Felicitation
-
తల్లి త్యాగాలను వెలకట్టలేం
సాక్షి, అమరావతి: పురుషులు కన్నా మహిళలు మానసికంగా దృఢవంతులని, తన బిడ్డలను ప్రయోజకులుగా చేసేందుకు తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసి వెంకట నారాయణ భట్టీ అన్నారు. తల్లి త్యాగాలను వేటితోనూ వెలకట్టలేమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య సంయుక్తంగా శనివారం హైకోర్టు మహిళా న్యాయమూర్తులను, మహిళా సీనియర్ న్యాయవాదులను సన్మానించింది. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి జస్టిస్ భట్టీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కలిసి హైకోర్టు మహిళా న్యాయమూర్తులయిన జస్టిస్ బి.శ్రీభానుమతి, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, ఉపలోకాయుక్త పి.రజనీరెడ్డి, సీనియర్ న్యాయవాదులు కేఎన్ విజయలక్ష్మి, ప్రేమలత, అచ్చెమ్మలను జస్టిస్ భట్టీ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు బహూకరించారు. అనంతరం జస్టిస్ భట్టీ, ఆయన సతీమణి అనుపమలను హైకోర్టు న్యాయవాదుల సంఘం, మహిళా న్యాయవాదుల సమాఖ్య, ఇతర న్యాయవాదులు గజమాలతో, శాలువాలతో వేదమంత్రోచ్చరణ మధ్య ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహూకరించారు. అలాగే హైకోర్టు ఉద్యోగుల సంఘం, న్యాయవాద పరిషత్ తదితర సంఘాలు కూడా జస్టిస్ భట్టీని సన్మానించాయి. మదనపల్లి మాణిక్యం.. జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ, జస్టిస్ భట్టీని ‘మదనపల్లి మాణిక్యం’గా అభివర్ణించారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో తల్లి పాత్ర కీలకంగా మారిందన్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వేస్టేషన్ గతంలో అసాంఘిక శక్తులకు చిరునామాగా ఉండేదని, ఆ స్టేషన్ బాధ్యతలను మహిళలకు అప్పగించిన తరువాత దేశంలోనే అత్యుత్తమ స్టేషన్‌గా మారిందన్నారు. మహిళా శక్తికి ఇదో నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, మహిళా న్యాయవాదుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు భాస్కరలక్ష్మి, అధ్యక్షురాలు కె.అరుణ, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, సిబ్బంది పాల్గొన్నారు. సమర్థత వల్లే జస్టిస్ భట్టీ సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, వృత్తిపట్ల నిబద్ధత, నిజాయితీ, సమర్థత, కష్టపడేతత్వం వల్లే జస్టిస్ భట్టీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాగలిగారని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న అసమానత్వాన్ని రూపుమాపేందుకు నిర్మాణాత్మక చర్యలు అవసరమన్నారు. మహిళల రక్షణ కోసం రాజ్యాంగంలో పలు అధికరణలున్నాయని, అవి సమర్థవంతంగా అమలయ్యేందుకు న్యాయస్థానాలు ఎప్పటికప్పుడు ఉత్తర్వులిస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో మహిళలది కీలకపాత్ర ఈ సందర్భంగా జస్టిస్ భట్టీ మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో మహిళలదే కీలక పాత్ర అని చెప్పారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి తన తల్లి, సోదరి, భార్యే కారణమన్నారు. తన తల్లి ఇచ్చిన ధైర్యం, తన సోదరి ఇచ్చిన సలహాలు, తన సతీమణి ఇచ్చిన మద్దతు కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాడిని కావడం వల్లే తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అయ్యానని చెప్పారు. ఏపీ హైకోర్టుకు సదా రుణపడి ఉంటానని, ఎల్లవేళలా ఈ హైకోర్టుకు అండగా ఉంటానని చెప్పారు. ఉద్యోగాల పేరుతో అమాయక యువతులను మానవ అక్రమ రవాణా ఉచ్చులో దించుతున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజలను చైతన్యపరిచే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన మహిళా న్యాయవాదుల సమాఖ్య, రాష్ట్ర న్యా యసేవాధికార సంస్థలను కోరారు. ఇందుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. -
జయ జయహే తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చి, ఉత్తేజం రగిల్చిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గేయంగా గుర్తించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనితోపాటు తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం భావితరాలకు గుర్తుండేలా కీలక మార్పులు చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ ఆత్మ కనిపించేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 25కుపైగా అంశాలపై చర్చించారు. వాహనాల రిజి్రస్టేషన్ నంబర్లలో రాష్ట్ర కోడ్‌గా ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు.. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని ఈ సమయంలోనే ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాకు వివరించారు. ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తాం కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చిన రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలిరోజున గవర్నర్ ప్రసంగిస్తారని, తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. మూడో రోజు బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు కొనసాగించేదీ బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. అలాంటి పోరాటాన్ని కాదని రాచరిక పోకడలతో రూపొందించిన రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా చిహ్నాన్ని రూపొందిస్తాం. తెలంగాణ తల్లి రూపాన్ని కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు కనిపించేలా మారుస్తాం. తెలంగాణ గేయంగా అందెశ్రీ రాసిన జయజయõహే తెలంగాణ పాట గుర్తించాలని మంత్రిమండలి నిర్ణయించింది..’’ అని పొంగులేటి తెలిపారు. త్వరలోనే కులగణన రాష్ట్రంలో బీసీలకు సంక్షేమ ఫలాలు పక్కాగా దక్కేలా కులగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికార యంత్రాంగం రూపొందిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ గెజిట్‌లో భాగంగా.. వాహనాల నంబర్ ప్లేట్లపై ‘టీజీ’ని నిర్దేశించిందని.. కానీ గత ప్రభుత్వం వారి పార్టీ ఆనవాళ్లు కనిపించేలా ‘టీఎస్’ను ఖరారు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర గెజిట్ ప్రకారం టీఎస్‌కు బదులు టీజీగా మార్చాలని నిర్ణయించినట్టు వివరించారు. వీఆర్ఓల అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనప్పటికీ.. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే మరో రెండు గ్యారంటీ హామీలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ.. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైకోర్టు నిర్మాణం కోసం వంద ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. త్వరలో వ్యవసాయాధికారి పోస్టుల భర్తీ చేపడతామన్నారు. గ్రూప్–1, ఇతర కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీలను గుర్తించి, భర్తీ చేసే దిశగా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై నివేదిక ఇవ్వండి రాష్ట్రంలో మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ అంశంపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆదివారం సచివాలయంలో సబ్ కమిటీతో ఈ అంశంపై సమీక్షించారు. బోధన్, ముత్యంపేటలలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన పాత బకాయిలు, వాటి ఆర్థిక ఇబ్బందులు, ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని, తగిన సూచనలను అందించాలని కమిటీని కోరారు. త్వరగా నివేదిక సిద్ధం చేస్తే.. మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సూచించారు. ఈ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
పద్మ పురస్కార గ్రహీతలకు తెలంగాణ సర్కార్ సన్మానం
సాక్షి, హైదరాబాద్: పద్మ పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. పద్మా అవార్డు గ్రహీతల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో ఆరుగురిని ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, మొదటి సినిమాలో ఎలాంటి తపన ఉందో 46 ఏళ్ల తరువాత కూడా చిరంజీవిలో అదే తపన ఉందన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం జరపడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తోందన్నారు. ప్రతీ ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల క్యాష్ రివార్డ్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతీ నెలా 25 వేల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. -
ఇంటర్ విద్యార్థులకు అవార్డులు అందజెసిన సీఎం జగన్
-
10 వ తరగతి విద్యార్ధులకి అవార్డు అందజెసిన సీఎం జగన్
-
బిటెక్, డిగ్రీ విద్యార్థులకు అవార్డులు అందజెసిన సీఎం జగన్
-
మీ అందరికి గ్రాండ్ వెల్కమ్
-
చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడం: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై.. రేపు ప్రపంచానికి ఫలాలు అందించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్ మైండ్స్.. షైనింగ్ స్టార్, ఫ్యూచర్ ఆఫ్ ఏపీ మనదని ఉద్ఘాటించారాయన. మంగళవారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కింద టాపర్స్‌ను విజయవాడలో సన్మానించే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం. కరిక్యులమ్ కూడా మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి విద్యార్థికి ట్యాబులు అందిస్తున్నాం. ప్రతీ విద్యార్థికి డిగ్రీ పట్టా ఉండాలనే తాపత్రయంతోనే.. విద్యా దీవెన, విద్యా వసతి చేపట్టాం. విద్యార్థుల ఫీజుల్ని ప్రభుత్వమే భరిస్తోంది. అత్యుత్తమ కంటెంట్‌తో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులకు టెక్నాలజీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో సీటు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి అండగా ఉంటాం. చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడం. మీ జగన్ మామ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని విద్యార్థులను ఉద్దేశించి స్పష్టం చేశారాయన. ప్రోత్సాహకాలిలా.. జగనన్న ఆణిముత్యాల పేరుతో ఈ నెల 12 నుంచి వారంపాటు సత్కారాలు నిర్వహించనున్నారు. పదవ తరగతిలో ఫస్ట్ ర్యాంకర్‌కు లక్ష. ద్వితీయ ర్యాంక్ రూ.75 వేలు, తృతీయ ర్యాంక్‌కు రూ. 50 వేలు ప్రొత్సాహకం అందించనుంది ఏపీ ప్రభుత్వం. 42 మందిని ఎంపిక చేసి అందిస్తారు. పదో తరగతి విద్యార్థులకు.. ► జిల్లా స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.50,000, ద్వితీయ– రూ.30,000, తృతీయ– రూ.15,000, విద్యార్థులు 609 మంది. ► నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.15,000, ద్వితీయ– రూ.10,000, తృతీయ–రూ.5,000, విద్యార్థులు 681 మంది. ► పాఠశాల స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.3,000, ద్వితీయ–రూ.2,000, తృతీయ– రూ.1,000, విద్యార్థులు 20,299 మంది. ఇంటర్ విద్యార్థులకు.. ► రాష్ట్ర స్థాయి గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.1,00,000 చొప్పున 26 మంది విద్యార్థులకు ప్రదానం ► జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.50,000 చొప్పున 391 మంది విద్యార్థులకు ప్రదానం ► నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.15,000 చొప్పున 662 మందికి ప్రదానం ► మొత్తం విద్యార్థుల సంఖ్య: 22,710 ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికేట్, మెడల్ అందజేస్తారు. -
CM YS Jagan Vijayawada Tour: మీకు జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది
Updates జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. ►మీకు జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది ►గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చదువుపై ధ్యాస పెట్టలేదు ►10వ తరగతిలో రాష్ట్రస్థాయి పస్ట్ ర్యాంకర్ నగదు పురస్కార రూ. 1 లక్ష ►ద్వితీయ ర్యాంకు రూ. 75 వేలు, తృతీయ ర్యాంకు వారికి రూ. 50 వేలు నగదు పురస్కారం ►ప్రభుత్వ స్కూల్స్‌లో చదువుతున్న పేద వర్గాల పిల్లలు ప్రపంచాన్ని ఏలే రోజు వస్తుంది ►నిరుపేద వర్గాలు కూడా ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుతారు ►రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో పరీక్షా పశ్నాపత్రాలు రూపకల్పన ►అట్టడుగు వర్గాల వారే ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు ►జగనన్న ఆణిముత్యాలు పేరుతో ఈ నెల 12 నుంచ 19 వరకూ సత్కారాలు ►ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్ మైండ్స్, షైనింగ్ స్టార్, ఫ్యూచ్ ఆఫ్ ఏపీ మనది ►మన మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు, ఈరోజు మహావృక్షాలై ప్రపంచానికి అభివృద్ధి ఫలాలు అందించాలి ►ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు, కరిక్యూలమ్ అన్ని మారాయి ►ప్రతి విద్యార్థికి ట్యాబ్‌లు అందిస్తున్నాం ►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిస్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. ► విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని ఈ కార్యక్రమం. మన విద్యార్థి ఏ రాష్ట్రానికి వెళ్లినా పోటీతత్వంలో నిలబడతారు. విద్యార్థులే రేపటి భవిష్యత్తుగా ఏపీ ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది అని అన్నారు. ► విజయవాడ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► విజయవాడలో అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం జగన్ ► పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది ఇంటర్లో సత్తాచాటిన 26 మంది నగదు పురస్కారంతో పాటు సర్టిఫికేట్, మెడల్ ప్రదానం ►రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు 22,710 మంది ►గత ప్రభుత్వంలో పెత్తందార్ల చేతిలో బందీ అయిన విద్యావ్యవస్థలో ప్రస్తుత ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది. లక్షల్లో డబ్బు గుంజే కార్పొరేట్ స్కూళ్ల కన్నా మిన్నగా పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించింది. ►ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చి, డిజిటల్ విద్యను ప్రవేశపెట్టి, మెరుగైన విద్యనందిస్తోంది. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక కలెక్టర్, ఒక సైంటిస్ట్, ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక లీడర్ వంటి ఆణిముత్యాలు రావాలన్న తపన, తాపత్రయంతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పనిచేస్తోంది. ►ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగ సంస్కరణలపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.60,329 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా సంస్థల్లో చదువుతూ.. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటరీ్మడియట్ గ్రూపుల వారీగా టాపర్స్‌గా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులను ప్రదానం చేయనున్నారు. విజయవాడ ఎ–కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగే వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులను సత్కరించనున్నారు. ►వీరితో పాటు ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు ‘స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డులు’ను ప్రదానం చేయనున్నారు. కార్యక్రమ వేదిక ఏర్పాట్లను సోమవారం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లు పరిశీలించారు. 22,710 మంది విద్యార్థులకు ప్రోత్సాహం ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ కేటగిరీ విద్యాసంస్థల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జగనన్న ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదో తరగతి, ఇంటర్లో విద్యార్థులను ఎంపిక చేసింది. పదో తరగతిలో కేటగిరీ వారీగా (జెడ్పీ, మున్సిపల్, మోడల్, ట్రైబల్/ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ తదితర) రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పాఠశాల స్థాయిలో ప్రతి స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవకాశం కల్పించింది. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ, హెచ్ఈసీ(నాలుగు) గ్రూపుల్లో ప్రతి గ్రూపులోను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన మొత్తం 22,710 మంది విద్యార్థులకు ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’గా ప్రోత్సాహం అందించనుంది. 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో పాఠశాల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో తొలి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12 నుంచి 19 వరకు ఇప్పటికే నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్తో సత్కరించింది. వీరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను, సంబంధిత విద్యాసంస్థలకు మొమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్లను ప్రభుత్వం సన్మానించింది. జగనన్న ఆణిముత్యాలు ప్రోత్సాహకాలిలా.. పదో తరగతి విద్యార్థులకు.. - రాష్ట్రస్థాయి నగదు పురస్కారం: ప్రథమ స్థానం– రూ.1,00,000, ద్వితీయ స్థానం– రూ.75,000, తృతీయ స్థానం– రూ.50,000, విద్యార్థులు 42 మంది. - జిల్లా స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.50,000, ద్వితీయ– రూ.30,000, తృతీయ– రూ.15,000, విద్యార్థులు 609 మంది. - నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.15,000, ద్వితీయ– రూ.10,000, తృతీయ–రూ.5,000, విద్యార్థులు 681 మంది. - పాఠశాల స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.3,000, ద్వితీయ–రూ.2,000, తృతీయ– రూ.1,000, విద్యార్థులు 20,299 మంది. ఇంటర్ విద్యార్థులకు.. - రాష్ట్ర స్థాయి గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.1,00,000 చొప్పున 26 మంది విద్యార్థులకు ప్రదానం - జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.50,000 చొప్పున 391 మంది విద్యార్థులకు ప్రదానం - నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.15,000 చొప్పున 662 మందికి ప్రదానం - మొత్తం విద్యార్థుల సంఖ్య: 22,710 - ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికేట్, మెడల్ అందజేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇది కూడా చదవండి: కదిలిన రుతుపవనాలు..వచ్చే 4 రోజుల్లో రాష్ట్రమంతటికీ విస్తరణ -
Live: వాలంటీర్లకు సీఎం వైఎస్ జగన్ సన్మానం
-
సచిన్ చేతుల మీదుగా సన్మానం
దక్షిణాఫ్రికాలో ఆదివారం ముగిసిన తొలి అండర్–19 మహిళల ప్రపంచకప్ టి20 క్రికెట్ టోరీ్నలో విజేతగా నిలిచిన భారత జట్టుకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సన్మానించనున్నాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ ప్రారంభానికి ముందు షఫాలీ వర్మ జట్టుకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సచిన్ ముఖ్య అతిథిగా హాజరై భారత యువ జట్టును సత్కరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. -
మళ్లీ బీజేపీలోకి రండి.. పార్టీని వీడిన నేతలకు బండి సంజయ్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో గతంలో చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందిపడి, భావోద్వేగాలతో పార్టీని వీడిన వారు, సైద్ధాంతిక భావాలున్న నేతలు తిరిగి పార్టీలోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. అందరం కలిసి కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడి బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణను సాధించుకుందామన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజలు బిచ్చమెత్తుకునే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యురాలు విజయశాంతి 25 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను పార్టీనేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బీజేపీలో కార్యకర్తలు కూడా ప్రధాని, రాష్ట్రపతి అయ్యే అవకాశాలుంటాయన్నారు. పార్టీలో తాను తప్పు చేసినా అడిగే హక్కు కార్యకర్తలకు ఉంటుందని, తాను సరిచేసుకోకపోతే ఢిల్లీనాయకత్వానికి చెప్పే వీలుంటుందన్నారు. బీఆర్ఎస్లో ఆ పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. సినిమా గ్లామర్ ప్రపంచం. రాజకీయాల్లో ప్రశంసలకంటే విమర్శలే ఎక్కువ, అవన్నీ తట్టుకుని తెలంగాణ ఉద్యమకారిణిగా గర్జిస్తూ విజయశాంతి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషమన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.,. విజయశాంతి ఎవరికీ తలవంచకుండా పనిచేసి రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేందుకు విజయశాంతి ఎంతో పోరాటం చేస్తున్నారని రాష్ట్రపార్టీ ఇన్చార్జీ తరుణ్‌చుగ్ ప్రశంసించారు. నన్ను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నించారు టీఆర్ఎస్ నేతగా ఉన్నపుడే ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నించారని విజయశాంతి చెప్పారు. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన రోజే తనను సస్పెండ్ చేశారన్నారు. ‘కేసీఆర్ ఒక విషసర్పం. ఆయనకు మరోసారి అధికారమిస్తే రాష్ట్రంలో ప్రజలు బతకలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికే రాష్ట్రం రాంగ్ పర్సన్ చేతుల్లోకి వెళ్లింది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని కోరారు. చదవండి: మంత్రి కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సవాల్ -
హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌కు ఘనసత్కారం
వాషింగ్టన్‌డీసీ: హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులెట్ జనరల్‌గా నియమితులైన జెన్నిఫర్ లార్సన్‌కు అభినందనలు తెలిపారు ప్రవాసాంధ్రులు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జెన్నిఫర్ లార్సన్‌కు గౌరవ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వ్యాపార దిగ్గజాలు పాల్గొన్నారు.. కార్యక్రమంలో మాట్లాడుతున్న జెన్నిఫర్ లార్సన్ అమెరికా-భారత వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల్లో చురుకుగా పాల్గొంటున్న వారు, వివిధ తెలుగు సంఘాల్లో పనిచేస్తున్న ప్రముఖులు జెన్నిఫర్ లార్సన్ను అభినందించారు. వ్యాపారవేత్త పార్థ కారంచెట్టి జెన్నిఫర్ లార్సన్ పూలగుచ్ఛంతో స్వాగతం పలికారు. అమెరికాలో పాతికేళ్లుగా సామాజిక సేవల్లో ముందుండేసాఫ్ట్వేర్ వ్యాపార దిగ్గజం రవి పులి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్ సమయంలో అమెరికాలో చిక్కుకు పోయిన ఎందరో భారతీయులను ప్రత్యేక విమానంలో భారత్‌కు చేర్చిన రవి పులి తెలుగువారికి సుపరిచుతులే. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కొత్త కాన్సులేట్ జనరల్ లార్సన్ను రవి పులి అభినందించారు. తాము ఈ దేశంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ, అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నా, మాతృదేశంపై మమకారంతో, రెండు దేశాల మధ్య సాంస్కృతిక, సాంకేతిక, ఆర్థిక, వైద్య లాంటి అన్ని రంగాల్లో పరస్పరం సహకరించుకుని, రెండు దేశాల అభివృద్ధిలో తమ వంతు సహకారం చేయడానికి ఈ సమావేశం ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నామని రవి పులి అన్నారు. ఈ సందర్భంగా జెన్నిఫర్ ప్రవాసాంధ్రులను అభినందించారు. వచ్చే నవంబర్‌లో, ఆసియాలోనే అతి పెద్ద ఎంబసీ హైదరాబాద్‌లో ప్రారంభించ బోతున్నామన్నారు. అక్కడ 55 వీసా విండోస్‌తో, కోవిడ్ మహమ్మారి సమయంలో వెనుకబడిన వీసా సంఖ్యని పెంచడానికి శాయశక్తులా కృషి చేయబోతున్నాం" అని అన్నారు. ప్రతీ సంవత్సరం అమెరికాలో సమాజానికి చేసే ఉత్తమ సేవలకు ఇచ్చే “ప్రెసెడెంట్ వాలంటరీ అవార్డు"ని రవి పులి గెలుచుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. 5279 గంటల వాలంటరీ సమయాన్ని రవి పులి, సమాజ హితం కోసం కేటాయించడం గర్వించదగిందని అమెరికా అధ్యక్షులు తమ అవార్డు సందేశంలో రవి పులి సేవలని కొనియాడారు. ప్రెసిడెంట్ బైడెన్ అవార్డు సందేశాన్ని చదివిన అనంతరం, అవార్డుతో పాటు ఇచ్చే బటన్‌ను రవి పులికి బహుకరించారు మిస్సెస్ జెన్నిఫర్. ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్ మినిష్టర్ (ఎకనామిక్ ) డాక్టర్ రవి కోట ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న రవి పులి హైద్రాబాద్‌లో అమెరికా కాన్సులేట్ కార్యాలయ విధులు నిర్వహిణకు ఎలాంటి మద్ధతు కావాలన్నా తామంతా ముందుంటామని ప్రవాసాంధ్రులు తెలిపారు. ఈ సమావేశంలో USIBC, CII, FICCI,US India SME Council, Indian Embassy ప్రతినిధులు, సైంటిస్టులు,, వ్యాపార వేత్తలు, CGI కంపెనీ అధికారులు పాల్గొన్నారు. చివరిగా వ్యాపారవేత్త జయంత్ చల్లా వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. -
డా.పద్మజా రెడ్డిని సత్కరించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)
నాలుగు దశాబ్దాలుగా కూచిపూడి సాంప్రదాయ నృత్యంతో కాకతీయ సాంప్రదాయ వారసత్వ కీర్తిని బావి తరాలకు అందించేందుకు ఎంత గానో కృషి చేస్తున్నారు పద్మశ్రీ గ్రహీత డా. పద్మజా రెడ్డి గడ్డం. ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ తరపున శాలువాతో ఆమెను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం పద్మజా రెడ్డి మాట్లాడుతూ.. తనను సత్కరించిన సొసైటీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని భావి తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సన్మాన సభలో సొసైటీ తరపున అధ్యక్షులు నీలం మహేందర్, కోశాధికారి లక్ష్మణ్ రాజు కల్వ, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శులు, జూలూరి సంతోష్, కార్యవర్గ సభ్యులు కాసర్ల శ్రీనివాస రావు, రవి క్రిష్ణ విజ్జాపూర్, శశి ధర్ రెడ్డి, భాస్కర్ నడికట్ల ప్రాంతీయ కార్యదర్శి నంగునూరి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతిభవన్‌కు తిమ్మక్క.. సమీక్ష సమావేశానికి తీసుకెళ్లి సత్కరించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ గ్రహీత.. 110 ఏళ్ల వయసున్న సాలు మరద తిమ్మక్క బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎం ఆమెను ప్రగతిభవన్‌లో మంత్రు లు, కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి స్వయంగా తోడ్కొని వెళ్లారు. అందరికీ పరిచయం చేశారు. ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పర్యావరణం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. మంచి పనిలో నిమగ్నమైతే గొప్పగా జీవించవచ్చని, మంచి ఆరోగ్యంతో ఉంటారనడానికి తిమ్మక్క నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. అందరూ ఆమె బాటలో నడవాలని ఆకాంక్షించారు. కాగా.. వ్యవసాయం, అటవీ సంరక్షణ రంగాల్లో రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలవడం పట్ల తిమ్మక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు అవసరముంటే తాను అందజేస్తానని చెప్పారు. కర్ణాటకకు చెందిన తిమ్మక్క బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల్లో ఒకరు. 25 ఏళ్లవరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి.. పచ్చదనం, పర్యావరణ హితం కోసం ఆమె కృషి చేస్తున్నారు. చదవండి👉🏼 కేసీఆర్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు.. తప్పుగా అనుకోవద్దని వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు, ప్రముఖ పర్యావరణ వేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, 110 సంవత్సరాల సాలుమరద తిమ్మక్క ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. pic.twitter.com/j9hLTlz4cK — Telangana CMO (@TelanganaCMO) May 18, 2022 ‘ఆకుపచ్చని వీలునామా’ఆవిష్కరణ హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ పై సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం ‘ఆకుపచ్చని వీలునామా’పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సీఎంను కలిసిన తమిళ హీరో విజయ్ తమిళ సినీనటుడు విజయ్ బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయ్‌కు కేసీఆర్ శాలువా కప్పి సత్కరించారు. చదవండి👉 భూవివాదంలో కేసు నమోదు.. పరారీలో మంత్రి మల్లారెడ్డి బావమరిది -
సొంతూరులో సన్మానం కిక్కేవేరు
సాక్షి, హైదరాబాద్: ‘ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అయినట్లు.. నేను ఎంత ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించినా ఈ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడినే.. న్యాయవాది రమణనే. సొంత ఊరిలో మర్యాద పొందడం అన్నది సామాన్యమైన విష యం కాదు... ఆ కిక్కే వేరు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టులో శుక్రవారం తెలంగాణ బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో చేపట్టిన సన్మానంపై ఉప్పొంగిపోయారు. గత స్మృతులను నెమరేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తనను రాజభవన్లో, వరం గల్లోనూ సన్మానించారని, తనను ఎంతో ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకున్న తెలంగాణ గడ్డకు కృతజ్ఞుడినని అన్నారు. తెలంగాణ హైకోర్టు తనకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. భాష, మర్యాద, సంస్కా రం, సంస్కృతి, జీవితంలో పోరాటం, జీవించడం వంటివి నేర్పిందని గుర్తుచేసుకున్నారు. న్యాయ వాదిగా 17 ఏళ్లు, న్యాయమూర్తిగా 13 ఏళ్లు పని చేశానని, అందుకే ఈ ప్రాంగణంలోకి వస్తే భావోద్వేగానికి గురవుతానన్నారు. తెలంగాణ అభివృద్ధికి సంతోషిస్తున్నా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు కొంత మంది ఎక్కువ క్రమశిక్షణతో కనిపిస్తున్నారని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి నిదర్శనమన్నా రు. ఐక్యతకు చిహ్నమని, అందుకే మీరు తెలంగాణను పోరాడి తెచ్చుకోవడం సామాన్య విషయం కాదన్నారు. ఆ తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే సంతోషించే వాడిలో తాను కూడా ఒకడినని చెప్పారు. తన పదవీకాలంలో ఏమి ఘన కార్యాలు చేసినా ఆ ఖ్యాతి తెలంగాణ హైకోర్టుదేనని, అపఖ్యాతి వస్తే మాత్రం ఆ బాధ్యత తనదన్నారు. కోర్టుల్లో వసతులలేమికి ఇక పరిష్కారం... తాను సీజేఐ అయ్యాక దేశ న్యాయ వ్యవస్థలో రెండు మౌలిక లోపాలను గమనించానని ఎన్వీ రమణ చెప్పారు. సామాన్యుడికి న్యాయం అందుబాటులో ఉండాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి తగిన సం ఖ్యలో కోర్టులు ఉండటం, సరైన సౌకర్యాలు ఉండ టం అవసరమన్నారు. అందుకోసమే కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించానన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే రాష్ట్రాల సీఎంలు, ప్రధాని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఈ అంశంపై చర్చిస్తామని, చర్చలు ఫలప్రదమైతే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సగం పోస్టులు భర్తీ చేశా.. ‘దేశంలోని హైకోర్టుల్లో 1,100 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ఎప్పుడూ కనీసం 400 ఖాళీలు ఉంటాయి. నేను సీజేఐ అయ్యాక 198 హైకోర్టు జడ్జీల పోస్టుల భర్తీ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపా. అందులో ఇప్పటిదాకా 130 భర్తీ అవగా మిగిలినవి కేంద్రం వద్ద పెండింగ్‌లోఉన్నాయి. మే నెలాఖరులోగా మరో 200 మంది న్యాయమూర్తుల నియామకానికి ప్రతిపాదనలు పంపుతా. తెలం గాణ హైకోర్టులో 24గా ఉన్న జడ్జీల సంఖ్యను 42కి పెంచుకున్నాం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ మరిన్ని పేర్లు పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అయితే ఖాళీల భర్తీలో సామాజిక, ప్రాంతీయ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని సీజేఐ సూచించారు. మహిళా జడ్జీల తరఫున నినదించా... ‘ఢిల్లీలో ఇటీవల మహిళా జడ్జీలకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కార్ల్ మార్క్స్ నినా దాన్ని కాస్త మార్చి చెప్పా. మహిళలారా ఏకం కండి.. పోరాడితే పోయేదేమీ లేదు... సంకేళ్లు తప్ప అనే నినాదం ఇచ్చా. కానీ ఈ విషయంలో కొన్ని సామాజిక మాధ్యమాలు నాపై దుమ్మెత్తిపోశాయి. అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని కోరడం తప్పు అన్నా నేనేమీ లెక్కచేయను. కేవలం మహిళలకే కాదు... అన్ని ప్రాంతాలకు సమ న్యాయం ఉండాలి. అప్పుడే న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. జూనియర్లకు ఆర్థిక చేయూత అందించాలి... ‘చిన్న, మధ్యతరగతి న్యాయవాదులు కోవిడ్ కాలంలో ఇబ్బందులు పడ్డారు. వృత్తిని వదిలేసి చేతివృత్తులు, ఆటోలు నడుపుకోవడం చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నా. అలాగే జూనియర్లను న్యాయమూర్తులు కాస్త కనిపెట్టి ఉండాలి. న్యాయవాదుల శిక్షణకు అకాడమీని హైదరాబాద్‌లోనే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అఖిల భారత జ్యుడీషియల్ డేటా మేనేజ్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించా. అలాగే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవాలి’ అని సీజేఐ సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా పనిచేస్తేనే మంచిపేరు
బాపట్ల టౌన్: వలంటీర్లు పారదర్శకంగా పనిచేసినప్పుడే ప్రజల మన్నన పొందగలరని కలెక్టర్ కె.విజయకృష్ణన్ చెప్పారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం బాపట్ల జిల్లాలోని వలంటీర్లకు సేవావజ్ర, సేవామిత్ర, సేవారత్న పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వలంటీర్లు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలకు ఎంపికైన వలంటీర్లను పూలమాలలు, శాలువాలతో సత్కరించి పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి పెద్దిరోజా, రెవెన్యూ డివిజనల్ అధికారి జి.రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, బాపట్ల ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, బాపట్ల జెడ్పీటీసీ సభ్యురాలు పిన్నిబోయిన ఎస్తేరురాణి పాల్గొన్నారు. -
సంక్షేమ వారధులు వలంటీర్లు
సాక్షి, పిడుగురాళ్ల: వలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందించాలని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 2, 3, 4, 5, 6, 7 వార్డుల్లో వలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో నిర్వహించబోయే జగనన్న బాట కార్యక్రమం ద్వారా ప్రతి గడప వద్దకు వెళతామని, ఎవరైనా సమస్య ఉందని చెబితే వలంటీర్లే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. అనంతరం 2, 3 వార్డు సచివాలయాల్లో https://bharatpe.com ఒక సేవారత్న, 16 సేవా మిత్రాలు వచ్చిన వలంటీర్లను, 4, 5, 6, 7 వార్డుల్లో 45 సేవా మిత్రాలను ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చేతుల మీదుగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, వైస్చైర్మన్లు కొమ్ము ముక్కంటి, షేక్ జైలాబ్దిన్, పట్టణ కన్వీనర్ చింతా రామారావు, కౌన్సిలర్లు కొక్కెర శ్రీను, రొక్కం మధుసూదన్‌రెడ్డి, బండిగుంతల నాగమణి, అజ్మిర శారదాబాయి, పొలు శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కుందుర్తి గురవాచారి, మున్సిపల్ కమిషనర్ ఎ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘పద్మ’ గ్రహీతలకు సీజేఐ సన్మానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మ అవార్డు గ్రహీతలు నలుగురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం సన్మానించారు. వివిధ రంగాల్లో 54 మంది ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం పద్మ అవార్డులు బహూకరించడం తెలిసిందే. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన దివంగత గోసవీడు షేక్ హసన్ తరఫున ఆయన మనవడు, గరికిపాటి నరసింహారావు, సుంకర వెంకట ఆదినారాయణ రావు, దర్శనం మొగుల య్యలను సీజేఐ తన నివాసానికి ఆహ్వానించి సన్మానించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
గిరిజనుల పాలిట దేవుడు అల్లూరి సీతారామరాజు
బంజారాహిల్స్(హైదరాబాద్): తన వీరోచిత పోరా టాలతో తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించి గిరిజనుల పాలిట దేవుడిగా, ప్రజల్లో దేశ భక్తిని నింపిన స్వాతంత్య్ర సమరయోధుడిగా అల్లూరి సీతారామరాజు చరిత్ర చిరస్థాయిలో నిలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రముఖుల జీవి తాలను ఈ తరానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా తెలుగు ప్రజల ఆరాధ్యదైవం అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని జాతీయ సంబురాలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని ఆదివారం ఫిలింనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లా డుతూ.. ఈ ఏడాది జూలై 4 నుంచి వచ్చే ఏడాది జూలై 4 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలను నిర్వహించాలన్నారు. ఏపీలోని లంబసింగిలో అల్లూరి మ్యూజియానికి రూ.35 కోట్లు కేటాయిం చామని, అందులో ఇప్పటికే రూ. 6.93 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈ జయంతి ఉత్సవాల్లోనే మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అల్లూరిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, దానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నామని చెప్పారు. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారానే ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలిసిందని, తాను ఆ సినిమాను 20 సార్లు చూశానని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలి: ఏపీ మంత్రి అవంతి ఏపీ పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసే విధంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కృషి చేయాలని కోరారు. ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఒక జిల్లాకు అల్లూరి పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అల్లూరి పేరుతో విశ్వవిద్యాలయాల్లో గోల్డ్ మెడల్స్‌ను ప్రవేశ పెట్టాలన్నారు. హీరో కృష్ణ మాట్లాడుతూ.. తన పన్నెండో ఏట నుంచే అల్లూరి అంటే ఇష్టమని.. తన వందో చిత్రం అల్లూరి సీతారామరాజు.. అని గుర్తు చేసుకున్నారు. తాను 365 సినిమాలలో నటించినా ఇప్పటికీ తనకు నంబర్ వన్ చిత్రం అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, హీరో మోహన్‌బాబు మాట్లాడుతూ.. రాజులు చాలా గొప్పవారని, వాళ్లల్లో రాజకీయం నరనరాల్లో ప్రవహిస్తూ ఉంటుందని అన్నారు. రాజులంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు ఎన్.నాగరాజు, ప్రధాన కార్యదర్శి పి.నానిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో కృష్ణను సత్కరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. -
సూపర్‌స్టార్ కృష్ణకు ఘన సన్మానం.. 350కిపైగా చిత్రాల్లో నటించినా
Tribute To superstar Krishna Under Alluri Sitaramaraju 125th Birth Anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ప్రయోగాలకు నిర్వచనం సూపర్ స్టార్ కృష్ణ. జేమ్స్ బాండ్ వంటి హాలీవుడ్ తరహా పాత్రలను టాలీవుడ్‌కు పరిచయం చేసి హిట్ కొట్టారు. విభిన్న పాత్రలు, కథలతో ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించారు. 350పైగా చిత్రాల్లో నటించి సూపర్ స్టార్‌గా ఎదిగారు. నిర్మాతగా, దర్శకుడిగా సైతం రాణించి ఎందరో ఆర్టిస్ట్‌లకు దేవుడిగా మారారు. ఎన్నో మైలు రాళ్లు చేరుకున్న ఘట్టమనేని కృష్ణకు హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా సన్మానం జరిగింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీనివాస్ గౌడ్, అవంతి శ్రీనివాస్‌తోపాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నిర్మాతలు అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల గుండెల్లో అల్లూరిసీతరామరాజుగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కృష్ణకు సన్మానం చేశారు. అలాగే తన 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు విశేషాల్ని పంచుకున్నారు కృష్ణ. 350 చిత్రాల్లో నటించినా అల్లూరి సీతారామరాజు సినిమానే తనకిష్టమని తెలిపారు. -
వడ్లమాని శ్రీనివాస్‌కి సన్మానం
చార్లెట్, నార్త్ కెరోలినా: అమెరికాకు చెందిన గాయకులు వడ్లమాని శ్రీనివాస్‌ని వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా వంశీ సంస్థల అధినేత శిరోమణి, డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ.. మాతృభాషను, మాతృదేశాన్ని మరవకుండా తెలుగు భాషకు వడ్లమాని శ్రీనివాస్ చేస్తున్న సేవలుక ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్, టెక్సాస్ 95వ ప్రచురణగా ముద్రించిన 'లిటిల్ డిటెక్టివ్' నవలికను శ్రీనివాస్ వడ్లమానికి బహుకరించారు. -
ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఓ పండుగ : మంచు విష్ణు
‘‘ఉపాధ్యాయ దినోత్సవం అనేది ముఖ్యమైన పండుగ. ‘శ్రీ’ విద్యానికేతన్ కుటుంబంలో ఉపాధ్యాయ దినోత్సవం అంతర్భాగం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పలువురు గురువులను, కోవిడ్ సమయంలో సాయమందించిన సినీ కళాకారులను మంచు విష్ణు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఉపాధ్యాయులకు శాశ్వత గౌరవ సూచకంగా, విద్యారంగంలోని వారి సేవలకు గుర్తింపుగా శ్రీ విద్యానికేతన్ ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వారిని సత్కరించే గొప్ప సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. కోవిడ్ మహమ్మారి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనేక మంది జీవితాలను కుదిపేసింది. మంచి హృదయం కలిగిన సినీ ప్రముఖులు, కళాకారులు చాలామందికి నగదు, నిత్యావసర వస్తువుల రూపంలో సహాయం అందించారు. పవిత్రమైన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామ సత్యనారాయణ, నటులు నరేశ్, పృథ్వీ, శివ బాలాజీ, గౌతమ్ రాజు, నటి మధుమిత తదితరులు పాల్గొన్నారు. చదవండి : హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు Bigg Boss 5 Telugu: బుల్లితెర హంగామా మొదలైంది -
‘సీఎం జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు’
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. ఆదివారం భీమవరం గునుపూడిలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ కొయ్యే మోషన్ రాజు సన్మాన సభకు ఎంపీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రాజధానులతో రాష్ట్ర సమగ్రాభివృద్ది జరుగుతుందన్నారు. కరోనా కష్టకాలంలోను పేదలకు సీఎం జగన్ సంక్షేమాన్ని చేరువ చేశారని చెప్పారు. మన బడి, నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చారని, ఇంగ్లీష్ మీడియంతో పేద విద్యార్థుల భవితకు అండగా నిలిచారని కొనియాడారు. అనంతరం మంత్రి రంగనాథ రాజు మాట్లాడుతూ.. కొయ్యే మోషన్ రాజు పార్టీకి అండగా ఉండి పని చేశారని తెలిపారు. కష్టపడిన వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. చదవండి: బీజేపీ నాయకులు రావాల్సిన నిధులపై మాట్లాడరే : మల్లాది విష్ణు -
హీరో నిఖిల్‌ను సత్కరించిన సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: హీరో నిఖిల్ సిద్దార్థను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సత్కరించారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఎంతోమందికి సహాయం చేసిన నిఖిల్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా నిఖిల్‌కు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం సజ్జనార్ నిఖిల్‌తో సరదాగా కాసేపు ముచ్చటించారు. కాగా కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, మందులు సహా అవసరమైన వారికి నిఖిల్ చేయూత అందించారు. ఇదిలా ఉండగా నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. Honoured to be Felicitated & Recognised by the Commisioner of Police VC. Sajjanar Sir for COVID Related Work During the second wave and Interacting with the frontline Covid Police Warriors. #covid_19 #covid pic.twitter.com/DlQLZp0DLp — Nikhil Siddhartha (@actor_Nikhil) August 13, 2021 -
ఒలింపిక్స్ విజేతల సందడి: వందనా కటారియా భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చూపించిన సొంతగడ్డపై అడుగిడిన క్రీడాకారులను ఘన స్వాగతం లభించింది. నగదు పురస్కారాలు, సత్కారాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి గౌరవించాయి. ముఖ్యంగా ఒడిశా ముఖ్యమంత్ర నవీన్ పట్నాయక్ రాష్ట్రానికి చెందిన పురుషులు, మహిళా హాకీ క్రీడాకారులను సన్మానించారు. బీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌కు 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని, అలాగే దీప్ గ్రేస్ ఎక్కా నమితా టోపోలకు ఒక్కొక్కరికి రూ .50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. మరోవైపు టోక్యో 2020 లో పాల్గొన్న మహిళల హాకీ జట్టు సభ్యులు సలీమా టేట్, నిక్కీ ప్రధాన్ తమ సొంత రాష్ట్రానికి చేరుకున్న రాంచీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు. పంజాబ్‌కు చెందిన పురుషులు మహిళల హాకీ క్రీడాకారుల లుకూడాఅమృత్సర్ చేరుకున్నారు. కామన్వెల్త్ ఆసియన్ గేమ్స్ వచ్చే నెల నుండి శిక్షణను ప్రారంభిస్తామని, హాకీ జట్టు ఆటగాడు గుర్జంత్ సింగ్ వెల్లడించారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి ఇండియన్ ప్లేయర్‌కు వందన కటారియాకు డెహ్రాడూన్ విమానాశ్రయంలోనూ, గ్రామంలోనూ వాయిద్యాలతో గ్రామస్తులు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల తండ్రిని కోల్పోయిన వందనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంటికి చేరినపుడు తనను తాను ఎలా నిభాయించుకోవాలో అర్థంకాలేదని పేర్కొన్నారు. అటు ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న మీరా బాయి చాను టెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిసారు. Amid 'dhols', Indian Women Hockey team's Vandana Katariya receives a warm welcome at Dehradun Airport, Uttarakhand. "We were broken after losing the bronze medal match, didn't win a medal but have won hearts. The team performed well at #Tokyo2020, " she says pic.twitter.com/VEa5jv8mLs — ANI (@ANI) August 11, 2021 Odisha CM Naveen Patnaik felicitated Men and Women hockey players from the state- Deep Grace Ekka, Namita Toppo, Birendra Lakra and Amit Rohidas for their performance at #Tokyo2020; handed over a cash award of Rs 2.5 crores to Birendra Lakra & Amit Rohidas. pic.twitter.com/Wt6ks6gYsC — ANI (@ANI) August 11, 2021 Family members of Indian men and women hockey players from Punjab receive them at Amritsar "We'll start training from next month. We have a busy year ahead due to Commonwealth & Asian Games. Confidence of team is high," says men's hockey team player Gurjant Singh pic.twitter.com/CpZDqXmSPr — ANI (@ANI) August 11, 2021 -
టోక్యో హీరోస్ కు సత్కారం
-
50 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి అనుమతి
సాక్షి, హైదరాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇదివరకు ఒక్కో శాఖకు ఒక్కోసారి పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చేవారమని, ఇప్పుడు అలాకాకుండా అన్ని శాఖల్లో భర్తీకి ఒకేసారి అనుమతి ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. అతి త్వరలో భర్తీకి అనుమతులు ఇస్తామని, ఇప్పటికే ఖాళీల గుర్తింపుపై కసరత్తు మొదలు పెట్టామన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చం ద్రావతి, ఖాద్రీల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. చక్రపాణి, ఇతర సభ్యులను సీ ఎస్ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లలో ఘంటా చక్రపాణి అత్యంత పారదర్శకంగా సేవలందిం చారని సీఎస్ కొనియాడారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెం చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఘం టా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, నియామకాల భర్తీ ప్రక్రియలో ఉద్యోగులు ఎంతో సహకరించారని, కమిషన్ పరపతి అంతర్జాతీ య స్థాయిలో పెరిగిందన్నారు. టీఎస్పీఎస్సీలో దరఖాస్తు ప్రక్రియ మొదలు ఫలితాల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, నియామక ఉత్తర్వులు.. ఇలా అన్ని స్థాయిల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి సత్ఫలితాలు తెచ్చామన్నారు. టీఎస్పీఎస్సీ ఇన్చార్జి చైర్మన్‌గా కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుడు డి.కృష్ణారెడ్డి సంస్థ ఇన్చార్జి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పదవీకాలం గురువారంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
కరోనాను జయించిన వారియర్స్‌కు సన్మానం
సాక్షి, హైదరాబాద్ : కరోనాను జయించి తిరిగి విధుల్లోకి చేరిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సన్మానం చేశారు. లాక్డౌన్ సమయంలో విధి నిర్వాహనలో భాగంగా కరోనా వారియర్స్‌గా ముఖ్యపాత్ర పోషించిన పలువురు పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు. రాచకొండ కమిసనరేట్ పరిధిలో దాదాపు 500 మంంది పోలీసులు కరోనాను జయించి మళ్లీ విధుల్లోకి చేరారు. వారి సేవలను గుర్తించి సీపీ మహేష్ భగవత్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్ కుమార్, డిసిపి మల్కాజిగిరి రక్షిత మూర్తి సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
సచిన్‌కు బీఎంసీ ఝలక్
సాక్షి, ముంబై: ప్రముఖ మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు సత్కారం చేయాలనే ప్రతిపాదనను ఎట్టకేలకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విరమించుకుంది. గత తొమ్మిదేళ్ల నుంచి సన్మానం పొందడానికి సచిన్‌కు సమయం అనుకూలించకపోవడంతో చివరకు రద్దు చేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో సచిన్ వివిధ క్రికెట్ మ్యాచ్‌లలో ప్రదర్శించిన ప్రతిభకు గుర్తుగా ఆయనకు ముంబై నగరం తరఫున ఘనంగా సత్కరించాలని 2010లో జరిగిన బీఎంసీ సభాగృహంలో నిర్ణయం తీసుకుంది. దీంతో తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని అందుకు సంబంధించిన లేఖను బీఎంసీ అధికారులు ఆయనకు పంపించారు. కానీ, తరుచూ ఆయన బిజీగా ఉండటంవల్ల వాయిదా వేస్తూ వస్తున్నారు. పలుమార్లు లేఖ రాసి మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఆయన నుంచి స్పందన రాలేదు. తొమ్మిదేళ్లు కావస్తున్నప్పటికీ బీఎంసీ తరఫున సత్కారం పొందేందుకు ఆయనకు సమయం లభించలేదు. చివరకు బీఎంసీ పరిపాలన విభాగం సత్కార కార్యక్రమాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. -
చూద్దాం పూలదండన్నా మార్పు తీసుకొస్తుందేమో!
దండేశారు దండం పెట్టారు.. అయినా వినని వారికి ఫైన్ రాశారు... అప్పటికీ వినకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు.... వరంగల్ బల్దియా అధికారుల్లా ఆలోచిస్తారు. బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న వారికి జీడబ్ల్యూఎంసీ (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్)ల అధికారులు వెరైటీ శిక్ష వేశారు. 200 వందల మందికి పైగా పూలదండలు వేసి సన్మానించారు. బహిరంగ మూత్ర విసర్జన కారణంగా... వరంగల్ ఏజీఎం ప్రాంతంలో రోడ్డుపై జనం నడవాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. బల్దియా అధికారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎన్నోసార్లు శుభ్రం చేశారు. అయినా జనాల్లో మార్పు కనిపించకపోవడంతో ఈ దండ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ చుట్టు ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని.. అలా చేసినప్పుడే రోగాల బారిన పడకుండా ఉంటారని అధికారులు అంటున్నారు. చూద్దాం పూలదండ కార్యక్రమమన్నా ప్రజల్లో మార్పు తీసుకొస్తుందేమో. -
గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం
సాక్షి,తాంసి: నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామాలకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. ఆదివారం తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్ గ్రామంలో బుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో నిర్వహించిన గ్రామస్తుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండల్‌నాగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమెల్యే రాథోడ్ బాపూరావును బుడగ జంఘం సంఘం నాయకులు పూలమాల శాలువాతో సన్మానించారు. పిప్పల్‌కోటి గ్రామంలో ఎమ్మెల్యేను నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పాలకవర్గసభ్యులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ పిప్పల్‌కోటి గ్రామంలో 368 కోట్ల రూపాయల రిజర్వాయర్ నిర్మాణంతో గ్రామంలో చుట్టుపక్కల భూములు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు భూములను అందించటం అభినందనీయమన్నారు. భూములను అందించిన రైతులకు నష్టపరిహారంతో పాటు అన్నివిధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములందించి సహకరించిన పిప్పల్‌కోటి గ్రామాన్ని దత్తత తీసుకొని అబివృద్ధి చేస్తానని గ్రామస్తులకు తెలిపారు. -
చంద్రబాబు సన్మాన కార్యక్రమం.. ఉద్యోగుల బాయ్‌కాట్
సాక్షి, అమరావతి : సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుకు జరిగిన సన్మాన కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయ ప్రసంగాలు చేయడంతో దుమారం రేగింది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మరళీకృష్ణ ప్రసంగించారు. దీంతో కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘం నాయకులు ఒక పార్టీకి వత్తాసు పలకడమేంటని మండిపడ్డారు. సీఎం సన్మాన కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాజకీయోపన్యాసం సెలవిచ్చుకున్నారు. కేంద్రం, ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఇళ్ల స్థలాలు కేటాయించినందుకు గాను ఏపీ ఉద్యోగుల జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సంఘం, అమరావతి సంఘాల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
లోకేష్ బాబు సన్మానానికి రెండున్నర కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేష్ సన్మానానికి ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రెండున్నర కోట్లు ఖర్చు పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు సంబంధిత ఉద్యోగులందరితో బుధవారం మంత్రి లోకేష్‌కు సన్మానం జరగనుంది. ఉద్యోగులందరూ కృతజ్ఞతగా మంత్రికి సన్మానం చేస్తున్నారని పైకి చెబుతున్నా.. ఆ ఉద్యోగులందరినీ విజయవాడకు తరలించేందుకు, సన్మాన సభకు అయ్యే ఖర్చు కోసం దాదాపు రూ. 2.5కోట్లను ఉపాధి హామీ నిధుల నుంచి వెచ్చించాలని మంత్రి లోకేష్ కార్యాలయం సూచించింది. నిజానికి ఉపాధి హామీ పథకానికి 90 శాతం నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అయినా లోకేష్‌కు సన్మానం చేయడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిజానికి ఉపాధి హామీ పథకంలో కూలీలకు డిసెంబరు నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. దాదాపు రూ.360 కోట్ల చెల్లింపుల జాప్యంపై రాష్ట్రాన్ని ప్రశ్నిస్తే మాత్రం.. కేంద్రం నిధులు ఇవ్వలేదని అంటుంది. మరి ఈ సన్మానానికి మాత్రం నిధుల కొరత లేకపోవడం గమనార్హం. (ధర్మ పోరాటమా.? సెల్ఫీల ఆరాటమా?) ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లతో పాటు మండల, జిల్లా స్థాయిలో పనిచేసే దాదాపు 15 వేల మందిని తరలించేందుకు ఉపాధి నిధులతో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సన్మానం కాగా.. బుధవారం ఉదయమంతా వారిని రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూపించేలా విహార యాత్రలు ఏర్పాటు చేశారు. విహార యాత్ర అనంతరం ఉద్యోగులంతా సన్మాన కార్యక్రమానికి హాజరై ‘థ్యాంక్యూ లోకేష్ గారూ!’ అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయాలి. జీతాలు పెంచుతామని ఆశ పెట్టి.. లోకేష్ సన్మాన కార్యక్రమానికి రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులంతా తప్పనిసరిగా పాల్గొనాలని, ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల పెంపుపై మంత్రి ప్రకటన చేస్తారని అధికారులు ఆశ పెట్టారు. కార్యక్రమానికి హాజరైతేనే జీతాలు పెరుగుతాయని చెప్పడంతో చాలామంది అయిష్టంగానే బయల్దేరారు. ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జీతాలు చెల్లిస్తారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ పథకంలో డిప్యూటేషన్‌పై పనిచేసే వందల మంది రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు రాష్ట్ర ఖజనా నుంచే కాకుండా కేంద్ర నిధుల నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పథకంలో దేశ వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా అక్కడ ఎలాంటి ఆర్భాటాలు ఉండకూడదని పథకం నిబంధనలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే మంత్రి లోకేష్ మాత్రం జీతాల పెంపు ప్రకటన పేరుతో రూ. రెండున్నర కోట్లను ఖర్చు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (అయ్యో.. లోకేష్ అది కూడా తెలియదా?) -
హనుమ విహారికి ఘన సన్మానం
యైటింక్లయిన్‌కాలనీ: భారత క్రికెట్ హనుమ విహారిని ఆదివారం రాత్రి ఘనంగా సన్మానించారు. తన సోదరి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనడానికి యైటింక్లయిన్‌కాలనీకి వచ్చిన క్రికెటర్ హనుమ విహారిని సీఈఆర్‌క్లబ్, దృవపాండవ్ క్రికెట్ టీం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ క్రికెట్లో మరింత రాణించి భారత్‌కు కీర్తిప్రతిష్టలు తేవాలని వక్తలు అన్నారు. చిన్ననాటి నుంచి కఠోర శ్రమతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన విహారి ఈ తరం యువతకు ఆదర్శం అని కొనియాడారు. పట్టుదల ఉంటే సాధించనిది ఏమి లేదని, ప్రతీ ఒక్కరు తమ లక్ష్యం వైపు అలుపెరుగని శ్రమ చేస్తే విజయం వరిస్తుందన్నారు. విహారీ మాట్లాడుతూ తనను సాదరంగా సన్మానించిన క్లబ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో క్లబ్ గౌరవ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కార్యదర్శి హమీద్, సింగరేణి డాక్టర్ రమేష్‌బాబు, ఓసీపీ–2 ఎస్ఈ చంద్రశేఖర్, దృవపాండవ క్రికెట్ టీం సభ్యులు నర్సింహారెడ్డి, ముఖేశ్, తిరుపతిరెడ్డి, హరీష్, రవిశంకర్, వేణుమాదవ్, పాశం ఓదెలు, ఆరీఫ్, శ్రీధర్, అంజి పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను సన్మానించిన చేనేత కార్మికులు
-
జగన్‌ను సత్కరించిన కాపు నేతలు
పిఠాపురం: ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చేబ్రోలులో రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన కాపు నేతలు సత్కరించారు. నాయకులు కొండేపూడి సురేష్,మాగాపు అమ్మిరాజు, గాదంశెట్టి శ్రీధర్, తోట భద్రరావు, తవట్టికూటి ఏసురావు తదితరులు మాట్లాడుతూ మొదటి నుంచి కాపుల ఉద్యమానికి అండగా ఉన్న నేత ఒక్క ఈయనే అన్నారు. ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చి మోసం చేసిన వారిని కాపులు చూస్తు ఊరుకోరని వారు హెచ్చరించారు కార్యక్రమంలో పలువురు కాపు నేతలు యుయకులు పాల్గొన్నారు. జగన్‌ను కలిసిన కాపు నేతలు -
విష్ణుప్రియకు సన్మానం
న్యూజెర్సీ : కళాభారతి న్యూజెర్సీ ఆధ్వర్యంలో నాటా ఐడల్-2018 అవార్డు గెలుపొందిన చిన్నారి విష్ణుప్రియ కొత్తమాసును ప్రవాసాంధ్రులు ఘనంగా సన్మానించారు. ఎడిసన్, న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాభారతి సంఘ సభ్యులు, స్నేహితులతో పాటు ఇతర తెలుగు సంఘాల పెద్దలు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు. నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి గంగసాని ఆధ్వర్యంలో నాటా మెగా కన్వెన్షన్ ఫిలడెల్ఫియాలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీల్లో విష్ణుప్రియా కొత్తమాసు నాటా ఐడల్ 2018 అవార్డు గెలుపొందింది. ఈ వేడుకలకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకులు కళ్యాణ్ మాలిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. గెలుపొందిన విష్ణుప్రియకు తన తర్వాతి చిత్రంలో గాయనిగా అవకాశం ఇవ్వనున్నట్లు కళ్యాణ్ మాలిక్ ప్రకటించారు. అనంతరం అమెరికా తెలుగు సంఘం (ఆటా), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రముఖులు విజేతను అభినందించారు. చిన్నారుల ప్రతిభను గుర్తిస్తూ కళాభారతి జరిపిన కార్యక్రమం ఎంతో బాగుందని, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించటంలో కళాభారతి ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి, హోలీ, దీపావళి వంటి పండుగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో తన చిన్నతనం నుంచి పాల్గొంటున్న విష్ణుప్రియ ఈ అవార్డు సాధించడం అభినందనీయమని అన్నారు. మరిన్ని విజయాలను అందుకోవాలని కళాభారతి సభ్యులు, పెద్దలు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆటపాటలు, నృత్యాలు అతిథులను అలరించాయి. -
‘ఖమ్మం బార్’ ను ఎప్పటికీ మరువను
సాక్షి, ఖమ్మం లీగల్ : ఖమ్మం జిల్లాతో, ఖమ్మం బార్‌తో తనకు విడదీయలేని బంధం ఉందని, ఖమ్మం బార్‌ను ఎన్నటికీ మరువనని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామచందర్‌రావు మాట్లాడుతూ న్యాయవాదులు నిరంతర విద్యార్థులని, ప్రతి క్షణం విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. గతంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తనను విశేషంగా ఆదరించి.. తన విజయానికి సహకరించారని పేర్కొన్నారు. బార్, గ్రంథాలయ అభివృద్ధి కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారికి ప్రత్యేక విజ్ఞప్తి చేసి రూ.లక్ష మంజూరు చేయించడమే కాకుండా చెక్కును బార్‌కు అందజేసినట్లు తెలిపారు. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఎన్.రామచందర్రావును బార్ అసోసియేషన్ ఈపీ, సీనియర్ న్యాయవాదులు ఘనంగా సన్మానించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు పసుమర్తి లలిత, ప్రధాన కార్యదర్శి కూరపాటి శేఖర్‌రాజు, పూసా కిరణ్, మర్రి ప్రకాష్, పబ్బతి రామబ్రహ్మం, సీనియర్ న్యాయవాదులు జి.సత్యప్రసాద్, మలీదు నాగేశ్వరరావు, వెంకట్‌గుప్తా, తల్లాకుల రమేశ్, రామసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
అటా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం..
సాక్షి, అట్లాంటా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం అట్లాంటాలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో టీసీసీఐ రాష్ట్ర సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ జగదీశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటా వీరిద్దరిని ఘనంగా సత్కారించింది. ఈ కార్యక్రమంలో అటా ప్రెసిడెంట్ కరుణాకర అసిరెడ్డి, అటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బొడ్డి రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ శివ కుమార్ రమదుగు, వీరితో పాటు గేట్స్ ప్రెసిడెంట్ నందా చాట్లా, గటా చీఫ్ శంకర్ గండ్ర, రఘు మరిపెడ్డి, గేట్స్ చైర్మన్ శ్రీధర్ నరవెల్, వెంకట్ వీరనేనిలు పాల్గొన్నారు. అంతేకాక ఈ సమావేశానికి స్థానిక కమ్యూనిటీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
ఎర్ర తివాచిపై హాస్యబ్రహ్మ
నవ్వుకు మరో పేరు అనేలా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు బ్రహ్మానందం. మూడు దశాబ్దాల కెరీర్లో ఎన్నో అవార్డులూ రివార్డులూ అందుకున్నారాయన. ఇప్పుడు అమెరికాలో ఘన సన్మానం అందుకోనున్నారు. అమెరికాలోని సియోటెల్ నగరంలో ఈ నెల 6న జరగనున్న తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకోవాల్సిందిగా బ్రహ్మానందంకి ఆహ్వానం అందింది. ఇదే వేదికపై 7న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ ఆయన్ను ఘనంగా సన్మానించనుంది. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘బ్రహ్మానందంగారికి మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలు వరించాలి’’ అని ఆయన ఆకాంక్షించారు. -
అమర జవాన్ భార్యను అవమానించిన అఖిలేష్
సాక్షి, లక్నో: సమాజ్ వాదీ పార్టీ యువ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అమర జవాన్ కుటుంబాన్ని అవమానించాడంటూ విమర్శలు మొదలయ్యాయి. ఒకరికి బదులుగా మరోకరికి సన్మానం చేయటమే అందుకు కారణం. 1965 ఇండో-పాక్ యుద్ధంలో అబ్దుల్ హమీద్ అనే జవాన్ చనిపోగా, ఆరు రోజుల తర్వాత ఆయనకు కేంద్ర ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం అజంఘడ్ జిల్లా నాథ్‌పూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హమీద్ భార్య రసూలన్ బీబిని అఖిలేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అయితే ఆ వార్తను టీవీల్లో చూసిన హమీద్ అసలు భార్య రసూలన్ షాక్‌కి గురైంది. అఖిలేష్ సన్మానం చేసింది ఎవరికోనని, అసలు ఆ రోజంతా తాను ఇంట్లోనే ఉన్నానని 90 ఏళ్ల రసూలన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఆమె మనవడు కూడా ధృవీకరించాడు. ఇక విషయం ఆ నోటా ఈ నోటా పాకి బీజేపీ చెవిన పడటంతో అఖిలేష్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ వీరుడి కుటుంబాన్ని ఘోరంగా అవమానించారంటూ సమాజ్ వాదీ చీఫ్ పై మండిపడింది. అంతేకాదు సెప్టెంబర్ 10న రసూలన్ను తాము ఘనంగా సత్కరించబోతున్నామని బీజేపీ ప్రకటించింది. తప్పు జరిగిపోయింది: సమాజ్‌వాదీ పార్టీ సన్మాన కార్యక్రమంలో తప్పు జరిగిపోయిందన్న విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ ఒప్పుకుంది. నిజానికి అక్కడ రామ్ సముజ్ యాదవ్ అనే అమర జవాన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న అమర వీరుల కుటుంబాలను ఆహ్వానించాం. రసూలన్ బిబి పేరు జాబితాలో ఉండగా మైక్‌లో నిర్వాహకులు పేరు చదివారు. వెంటనే ఓ 70 ఏళ్ల ఓ వృద్ధురాలు వేదికపైకి రావటంతో ఆమెకు అఖిలేష్ సన్మానం చేశారు. ఆమె రసూలన్ అవునో.. కాదో... నిర్ధారణ చేసుకోకపోవటం మా తప్పే. ఆమెకు క్షమాపణలు తెలియజేస్తున్నాం అని ఎస్పీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అంతేకాదు త్వరలో పార్టీ తరపున ఆమెను ఘనంగా సత్కరించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. -
పరిపాలనా భాషగా తెలుగు
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్ష - తెలుగు రాష్ట్రాలను మర్చిపోను.. సాయం చేసేందుకు ప్రయత్నిస్తా - తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి - రాజ్యసభకు పూర్వ వైభవం తీసుకొస్తా.. - అమరావతిలో వెంకయ్యకు ఏపీ ప్రభుత్వం పౌరసన్మానం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగు భాష పరిపాలనా భాషగా మారాలని ఉప రాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. తెలుగును పరిపాలనా భాషగా ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరూ తెలుగులోనే మాట్లాడాలని, తెలుగులోనే పాలన సాగాలని పిలుపునిచ్చారు. ఉప రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన వెంకయ్యనాయుడికి వెలగపూడి తాత్కాలిక సచివాలయం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం పౌరసన్మానం చేసింది. ఈ సందర్భంగా వెంకయ్య ప్రసంగిస్తూ... ‘‘రాజకీయాల్లో అయామ్ రిటైర్డ్, బట్ నాట్ టైర్డ్ (రాజకీయాల నుంచి విరమణ పొందానే కానీ అలసిపోలేదు). ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను కాబట్టి తరచూ కలిసి మాట్లాడుకునే అవకాశం ఉండదు. అయినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మర్చిపోను. నా స్థాయి వరకూ సాయం చేసేందుకు ప్రయత్నిస్తా’’ అని చెప్పారు. ఉపరాష్ట్రపతి అయితే రాజకీయంగా తమకు అందుబాటులో ఉండరని పలువురు తన వద్ద ప్రస్తావించినట్టు తెలిపారు. జాతీయ స్థాయి నాయకుడిగా ఉన్నప్పటికీ ఏపీకి అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చానన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు జాతీయ నాయకుడిగా ఉన్న తాను రాష్ట్రం కోసం మాట్లాడాలా? వద్దా? అనే దానిపై మూడు రోజులు ఆలోచించానన్నారు. చివరకు ఎవరు ఏమనుకున్నా రాష్ట్రానికి అన్ని విధాలుగా మేలు జరిగేలా రాజ్యసభలో పట్టుబట్టానని వెంకయ్య గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘1972లో జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నా. అప్పుడే రాష్ట్ర విభజన జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎంతో ముందుండేది. తెలంగాణ కూడా అభివృద్ధి సాధించేది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరచూ కలుస్తూ ఉండాలి. మనసు విప్పి మాట్లాడుకుని ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. ఇదే విషయాన్ని రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు గతంలోనే చెప్పా. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం వాటిపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రభుత్వం చేతిలో అధికారం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ప్రభుత్వంపై ప్రతిపక్షం సద్విమర్శలు చేయాలి. ఇరు పక్షాలు రాజకీయంగా ప్రత్యర్థులే తప్ప విరోధులు కారు. రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలకు తావులేదు. నా కోరిక నెరవేరేలా లేదు ఇప్పటి వరకు నేను అనుకున్నవన్నీ చేశా. 2020 జనవరి 12న రాజకీయాల నుంచి వైదొలగి సేవా కార్యక్రమాల్లోకి వెళ్లాలన్న కోరిక నేరవేరేలా లేదు. నాకు ఇప్పుడు 68 ఏళ్లు. మరో రెండేళ్లు అంటే 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేశాక, రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించినట్టు నా భార్యకు చెప్పా. ఇప్పుడు అనుకోకుండా ఉపరాష్ట్రపతి కావడంతో మరో ఆరేళ్లు ఈ పదవిలో కొనసాగాల్సి ఉంది. అందువల్ల రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్నప్పటికీ రిటైర్మెంట్ అనే కోరిక నేరవేరే అవకాశం లేదు. సన్మానాలు బాధ్యతలను గుర్తు చేస్తాయి. ఇక్కడ లభించిన అపూర్వ స్వాగతాన్ని ఎప్పటికీ మరచిపోలేను. ఇప్పటివరకు నేను చేపట్టిన ప్రతి పదవికీ న్యాయం చేశా. రాజ్యసభలో కొత్త ప్రమాణాలు నెలకొల్పి పెద్దల సభకు పూర్వ వైభవం తీసుకొస్తా’’ అని వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. వెంకయ్య నాయుడుది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఎన్నో గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి వెంకయ్య అని కొనియాడారు. బాధగా ఉంది: సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి వెంకయ్య నాయుడు అండగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి సందర్భంలోనూ తమకు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన ఉపరాష్ట్రపతిగా రాజకీయాలకు దూరంగా ఉండటం లోటు అని, ఇది బాధగా ఉందని చెప్పారు. వెంకయ్య ఇకపై రాజకీయాలు మాట్లాడకపోయినా ఏపీకి అవసరమైన అండదండలు అందిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి పట్టణ గృహ నిర్మాణ పథకం కింద 26 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే 5.35 లక్షల ఇళ్ల మంజూరుకు వెంకయ్య చొరవ చూపారని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి అయ్యే ముందు కూడా రాష్ట్రానికి 2.25 లక్షల ఇళ్ల మంజూరుకు సంతకం చేశారని చెప్పారు. పౌరసన్మానం సందర్భంగా స్వచ్ఛ సత్తెనపల్లి, స్వర్గపురి పుస్తకాలను ఆవి ష్కరించారు. వెంకయ్య నాయుడుకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. వెంకయ్య తొలుత సభా ప్రాంగణంలో పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రంలోని వంద మున్సిపాలిటీలకు ప్రధానమంత్రి పట్టణ గృహ నిర్మాణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 2.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు శిలాఫలకం ఆవిష్కరించారు. -
తెలుగు రాష్ట్రాలను మర్చిపోను: వెంకయ్య
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యంలో చట్టసభలకు చాలా ప్రాధాన్యత ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చట్టసభలు చర్చలకు వేదిక కావాలే కానీ, ఘర్షణలకు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..‘ఉప రాష్ట్రపతి బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తా. రాజ్యసభకు పునర్ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలకు చాలా ప్రాధాన్యత ఉంది. అర్థవంతమైన చర్చతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంచేందుకు కృషి చేయాలి. సభలో మాట్లాడేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ప్రభుత్వంపైనా ప్రతిపక్షం కూడా సద్విమర్శలు చచేయాలి. వ్యక్తిగత ద్వేషాలు రాజకీయాల్లో ఉండకూడదు. నేడు చట్టసభల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిద్దాం. నాకున్న బలం,బలహీనత అదే.. నాకున్న బలం, బలహీనత ఒక్కటే. అది జనంతో మమేకం కావడం. నాకు ఎప్పుడూ జనం...జనం కావాలి. 2020 జనవరి నుంచి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకుంటున్నా. ఆ తర్వాత సమాజ సేవలో పాల్గొంటా. ఇదే విషయాన్ని మా ఆవిడకు కూడా ముందే చెప్పేశాను. ఏదైనా అనుకుంటే పట్టుదలతో ఆ పని చేసేవాడిని. అధిక సమయం కేటాయించి ఎక్కువగా శ్రమించేవాడిని. దేశంలోని 623 జిల్లాలు పర్యటించాను. అనేక పార్టీలను, ప్రభుత్వాలు చూశాను. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను ఈ స్థాయి వరకూ వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలను మర్చిపోను. నా స్థాయి వరకూ సాయం చేసేందుకు ప్రయత్నిస్తా. రాష్ట్ర విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. అయితే ఇంత తక్కువ సమయంలో ఎక్కువ సహాయం జరిగింది ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే. అది ప్రజలకు రావాల్సిన న్యాయమైన వాటా. ఈ విషయంలో అప్పడప్పుడు నాపై విమర్శలు వచ్చాయి. వెంకయ్య నాయుడు ఏపీపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని. ఏపీ కూడా దేశంలోనే ఉంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారు. ఏపీకి ఏమైంది వెంకయ్య నాయుడు ఉన్నారు కదా అని. అన్యాయం జరిగింది కాబట్టే న్యాయం జరిగే ప్రయత్నం చేయాలి. రోడ్ల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుంది. -
వెంకయ్యకు ఏపీ సర్కార్ పౌర సన్మానం
♦వెంకయ్యను సన్మానించడం గౌరవంగా భావిస్తున్నా.. సాక్షి, అమరావతి : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఘనంగా పౌర సన్మానం నిర్వహించింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఉప రాష్ట్రపతి హోదాలో సొంత రాష్ట్రనికి విచ్చేసిన ఆయనకు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... వెంకయ్యను సన్మానించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ఘనత కూడా ఆయనదేనని అన్నారు. కేంద్రం నుంచి ఏపీకి ఇళ్ల కేటాయింపులో ఆయన కృషి అభినందనీయమన్నారు. నమ్మిన సిద్ధాంతాన్ని వెంకయ్య నాయుడు ఏనాడూ విడిచిపెట్టలేదన్నారు. ఉత్తరాదివారి కంటే ధీటుగా హిందీలో మాట్లాడగలరని ప్రశంసించారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు వెంకయ్య నాయుడు అని, ఆయనది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానమన్నారు. అంతకు ముందు వెంకయ్య పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు. -
ఐపీఎల్లో క్రికెట్ లెజెండ్స్‌కు సన్మానం
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో భారత క్రికెట్ లెజెండ్స్ ఐదుగురుని సన్మానిస్తామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. కౌన్సిల్ గురువారం ఢిల్లీలో సమావేశమైంది. హైదరాబాద్‌లో ఏప్రిల్ 5న జరిగే ఐపీఎల్-10 ప్రారంభ వేడుకలోభారత క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావీడ్, వీరెంద్ర సేహ్వాగ్ వీవీఎస్ లక్ష్మన్లను సన్మానించాలని నిర్ణయించింది. సమావేశ విషయాలనుఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా మీడియాకు తెలిపారు. ఈ ఐదుగురి లెజెండ్స్‌లో నలుగులు మాజీ కెప్టెన్లున్నారు. సన్మానించే లెజెండ్స్ లిస్టులో మాజీ కెప్టెన్, ప్రస్తుత కోచ్ అనీల్‌కుంబ్లే పేరు లేకపోవడం గమనార్హం. కుంబ్లే ఐదుగురి లెజెండ్స్‌తో భారత క్రికెట్‌కు సేవలందించిన సమ ఆటగాడు. మాజీ భారత మహిళా క్రికెటర్ డయానా ఎడ్జులీ మహిళా మాజీ క్రికెటర్ల ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను ఐపీఎల్ మ్యాచ్ వేదికలపై ఇవ్వాలని కోరింది. -
నేను రనౌట్ అయ్యా..
► వీడ్కోలు కార్యక్రమంలో మాజీ సీఎస్ ప్రదీప్ చంద్ర సంచలన వ్యాఖ్యలు ►షెడ్యూల్డ్ కులాల వారికి గుర్తింపు రాదన్న అపవాదు రాకుండా చూడండి ►అలా అయితే యువ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని వ్యాఖ్య ►ఆయన సేవలను సీఎం వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం: మంత్రులు సాక్షి, హైదరాబాద్: ‘అందరూ క్రికెట్ గురించి మాట్లాడారు. నేను వన్‌డౌన్ లో బ్యాటింగ్‌కు వచ్చానని సీఎం అన్నారు. దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యా. కొన్నిసార్లు ఇలా జరుగు తుంది. ఇందులో మీ తప్పేం ఉండదు. ఒక్కో సారి ముందుకెళ్లిన తర్వాత వెనక్కి మళ్లీ చూడ టం కుదరదు. ఈ పరిస్థితుల నుంచి రాజకీయ ప్రతిఫ లం ఆశిస్తున్న వారూ ఉన్నారు. ప్రభుత్వం వీటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజాయతీ, చిత్తశుద్ధి, అర్హత గల వారికి గుర్తింపు, గౌరవం లభించదన్న సందేశం వెళ్లకుండా చూడండి. మంచి పనిమంతు లైనప్పటికీ ఎస్సీలకు గుర్తింపు లభించదన్న అపవాదు రాకుండా చూడండి. ఈ అపవాదు యువ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయ గలదు. దీనిపై ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలి. ప్రభుత్వానికి వినమ్రతతో చేస్తున్న విజ్ఞప్తి ఇది.’ అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నవంబర్ 30న రాష్ట్ర రెండో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్‌చంద్ర నెల రోజులే పదవిలో కొనసాగారు. పదవీ కాలం పొడిగింపునకు కేంద్రం అంగీకరించకపోవడంతో ప్రదీప్ చంద్ర డిసెంబర్ 31న పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుధవారం సచివాలయంలో ప్రదీప్‌చంద్రను ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే పై వాఖ్యలు చేశారు. కాగా, ప్రదీప్ చంద్ర సేవలను వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్–ఐపాస్ రూపకల్పనలో ప్రదీప్ చంద్ర బృందం ఎంతో కృషి చేసిందని ప్రశంసించారు. ఏ సమస్య తోనైనా ప్రదీప్‌చంద్రను సంప్రదిస్తే సానుకూల దృక్పథంతో చక్కటి పరిష్కారం చూపేవారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొనియా డారు. కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సలహాదారులు ఏకే గోయల్, రాంలక్ష్మణ్, పాపారావు, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత నరేందర్ రావు, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులు పాల్గొన్నారు. -
బాలాంత్రపు రజనీ కాంతారావుకు సన్మానం
పాత గుంటూరు: కవిగా, కళాకారుడిగా, సంగీత విద్వాంసుడిగా, గాయకుడిగా ఖ్యాతిగాంచిన బాలాంత్రపు రజనీ కాంతారావు శతాబ్దిక మేరుపర్వతం లాంటివారని ప్రముఖ సాహిత్య విశ్లేషకులు వాడ్రేవు చిన వీరభధ్రుడు పేర్కొన్నారు. నగరంపాలెంలోని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి వసతిగృహం ప్రాంగణంలో ప్రముఖ సంగీత కళానిధి బాలాంత్రపు రజనీ కాంతారావుకు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కారంతోపాటు నగదు పురస్కారం అందజేశారు. సభకు ఫౌండేషన్ అధ్యక్షుడు బొమ్మిడాల కృష్ణమూర్తి అధ్యక్షత వహించగా ముఖ్యవక్తగా పాల్గొన్న వీరభద్రుడు మాట్లాడుతూ 20వ శతాబ్దపు సాహిత్య, సంగీతానికి రజనీ కాంతారావు వారధిగా నిలిచారన్నారు. ఓలేటి వెంకట పార్వతీశం రచించిన ఏకాంతసేవ, రజనీ కాంతారావుపై రచించిన రజనీ పుస్తకాలను ఆవిష్కరించారు. సభలో ఓలేటి పార్వతీశం, ముంజులూరి కృష్ణకుమారి, డాక్టర్.భూసరవెల్లి వెంకటేశ్వర్లు, సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరశాస్త్రి ప్రసంగించగా సాహిత్యాభిమానులు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మోదుగుల రవికృష్ణ నిర్వహించారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు తీర్చాలి
విజయవాడ : కాంట్రాక్టు, కంటింజెన్సీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టే కార్యక్రమాలకు మద్దతు పలకాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శనివారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో సభ జరిగింది. ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సేవలు అందిస్తున్న కాంట్రాక్టు, కంటింజెన్సీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి జీతాలు కొంచెం పెంచామని, అయితే, పూర్తిస్థాయిలో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ కృష్ణా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏ.విద్యాసాగర్ మాట్లాడుతూ అసోసియేషన్‌లో మూడు దశాబ్దాలుగా పనిచేసే అవకాశం కల్పించిన నాయకులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ఉద్యోగుల సమస్యలతో పాటు కాంట్రాక్టు, కంటింజెన్సీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తొలుత బందరురోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్జీవో హోమ్‌కు వెళ్లి నామినేషన్లు వేశారు. నూతన కార్యవర్గం ఇదే.. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా అధ్యక్షుడిగా ఏ.విద్యాసాగర్, అసోసియేట్ అధ్యక్షుడిగా డి.సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడిగా జి.ఏసురత్నం, ఎన్.శివకుమార్, ఎస్.అలెగ్జాండర్, ఎం.రాజబాబు, వి.నాగార్జున, కార్యదర్శిగా ఎండీ ఇక్బాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.రమేష్, సంయుక్త కార్యదర్శులుగా సీహెచ్ దిలీప్‌కుమార్, డి.ప్రసాదరాజు, ఎస్కే దాదాసాహెబ్, ఆర్‌హెచ్ ప్రకాష్, మహిళా విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎం.సుజాత, కోశాధికారిగా ఆనంద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బి.ఆశీర్వాదం, సహాయ ఎన్నికల అధికారి బాసిత్ ప్రకటించారు. అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి డి.చంద్రశేఖరరెడ్డి, తూర్పు కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు ఉల్లికృష్ణ, దారపు శ్రీనివాస్, సిటీ అధ్యక్ష, కార్యదర్శులు కోనేరు రవి, ఉపాధ్యక్షుడు వీవీ ప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.ఈశ్వర్, గ్రంథాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధి కళ్లేపల్లి మధుసూదనరాజు, ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధులు దాళినాయుడు, భోగరాజు, వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
తెనాలివాసికి ‘లెజెండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు
తెనాలి: పట్టణంలోని నాజరుపేటకు చెందిన ప్రముఖ గణిత పరిశోధకుడు కొండూరు శ్రీనివాస రాఘవ లెజండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో సంఘమిత్ర సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన అభినందన సభలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు చేతుల మీదుగా పత్రం అందుకున్నారు. తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకరరెడ్డి, సంఘమిత్ర కల్చరల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ పానుగంటి వెంకటేష్, తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్ డి.మనోహర్, డాక్టర్ తుర్లపాటి పట్టాభి పాల్గొని రాఘవ సేవలను కొనియాడారు. ఆయన పరిశోధనలివీ.. వేద గణితంతో పాటు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌కు సంబంధించిన సూత్రాల పరిశీలన– అభివృద్ధి అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ‘పై’విలువకు 500 సూత్రాలు కనుగొన్నారు. 70కి పైగా జాతీయ, అంతర్జాతీయ గణిత సమావేశాల్లో ప్రసంగించి, పత్రాలు సమర్పించారు. -
భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శం
విజయవాడ కల్చరల్ : భారతీయ సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శమని కంచికామకోటి పీఠ ఉత్తరాధికారి శంకర విజయేంద్రసరస్వతీస్వామి పేర్కొన్నారు. కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి స్వాములకు లబ్బీపేటలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం పాలక మండలి చైర్మన్ మాగంటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సత్కార సభను నిర్వహించారు. విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ ప్రపంచానికి విశ్వగురువులను అందించిన ఘనత భారతదేశానికే దక్కుతుందని చెప్పారు. జయేంద్ర సరస్వతి నిర్వహణలో సమాజసేవలో భాగంగా విద్యాలయాలు, ఆస్పత్రులు, వేదపాఠశాలలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో నవంబర్ 13వ తేదీ ప్రభుత్వం మఠానికి కేటాయించిన స్థలంలో వేద పాఠశాల, నేత్రాలయం, ధార్మిక కార్యక్రమాల కోసం కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేరోజు కెనాల్ రోడ్డులోని వినాయక దేవాలయంలో మహాకుంభాభిషేకం ఉంటుందని వివరించారు. జయేంద్ర సరస్వతి మాట్లాడుతూ నగర ప్రజలు ధార్మిక కార్యక్రమాల్లో ముందుంటారని, నదులున్న చోట వేదాలు జీవం పోసుకుంటాయని వివరించారు. దేవాలయ పాలక మండలి చైర్మన్ మాగంటి సుబ్రహ్మణ్యాన్ని ఆచార్య సేవారత్న బిరుదుతో సన్మానించారు. దేవాలయ పాలక మండలి చైర్మన్ కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతీస్వామి, శంకర విజయేంద్ర సరస్వతీస్వామిని సత్కరించారు. కార్యక్రమంలో జనచైతన్య రియల్ ఎస్టేట్ ఎండీ మాదాల సుధాకర్, ముత్తవరపు మురళీకృష్ణ, మాజీ మేయర్ జంధ్యాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మతో అనుబంధం ఈనాటిది కాదు
విజయవాడ కల్చరల్: ‘బెజవాడ కృష్ణమ్మ నా కళా జీవితానికి పునాది’ అని అలనాటి ప్రముఖ నటీమణి, కళాభినేత్రి వాణిశ్రీ అన్నారు. మహానటి సావిత్రి సాహిత్య, సాంస్కృతిక కళాపీఠం నిర్వహణలో గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్ హాలులో శుక్రవారం సాయంత్రం వాణిశ్రీకి ఘనంగా పౌరసత్కారం జరిగింది. వాణిశ్రీ మాట్లాడుతూ కృష్ణా జిల్లాతో నా అనుబంధం ఈ నాటిది కాదని, నా కళాజీవితంలో అనేక సంఘటనలు ఇక్కడే ముడివేసుకున్నాయని వివరించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వేదికగా విజయవాడ నగరం నిలిచిపోయింది, విజయవాడ ప్రేక్షకుల ఆదరణ మరువలేమని వివరించారు. మహానటి సావిత్రి నటజీవితం తనకు ఆదర్శమని ఆమె ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నానన్నారు. కృష్ణవేణి చిత్రంలో నటించటం తన నట జీవితంలో మరచిపోలేని సంఘటనగా ఆమె పేర్కొన్నారు. కళాపీఠం నిర్వాహకురాలు పరచూరి విజయలక్ష్మి సావిత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తోందని అభినందించారు. వాణిశ్రీ తెలుగు నవలా నాయకి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సినిమా ఆణిముత్యం వాణిశ్రీ, అమె నట జీవితం భావి నటులకు ఆదర్శమని అన్నారు. ఆమె నట జీవితం స్వర్ణయుగంతో ప్రారంభమైందన్నారు. సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ వాణిశ్రీ తెలుగు నవలా నాయకియని అభినందించారు. ఆమె సంభాషణలో చురుకుదనం, నటలో పరిపక్వత తెలుగు ప్రేక్షులు మరచిపోలేరన్నారు. పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ మహానటి సావిత్రికి వారసురాలు వాణిశ్రీ అని అభివర్ణించారు. 2016 సంవత్సరానికి గానూ హైదరాబాద్‌కు చెందిన నాట్యకళాకారిణి గుర్రం లాలినిధికి మహానటి సావిత్రి అమరావతి పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు పరచూరి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షుడు ప్రబల శ్రీనివాస్ , న్యాయవాది అక్కిపెద్ది వెంకటరమణ, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడిశెట్టి మన్మథరావు తదితరులు ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఘంటసాల పవన్‌కుమార్ బృందం పలు నృత్యాంశాలను ప్రదర్శించింది. నేరెళ్ళ సురేష్‌కుమార్ బృందం సంగీత విభావరి ఆకట్టుకుంది. పెద్దసంఖ్యలో కళాభిమానులు హాజరయ్యారు. -
జోష్ణవి విజయాలు స్ఫూర్తిదాయకం
శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు నెల్లూరు(బృందావనం) : అంతర్జాతీయస్థాయి యోగా క్రీడాకారిణిగా నెల్లూరుకు చెందిన జోష్ణవి సాధిస్తున్న విజయాలు క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు అన్నారు. ఇటీవల వియత్నాంలో జరిగిన 6వ ఆసియా యోగాసన చాంపియన్‌షిప్ పోటీల్లో మూడు బంగారు, ఒక రజత పతకం సాధించిన జోష్ణవిని ఆదివారం నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలోని ఓ హోటల్లో సన్మానించారు. యోగా అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రవీంద్రబాబు హాజరై మాట్లాడుతూ జోష్ణవి త్వరలో అమెరికాలో జరిగే ప్రపంచస్థాయి యోగా పోటీల్లో పాల్గొనాల్సి ఉందన్నారు. కార్పొరేటర్ డాక్టర్ జెడ్.శివప్రసాద్ మాట్లాడుతూ జోష్ణవికి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ద్వారా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకి విన్నవించనున్నామన్నారు. రవీంద్రభారతి స్కూల్ కరస్పాండెంట్ రవీంద్రరెడ్డి, చిత్తూరు జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.నాయుడు, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.ఎస్.సెల్వం పాల్గొన్నారు. జాతీయస్థాయి క్రీడాకారులకు అభినందన జాతీయస్థాయిలో వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన నెల్లూరుకు చెందిన క్రీడాకారులు రాధాకృష్ణారెడ్డి, ఎ.శ్రీనివాసులు, రమణయ్య, కశిష్, ఎస్.లీనా తదితరులను అంతర్జాతీయ యోగా క్రీడాకారిణి జోష్ణవితోపాటు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ తరపున విజయకుమార్, వివిధ యోగా అసోసియేషన్లకు చెందిన యోగా గురువులు ఎం.రవీంద్ర, ఎమ్వీఎస్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారిణులకు అభినందన
నెల్లూరు(బృందావనం): జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన నెల్లూరు క్రీడాకారిణులు ఏకాంబరం జోష్ణవి, కొమ్మెర్ల తులసిను శాప్డైరెక్టర్ రవీంద్రబాబు, డీఎస్డీఓ రమణయ్య శనివారం అభినందించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ వియత్నాం రాజధాని హునాయ్‌లో ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు జరిగిన ఆసియా యోగా క్రీడోత్సవాల్లో జోష్ణవి మూడు బంగారు, ఒక రజత పతకం సాధించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జంషెడ్‌పూర్‌లో జరిగిన సీనియర్ జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారిణి తులసి 162 కేజీల డెడ్‌లిఫ్ట్ ఈవెంట్లో కాంస్యపతకం సాధించినట్లు తెలిపారు. అలాగే ఇంటర్‌స్టేట్ +84 వెయిట్ క్యాటగిరిలో 475 కేజీల పవర్‌లిఫ్టింగ్‌లో జాతీయస్థాయిలో రజత పతకం సాధించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఖోఖో క్రీడాకారుడు పీ విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా సుబ్బులక్ష్మి జయంత్యుత్సవాలు
నెల్లూరు(బారకాసు): సింహపురి కల్చరల్ అకాడమీ, సంస్కృతి తరంగాలు సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో పురమందిరంలో నిర్వహిస్తున్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి శతజయంత్యుత్సవాలను రెండో రోజు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ డోలు విద్వాంసుడు నెల్లూరు మస్తాన్‌బాబు, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు కుమారి ఆశ్రితారెడ్డి, కుమారి లాస్యను ముఖ్యఅతిథులు సన్మానించి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పురస్కారాలను అందజేశారు. అవసరాల కన్యాకుమారితో నిర్వహించిన వయెలిన్ వాద్యం అలరించింది. ప్రముఖ డోలు విద్వాంసులు పద్మశ్రీ హరిద్వార మంగళం పళనివేల్(డోలు), పత్రి సతీష్‌కుమార్ (మృదంగం) వాద్య సహకారాన్ని అందించారు. నృత్య కళాకారిణి ఆశ్రితారెడ్డి కూచిపూడి నాట్యంతో ఆకట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి, బీవీ నరసింహం, సత్యనారాయణ, ప్రముఖ తవిల్ విద్వాన్ సుబ్రహ్మణ్యం, నిర్వాహకులు రేణిగుంట రాజశేఖర్, మునిప్రసాద్, మునిరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
27న ‘గోరటి’కి జాషువా కవితా పురస్కారం
గుంటూరు ఈస్ట్: మహాకవి కవికోకిల నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 121వ జయంతోత్సవాలు సందర్భంగా గోరటి వెంకన్నకు జాషువా కవితా పురస్కారం అందజేస్తున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జిల్లా రిజిస్ట్రార్ ఎస్.బాలస్వామి తెలిపారు. అరండల్ పేటలోని ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జాషువా పురస్కార కవితాసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘువులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణ రావు మాట్లాడుతూ జాషువా సాహిత్య విశిష్టతపై ప్రముఖకవి యండ్లూరి సుధాకర్, గోరటి వెంకన్న కవిత్వంపై మువ్వా శ్రీనివాస్ ప్రసంగిస్తారని వెల్లడించారు. ఆహ్వాన సంఘ గౌరవాధ్యక్షుడు ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ముత్యం, జాషువా విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎన్.కాళిదాసు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పీవీ రమణ, నాయకులు బి.లక్ష్మణరావు, సి.హెచ్.కిన్నర్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభను ప్రోత్సహిస్తే ఏపీ నంబర్‌వన్
సినీ నటుడు భానుచందర్ ఘనంగా మదర్‌థెరిసా జయంతి వేడుకలు నెల్లూరు(బారకాసు) : వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్న వారిని ప్రోత్సహిస్తే ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెంది దేశంలో నంబర్‌వన్‌గా గుర్తింపు పొందుతుందని ప్రముఖ సినీ నటుడు భానుచందర్ అన్నారు. పవిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని టౌన్‌హాల్ (పురమందిరం)లో నిర్వహించిన మదర్‌థెరిసా 106వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కళారంగాన్ని కాపాడుకుంటేనే సమాజం అన్ని విధాల అభివృద్ది చెందుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళారంగమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఎందరో ప్రతిభ కలిగిన వారున్నారన్నారు. కళారంగాన్ని, కళాకారులను ప్రోత్సహిస్తున్న ట్రస్ట్ అధినేత గాలి కిరణ్‌కుమార్ అభినందనీయుడని కొనియాడారు. దర్శకుడు పురుషోత్తంరావు మాట్లాడుతూ కళారంగమంటే తనకెంతో ఇష్టమని అందుకనే సినిమా రంగంలోకి ప్రవేశించానన్నారు. భానుచందర్ తననెంతగానో ప్రోత్సహిస్తున్నారన్నారు. అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కనుమరుగవుతున్న కళారంగాన్ని కాపాడలనే తపనతోనే తన వంతు ప్రోత్సహం అందిస్తున్నానని చెప్పారు. అనంతరం భానుచందర్, పురుషోత్తంను గజమాల, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో చిత్త శుద్ధితో విధులు నిర్వర్తిస్తున్న సీతారామయ్య, శ్రీరామప్రసాద్, యంట్రపాటి వెంకటేశ్వర్లు, కాలిశెట్టి శ్రీనివాసులు, మామిడి పుష్పకళ, పఠాన్ యస్దాన్ఆలి, వివిధ రంగాల్లో తమ ప్రతిభన కనబరుస్తున్న సర్వేపల్లి రామ్మూర్తి, విష్ణువర్దన్, కాలిశెట్టిలకు పురస్కారాలు అందజేశారు. అమరావతి కృష్ణారెడ్డి పేద వృద్ధ కళాకారులకు చీరలు, పంచెలు పంపిణీ చేశారు. తొలుత నిర్వహించిన పాటలు, డ్యాన్సు పోటీల్లో విజేతలైన వారికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రేక్షకులను ఆలరించాయి. కార్యక్రమంలో కావలి మార్కెట్ కమిటి చైర్మన్ దేవరాల సుబ్రమణ్యంయాదవ్, శ్రీడ్రైవింగ్ స్కూల్ అధినేత శ్రీనివాసులురెడ్డి, వీరిశెట్టి హజరత్‌బాబు, గడ్డం సుధాకర్‌రెడ్డి, ఎస్వీఆర్ స్కూల్ కరస్పాండెంట్ అందె శ్రీనివాసులు, రిటైర్డ్ లెక్చరర్ డేగా రామచంద్రారెడ్డి, పాటూరు శ్రీనివాసులు, ఎస్.వి రమేష్, చక్రధర్, అమానుల్లాఖాన్, తుమ్మల శ్రీనివాసులురెడ్డి, బయ్యా వాసు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు కొలకలూరి ఇనాక్ స్ఫూర్తి
గుంటూరు ఈస్ట్: ఏసీ కళాశాలలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ కు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని కళాశాల యాజమాన్యం, విద్యార్థులు బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ముత్యం మాట్లాడుతూ కొలకలూరి ఇనాక్ ఏసీ కళాశాలలో విద్యనభ్యసించి, అధ్యాపకునిగా పనిచేసి అంచలంచెలుగా ఎదగడం తమకు గర్వకారణ మన్నారు. ఇనాక్ కళాశాల ప్రతిష్టను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేసారని కొనియాడారు. ఆయనను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఉన్నతమైన ఆలోచనలతో విద్యార్థులు అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రిన్సిపాల్ ఇమాన్యుయేల్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్, తెలుగు అధ్యాపకులు, కళాశాల పీఆర్వో కనపాల జోసఫ్, వి.జి దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గురుదేవోభవ
విజయవాడ(లబ్బీపేట) : రాష్ట్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవం బుధవారం ఉత్సాహంగా జరిగింది. మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పలువురు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వారితో పాటు 13 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జానపద నృత్యాలతో పాటు కూచిపూడి, జుంబా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ రూపొందించిన స్వర్ణాంధ్రప్రదేశ్ విజయ్ ఇన్ యాక్షన్ అనే పుస్తకం డిజిటల్ వెర్షన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మలేషియా ప్రభుత్వం ఫెమెండోతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్ ఇ నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ బి.రత్నకుమారి హుదూద్ తుపాన్‌పై సంకలనం చేసిన పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ బడ్జెట్లో విద్యకు రూ.21.500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రమూ బడ్జెట్లో 10శాతానికి మించి విద్యపై ఖర్చు చేయట్లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17.5 శాతం నిధులు విద్యకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5వేల కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, మహిళా కమిషనర్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీధర్, శాసన మండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి సుమితాదావ్రా, సాంకేతిక, ఉన్నత విద్యశాఖల కమిషనర్ డి.ఉదయలక్ష్మి, పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, సబ్ కలెక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. -
సింధూ, సాక్షికి ఢిల్లీ సీఎం సన్మానం
న్యూఢిల్లీ : ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఘనంగా సన్మానించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, రెజ్లర్ సాక్షి మాలిక్‌లకు ఆయన సన్మానించి, ఢిల్లీ ప్రభుత్వం తరఫున ప్రకటించిన చెక్కులను అందచేశారు. బ్యాండ్మింటన్‌లో గెలిచి రజతం సాధించిన పీవీ సింధుకు రూ.2 కోట్లు, రెజ్లింగ్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్‌కు రూ.కోటి బహుమానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేజ్రీవాల్ సింధూ, సాక్షి మాలిక్ అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. కృషి, అంకితభావంతో వారు అనుకున్నది సాధించారని అన్నారు. అలాగే సింధూ, సాక్షిమాలిక్ కోచ్‌లు గోపీచంద్, మణిదీప్ సింగ్‌లకు చెరో రూ. 5లక్షల చెక్‌లు అందచేశారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్‌కు పీవీ సింధూ కృతజ్ఞతలు తెలిపింది. క్రీడాకారులను ప్రోత్సహించడం సంతోషకరంగా ఉందని... తమకు లభించిన గౌరవం మరవలేనిదని సింధూ అన్నారు. రియో ఒలింపిక్స్‌కు వెళ్లేటప్పుడు తమ వద్ద సెల్‌ఫోన్ కూడా లేదని, ఇంటి దగ్గర ఏం జరుగుతుందో కూడా తమకు తెలియదన్నారు. అయితే పతకం సాధించి భారత్‌కు తిరిగి వచ్చాక.. తమ మ్యాచ్‌లను టీవీ సెట్ల వద్ద కూర్చుని చూశామని ప్రతి ఒక్కరూ చెబుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించిందని... తల్లిదండ్రులతో పాటు తమకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ సింధు కృతజ్ఞతలు తెలిపింది. -
భాస్కరాచారికి వైఎస్సార్సీపీ సన్మానం
మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్, భాషా సాంస్కతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూస్‌పిక్షర్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ భాస్కరాచారిని శనివారం వైఎస్సార్సీపీ నాయకులు సన్మానించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా ఫొటోగ్రాఫర్‌కు ప్రథమ స్థానం రావడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ హైదర్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కోస్గి నసీర్, జమీర్‌పాష, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ వాజిద్, నేత శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
దిగంబర కవులకు సత్కారం
ఆదివారం దిగంబర కవిత్వ సంపుటాల ఆవిష్కరణ దిగంబర కవిత్వానికి 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం తెనాలిలో జరగనున్న రాష్ట్రస్థాయి ‘తెలుగు కవితా సమాలోచన’లో పలువురు ప్రముఖులు దిగంబర కవులు నగ్నముని, మహాస్వప్న, నిఖిలేశ్వర్, భైరవయ్యను సత్కరించనున్నారు. దిగంబర కవిత్వానికి 50 సంవత్సరాలు పేరుతో మూడు సంపుటాల సంయుక్త సంచికను ఇదే వేదికపై ఆవిష్కరిస్తారు. జూపల్లి ప్రేమ్‌చంద్ రచన ‘ధిక్కారవాదం– దిగంబర కవిత్వం’ పుస్తకావిష్కరణ చేస్తారు. తెనాలి: పోరాటాలతో దక్కించుకున్న స్వాతంత్య్రం అనంతరం 1965 ప్రాంతంలో దేశంలో దిగజారిన పరిస్థితులపై గొంతెత్తి కటువైన పదజాలంతో నినదిస్తూ రాష్ట్రంలో దిగంబర కవిత్వం రూపుదిద్దుకొంది. ఆకలి, దారిద్య్రం, చదువుకున్నవారికి ఉద్యోగాల్లేపోవడం, కులవృత్తుల ధ్వంసం, అవినీతి, బంధుప్రీతి అలముకున్న తీరు ఇందుకు దారితీసింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, వివిధ వృత్తులోనూ ప్రవృత్తిరీత్యా కవులుగా ఉన్న యాదవరెడ్డి, మానేపల్లి హృషీకేశవరావు, బద్దం భాస్కరరెడ్డి, వీరరాఘవాచార్యులు, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, మన్మోహన్ సహాయ్ అనే ఆరుగురు, నిఖిలేశ్వర్, నగ్నముని, చెరబండరాజు, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవయ్య పేర్లతో దిగంబర కవులుగా అవతరించారు. ‘ఒంటిమీది గుడ్డలతో జెండాలు కుట్టించి వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది/ ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని శోకం నీది’ అనే గీతంలో దిగంబర కవుల ఆక్రోశం కనిపిస్తుంది. అప్పట్లో ఈ కవిత్వం ఒక సంచలనం. ప్రభుత్వానికి కంటగింపు కూడా.. అరెస్టు చేసి జైలుకు పంపారు.. 1971 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిలో నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖిని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టుచేసి ముషీరాబాద్ జైలుకు పంపింది. సాహిత్యం ద్వారా వర్గపోరాటాన్ని రెచ్చగొట్టటం, పోరాటంలో నిర్భయంగా మృత్యువును ఎదుర్కోమని ఉద్భోదించారు. విద్యార్థుల, పౌరహక్కుల, విప్లవ రచయితల సభల్లో ప్రసంగించారంటూ...నేరారోపణలతో చార్జిషీట్లు తయారుచేశారు. దీనిపై కవితాలోకంలో నిరసన పెల్లుబికింది. తమ సాహిత్య రాజకీయ విశ్వాసాలను వివరిస్తూ వీరు నిర్బంధాన్ని కోర్టులో సవాల్ చేశారు. 1971 సెప్టెంబరు 20న హైకోర్టు బెంచి విచారణ జరిపి ఇరువైపుల వాదనలు విన్నారు. పోలీసులు వీరు రాసిన కవితలపైనా నేరారోపణ చేసినందున, న్యాయమూర్తులు వీరి కవితలను చదవమని ఆదేశించారు. కిక్కిరిసిన కోర్టు హాలులో ఈ ముగ్గురూ కవితా పఠనం చేయడం, ప్రతిస్పందనగా కరతాళధ్వనులు మోగటం విశేషం. దీనిపై బెంచి తరఫున తీర్పు వెలువరించిన జస్టిస్ చిన్నపరెడ్డి, ‘కవిత్వం చీకటిలోంచి వెలుగులోకి నడిపించే ప్రక్రియగా కవుల సంఘర్షణలోంచి వెలువడుతుంది...ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం లేదని కేసు కొట్టివేస్తున్నట్టు చెబుతూ ముగ్గురూ స్వేచ్ఛాజీవులుగా కోర్టునుంచే వెళ్లవచ్చని తీర్పు చెప్పారు. న్యాయవాదులు పత్తిపాటి వెంకటేశ్వర్లు, కేజీ కన్నభిరన్‌లు వీరి తరఫున ఉచితంగా వాదించారు. జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పు, ఆ తర్వాత విరసం నినాదంగా ‘కలాలకు సంకెళ్లు లేవు...విశ్వాసాలు విశ్వవ్యాప్తం’ అనే ఉత్తేజాన్ని నింపింది. రచయితల వాక్స్వాతంత్య్రాన్ని కాపాడిన ఈ సంఘటనలో ప్రత్యక్ష పాత్రధారి అయిన నిఖిలేశ్వర్ జ్ఞాపకమిది. -
సన్మానం పేరుతో దందా
నెత్తీనోరు బాదుకుంటున్న మద్యం దుకాణదారులు వ్యాపారుల నుంచి ఎక్సైజ్ అధికారుల అక్రమ వసూళ్లు నరసరావుపేట టౌన్: అయ్యగారి అభిమానం పొందేందుకు ఎక్సైజ్ అధికారులు అవినీతి దందాకు తెరలేపారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్న ఓ జిల్లా స్థాయి అధికారికి సన్మానం పేరిట జిల్లాలోని మద్యం వ్యాపారుల నుంచి జోరుగా మామూళ్లు వసూలు చేస్తున్నారు. మద్యం వ్యాపారం సజావుగా సాగాలంటే ఓ పక్క అధికార పార్టీ నాయకులకు కప్పం మరో పక్క అధికారులకు నెలవారి మామూళ్లతో సతమతమవుతున్న మద్యం వ్యాపారులకు వసూళ్లు కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది. వ్యాపారులకు జరిమానా... జిల్లాలో 140 బార్అండ్ రెస్టారెంట్లు, 330 వైన్స్షాపులున్నాయి. లాటరీ ద్వారా మద్యం దుకాణాలను దక్కించుకొన్న వ్యాపారులు ఆయా నియోజక వర్గాల్లోని అధికార పార్టీ నాయకులకు పెద్దమొత్తంలో కప్పం చెల్లించారు. కొన్నిప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులకు దుకాణాల్లొ భాగస్వామ్యం కల్పించారు. వీటితో పాటు ప్రతినెలా స్థానిక అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులకు సైతం మామూళ్లను వ్యాపారులు ముట్టచెప్పాల్సి ఉంది. దీంతోపాటు ఉన్నతస్థాయి అధికారులు ఇన్స్పెక్షన్కు వచ్చిన సమయంలో.. అధికారుల గృహాల్లో శుభకార్యాల వేళల్లో అదనంగా వ్యాపారులకు జరిమానా పడుతూ ఉంటుంది. వీటన్నింటితో సతమతమవుతున్న మద్యం వ్యాపారులకు అధికారుల పదవీ విరమణ సన్మానం సమయంలో అక్రమ వసూళ్లు ఏమిటంటూ నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఈ చర్యను కొంతమంది వ్యాపారులు వ్యతిరేకిస్తుండగా మరికొందరు సమస్యలు తలెత్తుతాయని భావించి మిన్నకుండి ఎంతో కొంత ముట్టజెబుతున్నారు. ఐదు రోజులుగా నరసరావుపేట డివిజన్లోని మద్యం వ్యాపారులతో జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొందరు సమావేశం నిర్వహించి సన్మాన కార్యక్రమ ఖర్చుకు సహకరించాలని హుకుం జారీ చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్ళ వ్యవహారంతో మద్యం వ్యాపారులలో అలజడి రేగుతోంది. -
పెరుగు రామకృష్ణకు సత్కారం
నెల్లూరు(బారకాసు): స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విజయవాడలో నిర్వహించిన స్వాతంత్ర సప్తతి కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన కవి పెరుగు రామకృష్ణ సత్కారం పొందారు. స్వాతంత్య్ర సమరయోధులకు కన్నీటి అభిషేకం చేస్తూ ఆయన రెండు కవితలు చదివి అందరి మన్ననలు పొందారు. కవితల పఠనంతో పాటు గజల్స్, గానంతో అందరినీ అలరించారు. అనంతరం ఆయనను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఘనంగా సత్కరించారు. -
సింధు, గోపీచంద్‌కు ఏపీ ప్రభుత్వం సన్మానం
-
సింధు, గోపీచంద్‌కు రేపు ఏపీ ప్రభుత్వం సన్మానం
విజయవాడ: రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో రజత పతకం గెలుచుకున్న పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఈ కార్యక్రమం చేపట్టనుంది. రేపు ఉదయం సింధు, కోచ్ గోపీచంద్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విజయవాడ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా సింధు, గోపీచంద్‌ను సత్కరించనున్నారు. పవిత్ర సంగమం ఘాట్ వద్ద జరిగే సత్కార కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. మంగళవారం కృష్ణాపుష్కరాల ముగింపు కూడా కావడంతో సంగమం వద్ద కొద్దిపాటి మార్పులు చేస్తున్నారు. ఈ మేరకు పుష్కరాల ప్రత్యేకాధికారి బి రాజశేఖర్, సినీ దర్శకుడు బోయపాటి శ్రీను. సీపీ గౌతంసవాంగ్, మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్, జేసీ గంధం చంద్రుడు సోమవారం మధ్యాహ్నం పవిత్రసంగమం ఘాట్‌ను పరిశీలించారు. ముగింపు వేడుకలకు ఏయే మార్పులు చేయాలో బోయపాటి శ్రీనును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి బి రాజశేఖర్ మాట్లాడుతూ నిత్యహారతికి ముందు సింధుకు సత్కార కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ప్రస్తుతం హారతి కోసం ఏర్పాటు చేసిన ఫంట్‌ను కొద్దిగా నదిలోకి వెనక్కు జరుపుతున్నట్లు తెలిపారు. ఘాట్ వద్ద కొద్దిపాటి మార్పులు తప్ప పెద్దగా ఏమీ మార్పులు చేయబోమన్నారు. ఘాట్ వద్ద వెయ్యి మంది కూచిపూడి కళాకారులు నృత్య ప్రదర్శన ఇస్తారన్నారు. హారతి, పుష్కరాల ముగింపు వేడుకలు చూసేందుకు తరలివచ్చే వీఐపీలు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తరలివచ్చే భక్తులు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎల్సీడీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మీడియాకు వేడుకల ముగింపు సందర్భంగా ప్రత్యేక పాస్‌లు జారీ చేయనున్నట్లు తెలిపారు. నదిలో హారతి వెనుకభాగంలో బాణా సంచా కాల్చేందుకు వీలుగా బోయపాటి శ్రీను ఏర్పాట్లు చేశారు. పుష్కరాల ముగింపు సందర్భంగా చేపట్టే ఈవెంట్ చరిత్రలో మిగిలిపోయేలా చేస్తున్నామన్నారు. భద్రత పరంగా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు సీపీ గౌతంసవాంగ్ చెప్పారు. కాగా సింధుకు ఏపీ సర్కార్ రూ.3కోట్ల నగదు, అమరావతిలో వెయ్యి గజాల స్థలంతో పాటు గ్రూప్-1 ఉద్యోగాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. -
క్రీడా ఆణిముత్యం సింధూ
నారాయణ మెడికల్ కళాశాలలో విజయోత్సవ వేడుక నెల్లూరు రూరల్: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం అందించిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకటసింధూ క్రీడా ఆణిముత్యమని పలువురు ప్రముఖులు కొనియాడారు. చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల సెమినార్ హాల్లో విజయోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత క్రీడాకారిణి సింధూ సోదరి దివ్య కేక్‌ను కట్ చేశారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీరనాగిరెడ్డి మాట్లాడారు. వీరోచిత పోరాట ప్రతిభ కనబర్చిన సింధూ విద్యార్థులకు ఆదర్శమని చెప్పారు. నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ఏజీఎం భాస్కర్‌రెడ్డి, ప్రముఖ డాక్టర్ కలికి హైమావతి, తదితరులు పాల్గొన్నారు. సింధూకు తల్లిదండ్రులే స్ఫూర్తి రియో ఒలింపిక్స్‌లో బాడ్మింటన్ మహిళల విభాగంలో రజత పతకం సాధించిన సింధూకు తల్లిదండ్రులే స్ఫూర్తి అని సోదరి దివ్య పేర్కొన్నారు. నారాయణ మెడికల్ కళాశాలలో ఎమ్మెస్ కోర్సును అభ్యసిస్తున్న దివ్య విజయోత్సవ వేడుకల్లో మాట్లాడారు. సింధూ ఆరో సంవత్సరం నుంచే తండ్రితో పాటు గ్రౌండ్స్‌కు వెళ్లేదని, అక్కడి నుంచే బాడ్మింటన్ ఆడేదని గుర్తు చేసుకున్నారు. సింధూ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారని చెప్పారు. కోచ్ గోపీచంద్ కృషితోనే ఈ స్థాయికి ఎదిగిందన్నారు. తన చెల్లెలు ఈ స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. నారాయణ మెడికల్ కళాశాలలో సింధూ విజయోత్సవ వేడుకలను నిర్వహించేందుకు మంత్రి నారాయణ, కళాశాల యాజమాన్యం సహకరించడం ఆనందంగా ఉందని తెలిపారు. -
సాక్షికి ఎయిర్ ఇండియా నజరానా
రియో 2016 ఒలింపిక్స్ లో కోట్లాది భారతీయుల కలను సాకారం చేసిన భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కు ఎయిర్ ఇండియా మరో అరుదైన బహుమతిని ప్రకటించింది. మహిళల ఫ్రీ స్టైల్ 58 కిలోల రెజ్లింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నహరియాణా క్రీడాకారిణి సాక్షి మాలిక్ (23 ) విజయానికి గుర్తుగా నజరానాను అందించనుంది. ఒక సంవత్సరంపాటు వర్తించేలా ఏదైనా రెండు ప్రదేశాలకు, రెండు బిజినెస్ క్లాస్ రిటన్ టికెట్స్ ను (సాక్షి, ఆమెతోపాటు మరొకరికి) ఉచితంగా అందిస్తున్నట్టు శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. విమానంలో ప్రయాణించే క్రీడాకారిణి కావాలని కలలు కన్న సాక్షిని తాము ఇలా సన్మానించనున్నట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇది తమకు గర్వకారణమని ఎయిర్ ఇండియా సీఎండీ అశ్విన్ లోహాని రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్ లో తొలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పై ఇప్పటికే ఒకవైపు అభినందనల వెల్లువ, మరోవైపు భారీ నజరానాలు అందుతున్నాయి. హర్యానా ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదుతో పాటు ప్రభుత్వం ఉద్యోగం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ.20 లక్షల ప్రత్యేక అవార్డు, రైల్వేశాఖ రూ.60 లక్షలు ఇవ్వనుంది. అటు భారత ఒలింపిక్ సమాఖ్య తొలిసారిగా కాంస్య పతక విజేతకు రూ.20 లక్షలు బహుమతిని ప్రకటించింది. వీటితో పాటు రియో ఒలింపిక్స్ కు సౌహార్ద్ర రాయబారిగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రూ. లక్ష అందజేయనున్నారు. 2014 లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా సాక్షి రజత పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. #AI is happy to offer two Business class return tickets to the pride of Nation,#SakshiMalik.You made us proud.#Rio2016. — Air India (@airindiain) August 19, 2016 -
వారికి సన్మానం చేస్తాం!
తెల్లవారుజామున నడిరోడ్డుపై ఓ వ్యక్తిని వాహనం ఢీకొంది. నెత్తురోడుతూ నిస్సహాయంగా పడి ఉన్న అతడికి సహాయం చేయాల్సిందిపోయి.. ఓ వ్యక్తి ఆ అభాగ్యుడి సెల్‌ఫోన్ ఎత్తుకొని పారిపోయాడు. మానవతా దృక్పథంతో ఎవరూ స్పందించకపోవడంతో రోడ్డు మీదనే నెత్తురోడుతూ ఆ బడుగు సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన మనుషుల్లో తగ్గిపోతున్నా కనీస మానవతా స్పందనను పట్టిచూపించింది. సాటి మనిషి ఎలాపోతే మనకేంటన్న ఉదాసీనభావం ప్రజల్లో పేరుకుపోతున్నట్టు ఈ ఘటన చాటింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త పథకం తీసుకురావాలని భావిస్తోంది. రోడ్డుప్రమాదాలు, ఆపద సమయాల్లో బాధితులకు వెంటనే సాయం అందించి, కాపాడే వారిని గుర్తించి, సత్కరించాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ప్రభుత్వం తరఫున రివార్డులు అందజేస్తామని, ఇందుకు ముందుకొచ్చే ట్యాక్సీ డ్రైవర్లు, రిక్షాకార్మికులకూ రివార్డులు అందిస్తామని ఢిల్లీ హోంమంత్రి సత్యేందర్ జైన్ ప్రకటించారు. ఇందుకోసం పథకం ముసాయిదాను రూపొందిస్తున్నామని, త్వరలోనే ఈ పథకాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రోడ్డుప్రమాద బాధితులకు ప్రజల నుంచి తక్షణసాయం అందేవిధంగా ఈ పథకం ఉంటుందని చెప్పారు. -
కళారంగాన్ని ప్రోత్సహించాలి
సురేష్ మండువకు ఆత్మీయ సత్కారం నెల్లూరు(బారకాసు): సమాజ మార్పు కోసం కళారంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, 25 కళాసంఘాల గౌరవాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. హరివిల్లు క్రియేషన్స్ పర్యవేక్షణలో 25 కళాసంఘాల ఆధ్వర్యంలో టౌన్హాల్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ మాజీ అధ్యక్షుడు సురేష్ మండువకు ఆత్మీయ అభినందన పురస్కార కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడారు. కళారంగం కనుమరుగువుతున్న తరుణంలో అమెరికాలో ఉద్యోగ రీత్యా స్థిరపడిన నెల్లూరీయుడు సురేష్ మండువ అక్కడ కళాకారులకు మంచి అవకాశాలు కల్పించి వారితో ప్రదర్శనలను నిర్వహించేలా చొరవ చూపడాన్ని అభినందించారు. అనంతరం ఓఎస్డీ పెంచలరెడ్డి మాట్లాడారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు అమెరికాలో తన వంతు కృషి చేస్తున్న సురేష్‌మండువ అభినందనీయుడన్నారు. పురస్కార గ్రహీత సురేష్‌మండువ మాట్లాడుతూ.. కళారంగమన్నా, కళలపై తనకెంతో అభిమానమని, తాను అమెరికాలో స్థిరపడినా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అక్కడి వారికి తెలియజేసేందుకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. ప్రతిభ కలిగిన కళాకారుల గురించి తనకు తెలియజేస్తే అమెరికాలో వారితో ప్రదర్శనలిచ్చే అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం సురేష్మండువను శాలువాలు, గజమాలలతో సత్కరించారు. ప్రముఖ నృత్య కళాకారిణి నదియా తన నాట్య ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర పలువురి సినీ కళాకారుల గొంతులను అనుకరించారు. గురుకృప కళాక్షేత్ర విద్యార్థుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సాయిహేమంత్‌కృష్ణ నాశిక వేణుగానం ఆహూతులను ఆకట్టుకున్నాయి. నాటా కార్యవర్గ సభ్యుడు కృష్ణపాటి రమణారెడ్డి, వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి, కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యంయాదవ్, మయూరి బ్యూటీపార్లర్ అధినేత్రి దుర్గాదేవి, అందె శ్రీనివాసులు, హరివిల్లు క్రియేషన్స్ అధినేత దోర్నాల హరిబాబు, పవిత్ర చారిటబుల్ ట్రస్ట్ అధినేత గాలి కిరణ్‌కుమార్, ఆల్తూరు ఆదినారాయణరెడ్డి, గుర్నాథం, పురస్కార గ్రహీత తండ్రి మండువ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు సంస్కృతిని కాపాడుకోవడమే లక్ష్యం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ మాజీ అధ్యక్షుడు సురేష్ మండువ నేడు ఆత్మీయ అభినందన పురస్కార ప్రదానం నెల్లూరు(బారకాసు): అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ తెలుగు వారికి అండగా నిలబడటమే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ లక్ష్యమని ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు సురేష్ మండువ తెలిపారు. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడిన సురేష్ నెల్లూరు వచ్చిన సందర్భంగా గురువారం పలు విషయాలను వెల్లడించారు. నెల్లూరు ఏసీనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వీఆర్సీ కళాశాలలో విద్యనభ్యసించాను. ఆ తరువాత తిరుపతిలో అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు చేసి కంప్యూటర్‌సైన్స్ కోర్సు చేసేందుకు 1996లో అమెరికా వెళ్లాను. కోర్సు పూర్తిచేసిన వెంటనే అక్కడే ఉద్యోగం దొరకడంతో స్థిరపడిపోయాను. 2000లో యోగితతో వివాహమైంది. అక్కడే మాకు బాబు, పాప సంతానం కలిగారు. చిన్నప్పట్నుంచి నాకు కళారంగం అంటే ఎంతో ఇష్టం. కళాశాలల్లో జరిగే ఫంక్షన్లలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడ్ని. అమెరికాలో స్థిరపడిన తరువాత తెలుగు వారికి మన సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ వాటికున్న విలువలను కాపాడాలన్న ఉద్దేశంతో నాటా, ఆటా, తానా వంటి సంస్థల్లో సభ్యుడిగా చేరి సేవలందించాను. ఈ క్రమంలోనే 2013లో టీఏఎన్‌టీఈఎక్స్ సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. తెలుగు కళాకారులకు అవకాశం అమెరికాలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కలిగిన తెలుగు కళాకారులకు అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తున్నాం. సినీ రంగానికి చెందిన తనికెళ్లభరిణి, సుద్దాల అశోక్‌తేజ, లక్ష్మీపార్వతి, జొన్నవిత్తులతో పాటు నెల్లూరుకు చెందిన హాస్య కళాకారుడు దోర్నాల హరిబాబు, ప్రముఖ నృత్య కళాకారిణి నదియా, నాశికా వేణుగానం సాయిహేమంత్‌కృష్ణ, తదితరులకు అవకాశం కల్పించాం. వివిధ రకాల సేవా కార్యక్రమాలు స్ఫూర్తి, మైత్రి, వనిత–వేదిక, తెలుగు వెన్నెల పేర్లతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. స్ఫూర్తిపేరుతో వృద్ధులకు సేవలందించడం, అమెరికాలో పుట్టిన తెలుగు చిన్నారులకు పాఠాలు నేర్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మైత్రి పేరుతో అమెరికాలో ఉంటున్న కుటుంబ సభ్యుల కోసం వచ్చి వెళ్లే వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. వనిత–వేదిక పేరుతో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. సాహిత్యవేదిక ద్వారా తెలుగు వెన్నెల పేరుతో ప్రతి నెలా మూడో ఆదివారం పలువురు ప్రముఖ కవులను పిలిపించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేడు ఆత్మీయ అభినందన పురస్కార ప్రదానం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ తెలుగువారికి అండగా నిలుస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్న నెల్లూరీయుడైన సురేష్ మండువకు 25 కళాసంఘాల ఆధ్వర్యంలో హరివిల్లు క్రియేషన్స్ పర్యవేక్షణలో శుక్రవారం ఆత్మీయ అభినందన పురస్కారం ప్రదానం చేయనున్నారు. నగరంలోని పురమందిరంలో సాయంత్రం 6గంటలకు జరిగే కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. -
జాతీయ స్టూడెంట్స్ ఒలింపిక్స్‌లో సత్తా
–నగరంలో అభినందన సభ నెల్లూరు(బృందావనం): జాతీయస్థాయి స్టూడెంట్స్ ఒలింపిక్ పోటీల్లో వివిధ క్రీడా విభాగంలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అభినందనసభ నిర్వహించారు. స్థానిక బాలాజీనగర్‌లోని మోడరన్ స్కూల్లో మంగళవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా వాకాటి విజయకుమార్‌రెడ్డి హాజరై మాట్లాడారు. గత నెల 22నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లోని ప్రేమ్‌సాగర్ ఆశ్రమంలో జరిగిన 3వ జాతీయ స్టూడెంట్స్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న నెల్లూరుకు చెందిన క్రీడాకారులు అండర్–10 నుంచి 25 వరకు కరాటే, యోగా, చెస్ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలవడం హర్షణీయమన్నారు. జిల్లా స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయభరద్వాజ్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సందీప్‌కుమార్, యోగా మాస్టర్ ఆదినారాయణలను వాకాటి విజయకుమార్‌రెడ్డి ప్రశంసించారు. కరాటే: –అండర్–12 కటావిభాగంలో డీఎల్ నరసింహ, పి.అభినయ (బంగారు) ఎస్.వెంకటశివాని (వెండి), జి.కావ్యలిఖిత(రజత),అండర్–14 కటావిభాగంలో డీవీ జాహ్నవి(వెండి), డి.నరేంద్ర(వెండి), టి.చందన(రజత), పి.సాయివికాస్‌రెడ్డి(రజత),అండర్–14కుమిటే విభాగంలో ఎ.వెంకటసాత్విక్ (బంగారు),అండర్–17కటా విభాగంలో టి.అభినయ్ రజత,కుమిటేలో వెండి,కుమిటేలో బి.సరితారెడ్డి(వెండి),అండర్–19 కుమిటే విభాగంలో ఎస్.మల్లికార్జున(బంగారు) యోగా: అండర్–10–వి.అక్షిత(రజత),అండర్–14 వి.వి.పూర్ణిమ అపురూప(రజత), చదరంగం అండర్–12విభాగంలో–ఎ.ఎం.శ్రీహరి(బంగారు),14లోఎ.ఎం.కుమారస్వామి(రజత), 25లో సీహెచ్.సాయికుమార్(బంగారు), వి.విష్ణువర్ధన్‌రెడ్డి(వెండి) సాధించారన్నారు. -
తెలంగాణ రత్న అవార్డు గ్రహీతకు సన్మానం
లక్సెట్టిపేట : తెలంగాణ రత్న అవార్డు గ్రహీత రెడ్డిమల్ల ప్రకాశంను పట్టణ మాలమహానాడు సభ్యులు ఆదివారం స్థానిక మహాలక్ష్మివాడలో ఘనంగా సన్మానించారు. సాహిత్యం, సామాజిక సేవలందించినందుకు ప్రకాశంకు తెలంగాణ రత్న ఆవార్డు లభించిందన్నారు. మండలంలోని జెండావెంకటాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపా«ధ్యాయుడిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ అవార్డు రావడం పట్ల పలువురు ఆనందం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గరిసె రవీందర్, మల్లేష్, రాజయ్య, పోచమల్లు, సత్తయ్య, బాపు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
జేసీ వివేక్ సేవలు ప్రశంసనీయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ జిల్లాలో చేసిన సేవలు ప్రశంసనీయమని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. జేసీ వివేక్ యాదవ్ విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళుతున్న సందర్భంగా గురువారం రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జేసీ తక్కువ కాలంలో జిల్లాలో పలు విభాగాల్లో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. పౌర సరఫరాల శాఖ, మీసేవ, ఈ పాస్, వంశధార, కొవ్వాడ, తోటపల్లి ప్రోజెక్టులు భూసేకరణ తదితర అంశాల్లో ఆయన మంచి సేవలు అందించారని తెలిపారు. ఎమ్మెల్సీ కావలి ప్రతిభాభారతి, కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, జేసీ–2 పి.రజనీకాంతారావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, డీఆర్ఓ బి. కృష్ణభారతి, ఐటీడీఏ పీఓ జె.వెంకటరావు, డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి, జెడ్పీ సీఈఓ నగేష్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గిన్నిస్ పుటల్లో ఎక్కనున్న గజరాజు!
కేరళ గజరాజుకు ప్రత్యేక గౌరవం దక్కింది. ఆసియాలోనే అత్యంత ఎక్కువకాలం జీవించిన ఏనుగుగా 86 ఏళ్ళ వృద్ధ ఏనుగు గిన్నిస్ రికార్డులకు ఎక్కనుంది. వృద్ధాప్యంలోనూ హుషారుగా గడిపేస్తున్న ఏనుగు గురించి యజమానులు.. ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) గిన్నిస్ అధికారులకు వివరాలతో లేఖ రాశారు. ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత వృద్ధ ఏనుగుగా దాక్షాయణి గురించి లేఖలో వివరించారు. ప్రాణాలతో జీవిస్తున్న ఏనుగుల్లో దాక్షాయణి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగు అని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు అధ్యక్షుడు పరీయర్ గోపాలకృష్ణన్ తెలిపారు. కేరళ అటవీశాఖ రికార్డులు కూడా అదే విషయాన్ని స్సష్టం చేస్తున్నట్లు వెల్లడించారు. వృద్ధ ఏనుగుగా గుర్తింపు పొందిన దాక్షాయణిని ఈ సందర్భంగా ట్రావెన్ కోర్ బోర్డు ప్రత్యేకంగా సత్కరించింది. దేవస్వం మినిస్టర్ కడకంపల్లి సురేంద్రన్ సత్కార కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఫారెస్ట్ మినిస్టర్ కె. రాజు పంచదేరం టైటిల్ తో ఏనుగును సత్కరించారు. ట్రావెన్ కోర్ రాజులు దాక్షాయణిని టీడీబీ కి బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఏనుగు ఛంగలూర్ మహాదేవ ఆలయంలో ఉంటోంది. కేరళ పోస్టల్ సర్వీస్ కూడా దాక్షాయణి పేరిట ఓ ప్రత్యేక పోస్టల్ కవర్ ను రిలీజ్ చేసే ఉద్దేశ్యంలో ఉంది. తైవాన్ కు చెందిన ఏనుగు.. 85 ఏళ్ళ వయసులో 2003 లో చనిపోగా... దాక్షాయణి 86 ఏళ్ళు జీవించిఉన్న ఏనుగుగా ప్రత్యేక గౌరవాన్ని దక్కించుకుని, గిన్నిస్ పుటలకు ఎక్కనుంది. -
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి డల్లాస్ లో సన్మానం
టెక్సాస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డిని ప్రవాస తెలుగు రాష్ట్రాల వాసులు ఘనంగా సన్మానించారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా సన్మానించేందుకు తెలుగు వారు ఓ కార్యక్రమం నిర్వహించారు. 2009లో నిజామాబాద్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన రికార్డు సృష్టించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన నీటిపారుదల, ఆరోగ్యశాఖలను నిర్వర్తించారు. నిజామాబాద్ మాజీ ఎంపీ డా.ఆత్మ చరణ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి సేవలను కొనియాడారు. అజయ్ రెడ్డి ఏలేటి, రఘువీర్ బండారు, ఇతర ముఖ్యనేతలు ఈ కారక్యమంలో పాల్గొన్నారు. సోషల్ యాక్టివిస్ట్ గానూ మంచి గుర్తింపున్న నేత సుదర్శన్ రెడ్డిని సుదర్శనచక్రంతో పోల్చారు. నీటిపారుదల మంత్రిగా సేవలకుగానూ ఆయనను అపర భగీరథుడిగా పిలుస్తారు. సమాజ సేవ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదర్ రెడ్డి కొర్సపాటి, ప్రమోద్ పొద్దుటూరి, రావ్ కల్వల, రామ్ కాసర్ల, ప్రసాద్ తోటకూర, శ్రీనివాస్ గుర్రం, సతీష్ రెడ్డి, సుబ్బు జొన్నలగడ్డ, మహేందర్ కమిరెడ్డి, రాజ్ గోందీ, ప్రవీణ్ బిల్లా, ఎన్ఎంఎస్ రెడ్డి, అల్ల శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్ తెలుగు, అశోక్ కొండల, మహేశ్ ఆదిబట్లలు పాల్గొన్నారు. ప్రజా సేవలో సుదర్శన్ రెడ్డి గారు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను సన్మానించినట్టు రామ్ అన్నాడి పేర్కొన్నారు. -
నటి సునీతాశెట్టికి ఘన సన్మానం
బళ్లారి అర్బన్ : సీనియర్ నటి సునీతాశెట్టి సేవలను గుర్తించి బళ్లారి మేరీజాన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా సునీతాశెట్టి మాట్లాడుతూ బళ్లారి ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలకు ఎంతో రుణపడి ఉన్నానన్నారు. బళ్లారి మేరీజాన్ సంస్థ సమాజ సేవలందిస్తోందని, తన లాంటి కళాకారులను గుర్తించి సన్మానించడం హర్షణీయమన్నారు. ఈ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బళ్లారి మేరీజాన్ సంస్థ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కార్పొరేటర్ సుధాకర్ దేశాయ్, కరవే ఉత్తర కర్ణాటక అధ్యక్షుడు చెన్నబసవరాజ్, వీహెచ్‌పీ నాయకుడు బసవరాజ్, కర్ణాటక ప్రాంత యువ కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీఎం.పాటిల్, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు ఫారుక్‌బాషా, అజయ్, డ్యాన్స్ మాస్టర్ బసవరాజ్, కళాకారిణి సౌమ్య హిరేమఠ్, రాజు హిరేమఠ్, జోగి విజయ్, మహ్మద్, దాదాపీర్ తదితరులు పాల్గొన్నారు. -
సాహసబాలలకు జాతీయ పురస్కారాలు ప్రదానం
-
పెళ్లి పందిట్లో విద్యా గురువులకు సన్మానం
గాంధీనగర్: పెళ్లంటే నూరేళ్ల పంట అని, అందరికి గుర్తుండిపోయేలా అట్టహాసాలు, ఆర్భాటాలతో పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు కన్నెలెందరో. గుజరాత్‌లోని హల్దారు గ్రామానికి చెందిన 22 ఏళ్ల నిషాద్‌బాను వాజిఫ్‌దార్ మాత్రం అలా ఆలోచించలేదు. వీలైనంత తక్కువ ఖర్చులో సాదాసీదాగా పెళ్లి చేసుకొని అలా మిగిల్చిన డబ్బును నలుగురికి ఉపయోగపడేందుకు ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది. ఇటీవలనే ఎంసీఏ కోర్సు పూర్తి చేసిన నిషాద్‌బాను తనకు నర్సరీ నుంచి ఎంసీఏ వరకు విద్యా బోధన చేసిన గురువులను, ఉన్నత విద్యనభ్యసించిన మహిళలను సముచిత రీతిన తన పెళ్లి రోజున సత్కరించాలని అభిప్రాయపడింది. అంతే, జనవరి 10 తేదీన పెళ్లి చేసుకున్న ఆమె ఆరోజున నర్సరీ నుంచి ఎంసీఏ వరకు తనకు చదువు చెప్పిన 75 మంది రిటర్డ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందజేసింది. విద్యారంగంలో మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా ఉన్నత విద్యలు చదివిన గ్రామానికి చెందిన ప్రతి ఒక్క విద్యార్థినిని ఆహ్వానించి గురువుల అనంతరం వారినీ సత్కరించింది. అంతేకాకుండా తాను చదివిన ప్రాథమిక, ప్రాతమికోన్నత పాఠశాలకు తన పెళ్లి కానుక కింద పది లక్షల రూపాయల విరాళాలు అందజేసింది. నిషాద్బానును ఉన్నత చదువులు చదివించిన ఆమె తండ్రి సాధారణ రైతు అయినప్పటికీ ఆమె పెద్ద మనసును అర్థం చేసుకున్నారు. పెళ్లి కొడుకు రమీజ్ మొహమ్మద్ కూడా ఆమె సంకల్పాన్ని గౌరవించి తోడ్పడ్డారు. ఆమె కోరిక మేరకు తండ్రి కూడా అలాంకారాల లాంటి ఆర్భాటాలకు వెళ్లకపోవడమే కాకుండా సాధారణ భోజనంతో సరిపెట్టారు. ఫుడ్ కూడా ఏ మాత్రం వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఆమె అటు గురువులకు, విద్యార్థినులకే కాకుండా మొత్తం గ్రామానికే కొత్త స్ఫూర్తినిచ్చారు. ఆమె తన ఫోటోను లేదా గురువుల సన్మానాల ఫోటోలను ప్రచురించేందుకు కూడా మీడియాను అనుమతించలేదు. తాను ఇదంతా ప్రచార ఆర్భాటాల కోసం చేయడం లేదని, తన సంకల్పం దీనికి అతీతమని చెప్పి మొత్తం సమాజానికే నేడు స్ఫూర్తిగా నిలిచారు. -
తొలి ఓటరుకు సన్మానం
వరంగల్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో తొలి ఓటరుకు సన్మానం చేశారు. కలెక్టర్ కరుణ, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఓటరకు పూలతో స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో మొదట ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు అధికారులు పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సిబ్బంది వెంటనే సరిచేయడంతో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల విశేషాలు.. వడ్డేపల్లిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు తమ గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ తొర్రురు మండలం టీక్యాతండా గిరిజనులు పోలింగ్‌ను బహిష్కరించారు. భూపాలపల్లి 17వ బూత్ పోలింగ్ కేంద్రం, ధర్మసాగర్ మండలం జానకీపురం, వర్ధన్నపేట మండలం వట్యాలలో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు వెంటనే సరిచేసి పోలింగ్ కొనసాగిస్తున్నారు. వరంగల్ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 1778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల మందికిపైగా భద్రత సిబ్బందిని వినియోగించారు. తొలిసారిగా ఈవీఎంలపై పార్టీ గుర్తులతోపాటు అభ్యర్థుల ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ ఉప ఎన్నికల్లో దాదాపు 15 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది.