
గుంటూరు,సాక్షి: అంబేద్కర్ జయంతి సభలో సీఎం చంద్రబాబు తడబడ్డారు. 2014-2019లో ప్రజలు ఆనందంగా కూర్చొని నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా? , ఉన్నాయా? అని నొక్కి నొక్కి సభ సాక్షిగా అడిగారు చంద్రబాబు. అది తన హయాం అనే విషయం మర్చిపోయిన చంద్రబాబు.. ఆ సమయంలో ఎవ్వరూ సంతోషంగా లేరనే విషయాన్ని ఆయన తన నోటి వెంటే పలికారు.
రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. నా చరిత్రలో ఎప్పుడు చూడని రాజకీయం 2014-2019లో చూశానని అన్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అప్రమత్తమయ్యారు. చంద్రబాబు వద్దకు వచ్చి ఆయన చెవిలో ఏదో గుసగుసలాడారు. అసలు విషయాన్ని ఆయన చెవిలో ఊదారు. వెంటనే తేరుకున్న చంద్రబాబు సారీ సారీ అంటూ తడబాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు.
ఏదేమైనా ఈ ఘటనతో బాబు.. తన పరిపాలనలో జనం సంతోషంగా లేరన్న విషయం తనే ఒప్పేసుకున్నట్లయింది. కొన్నిసార్లు మనం చేసిన తప్పుల్ని ఎంత దాచుదామనుకున్నా అది ఏదొక సమయంలో నోరూ జారుతూనే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది అని జనం ఆ నోట ఈ నోట అనేసుకుంటున్నారనుకోండి.
