విద్యార్థులకు కొలకలూరి ఇనాక్‌ స్ఫూర్తి | Kolakaloori Inak inspiration to students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు కొలకలూరి ఇనాక్‌ స్ఫూర్తి

Published Thu, Sep 8 2016 5:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

విద్యార్థులకు కొలకలూరి ఇనాక్‌ స్ఫూర్తి

విద్యార్థులకు కొలకలూరి ఇనాక్‌ స్ఫూర్తి

గుంటూరు ఈస్ట్‌: ఏసీ కళాశాలలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌ కు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని కళాశాల యాజమాన్యం, విద్యార్థులు బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.ముత్యం మాట్లాడుతూ కొలకలూరి ఇనాక్‌ ఏసీ కళాశాలలో విద్యనభ్యసించి, అధ్యాపకునిగా పనిచేసి అంచలంచెలుగా ఎదగడం తమకు గర్వకారణ మన్నారు. ఇనాక్‌ కళాశాల ప్రతిష్టను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేసారని కొనియాడారు. ఆయనను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.  ఉన్నతమైన ఆలోచనలతో విద్యార్థులు అభివృద్ధి చెందాలని కోరారు.  కార్యక్రమంలో అసోసియేట్‌ ప్రిన్సిపాల్‌ ఇమాన్యుయేల్, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీధర్, తెలుగు అధ్యాపకులు, కళాశాల పీఆర్వో కనపాల జోసఫ్, వి.జి దేవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement