womens dharna
-
తాగునీటి కోసం ఆర్డీవో కార్యాలయంలో ధర్నా
హుస్నాబాద్ : తాగునీటి సమస్యను తీర్చాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ప్రజా వాణిలో తమ సమస్యను ఎకరువుపెట్టాలని వస్తే ఆర్డీఓ పద్మజ లేకపోవడంతో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరీంనగర్ లోని హుస్నాబాద్ కాలనీ వాసులు మాట్లాడుతూ బస్ డిపో కాలనీలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌కు విద్యుత్ కనెక్షన్ పూర్తి స్థాయిలో బిగించకపోవడంతో తాగు నీటి భాదలు తప్పడం లేదన్నారు. త్రీఫేస్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ప్రతి సారి విద్యుత్ తీగలకు వైర్లను తగిలించడంతో విద్యుత్ మోటార్లు కాలిపోతున్నాయని అన్నారు. దీంతో తాగునీటి అవస్ధలు తరుచు ఏర్పడుతున్నాయన్నారు. అదికారులకు పలు మార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు. త్రీఫేజ్ కనెక్షన్ ఇచ్చి నీటి సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం నగర పంచాయతీ వద్ద ఆందోళన చేపట్టగా నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య స్పందించి వెంటనే నీటి సమస్య తీర్చుతానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
తూప్రాన్ : మెదక్ జిల్లా లో మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు వాహనాల రాకపోకలను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు. జిల్లాలోని తూప్రాన్ మండలం వెంకటాపురం అగ్రహారం గ్రామస్థులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెల్లినా పట్టించుకోలేదు. సర్పంచ్ కూడా అధికారుల దృష్టికి తీసుకునిపోకపోవడంతో అతని దిష్టి బొమ్మను దహనం చేశారు. రాస్తారోకోతో భారీ ఎత్తున వాహనాలు నిలిచి పోయాయి. -
తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట దాచేపల్లికి చెందిన సుమారు 300 మంది గిరిజన మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. తాగడానికి మంచినీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్లలోని కాలనీలకు చెందిన మహిళలు మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. నీటి ఎద్దడిపై ఎన్నిసార్లు ఉన్నతాధితారులకు విన్నవించినా ప్రయోజనం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎంపీడీవో నీటి ఎద్దడికి నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.