
సాక్షి, అమరావతి : సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకు జరిగిన సన్మాన కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ ప్రసంగాలు చేయడంతో దుమారం రేగింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మరళీకృష్ణ ప్రసంగించారు. దీంతో కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘం నాయకులు ఒక పార్టీకి వత్తాసు పలకడమేంటని మండిపడ్డారు. సీఎం సన్మాన కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాజకీయోపన్యాసం సెలవిచ్చుకున్నారు. కేంద్రం, ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఇళ్ల స్థలాలు కేటాయించినందుకు గాను ఏపీ ఉద్యోగుల జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సంఘం, అమరావతి సంఘాల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment