సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరో ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. జలవనరుల శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డిపై బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఉద్యోగుల వయోపరిమితి కుదింపు డ్రాఫ్ట్ కాపీ లీకేజీతో సంబంధం ఉందంటూ వెంకట్రామిరెడ్డిపై ఈ చర్యలు తీసుకున్నారు. కాగా ఇదే వ్యవహారంలో న్యాయశాఖ సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్పను సస్పెండ్ చేసిన అధికారులు తాజాగా వెంకట్రామిరెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు వేయడంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
కాగా ప్రభుత్వ ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపే ప్రతిపాదన లేదని గతంలో సీఎం చంద్రబాబు, మంత్రులు బుకాయించిన విషయం తెలిసిందే. అయితే జీఎం కాపీలను లీక్ చేశారంటూ చర్యలు తీసుకోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే చర్యలు తీసుకున్నారని వారు తెలిపారు. ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగుల ఎన్నికల్లో వెంకట్రామి రెడ్డి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆ విషయంలో పోటీ నుంచి తప్పుకోవాలని వెంకట్రామిరెడ్డిని ఇంటికి పిలిచి సీఎం వార్నింగ్ ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక.. ఆ ఎన్నికల వివాదమే కారణమని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ- ఆఫీసు విధానంలోనూ కాపీల లీక్ ఎలా సాధ్యమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment