులాపూర్ పూర్తిగా ముంపునకు గురవుతుండగా, నారాయణపూర్, ఇందుర్తి, వరికోలు, బెజ్జంకి మండలం గాగిళ్లాపూర్, కోహెడ మండలం రాంచంద్రాపూర్ పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి.
1.7 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.131.67 కోట్లు. 49 వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. రిజర్వాయర్ విస్తీర్ణం 3,600 ఎకరాలు కాగా, ఒగులాపూర్‌లో 670 ఎకరాలు, గాగిల్లాపూర్‌లో 359, వరికోలులో 866, రాంచంద్రాపూర్‌లో 646, ఇందుర్తిలో 780, నారాయణపూర్‌లో 35 ఎకరాలు సేకరించాలి. ఇప్పటివరకు 1495 ఎకరాల భూమి(42 శాతం) మాత్రమే పరిహారం అందించి సేకరించారు. ఇంకా 2105 ఎకరాలకు పరిహారం అందించాలి. 2015 లోపు పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇంకా కొన్ని చోట్ల భూసేకరణ దశలోనే ఉంది.
పరిహారమేదీ ?
ప్రాజెక్టు నిర్మాణంలో భూములతోపాటు ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం మాత్రం రావడం లేదు. 42 శాతం భూములకు మాత్రమే పరిహారం చెల్లించారు. వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.2.10 లక్షలు చెల్లించారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిమాండ్ ఎకరాకు రూ.4 నుంచి రూ.5 లక్షల మధ్య ఉన్నా అంతమేర చెల్లించలేదు.
ఇప్పుడు అక్కడ ధర ఎకరాకు రూ.8 నుంచి రూ.12 లక్షలు పలుకుతోంది. ఇంత విలువైన భూములను కేవలం రూ.2.10 లక్షలకే అప్పగించి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం పెంచి ఎకరానికి రూ.5 లక్షలు చెల్లించాలని కోరుతున్నారు. ముంపు గ్రామాలు కావడంతో అభివదిృ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లు గుంతలు పడ్డాయి. ఎలా పనులు చేపట్టడం లేదు.
మంత్రిపైనే ఆశ
సాగునీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు సొంత గ్రామమైన తోటపల్లిలో రిజర్వాయర్ పనులపై ఆయన దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ కింద పునరావసం కల్పించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. పాక్షిక ముంపు గ్రామాలను పూర్తి ముంపు గ్రామాలుగా ప్రకటించాలని కోరుతున్నారు.
ఆరేళ్లయినా అతీగతీ లేదు
Published Mon, Dec 8 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM
Advertisement
Advertisement