సీఎం జగన్‌ను కలిసిన వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో కె.వెంకట్రామిరెడ్డి ప్యానల్ స్వీప్ చేసింది. ఒక్క ఉపాధ్యక్షుడు మినహా మిగతా స్థానాల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ సభ్యులే విజయం సాధించారు. గతంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె.వెంకట్రామిరెడ్డి బుధవారం జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వెంకట్రామిరెడ్డి 288 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
వెంకట్రామిరెడ్డికి 720 ఓట్లు రాగా ప్రత్యర్థిగా పోటీ చేసిన రామకృష్ణకు 422 ఓట్లు వచ్చాయి. వెంకట్రామిరెడ్డి ప్యానల్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా సత్య సులోచన, అదనపు కార్యదర్శిగా వి.గోపీ కృష్ణ, సంయుక్త కార్యదర్శి (సంస్థ)గా యు.మనోహర్, జాయింట్ సెక్రటరీ (మహిళలు)గా రమాదేవిరెడ్డి, జాయింట్ సెక్రటరీ (క్రీడలు)గా ఎ.సాయి కుమార్, కోశాధికారిగా కె.వెంకటరావు విజయం సాధించారు. అలాగే వెంకట్రామిరెడ్డి మద్దతుదారులు ఇద్దరు జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడగా అందులో ఒక మద్దతుదారైన శ్రీకృష్ణ జనరల్ సెక్రటరీగా 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
సీఎం జగన్‌ను కలిసిన వెంకట్రామిరెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కాకర్ల వెంకట్రామిరెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment