ధరూరు, న్యూస్‌లైన్ : నియోజకవర్గం లోని 184 గ్రామాలకు తాగు నీరందిం చేందుకు నిర్మించిన భారీ తాగునీటి పథ కం ట్రయల్న్ ్రమరో మారు విఫలమయింది. రూ. 72 కోట్ల వ్యయతో మం డల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ పనుల్లో భాగంగా 2008 ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ ట్రయల్న్ ్రనిర్వహిస్తూనే ఉన్నారు. దాదాపు వంద సార్లకు పైగానే ట్రయల్న్ ్రనిర్వహించడం...పగలడంతోనే సరిపోయింది.
మంగళవారం రాత్రి నిర్వహించిన ట్రయల్న్‌త్రో ధరూరు- మన్నాపురం గ్రామాల మద్య పైప్‌లైన్ పగిలిపోయింది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గాని, సంబంధిత కాంట్రాక్టర్లు కాని పట్టించుకోక పోవడంతో రాత్రంతా నీరు వృధా అయింది. మండల కేంద్రానికి చెందిన చిన్న వెంకట్రామిరెడ్డి, అల్వలపాడు యామరెడ్డి, ర్యాలంపాడు తిమ్మప్ప, సవారన్న, వెంకటన్న, తదితర రైతుల పొలాలు నీట మునిగాయి. గత వారం రోజుల క్రితం వేసిన వరి నాట్ల తో పాటు, కూరగాయల తోటలు, వేరు శనగ పంట కట్టలు తెగి నీటిలో మునిగిపోయాయి. బుధవారం ఉదయం బాధిత రైతులు తమ పొలాలకు వెళ్లి చూడడంతో పంట నీట మునిగిన విషయాన్ని గమనించి లబోదిబోమన్నారు. పొలం గెట్లు కోతకు గురై ఇసుక మేటలు పెట్టాయి. దీంతో తీవ్ర నష్టం ఏర్పడింది.
ఇసుక మేటలు పెట్టిన, నీట మునిగిన పంట నష్టం విలువ దాదాపు రూ. 2 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. స్థానిక విలేకర్లు పైపులు పగిలన ప్రాంతానికి చేరుకుని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ చేయడంతో పంపును నిలిపివేసి పైప్‌లైన్‌ను సరి చేస్తామన్నారు. నాసిరకం పైపులు వేయడం మూలంగా తరచూ పగిలిపోయి అటు రైతులకు, ఇటు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టాలను కొని తెస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్‌లైన్‌లు పగిలి తీవ్ర నష్టం జరిగిన రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
ప్రతీ సారి ఇక్కడే పగులుతోంది
ట్రయల్న్ ్రచేసిన ప్రతీసారి మా పొలాల వద్దనే పగులుతోంది. రాత్రి ట్రయల్న్ ్రచేయడం వల్ల పగిలిన పైప్‌లైన్‌ను గమనించలేకపోయాము. వేలకు వేలు ఖర్చు చేసి సాగు చేసుకున్న వరి పంట నీటిలో మునిగిపోయింది. తెల్లవారు జాము నుంచి ఫోన్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గెట్లు తెగిపోయాయి. పొలంలో ఇసుక మేటలు పెట్టాయి. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు.
- యామరెడ్డి, రైతు
అన్నదాతలపైనే
అన్ని ఆటుపోటులు రైతులపైనే కక్ష తీర్చుకుంటున్నాయి. దానికి తోడు పైప్‌లైన్ పగుళ్లు తీవ్ర దెబ్బ తీస్తున్నాయి. తాగునీరందేది దేవుడెరుగు. కానీ అదే తాగునీటి పైప్‌లు రోజూ ఏదో ప్రాంతంలో పగులుతున్నాయి. నష్టాన్ని ఎవరు భరిస్తారు. అధికారులు మాత్రం మేమింతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
-తిమ్మప్ప, రైతు
ట్రయల్ రన్...నూరో ‘సారీ’..!
Published Thu, Jan 23 2014 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement
Advertisement