హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయం విషయమై తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య శుక్రవారం చోటు చేసుకున్న వివాదానికి ప్రభుత్వ పెద్దలు ముగింపు పలికారు. తెలంగాణ ఉద్యోగుల సంఘానికి ఏ-బ్లాక్‌లో అసోసియేషన్ కార్యాలయాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వివాదానికి ముగింపు దొరికింది.
ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం కార్యాలయం హెచ్ బ్లాక్‌లో ఉన్న కారణంగా శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం మండిపడింది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి పద్మాచారి అదే కార్యాలయాన్ని తమకూ కేటాయించాలని కేసీఆర్ ఫొటో పెట్టి సమావేశం నిర్వహించడంతో ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలన శాఖ నుంచి అనుమతి తెచ్చుకోకుండా ఈ విధంగా సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. అయితే, రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో తమకు కార్యాలయాన్ని కేటాయించడం తప్పనిసరని, అందుకే ఇక్కడ సమావేశం నిర్వహించుకున్నట్టు పద్మాచారి తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట కూడా జరిగింది. ఈ వివాదాన్ని మరింత పెద్దది కాకుండా చూసేందుకు తెలంగాణ ఉద్యోగుల సంఘానికి ఏ-బ్లాక్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగ సంఘాల మధ్య సమసిన వివాదం
Published Sat, May 31 2014 8:43 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement
Advertisement