రేపటి పూజలో కేసీఆర్‌ పాల్గొంటారు: హరీశ్‌రావు | Harish Rao Talks In Press Meet Over Reservoir Opening Ceremony | Sakshi
Sakshi News home page

దయచేసి రేపు పూజకు ఎవరూ రావొద్దు: మంత్రి

Published Thu, May 28 2020 6:29 PM | Last Updated on Thu, May 28 2020 6:46 PM

Harish Rao Talks In Press Meet Over Reservoir Opening Ceremony - Sakshi

సాక్షి, సిద్దిపేట: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రేపు(మే 29) జరిగే కొండపోచమ్మ రిజర్వేయర్‌ ప్రారంభోత్సవ పూజకు పరిమిత ప్రజాప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం ఉన్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండపోచమ్మ దేవాలయంలో రేపు జరిగే పూజలో సీఎం కేసిఆర్‌ పాల్గొంటారని తెలిపారు. ఈ పూజకు గజ్వేల్‌ ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మనమందరం కలిసి జరుపుకోవాల్సిన పండగ కానీ మహమ్మారి కారణంగా ఇది సాధ్యం కాదు. కాగా రేపు సీఎం కేవలం రిజర్వాయర్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రజలు ఎప్పుడైన వచ్చి సామాజిక దూరం పాటిస్తూ రిజర్వాయర్‌ సందర్శించవచ్చని చెప్పారు. ప్రారంభోత్సవానికి దయచేసి ప్రజలు ఎవరూ కూడా రావోద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. (‘సీఎం కేసీఆర్‌ పర్యటన విజయవంతం చేయాలి’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement