కరువునేల కళకళలాడనుంది.. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న మాగాణి భూముల్లో కృష్ణమ్మ పరుగులు తీయనుంది.. వలసలకు పేరొందిన పాలమూరు దశ మారనుంది..!జిల్లాలో ఏడులక్షల ఎకరాలతో పాటు మరోరెండు జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ప్రతిష్టాత్మక పాలమూరు ఎత్తిపోతల పథకానికి మొదటి అడుగుపడింది. మొదటి రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు మొదటివారంలో టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించింది.
జూరాల: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మొదటి అడుగుపడింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటిపంపు ద్వారా నీటిని పంపింగ్ చే సి నిల్వచేసే నార్లాపూర్ రిజర్వాయర్ సమగ్ర నివేదిక పనులు పూర్తిచేశారు. ఇందుకోసం అవసరమైన 2625 ఎకరాలు సేకరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. నెలాఖరులోగా ప్రాజెక్టు సమగ్ర నివేదికను సిద్ధంచేసే విధంగా నీటిపారుదలశాఖ అధికారులు పనులను వేగవంతం చేశారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ఆగస్టు మొదటివారంలో పథకం పనులకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు రంగం సి ద్ధంచేస్తున్నారు. మొదటి రిజర్వాయర్ ప రిధిలో ముంపునకు గురయ్యే అంజన్‌గిరితండా వాసులను జిల్లామంత్రి కలిసి ప్రా జెక్టు పనులకు సహకరించేలా అంగీకరింపజేశారు. దీంతో ప్రాజెక్టు పనులకు సం బంధించిన మొదటిదశకు అడ్డంకులు తొ లగినట్లయింది. ప్రాజెక్టును మూడు జి ల్లాల్లో 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు హైదరాబాద్ మహానగరానికి 20టీఎంసీల తాగునీటిని అందించే లక్ష్యంతో చేపడుతున్న ఈ పథకాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించి మూడేళ్లలోనే పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది.
జిల్లా నేతలతో సీఎం సమీక్ష
గురువారం రాత్రి జిల్లా ఎంపీ ఏపీ జి తేందర్‌రెడ్డి ఇంట్లో సీఎం కేసీఆర్, నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో పాటు ముఖ్యఅధికారులతో కలిసి పాల మూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై సమీక్షించారు. వచ్చేనెలలో టెండర్లు పిలచి పనులను ప్యాకేజీలుగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. వలసలకు నిలయమైన జి ల్లాలో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణానది జలాలను కరువునేలకు అందించే పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఏర్పడింది.
ప్రాజెక్టు స్వరూపం ఇలా..
శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ గ్రామానికి సమీపంలో మొదటి పంప్‌హౌస్ ఏర్పాటుచేస్తారు. ఇక్కడి నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు. ఇక్కడినుంచి ఏదుల రిజర్వాయర్‌కు, అక్కడినుంచి వట్టెం రిజర్వాయర్ లో 14.37టీఎంసీల నీటిని నిల్వచేస్తారు. వట్టెం రిజర్వాయర్ పరిధిలో 20వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
అనంతరం ఇక్కడినుంచి ప్రధానకాల్వ ద్వారా లోకిరేవు రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు. తద్వారా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఇక్కడినుంచి రంగారెడ్డి జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్ చేస్తారు. రిజర్వాయర్ నుంచి నాలుగు ప్రధానకాల్వల ద్వారా సాగునీరందేలా డిజైన్‌చేశారు. దక్షిణ బ్రాంచి కాల్వ ద్వారా 20వేల ఎకరాలకు, తూర్పు కాల్వ ద్వారా 30వేల ఎకరాలకు, ఉత్తరకాల్వ ద్వారా 1.65లక్షల ఎకరాలకు, పడమర కాల్వ ద్వారా 1.30లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
వచ్చేనెలలోనే
పాలమూరు టెండర్ల ప్రక్రియ
ఈనెలాఖరులోగా పాలమూరు ఎత్తిపోతల పథకం డీపీఆర్ సిద్ధం చేసి డిజైన్‌ను ఈఎస్‌సీ డిజైన్స్ విభాగానికి పంపి అనుమతి రాగానే వచ్చేనెలలోనే టెండర్లను పిలిచేలా పనులను వేగంగా కొనసాగిస్తున్నాం. పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వీలైనంత త్వరగా పనులు చేపట్టేలా అన్నిదశల్లో ప్రయత్నాలు సాగుతున్నాయి.
- ఖగేందర్, చీఫ్ ఇంజనీర్
కరువు నేలకు జలకళ
Published Sun, Jul 12 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement
Advertisement