తాగునీటి కోసం ఆర్డీవో కార్యాలయంలో ధర్నా | women dharna over drinking water problem | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం ఆర్డీవో కార్యాలయంలో ధర్నా

Published Mon, Oct 31 2016 4:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

women dharna over drinking water problem

హుస్నాబాద్ : తాగునీటి సమస్యను తీర్చాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.  ప్రజా వాణిలో తమ సమస్యను ఎకరువుపెట్టాలని వస్తే ఆర్డీఓ పద్మజ లేకపోవడంతో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరీంనగర్ లోని హుస్నాబాద్  కాలనీ వాసులు మాట్లాడుతూ బస్ డిపో కాలనీలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌కు విద్యుత్ కనెక్షన్ పూర్తి స్థాయిలో బిగించకపోవడంతో తాగు నీటి భాదలు తప్పడం లేదన్నారు.
 
త్రీఫేస్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ప్రతి సారి విద్యుత్ తీగలకు వైర్లను తగిలించడంతో విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని అన్నారు. దీంతో తాగునీటి అవస్ధలు తరుచు ఏర్పడుతున్నాయన్నారు. అదికారులకు పలు మార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు.  త్రీఫేజ్ కనెక్షన్ ఇచ్చి నీటి సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం నగర పంచాయతీ వద్ద ఆందోళన చేపట్టగా నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య స్పందించి వెంటనే నీటి సమస్య తీర్చుతానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement