సాక్షి, అమరావతి : అమరావతి: ఇరిగేషన్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ వెంకట రామిరెడ్డి సస్పెన్షన్‌పై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డిపై బుధవారం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సస్పెన్షన్‌కు గురైన వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ...‘నేనెలాంటి తప్పు చేయకపోయినా సస్పెండ్ చేశారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధం. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. 50 ఏళ్లకే ఉద్యోగుల పదవీ విరమణ ఆలోచన లేదని చెప్పారు. లేని జీవోని దొంగిలించానని నాపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్‌పై స్పందించాలని సచివాలయ ఉద్యోగ సంఘాన్ని కోరాం. వాళ్లు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రెండు రోజుల్లో చెబుతామన్నారు. ఉద్యోగుల సంఘం నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిస్తాం.’ అని అన్నారు.
ఉద్యోగుల్లో అభద్రతా భావం...
హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులు అభద్రతతో ఉన్నారని ఏపీ సచివాలయం ఉద్యోగిని భావన అన్నారు. ఏకపక్షంగా ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఉద్యోగుల్లో అభ్రదతా భావం తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉద్యోగుల సంఘం స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు.
ఈ చర్యపై ఏపీ సచివాలయం మూడో బ్లాక్ వద్ద బుధవారం సాయంత్రం కొందరు ఉద్యోగులు నిరసనకు ప్రయత్నించారు. అయితే, సచివాలయంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణపై వారంతా మండిపడ్డారు. సచివాలయం ఉద్యోగుల అసోసిషన్ వద్ద భవిష్యత్ కార్యచరణ పై చర్చలు జరిపారు. ఉద్యోగుల నిరసనతో ఎట్టకేలకు వారిని కలిసేందుకు మురళీకృష్ణ ముందుకొచ్చారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతో మురళీకృష్ణ చర్చలు సాగిస్తున్నారు.
నేను ఏ తప్పు చేయలేదు..విచారణకు నేను సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment