venkatrami reddy
-
ఆ ఉద్యోగ సంఘాలనేతలపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నిత్యం కొన్ని పత్రికలు ప్రచురిస్తున్నాయని తెలిపారు. ఆయా పత్రికల క్లిప్పింగులను కూడా మీనాకు అందజేశారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తనను సస్పెండ్ చేశారని.. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొన్ని ఉద్యోగ సంఘాల నేతల వ్యాఖ్యలు కూడా ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘన కిందకే వస్తాయని వెంకట్రామిరెడ్డి వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈనాడు తప్పుడు కథనాల వల్లే.. మార్చి 31న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ హోదాలో తాను వైఎస్సార్ జిల్లాలో ఏపీపీటీడీ ఉద్యోగులను కలిసి వారి సమస్యలపై చర్చించానని వెంకట్రామిరెడ్డి తెలిపారు. అయితే అదే రోజు ఈనాడు పత్రిక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే ఉద్యోగులు మునిగిపోయారంటూ ఒక తప్పుడు కథనం ప్రచురించిందన్నారు. ఈ కథనాన్ని తాను ఖండిస్తూ విలీనం వల్ల ఉద్యోగులకు మేలే జరిగిందని.. ఉద్యోగుల గురించి తప్పుడు కథనాలు రాయొద్దని పత్రికా ప్రకటన విడుదల చేశానని తెలిపారు. దీంతో తనపై కక్ష కట్టిన ఈనాడు ఏప్రిల్ 2న తాను ఉద్యోగులతో మాట్లాడుతున్న ఫొటోను ప్రచురించి.. ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నానని తప్పుడు కథనం రాసిందన్నారు. ఈ కథనం ఆధారంగా తమపైన నాలుగు కేసులు పెట్టడంతోపాటు 11 మందిని సస్పెండ్ చేశారని వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పత్రికలు విష పురుగులు కొన్ని పత్రికలు రోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సంఘాల నాయకులతో మాట్లాడిస్తున్నాయని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని వెంకట్రామిరెడ్డి నిలదీశారు. ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేసింది అంటే తప్పు.. ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది అంటే అది కరెక్టా? అది కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వార్తలు రాయడమంటే ఇదేనా అని ధ్వజమెత్తారు. కొంతకాలంగా ఆ పత్రికలు తమకు నచ్చిన వారికి మేలు చేయడమే లక్ష్యంగా కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ పత్రికలు విష పురుగులతో సమానమన్నారు. ఎయిడ్స్, కరోనా లాంటివే ఈ పత్రికలు కూడా అని పేర్కొన్నారు. ఆ వ్యాధులకు మందు కనుక్కున్నారు కానీ ఈ పత్రికలకు మాత్రం మందు కనుక్కోలేకపోతున్నారన్నారు. ఉద్యోగుల సమాఖ్య తరఫున ఈనాడును బహిష్కరిస్తున్నామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. -
కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు
సాక్షి, సిద్దిపేట: ‘కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది. బీజేపీ నల్ల చట్టాలను తీసుకువచ్చింది’అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కానీ కేసీఆర్ రైతు నేస్తం అని, ఆయన చెప్పినవి, చెప్పనవి కూడా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ చెప్పినవే చేయడం లేదని, అందుకే ఆ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, ఆ పార్టీని నమ్మి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. రూ.90 వేలకోట్ల ఖర్చుతో కేసీఆర్ విద్యుత్ వ్యవస్థను బాగు చేశారన్నారు. కేసీఆర్ పాలనలో పదేళ్లు కరువే లేదన్నారు. కాంగ్రెస్ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చిందన్నారు. మళ్లీ బోర్లలో పూడిక తీసుడు.. కరెంటు మోటార్లు కాలుడు మొదలైందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు చురక పెడితేనే దారికొస్తారన్నారు. సమావేశం అనంతరం కార్యకర్తలకు హరీశ్‌రావు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
గుమ్మనూరు జయరాం ఒక నమ్మక ద్రోహి.
-
వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు
పి.గన్నవరం: సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు జరిగిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయన అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 1.36 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని కొనియాడారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏపీజీఈఎఫ్) వైస్ చైర్మన్ విప్పర్తి నిఖిల్ కృష్ణ ఆధ్వర్యాన ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మూడు రోడ్ల సెంటర్ నుంచి దుర్గమ్మ గుడి వరకూ వివిధ శాఖల ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులకు అండగా నిలిచి, గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసినందుకు ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కరోనా వంటి కష్టకాలంలో ఆర్థిక శాఖ అధికారులు వద్దన్నా కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ అమలు చేశారన్నారు. అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్న ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి ‘మన ప్రభుత్వం – మన ప్రగతి’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. -
మనకు లక్షల ఉద్యోగాలిచ్చిన జగన్ ప్రభుత్వ ప్రతిష్టను పెంచుదాం
సాక్షి, అమరావతి: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే మారుమూల గ్రామీణ ప్రజలకు సైతం సొంత గ్రామాల్లోనే సంపూర్ణంగా ప్రభుత్వ సేవలందించే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా 1.36 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. మరో 2.66 లక్షల మందిని వలంటీర్లగా నియమించారు. తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉపాధి పొందారు. అందువల్ల మనకు లక్షల ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రతిష్టను మనమూ పెంచుదాం’ అంటూ ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి సచివాలయాల ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీజీఈఎఫ్ సెక్రటరీ జనరల్ అరవ పాల్, సచివాలయాల ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ట్రెజరర్ మధుబాబు తదితరులతో కలిసి శుక్రవారం అనంతపురంలో ఈ లేఖను విడుదల చేశారు. బహిరంగ లేఖలోని ముఖ్యాంశాలు.. ఇచ్చిన మాట ప్రకారం.. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి 10 మంది ఉద్యోగులను నియమించి ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం రాకుండా అన్ని సేవలూ గ్రామంలో వారి ఇంటి దగ్గర అందిస్తామని చెప్పినప్పుడు కొందరు హేళన చేశారు. కానీ ప్రజలు నమ్మారు. బ్రహ్మరథం పట్టారు. చెప్పిన మాట ప్రకారమే వైఎస్ జగన్ సీఎం అయిన మూడు నెలల్లోనే పాలనా వ్యవస్థలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. కొన్ని సమస్యలు ఉండొచ్చు.. కానీ.. సచివాలయాల ఉద్యోగులకు సమస్యల్లేవని, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. సమస్యలు ఒకటి పోతే ఒకటి రిటైరయ్యే వరకు వస్తూనే ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుందాం. సీఎం వైఎస్ జగన్ ఎన్నో కష్టనష్టాలకోర్చి సచివాలయాల వ్యవస్థను రూపుదిద్దుతుంటే ఓర్చుకోలేని కొందరు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రొబేషన్ ఖరారు కాకముందు ఎంత మంది హేళన చేశారో అందరికీ తెలుసు. ఒక మాజీ మంత్రి మేం అధికారంలోకి వస్తే సచివాలయాల ఉద్యోగులను తొలగిస్తామని అన్నట్టు వార్తలు వచ్చాయి. మరో ముఖ్య నాయకుడు ఈ వ్యవస్థ పనికిమాలినదని అన్నాడు. ఇంకో నాయకుడు ఈ వ్యవస్థలో భాగమైన వలంటీర్ల గురించి నీచంగా మాట్లాడాడు. కానీ ఈరోజు ఎవరైనా మన సచివాలయ వ్యవస్థను టచ్ చేయగలరా? ఒకవైపు ఈ వ్యవస్థ గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని కొందరు చూస్తుంటే.. సీఎం జగన్ సచివాలయాల ఉద్యోగులపై నమ్మకముంచి కీలకమైన స్థానం కల్పించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టడానికి కొన్ని చానళ్లు, పత్రికలు విషపు రాతలతో అసత్యాలు ప్రచారం చేస్తూ మానసిక దాడి చేస్తున్నాయి. ఈ దుష్ప్రచారాలను అడ్డుకోవాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపైనే ఉంది. ప్రజలకు వాస్తవాలు వివరించడానికి ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరూ రోజుకు ఇద్దరిని చైతన్యం చేయాలి. ఇలా రాబోయే 50 రోజుల్లో కనీసం వంద మందిని చైతన్యం చేయాలని కోరుతున్నా’ అనివెంకట్రామిరెడ్డి ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇంకెవరన్నా అయితేనా.. ‘వైఎస్ జగన్ కాకుండా వేరే ఎవరైనా సచివాలయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయాలనుకుంటే.. ఈ వ్యవస్థ ఏర్పాటుకు సంవత్సరం పట్టేది. ఆ తర్వాత ఉద్యోగాల నియామక నోటిఫికేషన్‌కు మరో సంవత్సరం, పరీక్షలకు ఇంకో సంవత్సరం, నియామకాలకు మరో సంవత్సరం తీసుకొనేవారు. 2024 ఎన్నికలకు నియామకాలు చేపట్టి, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిపిస్తేనే ప్రొబేషన్ ఇస్తామని ఓట్ల రాజకీయం చేసేవారు. కానీ, మన ముఖ్యమంత్రి అవేమీ ఆలోచించకుండా ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మూడు నెలల్లోనే ఇంత పెద్ద వ్యవస్థకు ప్రాణం పోశారు. తర్వాత 010 పద్దు కింద జీతాలు ఇచ్చారు. ప్రసూతి సెలవులు ఇచ్చారు. ప్రొబేషన్ ఖరారులో ఇబ్బంది లేకుండా శాఖాపరమైన పరీక్షల్లో నెగెటివ్ మార్కులు తొలగించారు. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కరోనా రూపంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవడంతో సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ వాయిదా వేయాలని అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా సీఎం జగన్మోహన్రెడ్డి పట్టించుకోలేదు. ప్రొబేషన్ డిక్లేర్ చేసి, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చారు.’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు సీఎం నెరవేర్చారు
కుప్పం(చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న పారదర్శక పాలనలో ప్రతి ఉద్యోగి భాగస్వామి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్(ఏపీజీఈఎఫ్) చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఏపీజీఈఎఫ్ ఆధ్వర్యాన ఆదివారం కుప్పం పట్టణంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీసీఎన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశంలో వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. నాలుగేళ్లలో ఉద్యోగులకు సంబంధించిన 42 సమస్యలను పరిష్కరించారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన 10 హామీల్లో 8 అమలు చేశారని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వంపై ఏడాదికి రూ.3 వేల కోట్లు అదనపు భారం పడుతుందని తెలిసినా, ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని విలీనం చేసి కారి్మకుల జీవితాల్లో వెలుగులు నింపారని ప్రశంసించారు. కరోనా సమయంలో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని, మన దగ్గర నెలనెలా జీతాలు అందజేశారని తెలిపారు. గతంలో ఉద్యోగులు ఇంక్రిమెంట్ కోసం రోడ్లపై ధర్నాలు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు అలాంటి సమస్య లేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో 1.30లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వారిని రెగ్యులరైజ్ చేసిన ఘనత ’ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. రెవెన్యూశాఖలో పనిచేస్తున్న 3,790 మంది వీఆర్వోలకు, పంచాయతీరాజ్‌లో 1,500 మందికి పదోన్నతులు కల్పించారని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. పదేళ్లుగా ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారికి త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ రాకపోవడానికి సీఎం కారణం కాదని, కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులే కారణమని ఆయన స్పష్టంచేశారు. ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు ప్రభుత్వంపై నిందలు మోపేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే క్రమంలో ఉద్యోగులను రెచ్చగొట్టి రోడ్లపైకి పంపి నిరసన తెలపాలని, ధర్నాలు చేయాలని ప్రోత్సహిస్తున్నాయని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా ఫెడరేషన్ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని చెప్పారు. అవసరమొచ్చినప్పుడు రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్సీలు భరత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగుల సంఘ నేత చల్లా చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సంఘం గవర్నర్‌ను కలవడం పబ్లిసిటీ స్టంట్: వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి/ విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్‌ను కలవడం పబ్లిసిటీ స్టంట్ అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య(జీఇఎఫ్) అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించినట్టు ఆయన స్పష్టం చేశారు. కాగా, వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించిన తర్వాత గవర్నర్‌ను కలవడమేంటని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే వీఆర్ఏలు, ఎండీవోలకు పదోన్నతులు వచ్చాయి. సచివాలయ ఉద్యోగులకు ప్రొహిబిషన్ డిక్లేర్ చేయలేదా?. గతంలో ఉద్యోగుల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. అంతకు ముందు.. సూర్యనారాయణపై ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యనారాయణ ఉద్యోగ సంఘాలను విమర్శించడం మానుకోవాలి. ఆయన ఉద్యోగుల గురించి మాట్లాడితే బాగుంటుంది. మీరు ఛాంపియన్‌లా.. మమ్మల్ని చవటల్లా చిత్రీకరిస్తే ఊరుకోము. 11 పీఆర్సీలు సాధించిన ఘనత మా సంఘానిది. గవర్నర్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై మాట్లాడకుండా మాపై విమర్శలు చేస్తున్నారు. నీ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులను తాకట్టు పెట్టొద్దు. సీఎం వైఎస్ జగన్ చర్చలకు పిలిస్తే.. నువ్వు ఎందుకు శ్రీకాకుళం పారిపోయావు అని ప్రశ్నించారు. -
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ స్వీప్
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో కె.వెంకట్రామిరెడ్డి ప్యానల్ స్వీప్ చేసింది. ఒక్క ఉపాధ్యక్షుడు మినహా మిగతా స్థానాల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ సభ్యులే విజయం సాధించారు. గతంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె.వెంకట్రామిరెడ్డి బుధవారం జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వెంకట్రామిరెడ్డి 288 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వెంకట్రామిరెడ్డికి 720 ఓట్లు రాగా ప్రత్యర్థిగా పోటీ చేసిన రామకృష్ణకు 422 ఓట్లు వచ్చాయి. వెంకట్రామిరెడ్డి ప్యానల్లో వైస్ ప్రెసిడెంట్‌గా సత్య సులోచన, అదనపు కార్యదర్శిగా వి.గోపీ కృష్ణ, సంయుక్త కార్యదర్శి (సంస్థ)గా యు.మనోహర్, జాయింట్ సెక్రటరీ (మహిళలు)గా రమాదేవిరెడ్డి, జాయింట్ సెక్రటరీ (క్రీడలు)గా ఎ.సాయి కుమార్, కోశాధికారిగా కె.వెంకటరావు విజయం సాధించారు. అలాగే వెంకట్రామిరెడ్డి మద్దతుదారులు ఇద్దరు జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడగా అందులో ఒక మద్దతుదారైన శ్రీకృష్ణ జనరల్ సెక్రటరీగా 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సీఎం జగన్‌ను కలిసిన వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కాకర్ల వెంకట్రామిరెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
సీఎం జగన్‌కు ఏపీపీటీడీ ఉద్యోగుల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగం (ఏపీపీటీడీ)కు చెందిన వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంను కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న సదుపాయాలన్నీ పీటీడీ ఉద్యోగులకు కూడా కల్పిస్తున్నారని ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారం అక్టోబర్ ఒకటి నుంచి పెరిగిన జీతాలు తమకు ఇస్తుండటంపై కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసినవారిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డీఎస్పీ రావు, రాష్ట్ర నాయకులు ఎ.రాధాకృష్ణ, డి.ఏడుకొండలు తదితరులు ఉన్నారు. అక్టోబర్ 1 నుంచి పెరిగిన వేతనాలు.. అక్టోబర్ 1న ఆర్టీసీ ఉద్యోగులందరికీ పీఆర్సీ మేరకు పెరిగిన వేతనాలు అందుతాయని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అక్టోబర్ ఒకటిన పెంచిన వేతనాలివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారన్నారు. ప్రభుత్వ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని విన్నవించామని తెలిపారు. అలాగే పలు కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, గురుకులాలు, విద్యాసంస్థల్లో ఉద్యోగులకు కూడా పెంచాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. తమ విన్నపాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. పదవీ విరమణ వయసు పెంపుపై దస్త్రాన్ని సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారని తెలిపారు. -
ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధం
సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోలతో ఉద్యోగులకు జరిగే అన్యాయాన్ని సరిదిద్దాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సచివాలయంలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ర్యాలీ చేశారు. అనంతరం వెంకట్రామిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. రెండు నెలలుగా ఉద్యోగుల సమావేశంలో చెప్పిన వాటినే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీడియాకు చెప్పి అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ‘సీఎస్ మీడియా సమావేశం ఉద్యోగులను రెచ్చగొట్టినట్టయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులకు ఎక్కడ నష్టం జరుగుతోంది? వారు ఎందుకు ఆందోళన చేస్తున్నారో ఆలోచించాలి. మేము ఎక్కువ కోర్కెలు కోరట్లేదు. మేము అనేక అంశాల్లో వెనక్కి తగ్గాం. జీతం తగ్గితే ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. కానీ జీవోలో 2019 నుంచి ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేస్తామంటున్నారు. అసలు మాకు చెప్పిందేమిటి.. చేస్తోందేమిటి? కొందరు అధికారులకు ఉద్యోగులను రెచ్చగొట్టడం తప్ప వేరే ఉద్దేశం లేనట్టుంద’ని మండిపడ్డారు. పీఆర్సీలో డీఏలు కలిపి జీతం పెరిగిందనే మాట చెప్పొద్దన్నారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ 4 శాతం తక్కువ ఇచ్చి, హెచ్ఆర్ఏలో 14 శాతం కోత వేసి.. జీతం పెరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పీఆర్సీ అమలు సమయంలో ఉద్యోగుల నుంచి ఐచ్చికాలు తీసుకోకుండా అధికారులు అత్యుత్సాహంతో ఎలాగైనా అమలు చేసేందుకు తాపత్రయ పడుతున్నారన్నారు. ఉద్యోగుల్లోని ఆందోళన, ఆవేదన గుర్తించి ప్రభుత్వం చర్చలు జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారికి మినిమం పే స్కేల్‌ను వర్తింపజేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి ఏటా వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే సోమవారం మరోసారి ఉద్యోగుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు.. న్యాయమైన పీఆర్సీ కోసం ఒకే కార్యచరణ, ఒకే వాదనతో అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. గురువారం సచివాలయంలో ఉద్యోగుల నిరసన కార్యక్రమం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పరస్పర అంగీకారంతో ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు. ప్రతి ఉద్యోగి ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. విభజన దగ్గర నుంచి కరోనా వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొంత ప్రభావం ఉందనేది వాస్తవమేనని, అది ఉద్యోగుల జీతాలు తగ్గించాల్సినంతగా లేదన్నారు. ఉద్యోగులకు ప్రస్తుతం వస్తున్నదాని కంటే తగ్గకుండా జీతాలు ఉండాలని సీఎం సూచించినట్టు అధికారులు అనేకసార్లు చెప్పారన్నారు. అయితే ముఖ్యమంత్రి చెప్పిన దానికి.. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల మధ్య చాలా వైరుధ్యం ఉందని తెలిపారు. ప్రతి ఉద్యోగి తన జీతంలో తగ్గుదలను గ్రహించి ఆందోళనకు దిగారన్నారు. ఎటువంటి భేషజాలకు పోకుండా అంతిమంగా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం కోసం నాయకులందరూ కలిసి పోరాటం చేస్తున్నట్టు వివరించారు. -
పచ్చని పల్నాడులో చిచ్చు పెడుతున్నారు
వెల్దుర్తి (మాచర్ల): పచ్చని పల్నాడులో చిచ్చు పెట్టడానికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే), వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహించదని తెలిపారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాల్సిన అవసరం పిన్నెల్లి కుటుంబానికి లేదని స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రయ్య హత్య బాధాకరమని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ హత్యపై పోలీసులు పూర్తిగా విచారించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హత్యా రాజకీయాలకు దూరంగా ఉండటంవల్లనే తమ కుటుంబాన్ని వరుసగా ఐదుసార్లు ఇక్కడి ప్రజలు గెలిపించారని చెప్పారు. గత 15 సంవత్సరాల్లో పల్నాడులో హత్యలు జరగలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఎటువంటి గొడవలు లేవని తెలిపారు. ఇన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పల్నాడుకు ఫ్యాక్షన్ ముద్ర ఉన్న నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డిని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించటం వల్లే మళ్లీ ఫ్యాక్షన్ మొదలవుతోందని చెప్పారు. గతంలో ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంబ మాచర్ల ఎమ్మెల్యేగా చేసిన సమయంలోనే అనేక ఫ్యాక్షన్ హత్యలు జరిగినట్లు తెలిపారు. బ్రహ్మారెడ్డి 15 హత్యలు చేయించాడన్నారు. చంద్రయ్య హత్య ఎందుకు జరిగిందో చంద్రబాబు తెలుసుకొని మాట్లాడాలన్నారు. దీనిని రాజకీయ హత్యగా చూపుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీతో సంబంధం లేని సంఘటనలను కూడా రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ చూస్తోందని విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు మామూలేనని, ప్రభుత్వం మీద, సీఎం జగన్ పైన నిత్యం అసత్యాలు ప్రచారం చేయటం పరిపాటిగా మారిందని అన్నారు. పక్క నియోజకవర్గాల నుంచి నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీసుకొచ్చి బెదిరించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎవరు ఎలాంటి వ్యక్తులో ఎవరి హయాంలో గొడవలు జరుగుతున్నాయో పల్నాడు ప్రజలకు తెలుసునని అన్నారు. గుండ్లపాడు చాలా సున్నితమైన గ్రామమని, గతంలోనూ హత్యలు జరిగాయని, ఇప్పుడు ఏమీ ఎన్నికలు లేని సమయంలో హత్యలెందుకు జరుగుతాయని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రం ముందుకెళ్తుంటే సహించలేని చంద్రబాబు ఈ హత్యను వైఎస్సార్సీపీ మీద రుద్దాలని చూస్తున్నారన్నారు. -
పీఆర్సీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు తగవు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల ముసుగులో కొందరు రాజకీయాలు చేస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. సచివాలయ ప్రాంగణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల్లో లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిజానికి.. పీఆర్సీ జాప్యంపై ఉద్యోగుల్లో కొంతవరకు అసంతృప్తి ఉన్నా, వారు ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకంగా లేరని ఆయన స్పష్టంచేశారు. కానీ, కొన్ని సంఘాల నాయకులు పదేపదే ఉద్యోగులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, అది తగదని హితవు పలికారు. సీఎం హామీ మేరకు పది రోజుల్లో పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందన్న విశ్వాసం తమకుందన్నారు. అందుకే ఏపీ ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్‌లోని 92 సంఘాలు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నాయని.. రెండు సంఘాలు మాత్రమే తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకున్నాయన్నారు. ఆందోళన చేస్తున్న వారు గతంలో సీఎంను మూడుసార్లు కలిసినప్పుడు తమ మాజీ అధ్యక్షుడికి పదవి ఇవ్వమని అడిగారే తప్ప పీఆర్సీ గురించి ప్రస్తావించలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సీఎం జగన్‌కు మద్దతిచ్చారేమో గానీ సదరు నాయకులు కాదన్నారు. వీరు గతంలో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రచారంచేసి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాశారని ఆరోపించారు. సీఎం చెప్పిన సమయం వరకూ వేచి చూడాల్సిన కనీస ధర్మం ఉద్యోగులుగా తమపై ఉందన్నారు. అప్పటికీ జాప్యం జరిగితే తమ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తెలిపారు. -
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు కోర్టుధిక్కరణే
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు, సుప్రీంకోర్టులు ఆదేశించినా వరి విత్తనాలు అమ్మినవారి దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వనంటూ సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కోర్టుధిక్కరణ కిందకు వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయంటూ ఈ వ్యవహారాన్ని సుమోటోగా కోర్టుధిక్కరణ కింద విచారణకు స్వీకరించింది. ఈ మేరకు వెంట్రామిరెడ్డికి మంగళవారం నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. యాసంగిలో ఒక్క కిలో వరి విత్తనాలు కూడా అమ్మడానికి వీల్లేదని, తన మౌఖిక ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా విత్తనాలు అమ్మితే వారి దుకాణాలు సీజ్ చేస్తామని, కోర్టులు ఆదేశించినా వాటిని తెరిచేందుకు అనుమతి ఇవ్వమంటూ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. చదవండి: గిన్నిస్ బుక్‌లో రికార్డులు సృష్టిస్తున్న శ్రీ వాస్తవ.. ఇంతకీ ఏం చేస్తోంది వీటి పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్.. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు కోర్టుధిక్కరణ కిందకు వస్తాయని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన న్యాయమూర్తిని కోరారు. స్పందించిన ధర్మాసనం కోర్టుధిక్కరణ వ్యాజ్యంగా విచారించింది. వెంకట్రామిరెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇదే విషయాన్ని సింగిల్ జడ్జి వద్ద తెలియజేశామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఇదిలా ఉండగా, రాజ్యాంగ ధర్మాసనాలను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన వెంకట్రామిరెడ్డిపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నేత తూంకుంట నర్సారెడ్డి దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే తాము కోర్టుధిక్కరణ కింద నోటీసులు జారీచేసిన నేపథ్యంలో మరో పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది. తాము విచారిస్తున్న పిటిషన్లో వాదనలు వినిపించుకోవచ్చని స్పష్టం చేసింది. ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోండి.. వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయ్యింది. ఆయన నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశించాలని, రాజీనామాను కూడా ఆమోదించకుండా ఆదేశాలు జారీచేయాలంటూ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఇప్పటికే ఆయన నామినేషన్‌ను స్వీకరించి ఎమ్మెల్సీగా ఎన్నిక ప్రక్రియ పూర్తయినందున.. ఐఏఎస్ అధికారిగా రాజీనామా ఆమోదంపై అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది. ఐఏఎస్ అధికారుల రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదించే అధికారం లేదంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన శంకర్‌తోపాటు మరొకరు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సోమవారం సాయం త్రం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడి యం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, పాడి కౌశిక్‌రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి ఉన్నారు. శాసనమండలి ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు ఈ నెల 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరించగా, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు అభ్యర్థులతోపాటు మరో ఇద్దరు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురవడంతో బరిలో టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు మాత్రమే మిగిలారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అభ్యర్థులు సాయంత్రం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమకు చట్టసభలో అవకాశమిచ్చిన పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణను చూసి ఓర్వలేకనే..: కడియం శ్రీహరి ‘అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తాం. అభివృద్ధిలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ అన్ని ప్రాంతాలు, వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు కావస్తుండగా, జీడీపీ భారీగా తగ్గి కరోనా సమయంలో అట్టడుగుకు పడిపోయింది. మోదీ పాలనాదక్షుడైతే దేశ జీడీపీ ఎలా తగ్గిందో రాష్ట్ర బీజేపీ నేతలు వివరించాలి. ధాన్యం సేకరణ అంశం కేంద్రం పరిధిలోనిదే అయినప్పటికీ కొనుగోలు చేయకుండా సమస్యలు సృష్టిస్తోంది’ అని శ్రీహరి అన్నారు. -
వెంకట్రామిరెడ్డి రాజీనామా ఆమోదం చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట పూర్వ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా ఆమోదం చట్టవిరుద్ధమంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కరీంనగర్ జిల్లాకు చెందిన జె.శంకర్, ఆంథోల్ ప్రాంతానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్‌లు గురువారం ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా భోజన విరామం తర్వాత విచారించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. దీనికి ధర్మాస నం నిరాకరించింది. ‘వెంకట్రామిరెడ్డి 2011లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. ఐఏఎస్ అధికారుల నియామకాలు చేపట్టేది రాష్ట్రపతి. వారు కేంద్ర ప్రభుత్వ అ«దీనంలో ఉంటూ.. విధులు నిర్వహిస్తారు. వారి రాజీనామా ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఐఏఎస్ అధికారులు రాజీనామా చేయడానికి 3 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలి. వెంకట్రామిరెడ్డి రాజీనామాతో ఆయనపై ఎటువంటి కేసులు పెండింగ్‌లో లేవని నిర్ధారిస్తూ విజిలెన్స్ విభాగం నివేదికను జతచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన దరఖాస్తును కేంద్రానికి పంపాలి. వీటన్నింటినీ పరిశీలించకుండా రాజీనామా ఆమోదించడం చట్టవిరుద్ధం. అయితే వెంకట్రామిరెడ్డి 14న స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే అదే రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించినట్లుగా పత్రికల్లో కథనాలొచ్చాయి. వెంటనే టీఆర్ఎస్లో చేరి 16న ఎంఎల్సీ అభ్యరి్థగా నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్ తిరస్కరించేలా ఆదేశించండి’ అని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్లో కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) ముఖ్య కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి, తెలంగాణ శాసన మండలి కార్యదర్శి, ఎంఎల్సీ ఎన్నికల రిటర్నింగ్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో పి.వెంకట్రామిరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. -
కలెక్టర్ టు పొలిటీషియన్.. వెంకట్రామిరెడ్డి జర్నీ ఇలా..
సాక్షి, సిద్దిపేట: కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. నాలుగున్నర ఏళ్ల పాటు పాలనాధికారిగా జిల్లాకు సేవలందించి సోమవారం పదవీకి రాజీనామా చేశారు. జిల్లాలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు, సూచనలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల అమలులో తనదైన ముద్ర వేసుకున్నారు. ► ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. ► ఆ సమయంలోనే సీఎం దత్తత గ్రామం ► ఎర్రవల్లికి ప్రత్యేకాధికారిగా పనిచేశారు. ► ఆ గ్రామస్తులతో నిత్యం మాట్లాడుతూ అభివృద్ధికి కావల్సిన పనులపై , సూక్ష్మసేద్యం, పంటకాలనీల ఏర్పాటు, ఇంటింటికీ సోలార్ సిస్టం ఇలా సీఎం, మంత్రి హరీశ్‌రావు సలహాలు సూచనలతో ప్రజలకు అవసరమైన ప్రయోజనాలు చేకురేలా కృషి చేశారు. ► ముఖ్యమంత్రి తొలిసారిగా ఆ బాధ్యతలు అప్పగించడంతో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి లక్ష్యాలను చేరుకున్నారు. ► జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపొచమ్మ సాగర్ ప్రాజెక్ట్‌లు, గజ్వేల్, సిద్దిపేట రైల్వేలైన్ నిర్మాణాలకు భూసేకరణలో కీలకంగా వ్యవహరించారు. కలెక్టరేట్ ప్రారంభ సమయంలో వెంకట్రామిరెడ్డిని ఆశీర్వదిస్తున్న సీఎం కేసీఆర్(ఫైల్) ► మూడు సాగునీటి ప్రాజెక్టులు, రైల్వేలైన్, గజ్వేల్ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఆయన ఆధ్వర్యంలో జిల్లాలో దాదాపు 50 వేల భూసేకరణ చేశారు. ► 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి నల్లానీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభించారు. ► నల్లా కనెక్షన్లను వందశాతం త్వరితగతిన అందజేయడంతో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో నిలిచేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. ► మల్లన్నసాగర్లో ముంపు గ్రామాల ప్రజలకు గజ్వేల్ సమీపంలోని ముట్రాజ్‌పల్లి ప్రాంతంలో దాదాపు 6,000 వేల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ► సీఎం ప్రాతినిథ్యం వహించే జిల్లా కావడంతో జిల్లా అభివృద్ధిని ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళ్లే వారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సిద్దిపేట జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతీసారి కలెక్టర్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసి ప్రశంసించారు. –డిసెంబర్ 20,2020న సిద్దిపేటలోని కేసీఆర్ కాలనీలో డబుల్ బెడ్ రూంల ప్రారంభోత్సవం సమయంలో దండోడు, మొండోడు అని తన పట్టుదల గురించి ప్రశంసించారు. ► అలాగే గజ్వేల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గజ్వేల్‌కు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అని చెప్పారు. సీఎంకు ఆయన విధేయుడిగా పని చేశారు. జిల్లాతో అనుబంధం ► 2002–04 వరకు మెదక్ ఉమ్మడి జిల్లా డ్వామా పీడీగా పని చేశారు. ► 24, మార్చి 2015 నుంచి 10, అక్టోబర్ 2016 వరకు ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ► ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం 11 అక్టోబర్, 2016న సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ► 2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో 8 నెలల పాటు సిరిసిల్ల కలెక్టర్‌గా, తర్వాత సిద్దిపేట కలెక్టర్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో 15 రోజుల పాటు సంగారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత యథావిధిగా సిద్దిపేట కలెక్టర్‌గా సేవలందించారు. -
Siddipet: వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం
-
Siddipet: కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా?
-
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ్రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఐఏఎస్ నుంచి ఉద్యోగ విరమణ చేస్తున్నట్లు ఆయన పెట్టుకున్న దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఆ వెంటనే తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెంకట్రామ్రెడ్డి వెల్లడించారు. అనంతరం రాత్రి తన సోదరుడితో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. వెంకట్రామ్రెడ్డి కొంతకాలంగా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతుండగా, గత ఏడాది నవంబర్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార పార్టీ తరపున ఆయన పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఓ నిర్మాణ సంస్థకు యజమానులుగా ఉన్న వెంకట్రామ్రెడ్డి కుటుంబానికి టీఆర్ఎస్కు చెందిన ఓ మాజీ మంత్రి కుటుంబంతో సన్నిహిత బంధుత్వం ఉంది. ఆయన ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్లో అధికారికంగా చేరే అవకాశముంది. ఇదిలాఉంటే శాసన మండలి స్థానిక సంస్థల కోటాలో పోటీ చేసేందుకు కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ పొందిన తర్వాతే వెంకట్రామ్రెడ్డి ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 11న కేసీఆర్‌తో భేటీ తర్వాత వెంకట్రామ్రెడ్డి ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. శాసనమండలి ఎన్నికలో స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ లేదా మెదక్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వెంకట్రామ్రెడ్డి స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినప్పటికీ దీర్ఘకాలంగా తాను ఐఏఎస్ అధికారిగా పనిచేసిన మెదక్ నుంచే శాసన మండలికి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆదర్శంగా సిద్దిపేట తెలంగాణను అణువణువూ అర్థం చేసుకున్న కేసీఆర్ రాష్ట్రాన్ని తన అపార అనుభవంతో అభివృద్ధి చేశారని వెంకట్రామ్రెడ్డి కొనియాడారు. తన పదవీ విరమణ దరఖాస్తు ఆమోదం పొందాక తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా సిద్దిపేట జిల్లాలో ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేటను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఎన్నో కొత్త ఆలోచనలకు సిద్దిపేట జిల్లా వేదికైంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎక్కువగా అభివృద్ధి సాధించింది. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామిగా మారడం ఆనందంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 9వేల కుటుంబాలకు ఇబ్బంది లేకుండా భూ సేకరణ జరిపాం. ముంపు గ్రామాలను ఖాళీ చేయించిన సమయంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా చూశాం. 26 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఏడేళ్లపాటు మెదక్ జిల్లాలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. సీఎం కేసీఆర్ తనను అనేక కార్యక్రమాల్లో భాగస్వామిని చేశారు’ అని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారా అని ప్రశ్నకు సీఎం కేసీఆర్ తనకు ఏ పదవి అప్పగించినా కష్టపడి పనిచేస్తానని బదులిచ్చారు. చదవండి: ‘టీఆర్ఎస్-బీజేపీలవి పగటి వేషగాళ్లలా దోస్తీ-కుస్తీ నాటకాలు’ గ్రూప్–1 అధికారిగా ప్రభుత్వ సర్వీసులోకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) ఓదెల మండలం ఇందుర్తికి చెందిన పి.వెంకట్రామ్రెడ్డి 1996లో డిప్యూటీ కలెక్టర్ హోదాలో గ్రూప్–1 అధికారిగా ప్రభుత్వ సర్వీసులోకి వచ్చారు. బందరు, చిత్తూరు, తిరుపతి ఆర్డీఓగా, మెదక్ డ్వామా పీడీ, హుడా కార్యదర్శి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఇన్కాప్ ఎండీగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. గత ఏడాది దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కొంతకాలం సిరిసిల్ల కలెక్టర్‌గా బదిలీపై వెళ్లి తిరిగి సిద్దిపేట కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సెప్టెంబర్, 2022 వరకు పదవీకాలం ఉంది. వివాదాలు... సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం సమయంలో వెంకట్రామ్రెడ్డి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడంపై విమర్శలు వచ్చాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ విషయంలో హైకోర్టులో భూ నిర్వాసితుల పిటిషన్ వేయడంతో జరిమానా, శిక్ష సైతం విధించిన విషయం తెలిసిందే. తాజాగా రైతుల విషయంలో మాట్లాడిన మాటలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
వరి సాగు చేస్తే ఊరుకునేది లేదు: సిద్ధిపేట కలెక్టర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, మెదక్: సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తాజాగా ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. వరి సాగు చేస్తే ఊరుకునేది లేదని, రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు విక్రయించినా ఊరుకునేది లేదని.. అమ్మితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. వ్యాపారం రద్దు చేసి షాపుని మూయిం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. డీలర్లు సుప్రీం కోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా షాపు ఓపెన్ చేసేది లేదని తేల్చిచెప్పారు. ‘నేను చెప్పిన దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు జడ్జి చెప్పినా, రాష్ట్ర హైకోర్టు జడ్జి చెప్పినా, ప్రజా ప్రతినిధులు చెప్పినా నేను కలెక్టర్‌గా ఉన్నంతకాలం ఎటువంటి పరిస్థితులలో షాపులు తెరుచుకోవు. ఒకవేళ డీలర్లు విత్తనాలు అమ్మితే సంబంధిత ఏఈవోలు, అధికారులు సస్పెండ్ అవుతారు.’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి. -
లక్ష మందితో నవంబర్‌లో సీఎంకు కృతజ్ఞత సభ
సాక్షి, అమరావతి: నవంబర్‌లో లక్ష మందితో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించినట్టు ఆ సంఘం గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు. విజయవాడ ఆర్టీసీ సమావేశ మందిరంలో ఆదివారం కార్యవర్గ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ రెండో తేదీ నాటికి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరిన వెంటనే సీఎం సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారని చెప్పారు. చదవండి: Andhra Pradesh: ఊరికి ఆరోగ్య రేఖ తదనుగుణంగా ఆ ప్రక్రియ జరుగుతోందని, డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉత్తీర్ణులైన ఉద్యోగులందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వానికి విన్నవించుకుంటూ పలు తీర్మానాలు చేశామన్నారు. డిపార్టుమెంటల్ టెస్ట్ లేని 8 శాఖలకు ఎటువంటి పరీక్షలు లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని, ప్రసూతి సెలవులో ఉన్న మహిళా ఉద్యోగుల సెలవు దినాలను పనిదినాలుగా పరిగణించి వారిక్కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరారు. స్లైడింగ్‌లో శాఖ మారిన ఉద్యోగుల మొత్తం సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మహిళా పోలీసుల విషయంలో ఆప్షన్ ఇచ్చి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని వెంకట్రామిరెడ్డి కోరారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అంజిరెడ్డి సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని 35 మందితో ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడిగా భీమిరెడ్డి అంజిరెడ్డి, వర్కింగ్ అధ్యక్షులుగా నిఖిల్ కృష్ణ, సుధాకర్, భార్గవ్, ప్రధాన కార్యదర్శిగా బత్తుల అంకం రామారావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా బీఆర్ఆర్ కిషోర్, ఉపాధ్యక్షులుగా పి.హరీష్, కిషోర్, బాజిని ఎన్నుకున్నారు. చదవండి: వడివడిగా ‘ఈ పంట’ నమోదు -
‘కరోనాకు బలి చేయవద్దని కోరుతున్నాం’
సాక్షి, అమరావతి: ఎన్నికలు వద్దని తాము ఎప్పుడూ చెప్పలేదని, తమకు వ్యాక్సిన్ ఇచ్చాక జరపాలని కోరామని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని, కరోనాకు బలి చేయవద్దని మొదటి నుంచి కోరుతున్నామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుపుతున్నప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏమిటని ఎస్ఈసీ ప్రశ్నించారని, ఆ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ రాకముందు ఎన్నికలు జరిపారని, ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికలు పెడుతున్నారని తెలిపారు. ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. ఎన్నికల విధులు వద్దన్న ఉద్యోగుల్ని వదిలేసి, చేస్తామని ముందుకొచ్చిన వారితో ఎన్నికలు నిర్వహించాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మంగళవారం తమ సంఘం అత్యవసర సమావేశం నిర్వహిస్తామని, అందులో ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామన్నారు. మాకు రక్షణ ఎవరు కల్పిస్తారు: బొప్పరాజు ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చి, పీపీఈ కిట్లు ఇచ్చి ఎన్నికల్లో పనిచేయిస్తామని ఎస్ఈసీ చెప్పారని, అవి ఏమయ్యాయని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ నెల రోజులు ఉంటుందని, ఇప్పటివరకూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించలేదని, కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల్లో మరమ్మతులు జరుగుతున్నాయని, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయలేదని, బ్యాలెట్ పేపర్ల ముద్రణ వంటి అంశాలు చాలా ఉన్నాయని ఇవేమీ పట్టించుకోకుండా ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి మాట్లాడేందుకు ఎన్నికల కమిషనర్‌ను అపాయింట్మెంట్ అడిగినా మూడురోజులుగా ఇవ్వలేదన్నారు. మా ప్రాణాలకు బాధ్యత వహిస్తారా..?: చంద్రశేఖర్‌రెడ్డి పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని, అదే సమయంలో ఎన్నికల విధుల్లో కరోనా వల్ల తమకు ప్రాణహాని జరిగితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత వహిస్తుందా అని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికల్లో పనిచేయమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంఘం జిల్లాలు, మండలాల యూనిట్ల నుంచి ఎన్నికలు బహిష్కరించాలని తీవ్ర ఒత్తిడి వస్తోందని చెప్పారు. ఉద్యోగులు ఎవరూ తమ ప్రాణాలు పోగొట్టుకునేలా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా లేరని, అవసరమైతే సమ్మెకు వెళ్లాలని కిందిస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సమావేశమవుతున్నామని తెలిపారు. -
నిమ్మగడ్డపైనే నిఘా పెట్టాలి
సాక్షి, అమరావతి: తనపై నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డీజీపీకి లేఖ రాశారని, అసలు నిఘా పెట్టాల్సింది ఆయనపైనేనని రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కే వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయనే ఎవరెవరినో కలుస్తున్నారని, ఈ విషయం అందరికీ తెలుసని చెప్పారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనను బెదిరించినట్లు, తన ద్వారా ఆయనకు ప్రాణహాని ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ డీజీపీకి లేఖ రాయడం సరికాదన్నారు. ఆయన్ను బెదిరించాల్సిన అవసరం తనకు లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాత్రమే తాను చెప్పానని, అవి ఆయన్ను ఉద్దేశించి కాదన్నారు. అయినా, తనపై నిఘా పెట్టినా అభ్యంతరం లేదన్నారు. తాను ఉద్యోగులు, వారి రక్షణ గురించి మాత్రమే మాట్లాడానని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమిటని అడిగామని చెప్పారు. 30 నెలలుగా ఏం చేశారు? ఎన్నికల కమిషనర్‌కి ప్రభుత్వానికి ఏదైనా ఉంటే వాళ్లే చూసుకోవాలని, వారి మధ్య జరిగే పోరాటంలో ఉద్యోగుల్ని బలి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వెంటనే ఎన్నికలు పెడితే వచ్చే లాభం, వ్యాక్సినేషన్ పూర్తయ్యాక జరిగితే వచ్చే నష్టం ఏమిటో ఎస్ఈసీ చెప్పాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. 30 నెలల నుంచి ప్రత్యేక అధికారుల పాలన ఉందని, ఇంతకాలం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నా వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వంటి నాయకులే సిద్ధంగా లేరని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారని.. సిద్ధంగా ఉన్న వారితో ఎన్నికలు జరుపుకోవచ్చని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి హద్దుల్లో ఉండాలి టీడీపీ అధికార ప్రతినిధి తమ గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఆయన హద్దుల్లో ఉండాలని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులను అడ్డగోలుగా వాడుకుంది టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. సచివాలయం నుంచి బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్టుకి ఉద్యోగుల్ని తీసుకెళ్లారని.. ఢిల్లీలో దీక్షలు చేసి అక్కడికి తమను తీసుకెళ్లారని.. నవ నిర్మాణ దీక్షలు చేసి వాటికి ఉద్యోగులను తరలించారని.. ఇలా టీడీపీ ప్రభుత్వం వాడుకున్నంతగా ఉద్యోగుల్ని ఎవరూ వాడుకోలేదన్నారు. ఇప్పటి ప్రభుత్వం అలాంటి ఒక్కదానిక్కూడా ఉద్యోగులను తీసుకెళ్లలేదని చెప్పారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అరవపాల్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్‌పై నిఘా పెట్టాలని తాము డీజీపీని కోరతామని చెప్పారు. తమపై మాట తూలితే సహించేది లేదన్నారు. -
నిమ్మగడ్డను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు
సాక్షి, విజయవాడ : తాము ఎవరినీ బెదిరించేలా వ్యాఖ్యలు చేయలేదని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను బెదిరించాల్సిన అవసరం తనకు లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనాతో ఉద్యోగుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పాం. ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలే కానీ.. నిమ్మగడ్డను ఉద్దేశించినవి కావు. నిమ్మగడ్డ కోరినట్లు నాపై పోలీసులు నిఘా పెట్టినా అభ్యంతరం లేదు. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదని చెప్పాం. 2 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే నష్టమేంటి?. ఉద్యోగుల కోసం ఎన్నికలు వాయిదా వేయలేరా?. పంచాయతీ ఎన్నికలు వద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు’’అని అన్నారు. చదవండి : నోటిఫికేషన్ వెనక్కు తీసుకోకుంటే సమ్మెకు దిగుతాం -
‘ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదు’
-
రాజధాని తరలింపు కేసులో అనూహ్య పరిణామం
-
36 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ఉద్యానశాఖ ప్రణాళిక రచించింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లలో 36 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలను ఉత్పత్తి చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు మంగళవారం ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేశారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సరిపడా కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, వంటనూనెలు వంటివి మన రాష్ట్రంలోనే పండించుకోవాలనేది ఉద్యానశాఖ లక్ష్యం. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని నిర్ణయించింది. కూరగాయల దిగుమతికి చెక్ పెట్టేలా.. రాష్ట్రంలో ప్రస్తుతం 3.52 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. ఏటా 30.71 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుబడి అవుతున్నాయి. దాదాపు 20 రకాలకు పైగా కూరగాయలను పండిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు ఏడాదికి 36 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నారు. ఒక్కో వ్యక్తి ఏడాదికి సరాసరి 90 కిలోల కూరగాయలు వినియోగిస్తున్నాడు. ఆ ప్రకారం ఏటా రూ.11,130 కోట్లు కూరగాయలకు ఖర్చు చేస్తున్నారు. అయితే మనం పండించే వాటిల్లో కొన్నింటిని అవసరానికి మించి, కొన్నింటిని అవసరానికన్నా తక్కువగా పండిస్తున్నాం. టమాట, వంకాయ, బెండ మొదలైన వాటిని అధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. పండించిన వాటిలో 7.72 లక్షల మెట్రిక్ టన్నులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. అదే సమయంలో మన అవసరాలకు కావాల్సిన ఉల్లి, మిరప, బీర, సోర, కాకర, చిక్కుడు, దోస, ఆలు, క్యారెట్, ఆకుకూరలు వంటి 17 రకాలను 13 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతులను తగ్గించి, మన రాష్ట్ర అవసరాలకు పూర్తిగా సరిపడా కూరగాయలను పండించేందుకు ఉద్యానశాఖ ఈ ఏడాది 5.24 లక్షల ఎకరాలలో సాగు చేయాలని నిర్ణయించింది. ఈ వానాకాలంలో 2.47 లక్షల ఎకరాల్లో 17.64 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగిలో 2.77 లక్షల ఎకరాల్లో 18.36 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తారు. రాష్ట్రంలో 12 రకాల పండ్ల సాగు.. మన రాష్ట్రంలో పండ్లు 4.35 లక్షల ఎకరాలలో సాగవుతున్నాయి. ఏడాదికి 22.97 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి అవుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా 14 రకాల పండ్ల వినియోగం జరుగుతుండగా, 12 రకాలు మన రాష్ట్రంలోనే పండుతున్నాయి. సగటున రాష్ట్ర జనాభా ఏడాదికి 12.44 లక్షల టన్నుల పండ్లను వినియోగిస్తున్నారు. అందుకోసం ప్రజలు ఏడాదికి రూ. 7,942 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో మామిడి, బత్తాయి, నిమ్మ, బొప్పాయి, పుచ్చ మన అవసరాలకు మించి ఉత్పత్తి అవుతున్నాయి. 18.44 లక్షల మెట్రిక్ టన్నుల ఈ పండ్లను ఉత్తర భారత్‌కి ఎగుమతి చేస్తున్నాం. మన రాష్ట్రంలో కొరత ఉన్న అరటి, సపోట, నేరేడు, కర్బూజ, యాపిల్, పైన్ యాపిల్ పండ్లను ఏడాదికి 7.91 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. యాపిల్, పైనాపిల్ రాష్ట్రంలో పండించేందుకు వీలుకాదు. మిగిలినవాటిని దాదాపు 65,866 ఎకరాలలో కొత్తగా దశల వారీగా పెంచేందుకు ప్రయత్నించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. సుగంధ ద్రవ్యాలు.. రాష్ట్రంలో సుగంధ ద్రవ్య పంటలు 3.85 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఏడాదికి 7.85 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి చేసుకుంటున్నాం. రాష్ట్రంలో 8 రకాల సుగంధ ద్రవ్యాలు వినియోగంలో ఉన్నాయి. పసుపు, ఎండు మిర్చి సాగులో రాష్ట్రం దేశంలోనే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. వీటిని మన అవసరాలకు మించి సాగు చేస్తున్నాం. మన రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలో ఉన్న ధనియాలు, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, చింతపండు మొదలైన పంటల స్వయం సమృద్ధి కోసం 95,646 ఎకరాల్లో పండించేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ యోచిస్తోంది. దేశంలో 15 మిలియన్ టన్నుల నూనె దిగుమతి.. మన దేశ జనాభాకి 22 మిలియన్ టన్నుల వంట నూనెల అవసరం కాగా, కేవలం 7 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. మిగిలిన 15 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం దిగుమతుల్లో పామాయిల్ ఒకటే 60 శాతం. అంటే 9 నుంచి 10 మిలియన్ టన్నుల పామాయిల్ నూనెను సుమారు రూ.60 వేల కోట్లు వెచ్చించి మన దేశం దిగుమతి చేసుకుంటోంది. అందుకే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాల్సిన అవసరముందని నివేదికలో వెల్లడించారు. -
నగరి మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కరోనా నివారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యంగా ఉన్నాయంటూ ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు నగరి మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘మాది చేతల ప్రభుత్వం’
సాక్షి, గుంతకల్లు(అనంతపురం) : గుంతకల్లులోని జగ్జీవన్‌రామ్ కాలనీలో నిర్మించిన మారెమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ పీడీ రంగయ్య, ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి పాత గుంతకల్లు వాల్మీకి సర్కిల్లోని వాల్మీకి విగ్రహానికి పూజ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని వారు చెప్పారు. అనంతరం వాల్మీకులు వివిధ సమస్యలపై ఎంపీ, ఎమ్మెల్యేకి వినతిపత్రం అందించారు. డీ.హీరేహాళ్: మండల కేంద్రంలోని నీలకంఠేశ్వ కళ్యాణ మంటపంలో సోమవారం వెలుగు ఏసీ గంగాధర్ ఆధ్వర్యంలో రూ.4 కోట్ల వడ్డీలేని రుణాలను మహిళలకు ప్రభుత్వవిప్ కాపు రామచంద్రారెడ్డి చెక్కుల రూపంలో అందించారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన హామీల్లో 80 శాతం వరకు నాలుగు నెలల్లోనే పూర్తి చేశారని, మిగతావి కూడా పూర్తి చేస్తారన్నారు. కళ్యాణదుర్గం: పట్టణంలోని ఆర్డీటీ ఏఎఫ్ ఫీల్ట్ కార్యాలయంలో సోమవారం వెలుగుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 252 మహిళా సంఘాలకు రూ.13 కోట్ల వడ్డీలేని రుణాలు చెక్కులను ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల పక్షపాతి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తమది మాటల ప్రభుత్వం మాదని చేతల ప్రభుత్వమన్నారు. -
ఏపీ బంద్: అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్
-
అమెరికాలో కామారెడ్డి జిల్లా వాసి మృతి
డల్లాస్ : అమెరికాలోని ఉత్తరా టెక్సాస్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మృతి చెందారు. కామారెడ్డి జిల్లా మచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి (40) వారాంతం కావడంతో కుంటుంబసభ్యులతో కలిసి శనివారం సరదాగా గ్రేప్‌వైన్ సరస్సులో బోటింగ్ చేయడానికి వెళ్లారు. పొంటూన్ బోటు నుంచి ఈత కొట్టడానికి నీళ్లలోకి దూకిన ఆయన ఎంతకూ పైకి రాకపోవడంతో రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. నీళ్లలో మునిగిపోయిన వెంకట్రామిరెడ్డి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు జరిపి 24 గంటల తర్వాత ఆదివారం అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 12 మంది ఉన్నారు. వెంకట్రామిరెడ్డి డల్లాస్‌లో గ్లోబల్ ఐటీ కంపెనీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య వాణి కూడా ఉద్యోగిని. ఆయన మృతదేహం వారం రోజుల్లో స్వదేశానికి రానుంది. ఈ సంఘటనతో వెంకట్రామిరెడ్డి స్వస్థలం ఆరెపల్లిలో విషాదం నెలకొంది. మరోవైపు డల్లాస్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఆదివారం అదే సరస్సులో జరిగిన మరో ప్రమాదంలో సరస్సులో మునిగిపోయిన ఓ 25 ఏళ్ల యువకుడిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అతడిని బెయిలర్ స్కాట్ అండ్ వైట్ మెడికల్ సెంటర్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ రెండు ఘటనల్లో బాధితులు లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని గ్రేప్ వైన్ ఫైర్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ చీఫ్ జాన్ షేర్వుడ్ తెలిపారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని, బోటింగ్, స్మిమ్మింగ్ చేసే వారు లైఫ్ జాకెట్లు తప్పని సరిగా ధరించి ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. -
'హత్యా రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు'
సాక్షి, అనంతపురం : హత్యారాజకీయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 36వ రోజు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చంద్రబాబును దుయ్యబట్టారు. అవినీతి, అక్రమాలకు టీడీపీ సర్కార్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. అందుకే వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు వేలాదిమంది ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. -
నేనెలాంటి తప్పు చేయలేదు...అయినా..
సాక్షి, అమరావతి : అమరావతి: ఇరిగేషన్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ వెంకట రామిరెడ్డి సస్పెన్షన్‌పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డిపై బుధవారం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సస్పెన్షన్‌కు గురైన వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ...‘నేనెలాంటి తప్పు చేయకపోయినా సస్పెండ్ చేశారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధం. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. 50 ఏళ్లకే ఉద్యోగుల పదవీ విరమణ ఆలోచన లేదని చెప్పారు. లేని జీవోని దొంగిలించానని నాపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్‌పై స్పందించాలని సచివాలయ ఉద్యోగ సంఘాన్ని కోరాం. వాళ్లు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రెండు రోజుల్లో చెబుతామన్నారు. ఉద్యోగుల సంఘం నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం.’ అని అన్నారు. ఉద్యోగుల్లో అభద్రతా భావం... హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులు అభద్రతతో ఉన్నారని ఏపీ సచివాలయం ఉద్యోగిని భావన అన్నారు. ఏకపక్షంగా ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఉద్యోగుల్లో అభ్రదతా భావం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉద్యోగుల సంఘం స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. ఈ చర్యపై ఏపీ సచివాలయం మూడో బ్లాక్ వద్ద బుధవారం సాయంత్రం కొందరు ఉద్యోగులు నిరసనకు ప్రయత్నించారు. అయితే, సచివాలయంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణపై వారంతా మండిపడ్డారు. సచివాలయం ఉద్యోగుల అసోసిషన్ వద్ద భవిష్యత్ కార్యచరణ పై చర్చలు జరిపారు. ఉద్యోగుల నిరసనతో ఎట్టకేలకు వారిని కలిసేందుకు మురళీకృష్ణ ముందుకొచ్చారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతో మురళీకృష్ణ చర్చలు సాగిస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు..విచారణకు నేను సిద్ధం -
సచివాలయంలో మరో ఉద్యోగిపై వేటు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరో ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. జలవనరుల శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డిపై బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఉద్యోగుల వయోపరిమితి కుదింపు డ్రాఫ్ట్ కాపీ లీకేజీతో సంబంధం ఉందంటూ వెంకట్రామిరెడ్డిపై ఈ చర్యలు తీసుకున్నారు. కాగా ఇదే వ్యవహారంలో న్యాయశాఖ సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్పను సస్పెండ్ చేసిన అధికారులు తాజాగా వెంకట్రామిరెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు వేయడంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపే ప్రతిపాదన లేదని గతంలో సీఎం చంద్రబాబు, మంత్రులు బుకాయించిన విషయం తెలిసిందే. అయితే జీఎం కాపీలను లీక్ చేశారంటూ చర్యలు తీసుకోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకున్నారని వారు తెలిపారు. ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగుల ఎన్నికల్లో వెంకట్రామి రెడ్డి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ విషయంలో పోటీ నుంచి తప్పుకోవాలని వెంకట్రామిరెడ్డిని ఇంటికి పిలిచి సీఎం వార్నింగ్ ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక.. ఆ ఎన్నికల వివాదమే కారణమని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ- ఆఫీసు విధానంలోనూ కాపీల లీక్ ఎలా సాధ్యమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. -
నేటి నుంచి సూక్ష్మ సేద్యం అనుమతులు
జీఎస్టీతో భారం లేదని నిర్ధారించుకున్న ఉద్యాన శాఖ సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ రాకతో నిలిచిన సూక్ష్మ సేద్యం తిరిగి ప్రారంభం కానుంది. సేద్యం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు మంగళవారం నుంచి అనుమతులిచ్చేందుకు ఉద్యాన శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సూక్ష్మ సేద్యం పరికరాలపై 18 శాతం జీఎస్టీ విధిం చడంతో కంపెనీలు పరికరాల ఏర్పాటును తాత్కాలికంగా నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే జీఎస్టీతో పెద్దగా భారం ఉండదని తెలుసుకుని సేద్యానికి తిరిగి అనుమతులిచ్చేం దుకు సిద్ధమైనట్లు ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతంలో సూక్ష్మ సేద్యంపై 5 శాతం వ్యాట్ ఉండేది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేది. అలాగే 12 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉండగా కంపెనీలు భరించేవి. అయితే తాజా జీఎస్టీలో ఆ 17 శాతం పన్ను కలిసిపోవడం, కేవలం ఒక శాతమే అదనపు భారం పడనుండటంతో ఉద్యానశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా రైతులపై భారం పడ కుండా అదనపు భారాన్ని సర్దుబాటు చేస్తా మని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. పెండింగ్‌లో లక్ష దరఖాస్తులు రాష్ట్రంలో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేం దుకు ప్రభుత్వం నాబార్డు నుంచి రూ.1,000 కోట్లు రుణం తీసుకుంది. సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ప్రస్తుతం దాదాపు లక్ష మంది రైతులు సూక్ష్మ సేద్యం కోసం ఉద్యాన శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటికీ మంగళవారం నుంచి అనుమతులు ఇస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
ఉద్యమించకపోతే.. సీమకు అన్యాయం
అనంతపురం టౌన్ : ‘కృష్ణా జలాల కోసం గళం విప్పకపోతే నష్టపోతాం. ఉద్యమించకపోతే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది’ అని అఖిలపక్ష పార్టీల నాయకులు అన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ‘‘హంద్రీనీవాకు 80 టీఎంసీ నికర జలాలు కేటాయించాలి’’ అనే అంశంపై సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాల కోసం గళలాలు వినిపించకపోతే రాయలసీమకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణలోకి మళ్లించడం జరుగుతుందన్నారు. దీంతో శ్రీశైలం డ్యాంలో ఆ మొత్తం నీరు ఆదా అవుతుందన్నారు. అలా అదా అయ్యే 80 టీఎంసీ నీటిని హంద్రీ నీవా ప్రాజెక్టుకు నికర జలాలను కేటాయించాలన్నారు. అంతే కాకుండా శ్రీశైలం డ్యాంలో 852 అడుగులకు తగ్గకుండా నీరు నిలువ ఉండేలా చూడాలన్నారు. పట్టిసీమ పథకం కోసం రూ.1,350 కోట్లు కేటాయించారని, 12 నెలల్లో పూర్తి చేయకపోతే ఎస్కలేషన్ చార్జీలు ఇవ్వబోమని నిబంధన ఉంచారన్నారు. అదే తరహాలో హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తికి రూ.2 వేల కోట్లు నిధులు కేటాయించి, 12 నెలల్లో పనులు పూర్తి చేస్తేనే ఎస్కలేషన్ చార్జీలు ఇస్తామన్న నిబంధన ఈ ప్రాజెక్టుకి వర్తింపజేయాలన్నారు. ఇవన్నీ నోటి మాటగా కాకుండా స్పష్టమైన జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చొరవతో హంద్రీనీవా ద్వారా జిల్లాకు కృష్ణ జలాలు వచ్చాయని, అయితే అధికార పార్టీ నాయకులు తాము చేయని పనిని చేశామని చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకున్నా అభ్యంతరం ఏమీ లేదన్నారు. ఇప్పుడైనా హంద్రీనీవాను పూర్తి చేసి నీరు ఇచ్చామని చెప్పుకోండని అన్నారు. ప్రజా ఉద్యమానికి నాంది పలకాలి అనంతపురం జిల్లాకు కృష్ణ నీరు రావాలనేది 45 ఏళ్ల కల. దీన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి నేరవేర్చారు. ప్రస్తుతం రాయలసీమకు.. ముఖ్యంగా జిల్లాకు అన్యాయం జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. గుక్కెడు నీటి కోసం పోరాడే పరిస్థితిని కల్పిస్తున్నారు. హంద్రీనీవాకు 80 టీఎంసీ నికర జలాలు కేటాయించేలా జీవో విడుదల చేయాలి. ఉద్యమ పంథాలో ముందుకు వెళితే తప్ప సాధ్యంకాదనేది స్పష్టమవుతోంది. ఇందుకు మనమంతా గొంతులు పెంచాలి. అప్పుడే అనుకున్నది సాధిస్తాము. - వీకేరంగారెడ్డి, అనంత సాధన కమిటీ చైర్మన్ నీటి కేటాయింపు అధికారికంగా జరగాలి జిల్లాకు కృష్ణ జలాలు తప్పితే ప్రత్యామ్నాయం లేదు. హంద్రీ నీవాకు నీటి కేటాయింపు అధికారికంగా జరగాలి. నికర జలాలు కేటాయిస్తేనే జిల్లాకు మనుగడ. హంద్రీ నీవాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధిక స్థాయిలో నిధులు కేటాయించడం ద్వారా ఈ రోజు జిల్లాకు కృష్ణ నీరు వచ్చింది. గత నాలుగేళ్లగా పనులు ముందుకు సాగడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణ నదిలోకి మళ్లించడం ద్వారా శ్రీశైలం డ్యాంలో ఆ స్థాయిలో నీరు ఆదా అవుతుంది. ఆ నీటిని హంద్రీనీవాకు నికర జలాలు కేటాయించాలి. లేదంటే జిల్లాకు మనుగడ ఉండదు. ఇవన్నీ మాటల ద్వారా కాకుండా జీఓ రూపంలో ఇవ్వాలి. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించేందుకు అందరూ నడుంబిగించాలి. జిల్లాకు నీటి సాధనకు చేపట్టే ఉద్యమానికి తాము పూర్తి మద్ధతు ఇచ్చి వెన్నంటి నిలుస్తాం. - గురునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెలే, వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యుడు నికర జలాల సాధనకు ఉద్యమించాలి కరువు జిల్లా అనంతపురం మనుగడ సాగించాలంటే హంద్రీనీవాకి 80 టీఎంసీ నికర జలాలు కేటాయించాలి. దీని సాధనకు ఉద్యమించాలి. లేకపోతే మనకు తీరని అన్యాయం చేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి 40 టీఎంసీలు ఇచ్చారు. ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణ బేసిన్‌కి మళ్లిస్తే శ్రీశైలం డ్యాంలో 80 టీఎంసీ ఆదా అవుతాయి. హంద్రీనీవా సామర్థ్యం పెంచి 80 టీఎంసీలు ఇవ్వాలి. రాయలసీమకి నీరు ఇస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు. గాలిలో దీపం పెట్టినట్లు మాట్లాడితే సరిపోదు. 80 టీఎంసీ నికర జలాలు కేటాయిస్తున్నట్లు స్పష్టమైన జీవో ఇవ్వాలి. అది సాధించేందుకు పోరాటం చేయాలి. - జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి వైఎస్ఆర్ వల్లే కృష్ణా నీరు చూశాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా హంద్రీనీవాకు మూడు సార్లు శంకుస్థాపన చేశారే తప్ప నిధులు కేటాయించలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి నిధులు కేటాయించి సంకల్పంతో పనిచేయండం వల్లనే ఈ రోజు జిల్లా వాసులు కృష్ణా నీటిని చూసే అవకాశం దక్కింది. ఇప్పుడున్న ప్రభుత్వం హంద్రీనీవాకు రూ.100 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో ఉద్యోగుల జీతాలకు రూ.90 కోట్లు పోగా మిగిలిన రూ.10 కోట్లతో హంద్రీనీవా ఎలా పూర్తి చేయడం సాధ్యం. ప్రస్తుత బడ్జెట్లో హంద్రీనీవాకు రూ.2 వేల కోట్లు కేటాయించాలి. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కి 80 టీఎంసీ నీరు మళ్లించడం ద్వారా శ్రీశైలంలో ఆదా అయ్యే 80 టీఎంసీల నీటిని రాయలసీమకు నికర జలాలుగా కేటాయించాలి. - ప్రొఫెసర్ చంద్రశేఖర్, మానవ హక్కుల వేదిక కన్వీనర్ శాశ్వత ప్రాతిపదికన నీరివ్వాలి జిల్లా అవసరాల దృష్ట్యా శాశ్వత ప్రాతిపదికన నీరివ్వాలి. హంద్రీనీవాకు రూ.100 కోట్లు కేటాయించడం చూస్తే రాయలసీమకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదనేది స్పష్టమవుతోంది. నిధులు కేటాయించకుండా హంద్రీ నీవా ద్వారా కుప్పంకి నీరు తీసుకెళతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదం. ఇది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. రాయలసీమ ప్రయోజనాల కోసం హంద్రీనీవాకు 80టీఎంసీ నికర జలాలు కేటాయించాలి. - నాగరాజు, డీసీసీ ప్రధాన కార్యదర్శి -
మా భర్తల అరెస్ట్ అక్రమం
హైకోర్టులో వెంకట్రామిరెడ్డి, రవిరెడ్డిల సతీమణులు పిటిషన్ 14 రోజుల కస్టడీ కోరుతూ ప్రత్యేక కోర్టుకు సీబీఐ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ టి.వినాయక్ రవిరెడ్డిల అరెస్ట్‌ను సవాలు చేస్తూ వారి సతీమణులు సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. ఈ వ్యాజ్యంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన న్యాయమూర్తి, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకునేందుకు వెంకట్రామిరెడ్డి, రవిరెడ్డిలకు స్వేచ్ఛనిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉండగా, సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్లో తన పేరును చేర్చడాన్ని సవాలు చేస్తూ చార్టర్డ్ అకౌంటెంట్ మణి ఓమెన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. డీసీ డెరైక్టర్ల కస్టడీ పిటిషన్‌పై 19న విచారణ వెంకట్రామిరెడ్డి, వినాయక్ రవిరెడ్డిలను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి... కౌంటర్ దాఖలు చేసేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదికి గడువునిస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. ప్రత్యేక సౌకర్యాలు కల్పించండి రాజ్యసభ మాజీ సభ్యుడిగా, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డికి జైలులో ప్రత్యే క సౌకర్యాలు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆడిట్ బ్యూ రో ఆఫ్ సర్క్కులేషన్ చైర్మన్‌గా పనిచేశారని, కోటి రూపాయల వరకు ఆదాయపన్ను చెల్లిస్తున్నారని తెలిపా రు. పట్టభద్రుడని, అనారోగ్యంతో ఉన్న ఆయనకు జైలుగా ప్రత్యేక కేటగిరీ కింద సౌకర్యాలు కల్పించాలని నివేదించారు. ఈ పిటిషన్‌పై అభ్యంతరాలుంటే తెలపాలని సీబీఐకి సూచి స్తూ దీని విచారణను 18వ తేదీకి వాయిదా వేశారు. -
చీటింగ్ కేసులో ‘డీసీ’ వెంకట్రామిరెడ్డి అరెస్టు
ఆయన సోదరుడు వినాయక్ కూడా.. సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై ‘దక్కన్ క్రానికల్’ ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ టి.వినాయక్ రవి రెడ్డిలను సీబీఐ శనివారం అరెస్టు చేసింది. బెంగళూరుకు చెందిన సీబీఐ ‘బ్యాంకు సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ యూనిట్’కు సంబంధించిన దర్యాప్తు అధికారులు శనివారం వెంకట్రామిరెడ్డితో పాటు మరో ఇద్దరు ప్రమోటర్ల నివాసాలు, సికింద్రాబాద్‌లోని దక్కన్ క్రానికల్ పత్రికా కార్యాలయంపై ఏకకాలంలో దాడులు జరిపి సోదాలు నిర్వహించారు. డీసీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఆయన సోదరుడు వినాయక్ రవి రెడ్డిలను అదుపులోకి తీసుకుని కోఠిలోని సీబీఐ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. కెనరా బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డి, వినాయక్ రవి రెడ్డి, వైస్ చైర్మన్ పి.కె అయ్యర్‌లపై ఐపీసీ సెక్షన్ 120బీ, 420 , 468, 471 ల కింద కేసులు నమోదు చేసింది. తప్పుడు పత్రాలను తనఖా పెట్టి రూ.357.77 కోట్ల రుణం పొందారని కెనరా బ్యాంకు చేసిన ఫిర్యాదుపై 2013 జూలైలో ఈ కేసు నమోదైంది. విచారణ అనంతరం సీబీఐ అధికారులు నిందితులకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మళ్లీ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ఆయన్ను సీబీఐ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశముంది. కాగా, 2008-2012 మధ్య మోసం, కుట్రపూరిత చర్యలతో కెనరా బ్యాంకుకు రూ.1,230 కోట్ల నష్టాన్ని కలిగించారని దక్కన్ క్రానికల్ యాజమాన్యంపై ఆరోపణలున్నాయి. -
డీసీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్ట్
-
డీసీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్టు
దక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకును మోసం చేసిన కేసులో వెంకట్రామిరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. తమకు రూ. 357 కోట్ల మేర ఆయన నష్టం చేకూర్చారని కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది. అరెస్టు చేసిన తర్వాత వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టుకు తరలించారు. -
కామ్రేడ్ కొత్వాల్
కోట రక్షణకు కొత్వాల్! ఇప్పటి అర్థంలో సిటీ (రాజధాని) పోలీస్ కమిషనర్! హైదరాబాద్ స్టేట్ చరిత్రలో ‘కొత్వాల్’ పదవి పురాతనం, శక్తిమంతం అని విదేశీ యాత్రికులు తమ రచనల్లో ‘కొత్వాల్’ను ఉదహరించారు. అందరిలో అద్వితీయుడు రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి! ఆయన చివరి కొత్వాల్. తొలి హిందువు. రాష్ట్ర పోలీస్ అకాడమీ ‘రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ’గా కొత్తపేరు అలంకరించుకున్న నేపథ్యంలో ఆయన జీవన తరంగాలను తలుచుకుందాం... మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సంస్థానం, రాయనిపేట గ్రామంలో వెంకటరామిరెడ్డి 1869 ఆగస్ట్ 22న జన్మించాడు. తండ్రి 8 గ్రామాల పటేల్. వనపర్తి రాజాకు మేనల్లుని కుమారుడు. వెంక ట్రామిరెడ్డి పుట్టిన మూడు రోజులకు తల్లి, ఎనిమిదో ఏట తండ్రి చనిపోయారు. మేనమామ విలియం వాహెబ్ సంరక్షణలో పెరిగాడు. వాహెబ్ను అందరూ క్రిస్టియన్ అనుకునేవారు. వనపర్తి రాజా తన పిల్లలకు చదువు నేర్పేందుకు కేథలిక్ టీచర్‌ను నియమించాడు. ముస్లిం పాలకవర్గాల విద్యార్థుల పేర్లకు భిన్నంగా, పిలిచే ందుకు వీలుగా క్రిస్టియన్ పేర్లు పెట్టాడు. ఊర్లో చదువయ్యాక వెంకట్రామిరెడ్డి వనపర్తి వచ్చాడు. అక్కడ రెండో రాజా రామేశ్వరరావు సహవిద్యార్థి. తెల్ల సైనికుడిని పట్టుకున్నాడు... మేనమామ వాహెబ్ రాయచూర్‌లో పోలీసు అధికారి. అకస్మాత్తుగా మరణించాడు. వెంకట్రామిరెడ్డికి అప్పటికి పదహారేళ్లు. విద్యార్హతలు బొటాబొటి! నాజర్ మహమూద్ ఖాన్ అనే పఠాన్ వాహెబ్ వారసునిగా వచ్చాడు. ఆయన వెంకట్రామిరెడ్డికి గ్రేడ్-4 అమీన్ ఉద్యోగం ఇచ్చాడు. వెంకట్రామిరెడ్డి మరీ బక్కగా ఉండేవాడు. పై ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్తూ దుస్తుల్లోపల దూదిపొరలు పేర్చుకున్నాడు. ఇది గమనించిన ముఖ్యాధికారి నవ్వి ఊరుకున్నాడు. ఉద్యోగం ఇచ్చాడు. వేర్వేరు జిల్లాల్లో పనిచేశాడు వెంకట్రామిరెడ్డి. సైన్యం నుంచి తప్పించుకున్న ఓ ఇంగ్లిష్ వ్యక్తిని నిజామాబాద్‌లో పట్టుకున్నందుకు రూ.11 బహుమానం పొందాడు. ఆయన సమర్థత, కుటుంబ నేపథ్యం పదోన్నతులకు దోహదం చేశాయి. స్టేట్ పోలీస్ చీఫ్ హెమ్కిన్.. వెంకట్రామిరెడ్డిని రాజ్యంలో ఉత్తమ పోలీస్‌గా ఎంపిక చేశాడు. హైదరాబాద్ శివారు జిల్లా (అత్రాఫ్-ఇ-బల్దా) అధికారిగా పదోన్నతి పొందాడు. ఈ నేపథ్యంలో రాజేశ్వరరావు-2 వన పర్తి రాజా అయ్యాడు. తన ఎస్టేట్‌కు కార్యదర్శిగా ఉండమని వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించాడు. అదే సమయంలో హైదరాబాద్ కొత్వాల్‌గా బాధ్యతలు తీసుకున్న నవాబ్ ఇమాదత్ జంగ్ అసిస్టెంట్ కొత్వాల్‌గా వెంకట్రామిరెడ్డిని నియమించుకున్నాడు. 1920లో ఇమాదత్ జంగ్ చనిపోయే వరకు ఆరేళ్లు నగర పోలీస్ విభాగంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అచ్ఛా ఆప్ జా సక్తే... ఓ రోజు వెంకట్రామిరెడ్డికి నిజాం నుంచి పిలుపు వచ్చింది. అప్పటికి ఆయన నిజాం ప్రభువుకు ఎన్నడూ తారసపడలేదు. పోలీసుల నుంచి పౌరులకు పిలుపు వచ్చినా, పాలకుల నుంచి పోలీసులకు పిలుపు వచ్చినా తెలియని పరేషాన్! ప్రభువు ఆదేశానుసారం కింగ్‌కోఠిలో వెంకట్రాం నిరీక్షిస్తున్నాడు, చిరుచెమటలతో! ఆ రోజు శుక్రవారం. ప్రార్థన అనంతరం తన సమక్షానికి విచ్చేసిన వెంకట్రాంను నిజాం నాలుగైదు పర్యాయాలు ఎగాదిగా చూశాడు. ‘అచ్ఛా ఆప్ జా సక్తే’ అన్నాడు. మరుసటి రోజు వెంకట్రామిరెడ్డిని నిజాం కొత్వాల్‌గా నియమించాడు. ఆ రోజు నుంచి ప్రతి రోజూ అనేకసార్లు కొత్వాల్ నిజాంను పరకాయించి చూసేవాడు. ఆర్డర్లీ ఫిర్యాదు.. స్వాతంత్య్రోద్యమం పుంజుకుంటున్న వాతావరణం. అహ్మదాబాద్ బృందం స్థానిక నాయకులతో కలసిపోయి రెసిడెన్సీ కోర్ట్ భవనం కిటికీలు, తలుపులు ధ్వంసం చేసింది. కొత్వాల్ సంఘటనా స్థలానికి వెళ్లి ప్రదర్శకులను సమాధానపరచారు. గణేష్ ఉత్సవం సజావుగా సాగేందుకు నలుగురు పోలీసులతో స్వామి పల్లకీ మోయించేవారు. కొత్వాల్‌కు ఇంగ్లిష్ పరిజ్ఞానం లేదు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నగర పర్యటనకు ముందు ఇంగ్లిష్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. పనికొచ్చే పదాలను, వాక్యాలను రాత్రిపూట తన గదిలో పెద్దగా పలికేవారు. సంగతి తెలియని ఆర్డర్లీ తన బాస్‌కు ఏదో అయ్యిందని పోలీస్ స్టేషన్లో తన పై అధికారికి ఫిర్యాదు చేశాడు. తర్వాత నిజం తెలిసి అంతా నవ్వుకున్నారు. ప్రిన్స్ బసచేసిన ప్యాలెస్‌లోకి తెల్ల సెక్యూరిటీ కొత్వాల్‌ను అనుమతించలేదు. దీంతో లండన్ సెక్యూరిటీని పక్కనపెట్టి మొత్తం బాధ్యతను నిజాం కొత్వాల్‌కు అప్పజెప్పాడు. నిజాం కుమారుల అప్పుపై విచారణ... నిజాం తన పుట్టిన రోజు సందర్భంగా కొత్వాల్ వెంకట్రామిరెడ్డికి రాజబహదూర్ బిరుదునిచ్చాడు. మరుసటి ఏడాది బ్రిటిష్ ప్రభుత్వం ‘ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’తో సత్కరించింది. అనేకసార్లు పదవీకాలం పొడిగించిన తర్వాత 1934లో ‘కొత్వాల్’ పదవీ విరమణ చేశాడు. జీతంలో సగం మొత్తం అనే ఆనవాయితీకి భిన్నంగా అంతకుమించి, నెలకు రూ.వెయ్యి నిజాం పెన్షన్‌గా మంజూరు చేశాడు. 1920 మార్చి 19 నుంచి 1934 జూలై 1 వరకూ 14 ఏళ్ల సుదీర్ఘకాలం కొత్వాల్‌గా పనిచేసిన రాజ బహదూర్‌ను మరుసటి రోజు నుంచే నిజాం తన ప్రైవేట్ ఎస్టేట్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించాడు. తన వారసులు చేసిన అప్పులపై విచారణ జరిపేందుకు రాజ బహదూర్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేశాడు. విద్యానిధి మిగులు ధనం రూ.30 ప్రభుత్వోద్యోగం చేస్తూ సమాజ సేవ చేసిన అరుదైన వ్యక్తి వెంకట్రామిరెడ్డి. తనలా గ్రామీణ ప్రాంతాల ప్రజలు బొటాబొటి చదువుకు పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదవాలని.. అందుకు దోహదపడాలని భావించారు. అబిడ్స్‌లో 1918లో ‘రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించారు. రెడ్డి హాస్టల్ నెలకొల్పారు. తన కులస్తులే కాదు ఇతర బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ బి.సత్యనారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, యూజీసీ చైర్మన్ జి.రాంరెడ్డి, అనేక మంది న్యాయమూర్తులు, లాయర్లు, డాక్టర్లు ఈ హాస్టల్లో ఉండి చదువుకున్నవారే! హిందూ విద్యార్థినులు కూడా బురఖా వేసుకోవాలని నిబంధన ఉన్న రోజుల్లో ‘రెడ్డి బాలికల పాఠశాల’ స్థాపించారు. ఈ పాఠశాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం గుర్తించని నేపథ్యంలో పూణెకు చెందిన కార్వె ఇన్స్టిట్యూట్కు అనుసంధానం చేశాడు. ఈ బడి తర్వాత కళాశాల అయ్యింది. మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఆంధ్ర విద్యాలయ తదితర సంస్థలకు ఆయన సహాయం చేశారు. వేలాదిమంది ఆయన గుప్తదానాల గురించి చెబుతారు. చట్టసభలో సభ్యుడిగా బాల్య వివాహాల రద్దుకు, వితంతు వివాహాల ప్రోత్సాహానికి మద్దతునిచ్చారు. 1956లో ఆయన పరమపదించారు. అప్పటి ఆయన పెన్షన్‌లో మిగులు ధనం రూ.30. ఒక పోలీసు ఉన్నతాధికారికి ప్రజలు పలికిన నీరాజ నానికి ప్రతీకగా.. నారాయణగూడ సర్కిల్లో వెంకట్రామిరెడ్డి విగ్రహం దర్పంగా, సౌజన్యంగా కనిపిస్తుంది. ప్రముఖ విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి మాటల్లో.. రాజ బహదూర్ ఛాతియే కాదు- హృదయమూ విశాలమే! ఉన్నతాధికారి మాత్రమే కాదు - నిస్సహాయులను ఆదుకున్న ఉత్తముడు! వ్యక్తులకు నమ్మకమైన మిత్రుడు. అంతేనా..! జనానికి కామ్రేడ్! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
దేవాదాయ కమిషనర్‌గా వెంకట్రామిరెడ్డి?
సాక్షి, హైదరాబాద్: దాదాపు పది నెలలుగా ఇన్చార్జి కమిషనర్‌తో నెట్టుకొస్తున్న దేవాదాయశాఖకు కమిషనర్‌ను నియమించాలని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ కార్యదర్శి వెంకటేశ్వరరావు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. కమిషనర్‌గా ఆయన సరిగా దృష్టి సారించకపోవడంతో దేవాదాయశాఖలో ఫైళ్లు పేరుకుపోయినట్టు ఆ శాఖ ఉద్యోగులే పేర్కొంటున్నారు. దీంతో నిత్యం ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదులు వస్తున్నాయి. గురువారం ప్రధాన దేవాలయాల ప్రతినిధులు కొందరు స్వయంగా మంత్రి ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో గృహనిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న వెంకట్రామిరెడ్డికి తాత్కాలికంగా దేవాదాయ శాఖ కమిషనర్ బాధ్యత అప్పగిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
వారికి శిక్ష తప్పదు
అనంతపురం జిల్లా పరిషత్తు, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి తెలుగు ప్రజల గొంతు కోసిన పాపానికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు మట్టిలో కలిసిపోవడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బి.గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు లోకసభలో మాదిరిగానే గురువారం రాజ్యసభ కూడా మూజువాణి ఓటుతో ఆమోదించడం దురదృష్టకరమన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి రాష్ట్ర విభజన బిల్లును అత్యంత అప్రజాస్వామిక పద్ధతిలో ఆమోదించడం సిగ్గుచేటన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విభజన నిర్ణయం తీసుకోవడం హేయమైన చర్య అన్నారు. గురువారం రాత్రి వారు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. బిల్లు అసమగ్రంగా ఉందని అటార్నీ జనరల్, పలువురు రాజ్యాంగ నిపుణులు వ్యతిరేకించినా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు. విభజన చేస్తామని సీమాంధ్ర ప్రజల గొంతు నిలువునా కోసేశారని ఆందోళన వెలిబుచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి లోపాయికారీగా సహకరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ముక్కలు చేయండని... బ్లాంక్ చెక్కులా విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే తెలుగుజాతి విచ్ఛిన్నం అవడానికి ప్రధాన కారణమన్నారు. సీమాంధ్ర ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, డిమాండ్లు పరిష్కరించిన తరువాతే బిల్లుకు మద్దతునిస్తామని చెప్పుకొస్తున్న మరో జాతీయ పార్టీ బీజేపీ ఉన్నఫలంగా కాంగ్రెస్ పార్టీకి ఆపన్నహస్తం అందించడం ఘోరమైన చర్యగా అభివర్ణించారు. సవరణలు చేయాల్సిందేనంటూ చివర్లో డ్రామాను రక్తికట్టించిన బీజేపీ నేతలు సీమాంధ్ర ప్రజలను వంచనకు గురిచేశారని ధ్వజమెత్తారు. మూడు పార్టీలు విభజన ద్రోహులుగా సీమాంధ్రకు చీకటి రోజుగా మిగిల్చివేశారని మండిపడ్డారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడం కోసం మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవిరళ కృషి చేశారన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో వేర్పాటువాద శక్తుల అటకట్టించారన్నారు. వైఎస్ హయాంలో తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరలేదని గుర్తు చేశారు. మహానేత వైఎస్ ఆశయ సాధన కోసం జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రాష్ట్రం ముక్కలు కాకుండా జైలులో ఉండి పోరాటం చేశారన్నారు. తరువాత సమైక్య శంఖారావం పేరుతో రాష్ట్రంతో పాటు ఢిల్లీ వీధుల్లో కూడా ఉద్యమాన్ని చేపట్టారన్నారు. సమైక్య తీర్మానం చేసిన తరువాతనే విభజన బిల్లు గురించి మాట్లాడదామని మొదటి నుంచి జగన్మోహన్రెడ్డి మొత్తుకుంటున్నా కాంగ్రెస్, టీడీపీ పట్టించుకోక పోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. విభజన ద్రోహులకు రానున్న ఎన్నికల్లో రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
ట్రయల్ రన్...నూరో ‘సారీ’..!
ధరూరు, న్యూస్‌లైన్ : నియోజకవర్గం లోని 184 గ్రామాలకు తాగు నీరందిం చేందుకు నిర్మించిన భారీ తాగునీటి పథ కం ట్రయల్న్ ్రమరో మారు విఫలమయింది. రూ. 72 కోట్ల వ్యయతో మం డల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ పనుల్లో భాగంగా 2008 ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ ట్రయల్న్ ్రనిర్వహిస్తూనే ఉన్నారు. దాదాపు వంద సార్లకు పైగానే ట్రయల్న్ ్రనిర్వహించడం...పగలడంతోనే సరిపోయింది. మంగళవారం రాత్రి నిర్వహించిన ట్రయల్న్‌త్రో ధరూరు- మన్నాపురం గ్రామాల మద్య పైప్‌లైన్ పగిలిపోయింది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గాని, సంబంధిత కాంట్రాక్టర్లు కాని పట్టించుకోక పోవడంతో రాత్రంతా నీరు వృధా అయింది. మండల కేంద్రానికి చెందిన చిన్న వెంకట్రామిరెడ్డి, అల్వలపాడు యామరెడ్డి, ర్యాలంపాడు తిమ్మప్ప, సవారన్న, వెంకటన్న, తదితర రైతుల పొలాలు నీట మునిగాయి. గత వారం రోజుల క్రితం వేసిన వరి నాట్ల తో పాటు, కూరగాయల తోటలు, వేరు శనగ పంట కట్టలు తెగి నీటిలో మునిగిపోయాయి. బుధవారం ఉదయం బాధిత రైతులు తమ పొలాలకు వెళ్లి చూడడంతో పంట నీట మునిగిన విషయాన్ని గమనించి లబోదిబోమన్నారు. పొలం గెట్లు కోతకు గురై ఇసుక మేటలు పెట్టాయి. దీంతో తీవ్ర నష్టం ఏర్పడింది. ఇసుక మేటలు పెట్టిన, నీట మునిగిన పంట నష్టం విలువ దాదాపు రూ. 2 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. స్థానిక విలేకర్లు పైపులు పగిలన ప్రాంతానికి చేరుకుని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ చేయడంతో పంపును నిలిపివేసి పైప్‌లైన్‌ను సరి చేస్తామన్నారు. నాసిరకం పైపులు వేయడం మూలంగా తరచూ పగిలిపోయి అటు రైతులకు, ఇటు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టాలను కొని తెస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్లైన్లు పగిలి తీవ్ర నష్టం జరిగిన రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతీ సారి ఇక్కడే పగులుతోంది ట్రయల్న్ ్రచేసిన ప్రతీసారి మా పొలాల వద్దనే పగులుతోంది. రాత్రి ట్రయల్న్ ్రచేయడం వల్ల పగిలిన పైప్‌లైన్‌ను గమనించలేకపోయాము. వేలకు వేలు ఖర్చు చేసి సాగు చేసుకున్న వరి పంట నీటిలో మునిగిపోయింది. తెల్లవారు జాము నుంచి ఫోన్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గెట్లు తెగిపోయాయి. పొలంలో ఇసుక మేటలు పెట్టాయి. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు. - యామరెడ్డి, రైతు అన్నదాతలపైనే అన్ని ఆటుపోటులు రైతులపైనే కక్ష తీర్చుకుంటున్నాయి. దానికి తోడు పైప్‌లైన్ పగుళ్లు తీవ్ర దెబ్బ తీస్తున్నాయి. తాగునీరందేది దేవుడెరుగు. కానీ అదే తాగునీటి పైప్‌లు రోజూ ఏదో ప్రాంతంలో పగులుతున్నాయి. నష్టాన్ని ఎవరు భరిస్తారు. అధికారులు మాత్రం మేమింతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. -తిమ్మప్ప, రైతు -
రాష్ట్ర క్రీడా బంధుకి సాక్షి నివాళి