Padma award
-
తెలంగాణ రాజకీయాలో పద్మ వార్ : KSR
-
అర్హులకే పద్మ అవార్డులు వచ్చాయి: బండి సంజయ్
-
నందమూరి బాలకృష్ణకు అల్లు అర్జున్ అభినందనలు
నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పద్మభూషణ్ అవార్డుకు పూర్తిగా అర్హులంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. తెలుగు సినిమాకు అందించిన సేవలకు సరైన గుర్తింపు లభించిందన్నారు. అజిత్ కుమార్ సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా పద్మ అవార్డులకు ఎంపికైన శోభన, శేఖర్ కపూర్, అనంత్ నాగ్‌లకు అభినందనలు తెలిపారు. పద్మ అవార్డులు సాధించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. కళల విభాగంలో గుర్తింపు దక్కడం నా హృదయాన్ని సంతోషంతో నింపిందని అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. Heartfelt congratulations to #NandamuriBalakrishna garu on receiving the prestigious #PadmaBhushan award, this recognition is well-deserved for your contributions in telugu cinema. My dear #AjithKumar garu, your achievement is equally inspiring and commendable.Also…— Allu Arjun (@alluarjun) January 27, 2025 -
ఆ నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గాలి.. లేదంటే..
సాక్షి,హైదరాబాద్ : పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టకరం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం సర్టిఫికెట్ల కోసం మాత్రమే కాదు. సామాజిక బాధ్యతగా ఆనాడు పీవీ నరసింహారావు యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లారు. సమాజంలో సమస్యలకు ఇక్కడి నుంచే పరిష్కారం మొదలు కావాలి. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలను నియమించాం. వందేళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించాం. యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించాం. తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ వీసీలపై ఉంది.పదేళ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయండి..అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేస్తే అది మంచిది కాదు. రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి. దేశానికి పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డిలాంటి వారిని అందించిన ఘనత యూనివర్సిటీలదే. రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. చిట్టచివరి పేదల వరకు సంక్షేమ ఫలాలు అందాలన్న అంబేద్కర్ ఆశయంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది.యూజీసీ నిబంధనలు మార్చి రాష్ట్రాల పరిధి నుంచి యూనివర్సిటీలపై అధికారాలను తప్పించాలని కుట్రలు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళితే కొంతమంది చేసే విషప్రచారానికి యూనివర్సిటీలు వేదికలు కాబోతున్నాయి.ప్రధాని మోదీకి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు యూజీసీ నిబంధనలు మార్చాలనుకోవడం రాజ్యాంగంపై దాడి చేయడమే. ఇది రాష్ట్రాలపై సాంస్కృతిక దాడి చేయడమే. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదు.ఇది అనవసర వివాదాలకు దారితీస్తుంది. రాష్ట్రాల అధికారాన్ని కేంద్రం గుంజుకోవడం మాపై దాడిగానే భావిస్తాం మా హక్కులను వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందే. అలా చేయకపోతే అవసరమైతే నిరసనలకు వెనకాడం. రాష్ట్రాల అధికారాలను ఒక్కొక్కటిగా కేంద్రం తీసుకుంటూ వెళితే.. రాష్ట్రాలు కేవలం పన్నుల వసూలు చేసే సంస్థలుగా మిగలాల్సి వస్తుందిరాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా మేధావులు ఆలోచన చేయాలి. పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణం. పద్మ అవార్డులపై ఈ వేదికగా మా అసంతృప్తిని కేంద్రానికి తెలియజేస్తున్నాం. త్వరలోనే ప్రధానికి ఈ విషయంపై లేఖ రాయబోతున్నాం’ అని అన్నారు. -
మా నాన్న బతికుంటే ఇంకా సంతోషంగా ఉండేది: అజిత్ కుమార్
తనకు పద్మభూషణ్ అవార్డ్(padma Bhushan Award) ప్రకటించడంపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కుమార్ (Ajith Kumar) స్పందించారు. ఈ అవార్డ్ ప్రకటించినందుకు ముందుగా భారత ప్రభుత్వం, సినిమా రంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు చూడటానికి మా నాన్న పి సుబ్రమణ్యం బతికుంటే ఇంకా సంతోషపడే వాడినని అన్నారు. అలాగే నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన తల్లి మోహిని, భార్య షాలిని, పిల్లలు అనౌష్క, ఆద్విక్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.కాగా.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగానికి చెందిన వారిలో అజిత్‌కుమార్, నందమూరి బాలకృష్ణ, శోభనతో పాటు మరికొందరికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు."భారత రాష్ట్రపతి నుంచి గౌరవ పద్మ అవార్డును స్వీకరిస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి ఎంపిక చేసిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత స్థాయిలో గుర్తింపు పొందడం, అలాగే దేశానికి నా కృషిని గుర్తించినందుకు కృతజ్ఞుడను. ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. చాలా మంది సమిష్టి కృషి, మద్దతు వల్లే ఇది సాధ్యమైంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేరణ, సహకారం, మద్దతు నా ప్రయాణంలో కీలక పాత్ర పోషించాయి " అని అజిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాగా.. ప్రస్తుతం అజిత్ కుమార్ (Ajith Kumar) విదాముయార్చి (Vidaamuyarchi Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్‌తో నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి తెలుగులో పట్టుదల అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ చూస్తుంటే మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సంక్రాంతికే విదాముయార్చి విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
వాహ్ ఉస్తాద్ వాహ్
పుట్టిన వెంటనే చెవిలో ‘కల్మా’ కాకుండా తబలా జతులు విన్నవాడు... మూడేళ్లకే తబలాను పసి వేళ్లతో మీటిన వాడు... ఏడేళ్లకు ప్రదర్శనలు ఇచ్చినవాడు...పన్నెండేళ్లకు ప్రపంచ యాత్రకు బయల్దేరినవాడు... మహా మహా విద్వాంసులకు సహ వాద్యగాడు... తనే స్వయంగా అద్వితీయ వాద్యకారుడు... తబలా ప్రపంచానికి ఈశ్వరుడు... దేవుడు... ఉస్తాద్ జాకీర్ హుసేన్.టీషర్ట్, జీన్స్ వేసుకుని ఆధునిక యువకుడిగా ఉంటూ సంప్రదాయ శాస్త్రీయ సంగీతాన్ని కుర్రకారుకు చేరువ చేసిన ఈ నవ యువ వాద్య మాంత్రికుడు కన్నుమూశాడు. అతను లేడు. అతనిలాంటి వాడు మరి రాడు. ఒక్కడే జాకిర్ హుసేన్.జాకిర్ హుసేన్ ప్రదర్శనలో ఎవరైనా ఇది చూడాలి. ఆయన తబలా మీద డమరుకాన్ని, శంఖాన్ని వినిపిస్తాడు. ‘ఎడమ’ మీద డమరుకం వినిపిస్తూ ‘కుడి’ని మీటి శంఖనాదాన్ని సృష్టిస్తాడు. ఆ శంఖనాద సమయంలో జాకిర్ హుసేన్ వేళ్లు ఎంత వేగంగా కదులుతాయంటే అవి కనపడవు. పైగా తబలాని తాకినట్టుగా కూడా ఉండవు. ఇలా వాయించడం అసాధ్యం. ‘ఇది ఎలా సాధించారు’ అని అనడిగితే ‘సాధన చేయాలి. తబలాతో స్నేహం చేయాలి. దాని మాటకు చెవి ఒగ్గాలి’ అంటాడు జాకిర్ హుసేన్. అంత వినమ్రంగా ఉండటం వల్లే ఆయన తన తబలాకు ప్రపంచమే చెవి ఒగ్గేలా చేయగలిగాడు. ‘ఉస్తాద్’ కాగలిగాడు. ‘మేస్ట్రో’ అనిపించుకున్నాడు.‘మీరు తబలా ఏ వయసులో నేర్చుకోవడం మొదలెట్టారు’ అని అడిగితే జాకిర్ హుసేన్ ఆశ్చర్యపోతాడు. ‘అదేం ప్రశ్న’ అంటాడు. నిజమే. అతను పుట్టిందే తబలా ఉన్న ఇంట్లో. జాకిర్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా జగమెరిగిన తబలా విద్వాంసుడు. మన దేశంలో తబలాకు ఔన్నత్యం తీసుకు వచ్చిన తొలి విద్వాంసుడు. ఆయనకు పెద్ద కొడుకుగా 1951లో ముంబైలో జన్మించాడు జాకిర్ హుసేన్. నర్సింగ్ హోమ్ నుంచి మరుసటిరోజు ఇంటికి తీసుకొస్తే ముస్లిం సంప్రదాయం ప్రకారం తండ్రి తన కొడుకు చెవిలో ‘కల్మా’ చదివి, పేరు పలికి లోపలికి తీసుకెళ్లాలి. కాని అల్లా రఖా జాకిర్ని తన చేతుల్లో తీసుకుని ‘ధాధా ధినా.. థాథా తునా’ అని తబలా జతులు వినిపించాడు. భార్య ‘ఇదేమిటండీ చోద్యం.. దైవ స్తోత్రం వినిపించక’ అనంటే ‘నా దైవం తబలాయే’ అని బదులిచ్చాడాయన. అలా జాకిర్‌కు పుట్టిన వెంటనే తబలా తెలిసింది. జాకిర్‌ను పడుకోబెట్టడానికి తండ్రి రోజూ ఒడిలోకి తీసుకుని తబలా జతులు వినిపిస్తూనే వెళ్లాడు. ఇలా మూడేళ్లు ఆ పసికందు మెదడులోకి తబలా మాత్రమే వెళ్లింది. మూడేళ్లు వచ్చేసరికి జాకిర్ తబలా వరకూ బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్లి అత్యంత సహజంగా దానిని మీటాడు.జాకిర్ హుసేన్ తబలా యాత్ర మొదలైంది.మన దేశానికి స్వతంత్రం వచ్చే వరకూ శాస్త్రీయ సంగీతం ఆస్థానాల్లో, దర్బారుల్లో, శ్రీమంతుల మహళ్లలో ఉండిపోయింది. స్వతంత్రం వచ్చాక అవన్నీ వెళ్లి సంగీత కచ్చేరీలు మొదలయ్యాయి. అయితే వాటికి ఆదరణ అంతంత మాత్రమే ఉండేది. ఆ సమయంలో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, సరోద్ వాద్యకారుడు అలి అక్బర్ ఖాన్‌లాంటి వారు అమెరికాకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తూ మన దేశం తిరిగి వచ్చి అటెన్షన్ సంపాదించారు. ఆ తర్వాతి రోజుల్లో సంతూర్ పండిట్ శివకుమార్, వేణువు హరిప్రసాద్ చౌరాసియా కూడా పశ్చిమ దేశాలలోకి మన సంగీతాన్ని తీసుకెళ్లాడు. పండిట్ రవిశంకర్‌కు శాశ్వతంగా అల్లారఖా తబలాజోడిగా ఉండేవారు. అయితే అల్లా రఖాకు అనారోగ్యం వల్ల జాకిర్‌కు 19ఏళ్లు ఉండగా మొదటిసారి అమెరికా వెళ్లి రవి శంకర్‌కు సహ వాయిద్యం అందించే వీలు జాకిర్‌కు దక్కింది. మొదటిసారి అలా అమెరికాలో అడుగు పెట్టిన జాకిర్ జీవితంలో అత్యధిక కాలం అమెరికాలో ఉంటూ అక్కడినుంచే దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ తబలా వాదనలో ఉండే ఉత్కృష్ట ధ్వనిని ప్రపంచానికి వినిపించాడు. చివరకు అక్కడే– డిసెంబర్ 16 (సోమవారం) అంతిమ శ్వాస వదిలాడు.‘తబలాకు ఎప్పుడూ కాలు తగలనివ్వకు బాబూ. అది మన సరస్వతి’ అనేవారట ఉస్తాద్ అల్లారఖా. అందువల్ల జాకిర్ హడావిడి ప్రయాణాల్లో రైళ్లలో సీటు దొరక్కపోతే కింద కూచుని తబలాను ఒళ్లో జాగ్రత్తగా పెట్టుకునేవారు. ‘నేను తబలా నేర్చుకుంటాను’ అని ఏడేళ్ల వయసులో మొదటిసారి జాకిర్ తన తండ్రితో చెప్పినప్పుడు ఆ మరుసటి రోజు రాత్రి 3 గంట లకు నిద్ర లేపి సాధన మొదలేయించేవారట అల్లారఖా. రోజూ రాత్రి మూడు నుంచి ఉదయం 6 వరకు వారి సాధన సాగేది. ఆ తర్వాత స్కూల్ వెళ్లి సాయంత్రం మళ్లీ సాధన కొనసాగించేవాడు. ‘పండితులకు జన్మించే పిల్లలకు పోలిక ఉంటుంది. అల్లా రఖా కొడుకై ఉండి ఇంత సామాన్యంగా వాయిస్తున్నాడా అనంటే మా నాన్న పరువేంగాను. అందుకే నేను మరింత కష్టపడేవాణ్ణి’ అంటాడు జాకిర్. అంతేకాదు అన్ని మతాల సంగీతం నుంచి కూడా నేర్చుకోవడానికి చూశాడు. ‘నేను స్కూల్‌కు వెళ్లే దారిలో చర్చిలో సంగీతం వినేవాణ్ణి. గుడిలో వినిపించే భక్తి గీతాలు ఆలకించేవాణ్ణి. ప్రపంచంలో ఏ మతమూ ఇంకో మతంపైన జబర్దస్తీ చేయదు. ఏ మతమైనా చెప్పేది నీ పొరుగువారిని ప్రేమించమనే’ అంటాడు జాకిర్ హుసేన్. అందుకే జాకిర్ అన్ని మతాల, అన్ని ధోరణుల విద్వాంసులతో అతి సులువుగా కలిసిపోయి తన తబలాను వారి సంగీతానికి జత చేయగలిగారు. ముఖ్యంగా సంతూర్ శివకుమార్‌తో ఆయనకు సుదీర్ఘ స్నేహం సాగింది. కొన్నాళ్ల క్రితం శివకుమార్ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలకు హాజరైన జాకిర్ హుసేన్ దహన వాటిక నుంచి అందరూ వెళ్లిపోయినా తనొక్కడే మండుతున్న చితి పక్కన చాలా సేపు నిలబడిపోయి ఆ స్నేహితునికి అంతిమ వీడ్కోలు పలికాడు. ఈ భారతీయ హిందూ ముస్లిం శాస్త్రీయ సంగీత భాగస్వామ్యాన్ని జాకిర్ స్థిరంగా ప్రచారం చేశాడు. కొనసాగాలని కోరుకున్నాడు.బీటెల్స్ గ్రూప్ ద్వారా ఖ్యాతి గాంచిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్ ‘లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్’ అనే ఆల్బమ్‌లో జాకిర్ భాగస్వామ్యాన్ని కోరడంతో 1973 నుంచి ఫ్యూజన్ సంగీతానికి ప్రచారం కల్పించసాగాడు జాకిర్ హుసేన్. అమెరికన్ జాజ్ మ్యుజీషియన్ జాన్ హ్యాండీ, ఐరిష్ గాయకుడు వాన్ మారిసన్, అమెరికన్ డ్రమ్మర్ మికీ హర్ట్లాంటి ప్రసిద్ధులతో యాభై ఏళ్ల క్రితమే పని చేయడం వల్ల జాకిర్ హుసేన్‌కి హద్దులు లేని ప్రచారం, ప్రశంస లభించాయి. గాత్ర సంగీతమైనా, వాద్య సంగీతమైనా, జుగల్బందీ అయినా, వ్యక్తిగత ప్రదర్శన అయినా, ఫ్యూజన్ అయినా జాకిర్ నీరు పాత్ర రూపు దాల్చినంత సులభంగా ఇమిడిపోయి కచ్చేరికి అందం, ఆనందం తెచ్చేవాడు. పొడవైన తన గుబురు జుత్తు గాలిలో ఊగేలా ఆయన సాగించే తబలా వాదనను చూడటానికి జనం విరగబడేవారు. ముచ్చటపడేవారు.జాకిర్ హుసేన్ మన దేశంలో ‘పద్మశ్రీ’తో గౌరవించబడ్డ (1988) అత్యంత పిన్న వయస్కుడు (అవార్డు ప్రకటించే సమయానికి). ఆ తర్వాత ఆయనకు ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ వచ్చాయి. నాలుగుసార్లు ‘గ్రామీ’ గెలుచుకున్న ఏకైక భారతీయ సంగీతకారుడు. అంతేనా? అమెరికా ప్రభుత్వం కళ, సాంస్కృతిక రంగాల్లో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక ఫెలోషిప్ ‘నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్’ జాకిర్‌ను వరించింది. జాకిర్ సినిమాలకు పని చేశాడు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘వానప్రస్థం’ సినిమాకు పాటలు కంపోజ్ చేశాడు. లతా మంగేశ్కర్, ఆశా భోంస్లేల జీవితం ఆధారంగా తీసిన ‘సాజ్’ (1998)లో ఆశా భోంస్లే భర్త ఆర్.డి.బర్మన్ పాత్రలో కనిపించాడు. మంచి మాటగాడు, హాస్యప్రియుడు, భోజన ప్రియుడైన జాకిర్ హుసేన్ ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. నవ్వులు ఉంటాయి. తబలా ఎలాగూ ఉంటుంది.గొప్ప సంగీతమయ ప్రపంచాన్ని సృష్టించి, శుభ నాదాలను జగత్తులోకి వదిలి సంగీతం ద్వారా శాంతము పొందమని కోరుతూ వీడ్కోలు తీసుకున్నాడు ఉస్తాద్ జాకిర్ హుసేన్. ప్రపంచ సంగీత ప్రియులు అతణ్ణి తలచుకుని కన్నీరు కారుస్తున్నారు. జాకిర్ ఆత్మ విశ్వ సంగీతంలో డోలలూగాలి.– కె -
కోల్‌కతా ఘటన: ప్రధానికి 70 మంది ‘పద్మ’ వైద్యుల లేఖ
కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టింది. తాజాగా.. ఈ ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.కోల్‌కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. అలాగే వైద్య సిబ్బంది భద్రతను కోరుతూ పలు డిమాండ్లను ఆయన ముందు ఉంచారు. ప్రధాని మోదీకి లేఖ రాసిన వారిలో ప్రముఖ వైద్యులు హర్ష్ మహాజన్, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సరిన్ తదితరులు ఉన్నారు.ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్ధీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. మరోవైపు కోల్‌కతా పోలీసులు ఆగస్టు 18 నుండి ఆగస్టు 24 వరకు ఆర్జీ కార్ ఆస్పత్రి సమీపంలో నిషేధాజ్ఞలను విధించారు. -
ప్రముఖ గాయకుడు మృతి.. పద్మశ్రీ అవార్డు అందుకోకుండానే విషాదం
భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్ (93) మరణించారు. కొద్దిరోజుల క్రితం జనవరి 26వ తేదీన భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి కొద్ది రోజుల ముందు పండిట్ తైలాంగ్ మరణించారు. నేషనల్ మీడియా కథనాల ప్రకారం పండిట్ తైలాంగ్ న్యుమోనియాతో పాటు ఇతర వ్యాధులతో చికిత్స పొందుతూ జైపూర్‌లోని దుర్లబ్జీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ వార్తను ధృవీకరిస్తూ, పండిట్ తైలాంగ్ కుమార్తె, స్వయంగా ప్రఖ్యాత ధృపద్ గాయని అయిన ప్రొఫెసర్ మధు భట్ తైలాంగ్ ఇలా అన్నారు, "గత కొన్ని రోజులుగా నాన్నగారి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం దుర్లభ్జీ ఆసుపత్రిలో చేర్పించాం. చికిత్స సమయంలోనే ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.' అని తెలిపారు. జైపూర్‌కు చెందిన పండిట్ లక్ష్మణ్ భట్ తన జీవితమంతా సంగీత సాధనకు అంకితం చేశారు. ఇందులో తన పిల్లలతో పాటు అనేక మంది విద్యార్థులకు విస్తృతమైన జ్ఞానం, విద్యను అందించాడు. ఆయన తన కుమారుడు రవిశంకర్‌తో పాటు కుమార్తెలు శోభ, ఉష, నిషా, మధు, పూనమ్, ఆర్తిలను వివిధ సంగీత కళా ప్రక్రియలలో ప్రావీణ్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించారు. బనస్థలి విద్యాపీఠ్, రాజస్థాన్ సంగీత సంస్థలో సంగీత ఉపన్యాసకుడిగా ఆయన పనిచేశారు. 1985లో జైపూర్‌లో 'రసమంజరి' పేరుతో ఒక సంగీతోపాసు కేంద్రాన్ని ఆయన స్థాపించారు. అక్కడ ఎందరికో ఉచితంగానే విద్యను అందించారు. 2001లో జైపూర్‌లో 'అంతర్జాతీయ ధ్రుపద్-ధామ్ ట్రస్ట్'ని స్థాపించి చాలామందికి సాయం అందించారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డు అందుకోకుండానే ఆయన మరణించడం బాధాకరం అని చెప్పవచ్చు. -
పద్మ పురస్కార గ్రహీతలకు తెలంగాణ సర్కార్ సన్మానం
సాక్షి, హైదరాబాద్: పద్మ పురస్కార గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. పద్మా అవార్డు గ్రహీతల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో ఆరుగురిని ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, మొదటి సినిమాలో ఎలాంటి తపన ఉందో 46 ఏళ్ల తరువాత కూడా చిరంజీవిలో అదే తపన ఉందన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం జరపడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తోందన్నారు. ప్రతీ ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల క్యాష్ రివార్డ్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రతీ నెలా 25 వేల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. -
ఎక్కడికెళ్లినా.. భారత్ నాలో భాగమే : సుందర్ పిచాయ్
-
Kangana Ranaut: అప్పుడేం జరిగిందో చెబితే పద్శశ్రీ తిరిగి ఇచ్చేస్తా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవల 1947లో వచ్చిన స్వాతంత్ర్యం భిక్షగా అభివర్ణించారు. ప్రధాని మోడీ అధికారంలో 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని టైమ్స్ నౌ సమ్మిట్ 2021లో తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, ప్రముఖులు కంగనాను తీవ్రంగా విమర్శించారు. ఆమె అందుకున్న పద్మశ్రీ అవార్డును సైతం రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌కు స్పందనగా కంగనా మరో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయితే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తాను అని తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఇలా రాసుకొచ్చింది. 'సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, వీర్ సావర్కర్ జీ వంటి మహానుభావుల త్యాగాలతో 1857లో మొదటి స్వాతంత్య్ర పోరాటం జరిగిందని అదే ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాను. 1857లో ఏం జరిగిందో నాకు తెలుసు. కానీ 1947లో ఏం జరిగిందో నాకు తెలీదు. ఎవరైనా నాకు చెబుతారా. అది చెప్పగలిగితే నా పద్మశ్రీని తిరిగి ఇస్తాను. క్షమాపణ కూడా చెబుతాను. దయచేసి ఇందులో నాకు సహాయం చేయండి.' 'అంతకుముందు మనకు వచ్చిన స్వాతంత్ర్యం కేవలం భౌతికమైనది. కానీ భారతదేశం 2014లో మానసికంగా విముక్తి పొందిందని ప్రత్యేకంగా చెప్పాను. చనిపోయిన నాగరికత సజీవంగా తిరిగి వచ్చింది. ఈ స్వాత్యంత్రం ఇప్పుడు గర్జిస్తూ, పైకి ఎగురుతోంది. నేడు మొదటిసారిగా ఇంగ్లీష్‌లో మాట్లాడలేనందుకు, చిన్న గ్రామాల నుంచి వస్తున్నందుకు, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు వాడనందుకు ప్రజలు సిగ్గుపడలేరు. ప్రతిదీ అదే ఇంటర్వ్యూలో స్పష్టంగా ఉంది. అపరాధ భావం ఉన్నవారు దహించుకుపోతారు. దాని గురించి ఏం చేయలేం. జై హింద్.' అని తనను సమర్థించుకుంది. ఇంకా కంగనా తన స్టోరీలో 'భిక్షగా లభించిన స్వాతంత్ర్యం కూడా ఒక స్వాతంత్య్రమా ? కాంగ్రెస్ పేరుతో బ్రిటీష్ వారు ఏం వదిలేశారు. వారు బ్రిటీష్ వారి కొనసాగింపు.' అని రాసుకొచ్చింది. ఇంతకుముందు కంగనా ట్విటర్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు కంపెనీ ఆమె ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకుంది ట్విటర్. కంగనా ఇప్పుడు తన వీడియోలు, సందేశాలను ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తోంది. -
పద్మ అవార్డులకు వైద్యుల పేర్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ముగ్గురు వైద్యుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం వెల్లడించారు. డాక్టర్లు ఎస్కే సరిన్, సురేశ్ కుమార్, సందీప్ బుధిరాజలు ఇందులో ఉన్నారని చెప్పారు. కోవిడ్ 19 పోరాటంలో భాగంగా వీరు చేసిన సేవలను గుర్తుంచుకొని పేర్లను సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కేవలం వైద్యుల పేర్లను మాత్రమే పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మొత్తం 9,427 మంది ప్రజలు కలసి 740 మంది పేర్లను సూచించారన్నారు. ఇందులో డాక్టర్లు, పారమెడిక్స్, ఇతర ఆరోగ్య రంగ నిపుణులు ఉన్నారన్నారు. ఇందులో ముగ్గురి పేర్లను డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నేతృత్వంలోని కమిటీ ఖరారు చేసిందన్నారు. వారిలో ఐఎల్‌బీఎస్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్.కె సరిన్, ఎల్ఎన్జేపీ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్, గ్రూప్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మ్యాక్స్ హెల్త్ కేర్ గ్రూప్ డాక్టర్ సందీప్ బుధిరాజలు ఉన్నారని తెలిపారు. -
‘పద్మ’ అవార్డులపై మోదీకి ఎంపీ లేఖ
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఒక్కరికీ కూడా పద్మ అవార్డులు ఇవ్వకపోవడంపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మ అవార్డుల ఎంపికలో కొన్ని రాష్ట్రాలకే పెద్దపీట వేస్తూ తెలంగాణ సహా పలు రాష్ట్రాలను పట్టించుకోకపోవడంపై వినోద్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పద్మ అవార్డులకు నిర్దేశించిన మార్గదర్శకాలకు తగ్గ ప్రతిభ తెలంగాణలో చాలా మంది కవులు కళాకారులకు ఉన్నా వారిలో ఒక్కరు కూడా ఆ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక కాకపోవడం నిరాశ కలిగించిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో అవార్డులు లభించి ఇంకొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోతే అది మంచి సంప్రదాయం అనిపించుకోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా వాటిని ఎంపిక కమిటీ పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వినోద్ అన్నారు. ఇకపై పద్మ అవార్డుల ఎంపికలో సమ తుల్యత ఉండేలా అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తన లేఖలో ప్రధానిని కోరారు. -
'పద్మశ్రీ' ఆశ చూపి నాలుగు కోట్లు టోకరా
-
పద్మ అవార్డు కోసం రూ. 4 కోట్లు టోకరా
-
పద్మ అవార్డు కోసం 4 కోట్లు.. సీఐ అరెస్టు!
సాక్షి, నెల్లూరు: కార్పొరేట్ పదవులు, పద్మ అవార్డులు ఇప్పిస్తానంటూ మోసం చేసిన గుంటూరు సీసీఎస్ సీఐ శేషారావు బండారం బయటపడింది. గుడూరు పోలీసులు శనివారం సీఐ శేషారావుతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. కార్పొరేట్ పదవులు, పద్మ అవార్డుల ఇప్పిస్తానంటూ రమణయ్య అనే వ్యక్తిని వీరు బురిడీ కొట్టించారు. ఆయన నుంచి రూ. 4 కోట్లు వసూలుచేసి.. ఆపై ముఖం చాటేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సీఐతోపాటు ఇతర నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మ అవార్డు కోసం 4 కోట్లు.. సీఐ అరెస్టు! -
ధోని, జాకీర్ హుస్సేన్‌లకు ‘పద్మ’ నిరాకరణ
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీం సింగ్, ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోని, తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ పేర్లను ఈ ఏడాది పద్మ అవార్డులకు ప్రభుత్వం తిరస్కరించింది. ఇలా నిరాకరణకు గురైన సుమారు 18 వేలకు పైగా సిఫార్సులు, దరఖాస్తుల వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో...రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, గాయకుడు సోను నిగమ్, నటి శ్రీదేవి, ప్రముఖ పాత్రికేయుడు అర్ణబ్ గోస్వామి, ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ తదితరులున్నారు. -
అనుపమ్‌కి ఈ అవార్డు ఎలా వచ్చింది?!
అవార్డొస్తే ఆనందం. రాకపోతే నిరాశ. వస్తుందనుకునీ రాకపోతే కోపం. క్వయిట్ నేచురల్. ఆనందంలో ఎగిరి గంతేస్తాం. నిరాశలో డీలా పడిపోతాం. కోపంలో కయ్యిమని లేస్తాం. ఇదీ నేచురలే. ఆనందంలో, నిరాశలో, కోపంలో ఒకేలా ముక్కూ మూతి బిగించుకుని ఎలా కూర్చుంటాం? కానీ ఈ మనుషులకి ఎప్పుడూ ఒకే ఎక్స్ప్రెషన్ కావాలి. ‘ఆరోజు నువ్వు అవార్డుల్ని తీసి పారేశావు కదా, ఇప్పుడెలా వాటిని తలకెత్తుకుంటావు’ అని వీళ్ల పాయింట్! సోషల్ మీడియా కోడిని కోసి, ఎవరికైనా ఒక సండే రోజు వండి పెట్టాలన్నంత కోపం వస్తోంది. ఎప్పుడో ఏదో అన్నానని, ఇప్పుడూ అదే అనాలా?! పని చేసేవాళ్ల కన్నా, పనికిమాలిన ప్రశ్నలేసేవాళ్లు ఎక్కువయ్యారు దేశంలో! అవును. అన్నాను. పద్మ అవార్డులకి ఇక్కడేం విలువ లేదు అన్నాను. అది పాస్ట్. ఇప్పుడు హ్యాపీ అండ్ హంబుల్డ్ అంటున్నాను. ఇది ప్రెజెంట్. ‘నీ పాస్టు, నీ ప్రెజెంటు ఒకేలా ఉండాలి’ అనే వాళ్లకి సమాధానం చెప్పేంత తీరిక నాకు లేదు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాను. ఇప్పుడూ ఉన్నాను. ఐదున కరాచీలో లిటరేచర్ ఫెస్టివల్. దానికి వెళ్లాలి. దాని కోసం నోట్స్ రాసుకోవాలి. పెద్ద పని! ఇంకా పెద్ద పని.. ఫెస్టివల్లో నా పుస్తకం ‘ది బెస్ట్ థింగ్ ఎబౌట్ యు ఈజ్ యు’ రీడింగ్‌కి నన్ను నేను రెడీ చేసుకోవడం. నా లైఫ్ స్ట్రగుల్ అంతా ఆ పుస్తకంలో ఉంది. నేను ఇల్లొదిలి వెళ్లడం, వేషాల కోసం వెతుక్కోవడం, రైల్వే ప్లాట్‌ఫారాల మీద పడుకోవడం.. ఊరికే పద్దెనిమిది ముద్రణలు అవుతాయా? ఊరికే నాకు అవార్డులు వచ్చేస్తాయా? నన్ను నేను రెస్పెక్ట్ చేసుకోదగిన జీవితం నాకు ఉన్నందువల్లనే కదా ఈ గుర్తింపు అంతా. గుర్తింపు రాని రోజుల్లో నిరాశతో, కోపంతో నేను అన్నమాటలకు కూడా రెస్పెక్ట్ ఉంటుందనే జ్ఞానం ఈ క్రిటిక్స్‌కి లేకపోతే.. ఆ జ్ఞానమేదో కలిగించడానికి నేనెందుకు టైమ్ వేస్ట్ చేసుకోవాలి? ‘అసలు అనుపమ్‌కి ఈ అవార్డు ఎలా వచ్చింది?!’ అని.. వీళ్లదే ఇంకో క్వొశ్చన్ మార్క్! ఏం? ఎందుకు రాకూడదు? నాకేం పెయింటింగ్కీ, డాన్సింగ్కీ పద్మభూషణ్ ఇవ్వలేదే? అలా ఇచ్చి ఉంటే ముఖం దాచుకోడానికి ముంబైలో ఎక్కడైనా మంచి ప్లేస్ ఉందేమో వెతుక్కునేవాడిని. లేదా నేను పుట్టిన సిమ్లాకు వెళ్లిపోయేవాడిని. ‘నేను ఏమిటో అందుకు మాత్రమే’ వచ్చిన అవార్డు ఇది. కాబట్టి నేనెవ్వరికీ సమాధానం చెప్పక్కర్లేదు. నాకైతే ఒకటి బాగా అర్థమైంది. మనమంటే నచ్చనివాళ్లకు మనమేం సాధించినా లెక్కకాదు. మనమంటే ఇష్టపడేవాళ్లకు మనం ఏం సాధించామన్నది లెక్కకాదు. -
'ఆయన ఫోన్ నంబర్ అడిగేంత ధైర్యం లేదు'
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మంచి జోష్‌లో ఉన్నాడు. అక్షయ్ హీరోగా తెరకెక్కిన ఎయిర్ లిఫ్ట్, కలెక్షన్ల హవా సృష్టిస్తుండగా, అక్షయ్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను ఈజీగా రీచ్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో పాటు తొలిసారిగా సౌత్ ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతున్నాడు అక్షయ్ కుమార్. రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నెగెటివ్ రోల్లో నటిస్తున్నాడు అక్షయ్. ఇప్పటికే ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ బాలీవుడ్ స్టార్, త్వరలోనే షూటింగ్లో పాల్గొనటానికి రెడీ అవుతున్నాడు. రోబో సినిమాలో కలిసి నటిస్తున్న అక్షయ్ కుమార్, రజనీ కాంత్‌లకు ఒకేసారి పద్మ అవార్డులు ప్రకటించటంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో అక్షయ్ చెప్పిన సమాధానం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. రజనీ కాంత్ గారు పద్మ విభూషణ్ అందుకుంటున్నారు కదా.. మీరు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారా అన్న ప్రశ్నకు...' నాదగ్గర రజనీ సార్ ఫోన్ నంబర్ లేదు.. ఆయన్ని ఫోన్ నంబర్ అడిగేంత ధైర్యం నాకు లేదు' అంటూ సమాధానం ఇచ్చాడు అక్షయ్ కుమార్. -
ఆ విషయమే నాకు తెలియదు: రాజమౌళి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం తెలుగు సినీరంగం నుంచి రాజమౌళిని పద్మ శ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు గాను ప్రభుత్వం ఈ దర్శక ధీరుణ్ని అత్యుతన్నత పురస్కారంతో గౌరవించింది. ఇప్పటికే ఈ గౌరవానికి తాను అర్హుడిని కాదంటూ ప్రకటించిన రాజమౌళి, మరిన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ' గత ఏడాది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పద్మ అవార్డుకు నా పేరును పంపాలని నన్ను సంప్రదించింది. నేను కాదన్నాను. ప్రభుత్వం నాపై చాలా ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే నేను రిక్వెస్ట్ చేయటంతో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పద్మ అవార్డుకు నా పేరును ఎంపిక చేయలేదు. కానీ ఈ సారి మాత్రం నన్ను సంప్రదించకుండానే నా పేరును అవార్డు కమిటీకి పంపారు. ఈ పని ఎవరు చేశారా అని ఆరా తీస్తే, కర్ణాటక ప్రభుత్వం నా పేరును అవార్డుకు పంపినట్టుగా తెలిసింది. నేను పుట్టింది కర్ణాటకలో, చదువుకుంది ఆంద్ర ప్రదేశ్ లో, పని చేసింది తమిళనాట, ప్రస్తుతం ఉంటున్నది తెలంగాణలో ఇన్ని రాష్ట్రాలతో అనుబందం ఉన్నందుకు ఆనందంగా ఉంది' అంటూ అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు రాజమౌళి. Last year the govt of AP wanted to recommend my name for Padma Sri. I requested them not to citing the same reasons. They insisted. But upon — rajamouli ss (@ssrajamouli) January 26, 2016 my repeated requests, they dropped my name. This year i was not consulted. — rajamouli ss (@ssrajamouli) January 26, 2016 I was wondering how this happened when I came to know that I was recommended by the Karnataka government. — rajamouli ss (@ssrajamouli) January 26, 2016 I was born in Karnataka, studied in Andhra Pradesh, worked in Tamil Nadu and settled in Telangana. Happy to be a son of all the states. — rajamouli ss (@ssrajamouli) January 26, 2016 -
లలిత్‌కు ‘పద్మ’ సిఫార్సు!
మరో వివాదంలో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే రాజేపై విరుచుకుపడ్డ కాంగ్రెస్.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ జైపూర్: ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లలిత్‌మోదీకి పద్మ పురస్కారం ఇవ్వాలంటూ ఆమె 2007లో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు ఇప్పుడు బయటకు రావడంతో రాజేకు మరో తలనొప్పి ఎదురైంది. రాజస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి, అలాగే క్రీడారంగానికి లలిత్ మోదీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరును పద్మ పురస్కారానికి సిఫార్సు చేయాలని రాజస్తాన్ రాష్ట్ర క్రీడా మండలి(ఆర్‌ఎస్‌ఎస్‌సీ)కి సూచించినట్టుగా బుధవారం వార్తలు వెలువడ్డాయి. అయితే ముఖ్యమంత్రి మీడియా సలహాదారు ఈ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు. కాగా, దీనిపై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) మాజీ గౌరవ కార్యదర్శి సుభాష్ జోషి స్పందిస్తూ.. అప్పట్లో ఆర్సీఏ అధ్యక్షునిగా, బీసీసీఐ ఉపాధ్యక్షునిగా ఉన్న లలిత్ మోదీ పేరును పద్మ అవార్డులకు సిఫార్సు చేసేందుకుగానూ ఆయనకు సంబంధించిన వివరాలు, పత్రాలు అందించాలని జూలై 27, 2007న ఆర్‌ఎస్‌ఎస్‌సీ నుంచి తమకు లేఖ అందిందని చెప్పారు. అనంతరం కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రధాన కార్యదర్శికి ఆర్‌ఎస్‌ఎస్‌సీ పద్మ పురస్కారానికి లలిత్‌మోదీ పేరు సిఫార్సు చేస్తూ ప్రతిపాదన పంపిందని చెప్పారు. అయితే కేంద్రం రాజస్తాన్ ప్రభుత్వ సిఫార్సును పట్టించుకోలేదు. కాగా, ఈ వ్యవహారంలో వసుంధరా రాజేపై రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సచిన్ పైలట్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో లలిత్‌మోదీ సంస్థాగత అవినీతికి పాల్పడ్డాడని, లలిత్‌మోదీ పేరును పద్మ అవార్డుకు సిఫార్సు చేయడంతో రాజేకు, లలిత్‌మోదీకి ఉన్న బంధం మరోసారి బయటపడిందని చెప్పారు. వసుంధర రాజే తక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
అవును సిఫారసు చేశా: శరద్ యాదవ్
న్యూఢిల్లీ: నిజాయితీ లేనివారికి పద్మ పురస్కారాలు ఇస్తున్నారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన జేడీ(యూ) నేత శరద్ యాదవ్ స్వయంగా ఒక డాక్టర్ కు పద్మ అవార్డు కోసం సిఫారసు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. 2014లో గుర్గావ్ కు చెందిన వైద్యుడు బాల్ రాజ్ సింగ్ యాదవ్ పేరు పద్మ పురస్కారం కోసం సిఫారసు చేశారని హోంమంత్రిత్వ శాఖ డాక్యుమెంట్ వెల్లడించింది. వైద్యుడి పేరు సిఫారసు చేసిన విషయం వాస్తమేనని శరద్ యాదవ్ తెలిపారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. పద్మ పురస్కారాల ఎంపిక విధానం నిజాయితీగా లేదని మాత్రమే తాను అన్నానని వివరణ ఇచ్చారు. అవార్డుల ఎంపిక పారదర్శకంగా లేదని పేర్కొన్నారు. -
పద్మ అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ప్రదానం కోసం 2015 సంవత్సరానికి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ లోగా దరఖాస్తులు పంపవచ్చని కేంద్ర హోంశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దేశిత నమూనాలోని నామినేషన్లను, దరఖాస్తుదారు కృషికి సంబంధించి 800 పదాలలోపు సంక్షిప్త లిఖిత పత్రాన్ని జతచేసి.. కేంద్ర హోంశాఖ లేదా కేంద్ర హోంశాఖ కార్యదర్శి కార్యాలయాలకు (నార్త్‌బ్లాక్,న్యూఢిల్లీ-110001) పంపించాలని సూచించింది. నిర్దేశిత న మూనా పత్రాన్ని కేంద్ర హోంశాఖ వెబ్సైట్ నుంచి పొందవచ్చని పేర్కొంది. 2015 సం వత్సరానికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్నారు. -
'లైంగిక' ఆరోపణలున్న వ్యక్తికి 'పద్మశ్రీ'నా ?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతినికేతన్ లోని విశ్వభారతీయూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ సుశాంత్ దత్తగుప్తకు పద్మ పురస్కారం ప్రకటించడం పట్ల పశ్చిమ బెంగాల్ మహిళ కమిషన్ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. సుశాంత్‌కు ప్రకటించిన పద్మ పురస్కారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ మహిళ కమిషన్ చైర్మన్ సునందా ముఖర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు లేఖ రాశారు. పద్మ పురస్కారాలు అత్యున్నతమైనవని వాటిని వివిధ రంగాలలో రాణించిన వారికి అందజేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అయితే ఆ పురస్కారాన్ని అందుకునే అర్హత సుశాంత్‌కు లేదని సునంద ఆ లేఖలో వెల్లడించారు. సుశాంత్‌కు పద్మ పురస్కారం ప్రకటించడంపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జాతీమ మహిళ కమిషన్‌కు లేఖ రాసినట్లు వివరించారు. వివిధ రంగాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రప్రభుత్వం ఆదివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసినందుకు సుశాంత్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలు ఏం జరిగింది: 2005లో సుశాంత్ దాస్‌గుప్తా సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో ఆ సంస్థలో పని చేస్తున్న మహిళ శాస్త్రవేత్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుశాంత్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మహిళ కమిషన్ సుశాంత్‌కు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.