సాక్షి, అమరచింత (కొత్తకోట): కరోనా నేపథ్యంలో ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. భౌతిక దూరం పాటిస్తూ మస్క్‌లు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఓ వైపు అవగాహన కలి్పస్తున్నా.. మరోవైపు కోవిడ్ నిబంధనలు.. భౌతికదూరం పాటింపును గాలికొదిలేస్తున్నారు మరికొందరు. గుంపులు గుంపులుగా ఒకేచోట చేరడం.. మాస్‌్కలు ధరించకపోవడంతో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జూరాల ప్రాజెక్టు వద్ద 29 క్రస్టుగేట్లు తెరిచి వరద జలాలను దిగువకు వదులుతుండగా ఆ దృశ్యాలను చూసేందుకు ఆదివారం జిల్లాతోపాటు హైద్రాబాద్, నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల నుండి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రాజెక్టు పరిసరాలు ఎటు చూసినా.. జనసందోహం నెలకొంది. వందలాదిగా వాహనాలు ప్రాజెక్టు రహదారిపైకి రావడంతో ట్రాఫిక్‌జాం అయ్యింది. రెండు కిలోమీటర్ల పొడవున వాహనరాకపోకలకు అంతరాయం కల్గడంతో వాహనదారులు దాదాపు మూడు గంటల పాటు వాహనాల్లోనే ఇరుక్కుపోయే పరిస్థితి చోటుచేసుకుంది. పోలీసులు బందోబస్తు నిర్వహించకపోవడంతో మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం సందర్శకుల సందడి కనిపించింది. దేవరకద్ర పోలీసులు సమీపంలోనే బారికేడ్లను ఏర్పాటు చేయడం వల్ల వాహనాలకు అక్కడే నిలిపి కొందరు కాలినడకన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పిల్లలు, పెద్దలు, యువతి యువకులు సెలీ్ఫలు దిగుతూ ఆనందంగా కనిపించారు.
చేపలు పట్టిన ఎమ్మెల్యే..
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బండర్‌పల్లి చెక్‌డ్యామ్ వద్ద ఆదివారం కొద్ది సేపు గాలం వేసి చేపలు పడుతూ ఆనందించారు. చెక్‌డ్యామ్ నిండుగా ఉండడం అలుగు పారడంతో చేపలు నీటిలో ఎదురెక్కడంతో పలువురు గాలాలు వేసి చేపలు పట్టడం కనిపించింది.
బండర్‌పల్లి వద్ద గాలంతో చేపను పట్టిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
కనిపించని కరోనా భయం
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలను విధిస్తున్న ప్రజలు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలను పాటించలేక పోతున్నారు. భౌతిక దూరం, మాసు్కలను ధరించాలని చెబుతున్నా జూరాల ప్రాజెక్టుకు వస్తున్న పర్యాటకులు మాత్రం వీటిని పాటించలేక పోతున్నారు. ప్రాజెక్టు దిగువ భాగాన క్రస్టుగేట్ల నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తున్నా.. పర్యాటకులు మాత్రం సెల్ఫీల మోజులో పారుతున్న నీటిలో నిల్చోవడం, జలకాలాడడం, సెల్ఫీలు తీసుకోవడం పరిపాటిగా మారింది.
తేడా వస్తే ప్రవాహంలో కొట్టుకుపోతామన్న భయం కూడా కలగకపోవడం దిగువ జూరాల వద్ద ప్రాజెక్టు అధికారులు గాని పోలీసు సిబ్బందిగాని హెచ్చరిక బోర్డులతో పాటు సిబ్బందిని నియమించక పోవడంతో పర్యాటకులు పారే నీటిలో ఆటలాడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేగాక మద్యం విక్రయాలు కూడా చేపవంటకాల దుకాణాల వద్ద జోరుగా కొనసాగుతున్న సంబందిత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదిలాఉండగా, కోవిడ్ దృష్ట్యా పర్యాటకులు జూరాల ప్రాజెక్టు వద్దకు రావద్దని సూచించామని ఆత్మకూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీతయ్య, ప్రాజెక్టు ఈఈ పార్థసారథి పేర్కొన్నారు. అందరు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment