Secretariat Employees Association
-
సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ స్వీప్
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో కె.వెంకట్రామిరెడ్డి ప్యానల్ స్వీప్ చేసింది. ఒక్క ఉపాధ్యక్షుడు మినహా మిగతా స్థానాల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ సభ్యులే విజయం సాధించారు. గతంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె.వెంకట్రామిరెడ్డి బుధవారం జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వెంకట్రామిరెడ్డి 288 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వెంకట్రామిరెడ్డికి 720 ఓట్లు రాగా ప్రత్యర్థిగా పోటీ చేసిన రామకృష్ణకు 422 ఓట్లు వచ్చాయి. వెంకట్రామిరెడ్డి ప్యానల్లో వైస్ ప్రెసిడెంట్‌గా సత్య సులోచన, అదనపు కార్యదర్శిగా వి.గోపీ కృష్ణ, సంయుక్త కార్యదర్శి (సంస్థ)గా యు.మనోహర్, జాయింట్ సెక్రటరీ (మహిళలు)గా రమాదేవిరెడ్డి, జాయింట్ సెక్రటరీ (క్రీడలు)గా ఎ.సాయి కుమార్, కోశాధికారిగా కె.వెంకటరావు విజయం సాధించారు. అలాగే వెంకట్రామిరెడ్డి మద్దతుదారులు ఇద్దరు జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడగా అందులో ఒక మద్దతుదారైన శ్రీకృష్ణ జనరల్ సెక్రటరీగా 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సీఎం జగన్‌ను కలిసిన వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కాకర్ల వెంకట్రామిరెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
చంద్రబాబు సన్మాన కార్యక్రమం.. ఉద్యోగుల బాయ్‌కాట్
సాక్షి, అమరావతి : సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకు జరిగిన సన్మాన కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ ప్రసంగాలు చేయడంతో దుమారం రేగింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మరళీకృష్ణ ప్రసంగించారు. దీంతో కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘం నాయకులు ఒక పార్టీకి వత్తాసు పలకడమేంటని మండిపడ్డారు. సీఎం సన్మాన కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాజకీయోపన్యాసం సెలవిచ్చుకున్నారు. కేంద్రం, ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఇళ్ల స్థలాలు కేటాయించినందుకు గాను ఏపీ ఉద్యోగుల జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సంఘం, అమరావతి సంఘాల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
సచివాలయంపై సర్కారు ఆందోళన
- తాత్కాలిక నిర్మాణాల్లో వరుస ప్రమాదాలు - ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ సమీక్ష సాక్షి, అమరావతి : తాత్కాలిక సచివాలయంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. నిర్మాణాల్లో జరుగుతున్న లోపాలను తెలుసుకునే పనిలో పడింది. అందులో భాగంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మంగళవారం సమావేశమయ్యారు. నిర్మాణాల్లో జరుగుతున్న తప్పొప్పులపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒకరు, మే 10న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర ప్రమాదవశాత్తు మరణించారు. గతనెలలో తాత్కాలిక సచివాలయం రెండో భవనంలో ఓ చోట గ్రౌండ్‌ఫ్లోర్ కుంగింది. సోమవారం సాయంత్రం మొదటి భవనం మొదటి అంతస్తులో సైడ్‌వాల్ నిర్మిస్తుండగా జోరుగా వీచిన గాలికి పై భాగంలో నిర్మించిన సిమెంట్ రాళ్లు ఒక్కసారిగా కిందపడ్డాయి. అక్కడే పనిచేస్తున్న ఐదుగురు కూలీలపై ఆ రాళ్లు విరిగిపడటంతో రామచంద్ర, ధర్మేంద్ర తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండో ముచ్చట మళ్లీ వాయిదా వరుస సంఘటనల నేపథ్యం.. పనులు పూర్తి కాకపోవటంతో బుధవారం జరగాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మంత్రి నారాయణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రకటించారు. ఈ నెల 21న తాత్కాలిక సచివాలయంలోని ఐదవ భవనం మొదటి అంతస్తులో రోడ్లు, భవనాలు, రవాణా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
ఉద్యోగుల తరలింపులో అధికారుల వైఫల్యం
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ సాక్షి, హైదరాబాద్: సచివాలయ ఉద్యోగుల తరలింపు అంశంలో అధికారులు వైఫల్యం చెందారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ విమర్శించారు. సోమవారం ఆయన సచివాలయ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. వెలగపూడికి ఉద్యోగులను తరలింపునకు నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడానికి అధికారులే కారణమన్నారు. తరలింపులో సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని.. రాబోయే 5,6 నెలలు ఉద్యోగులకు గడ్డు కాలమని చెప్పారు. తరలింపును మూడు నెలలు వాయిదా వేసినంత మాత్రాన ఆ సమస్యలన్నీ తీరవని స్పష్టం చేశారు. జూన్ 27 నుంచి వెలగపూడి నుండి పరిపాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారని, దానికనుగుణంగా కొత్త రాజధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇస్తుందని భావిస్తున్నామన్నారు. తాత్కాలిక సచివాలయంలో భవన నిర్మాణాలను బట్టి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ ఉంటుందని చెప్పారు. కొత్త రాజధానిలో అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించాలంటే సాధ్యం కాదని.. ఉద్యోగులు కూడా కొంతమేరకు సర్దుకుపోవాలని సూచించారు. ఉద్యోగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్‌కు హితవు పలికారు. ప్రస్తుతం వేతనం తగ్గకుండా హెచ్ఆర్ఏ ఇవ్వాలని సీఎంను కోరామని.. త్వరలో స్థానికత, 30 శాతం హెచ్ఆర్ఏపై జీవో విడుదల చేసే అవకాశముందని చెప్పారు. సెప్టెంబరు నాటికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని.. పనిచేసేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు మురళీకృష్ణ తెలిపారు. ఉద్యోగుల్లో ‘తరలింపు’ గందరగోళం ఏపీ సచివాలయం ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నెల 27కల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి తరలివెళ్లాలన్న ఆదేశాలపై గందరగోళం నెలకొందని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించడంలో ఉద్యోగ సంఘ నాయకులు విఫలం కావడమే ఈ అయోమయ పరిస్థితికి కారణమని ఏపీ సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం సచివాలయ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు.. స్థానికత అంశం తేల్చలేదు.. కొత్త రాజధానిలో ఉద్యోగులకు వసతి కల్పించలేదు.. తాత్కాలిక సచివాలయ భవనాలు పూర్తి కాలేదు.. రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సౌకర్యాలను కల్పించలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో తరలింపు ఉంటుందా అని ఉద్యోగులు మధనపడుతుంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఇవేవి పట్టించుకోకుండా మీడియాలో మైకు దొరికినప్పడల్లా జూన్‌కు తరలిరావడానికి మేం సిద్ధం అని చెప్పడాన్ని ఆక్షేపించారు. కొత్త రాజధానికి వెళ్లడానికి అభ్యంతరం లేదని, అయితే దానికి సంబంధించి రోడ్ మ్యాప్ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. పిల్లల గురించి అడిగితే గొంతెమ్మ కోరికా?: కృష్ణయ్య పిల్లల స్థానికత గురించి తాము ఏడాది నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నామని, అది గొంతెమ్మ కోరిక అవుతుందా అని ఏజీ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు అందరూ అక్కడకు వెళ్లాల్సి వస్తుందని, మరి వాళ్ల పిల్లల సంగతి ఏమవ్వాలని ఆయన నిలదీశారు. -
సచివాలయం ఎక్కడో చెప్పకుండా ఎలా వెళ్తాం?
ఉద్యోగుల అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ‘ప్రతి దానికీ ఉద్యోగుల మీద నెపం వేయడం ప్రభుత్వానికి అలవాటైంది. మేము రాజధానికి వెళ్లడానికి రెడీగా ఉన్నాం.. కానీ ఇప్పటికీ సచివాలయం భవనం ఎక్కడో చెప్పకుండా వెళ్లండంటూ ఒత్తిడి తెస్తూంటే ఎలా వెళ్తాం?’ అంటూ సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం, సాధారణ పరిపాలనశాఖ ఉద్యోగులు బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఫలానా భవనంలో సచివాలయ కార్యాలయం ఉంటుందని ఇప్పటివరకూ ప్రభుత్వం స్పష్టం చేయలేదన్నారు. సచివాలయ ఉద్యోగులను రాజధానికి తరలించాలంటే అందరినీ ఒకేసారి తరలించాలని, అన్ని శాఖలు ఒకే భవనంలో పనిచేసేలా ఏర్పాటు చేస్తే తాము వెళ్లడానికి సిద్ధమని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. -
ఉద్యోగ సంఘాల మధ్య సమసిన వివాదం
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయం విషయమై తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య శుక్రవారం చోటు చేసుకున్న వివాదానికి ప్రభుత్వ పెద్దలు ముగింపు పలికారు. తెలంగాణ ఉద్యోగుల సంఘానికి ఏ-బ్లాక్‌లో అసోసియేషన్ కార్యాలయాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వివాదానికి ముగింపు దొరికింది. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం కార్యాలయం హెచ్ బ్లాక్‌లో ఉన్న కారణంగా శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం మండిపడింది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి పద్మాచారి అదే కార్యాలయాన్ని తమకూ కేటాయించాలని కేసీఆర్ ఫొటో పెట్టి సమావేశం నిర్వహించడంతో ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలన శాఖ నుంచి అనుమతి తెచ్చుకోకుండా ఈ విధంగా సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. అయితే, రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో తమకు కార్యాలయాన్ని కేటాయించడం తప్పనిసరని, అందుకే ఇక్కడ సమావేశం నిర్వహించుకున్నట్టు పద్మాచారి తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట కూడా జరిగింది. ఈ వివాదాన్ని మరింత పెద్దది కాకుండా చూసేందుకు తెలంగాణ ఉద్యోగుల సంఘానికి ఏ-బ్లాక్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల వాగ్వాదం
కార్యాలయం కేటాయింపుపై ఘర్షణ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయం విషయమై తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య శుక్రవారం తోపులాట, వాగ్వాదం జరిగింది. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం కార్యాలయం హెచ్ బ్లాక్‌లో ఉంది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి పద్మాచారి అదే కార్యాలయాన్ని తమకూ కేటాయించాలని కేసీఆర్ ఫొటో పెట్టి సమావేశం నిర్వహించారు. దీనికి ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలన శాఖ నుంచి అనుమతి తెచ్చుకోకుండా ఈ విధంగా సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. అయితే, రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో తమకు కార్యాలయాన్ని కేటాయించడం తప్పనిసరని, అందుకే ఇక్కడ సమావేశం నిర్వహించుకున్నట్టు పద్మాచారి తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. దీనిపై టీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు స్పందిస్తూ.. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఎలాంటి వివాదాలూ లేవని, ఇవన్నీ ఎవరో కావాలని సృష్టిస్తున్నారని చెప్పారు. -
జగన్‌ను ఢిల్లీకి ఆహ్వానించిన సీమాంధ్ర ఉద్యోగులు
-
జగన్‌తో సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం భేటీ