పద్మ పురస్కార గ్రహీతలకు తెలంగాణ సర్కార్‌ సన్మానం | Telangana Government Felicitate Padma Award Winners | Sakshi
Sakshi News home page

పద్మ పురస్కార గ్రహీతలకు తెలంగాణ సర్కార్‌ సన్మానం

Feb 4 2024 12:07 PM | Updated on Feb 4 2024 1:40 PM

Telangana Government Felicitate Padma Award Winners - Sakshi

పద్మ పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.

సాక్షి, హైదరాబాద్‌: పద్మ పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. పద్మా అవార్డు గ్రహీతల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో ఆరుగురిని ప్రభుత్వం సత్కరించింది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, మొదటి సినిమాలో ఎలాంటి తపన ఉందో 46 ఏళ్ల తరువాత కూడా చిరంజీవిలో అదే తపన ఉందన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం జరపడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తోందన్నారు. ప్రతీ ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల క్యాష్ రివార్డ్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతీ నెలా 25 వేల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement